Tahawwur Rana
-
రాణాపై రోజూ 8–10 గంటలు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణా(64)ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)అధికారులు రోజులో 8 నుంచి 10గంటలపాటు ప్రశ్నిస్తున్నారు. పేలుళ్ల వెనుక కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. 2008 నవంబర్ 26వ తేదీన దాడులకు ముందు అతడు దేశంలోని పలు ప్రాంతాల్లో చేసిన పర్యటనల వెనుక ఉద్దేశాన్ని కనుగొనే దిశగా విచారణ సాగుతోందన్నారు. ఈ నెల 10న అమెరికా నుంచి తీసుకు వచ్చిన రాణాను ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతించడం తెల్సిందే. రాణాకు ఆరోగ్య పరీక్షలు చేయించడంతోపాటు లాయర్‌ను కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన విచారణాధికారి జయా రాయ్ సారథ్యంలో విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు రాణా సహకరిస్తున్నాడని ఓ అధికారి వెల్లడించారు. రాణా కోరిన మేరకు పెన్, నోట్ ప్యాడ్, ఖురాన్‌ను సమకూర్చామన్నారు. ఇతర నిందితులకు మాదిరిగానే ఆహారం అందిస్తున్నామని, ప్రత్యేకంగా ఏదీ అతడు కోరలేదన్నారు. రాణా ప్రస్తుతం ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో అత్యంత భద్రత కలిగిన సెల్లో ఉన్నాడు. కుట్ర, హత్య, ఉగ్రకార్యకలాపాలకు ఊతమివ్వడం, ఫోర్జరీ తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా, హర్కతుల్ జిహాదీ ఇస్లామీకి చెందిన పలువురు ఉగ్ర నేతల ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీలోనూ దాడులకు కుట్ర 2008 నవంబర్ 26వ తేదీన ముంబై ఉగ్రదాడులకు పథకం రచన చేసిన తహవ్వుర్ రాణా అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలోనూ మారణ హోమం సృష్టించేందుకు పథకం వేసినట్లు వెల్లడైంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ ఈ నెల 10వ తేదీన జారీ చేసిన 10 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘దేశమంతటా విస్తృతంగా పర్యటన చేసిన రాణా పలు నగరాల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇందులో ఢిల్లీ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ ఆధారాలున్నాయి. జాతీ భద్రతకు సంబంధించిన విషయం ఇది. దీని వెనుక ఉన్న భారీ కుట్రకోణాన్ని ఛేదించేందుకు రాణా కస్టోడియల్ విచారణ అవసరం. సాకు‡్ష్యల విచారణ, ఆధారాల సేకరణ, రాణా అతడి అనుయాయుల పర్యటనల వివరాలను రాబట్టాల్సి ఉంది. 17 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలపై రాణాను పలు కీలక ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది’అని అందులో పేర్కొన్నారు. అనేక ఆరోగ్య సమస్యలున్న రాణాకు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని ఆయన ఆదేశించారు. -
ముంబై దాడుల కేసులో కొనసాగుతున్న తహవ్వుర్ రాణా విచారణ
-
ముంబై దాడుల కేసులో తహవ్వుర్ రాణాను విచారిస్తున్న NIA
-
రాణా గుప్పిట కీలక రహస్యాలు!
పదిహేడేళ్ల క్రితం ముంబై మహానగరంలో 10 మంది ఉగ్రవాదులు 78 గంటలపాటు విచక్షణా రహితంగా దాడులకు తెగబడి 166 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర ఉదంతంలో కీలక కుట్ర దారైన తహవ్వుర్ రాణా ఎట్టకేలకు మన దేశంలో అడుగుపెట్టాడు. రానున్న 18 రోజుల్లో మన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో అతగాడు ఆ ఘోర ఉదంతానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తాడన్నది చూడాలి. ఆ ఉగ్రవాదులు బాంబులూ, ఇతర మారణాయుధాలతో పాకి స్తాన్‌లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకుని ఆ నగరంలో అనేకచోట్ల తుపాకు లతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు. ఆ దాడుల్లో సాధారణ పౌరులూ, కర్కరే వంటి పోలీస్ ఉన్నతాధి కారులూ ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదిమంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హత మార్చగా, ఉగ్రవాది కసబ్ పట్టుబడ్డాడు. విచారణానంతరం 2012లో అతన్ని ఉరితీశారు. రాణా వెల్లడించేఅంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధ్రువీకరించుకోవటానికీ, మరో ఉగ్రవాది, ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న డేవిడ్ హెడ్లీపై మరిన్ని వివరాలు రాబట్టడానికీ తోడ్పడుతాయి.రాణా అప్పగింత అతి పెద్ద దౌత్యవిజయమని మన ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు అమెరికా కూడా ఉగ్రదాడుల్లో హతమైనవారికీ, ఇతర బాధితులకూ న్యాయం చేకూర్చటంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది. కావచ్చు. అయితే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై చెబుతున్నట్టు ‘అతగాడి దగ్గర చెప్పడానికేం లేదు గనుకనే...’ అప్పగించారా? రాణా పాత్ర కూడా తక్కువేం కాదు. దాడులకు పక్షం రోజుల ముందు భార్యతో కలిసి ముంబైలో చాలా ప్రాంతాలు వెళ్లి చూశాడు. అతను ఎంపిక చేసిన ప్రాంతాలను హెడ్లీ భార్యాసమేతంగా వచ్చి తనిఖీ కూడా చేశాడు. ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. రాణా ముంబైతోపాటు ఢిల్లీ, కొచ్చి వంటి నగరాలకు కూడా పోయాడు. 1971 నాటి యుద్ధవీరులకై నిర్మించిన ముంబైలోని జల వాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో భార్యతో కలిసి బస చేశాడు. ఆ కాంప్లెక్స్ పేల్చివేతకు అవకాశం ఉందా లేదా చూసుకుని, అసాధ్యమని నిర్ణయించుకున్నాక భారత్ నుంచి వెళ్లిపోయాడని అంటారు. పిళ్లై వాదన పూర్తిగా కొట్టిపారేయదగింది కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో రాణాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. ప్రస్తుతం రాణా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెబుతున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకంటే అతగాడు అమెరికా మాదకద్రవ్య నియంత్రణ విభాగం (డీఈఏ) ఏజెంట్‌గా పని చేశాడు. అదే సమయంలో ఐఎస్‌ఐకీ, లష్కరే తొయిబా (ఎల్ఈటీ)కీ కూడా ఏజెంట్‌గా ఉన్నాడు. ఇవన్నీ అమెరికా నిఘా సంస్థలకూ తెలుసు. అంతేకాదు... ముంబై మారణకాండ పథక రచన మొదలుకొని అన్ని విషయాలపైనా అమెరికా దగ్గర ముందస్తు సమాచారం వుంది. ఆ సంగతలా వుంచి భారత్‌లో సేకరించిన సమస్త సమాచారాన్నీ, ముంబైకి సంబంధించిన జీపీఎస్ లోకేషన్‌లనూ హెడ్లీకి రాణా అందించాడు. దాని ఆధారంగానే కొలాబా తీరప్రాంతంలోని బధ్వర్ పార్క్ దగ్గర ఉగ్రవాదులు బోట్లు దిగారు. రాణా ఇచ్చిన సమాచారాన్ని హెడ్లీ పాకిస్తాన్ పోయి అక్కడ ఐఎస్ఐ తరఫున తనతో సంప్రదిస్తున్న మేజర్ ఇక్బాల్ అనే వ్యక్తికి అందజేశాడని ఇప్పటికే మన నిఘా సంస్థలకు రూఢి అయింది. ఉగ్రవాదులకు ఐఎస్ఐ ఇచ్చిన శిక్షణేమిటో హెడ్లీకి తెలుసు. వీటిపై అమెరికా భద్రతా సంస్థలకు క్షణ్ణంగా తెలిసినా మన దేశాన్ని ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదన్న సంశయాలున్నాయి. ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఏవో సాకులు చెబుతోందన్నది వాస్తవం. సందేహం లేదు... రాణా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైనవాడు. అతను ఎల్ఈటీలో చేరడమే కాక, ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల సమయంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటి కప్పుడు ఫోన్లో లఖ్వీ ఆదేశాలివ్వటం వెనక హెడ్లీ ప్రమేయం వుంది. తమకు ఏజెంటుగా పని చేసినవాడిని అప్పగించరాదని అమెరికా భావించటం మూర్ఖత్వం. అదే పని భారత్ చేస్తే అంగీకరించగలదా? హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం బయటపడుతుందని అది సంకోచిస్తున్నట్టు కనబడుతోంది. రాణా అప్పగింత ప్రక్రియ తమ హయాంలోనే మొదలైందని గర్వంగా చెబుతున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హెడ్లీ విషయంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి. వికీలీక్స్ పత్రాలు ఈ సంగతిని చాన్నాళ్ల క్రితమే వెల్లడించాయి. హెడ్లీ అప్పగింతకు పట్టుబట్టవద్దని అప్పటి మన జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్‌ను నాటి అమెరికా రాయబారి తిమోతీ రోమెర్ కోరినట్టు అందులో ఉంది. అలా అడిగినట్టు కనబడకపోతే తమకు ఇబ్బందులొస్తాయని నారాయణన్ బదులిచ్చినట్టు కూడా ఆ పత్రాల్లో ఉంది. హెడ్లీ ఎలాంటివాడో అతని కేసులో 2009లో తీర్పునిచ్చిన అమెరికా న్యాయమూర్తే చెప్పారు. ‘హెడ్లీ ఉగ్రవాది. అతని నుంచి ప్రజలను రక్షించటం నా విధి. మరణశిక్షకు అన్నివిధాలా అర్హుడు. కానీ ప్రభుత్వ వినతి మేరకు 35 ఏళ్ల శిక్షతో సరిపెడుతున్నాను’ అన్నారాయన. ఎటూ పాకిస్తాన్ తన రక్షణలో సేద తీరుతున్న లఖ్వీ, సయీద్‌లను అప్పగించదు. ఆ దేశంతో మనకు నేరస్థుల అప్పగింత ఒప్పందం కూడా లేదు. కానీ అమెరికాతో ఆ మాదిరి ఒప్పందం ఉంది గనుక హెడ్లీ కోసం మన దేశం గట్టిగా పట్టుబట్టాలి. అది సాధిస్తేనే నిజమైన విజయం దక్కినట్టవుతుంది. -
నాడు కసబ్ కోసం పెట్టిన ఖర్చు ఇదే.. ఇప్పుడు రాణా కోసం ఇంకెంత ఖర్చు చేయాలో?
ముంబై: దేశ చరిత్రలో అతి కిరాతక ఘటనగా నిలిచిపోయిన ముంబై ఉగ్రదాడి జరిగి 16 సంవత్సరాలు గడిచాయి. నాడు మారణ హోమానికి తెగబడిన ఉగ్రవాదులను తెరవెనక నుంచి నడిపించిన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు అనుమతి ఇచ్చింది.ఈ తరుణంలో నాటి 2008, నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ తోటి ఉగ్రవాదులతో కలిసి మారణ హోమం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముంబై ఉగ్రవాద దాడిలో ప్రాణాలతో బయటపడిన ఏకైక నిందితుడు అజ్మల్ కసబ్ ఉరితీయడానికి సుదీర్ఘ సమయం పట్టగా.. జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అందించారనే ఆరోపణలు ఉన్నాయి. అజ్మల్ కసబ్ తరహాలో కాకుండా తహవూర్ హుస్సేన్ రాణాకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వొద్దని ముంబై ఉగ్రదాడి బాధితులతో పాటు యావత్ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాడు పట్టుబడ్డ సమయం నుంచి ఉరిశిక్ష వేసే వరకు అజ్మల్ కసబ్‌పై పెట్టిన ఖర్చు ఎంత అనే వివరాల్ని సమాచార హక్కు చట్టం ద్వారా అథక్ సేవా సంఘ్ ఛైర్మన్ అనిల్ గాల్గాలీ సేకరించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా.. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిపి రూ. 28.46 కోట్లు ఖర్చు చేశాయి. ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో, పుణెలోని యరవాడ జైలులో కసబ్‌పై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. వీటితో పాటు కసబ్‌కు ఉరిశిక్ష విధించే రోజు భోజనం కోసం రూ. 33.75, దుస్తుల కోసం రూ. 169 ఖర్చు కాగా,అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ. 9,573 ఖర్చు పెట్టినట్లు ఆర్టీఐ తేలింది. కసబ్‌పై పెట్టిన మొత్తం ఖర్చు వివరాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆహారం: రూ. 43,417.67భద్రత: రూ. 1,50,57,774.90మెడిసిన్: రూ. 32,097దుస్తులు: రూ. 2,047సెక్యూరిటీ: రూ. 5,25,16,542అంత్యక్రియలు: రూ. 9,573మొత్తం ఖర్చు: రూ. 6,76,49,676.82ప్రస్తుతం, ఎన్ఐఏ రిమాండ్‌లో ఉన్న తహవూర్ రాణాకు సైతం విచారణ సుదీర్ఘ కాలం జరిగితే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాటి కసబ్ పెట్టిన ఖర్చుతో పోలిస్తే తహవూర్ రాణాకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.కసబ్‌కు ఉరిశిక్ష పడిన తేదీ, సమయంఉరిశిక్ష తేదీ, సమయం: కసబ్‌ను నవంబర్ 21, 2012న ఉదయం 7:30 గంటలకు ఉరితీశారు.ఎక్కడ ఉరితీశారు: మహారాష్ట్రలోని పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరితీశారు. మెర్సీ పిటిషన్: ఉరిశిక్షకు రెండు వారాల ముందు, నవంబర్ 5, 2012న కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. -
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
న్యూఢిల్లీ: ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది.ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే(LeT) ఉగ్రవాదులకు నిషాన్ ఏ హైదర్(పాక్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్ మైండ్ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్ఈటీ కదలికల గురించి, ముంబై దాడుల గురించి వీరిరువురూ చర్చించారు.అప్పటికే చికాగోలో ఇమ్మిగ్రేషన్ వ్యాపారంలో ఉన్న రాణా ముంబైలోనూ ఓ కార్యాలయం తెరవాలని చూశాడు. దానికి ఎలాంటి అనుభవం లేకపోయినా హెడ్లీని మేనేజర్‌ను చేయాలనుకున్నాడు. అలాగే ముంబై దాడుల అనంతరమూ ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో జరిగిన నష్టం గురించి హెడ్లీ ప్రస్తావించగా.. భారతీయులకు ఇలా జరగాల్సిందేనంటూ రాణా బదులిచ్చాడు. అంతేకాదు హెడ్లీ ప్రయాణాలకు అవసరమైన తప్పుడు పత్రాలను కూడా రాణానే సృష్టించేవాడు. ముంబై దాడుల్లో భాగస్వాములుడేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), తహవూర్ హుసేన్ రాణా.. ఈ ఇద్దరూ 2008 ముంబై ఉగ్రదాడుల కేసుల్లో ప్రధాన నిందితులుగానే ఉన్నారు. డేవిడ్ హెడ్లీ ప్రధాన సూత్రధారి కాగా.. రాణా అతనికి సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. రెక్కీ నిర్వహించడంతో దాడులకు బ్లూప్రింట్ రూపకల్పన తదితర అంశాలను రాణానే దగ్గరుండి చూసుకున్నట్లు నేరారోపణలు ఉన్నాయి. ముంబై దాడులతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో 2009 అక్టోబర్‌లో తొలుత హెడ్లీ, ఆపై రాణా అరెస్టయ్యారు. డేవిడ్ హెడ్లీకి అక్కడి కోర్టులు 35 ఏళ్ల కారాగార శిక్ష విధించగా.. అప్రూవర్‌గా మారిపోయి అమెరికా న్యాయ విభాగంతో జరుపుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని భారత్‌కు అప్పగించే అవకాశం లేకుండా పోయింది. ఇక.. 2013లో తహవూర్ రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇల్లినాయిస్ కోర్టు. దాదాపు ఏడేళ్ల తర్వాత.. 2020లో తహవూర్ రాణాను తమకు అప్పగించాలని భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల తర్వాత.. సెంట్రల్ డిసస్టట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అనుమతించింది. అప్పటి నుంచి అన్నిరకాల కోర్టుల్లో ఊరట కోసం రాణా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు అగ్రరాజ్య సుప్రీం కోర్టులోనూ దారులు మూసుకుపోవడంతో.. ఎట్టకేలకు అమెరికా భారత్‌కు అప్పగించింది. -
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ హుసేన్ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్‌కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ, ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్ ప్రకటించారు.2009 అక్టోబర్‌లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్ చికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్ రాణాను అక్టోబర్ 18వ తేదీన ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10వ తేదీన భారత్‌లో దిగగానే తహవూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
NIA అదుపులో తహవూర్ రాణా
-
ముంబై ఉగ్రదాడి: తహవ్వుర్ హుస్సేన్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
ఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పాటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.వివరాల ప్రకారం.. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట ఎన్ఐఏ అధికారులు హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది.2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు.అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. -
భారత్ చేతిలో రాణా.. ముంబై నరమేధం 26/11
-
ఎన్ఐఏ అదుపులో రాణా
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. అతడిని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్ చేశారు. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది. 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు. అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. రాణాను బహిరంగంగాఉరి తీయాలి: ఏక్నాథ్ ఓంబలే ఉగ్రవాది తహవ్వుర్ రాణాను బహిరంగంగా ఉరి తీయాలని ఏక్నాథ్ ఓంబలే డిమాండ్ చేశాడు. వందల మంది ప్రాణాలను బలిగొన్న ముష్కరుడికి బతికే హక్కు లేదని అన్నాడు. భారత్‌పై దాడులు చేయాలన్న ఆలోచన వస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలియాలంటే రాణాను జనం సమక్షంలో ఉరికంభం ఎక్కించాల్సిందేనని తేల్చిచెప్పాడు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ఏక్నాథ్ ఓంబలే సోదరుడు, అసిస్టెంట్ ఎస్ఐ తుకారాం ఓంబలే కన్నుమూశాడు. ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను బంధించే ప్రయత్నంలో మృతిచెందాడు. ఆ సమయంలో తుకారాం వద్ద లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేదు. ఆయినప్పటికీ కసబ్‌ను ధైర్యంగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన కసబ్ కాల్పులు జరపడంతో తుకారాం నేలకొరిగాడు. కసబ్‌ను చాలాసేపు నిలువరించడం వల్లే చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. తుకారాంకు ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. దాడులకు ముందు తాజ్‌మహల్ సందర్శన ఉగ్రవాది తహవ్వుర్ రాణా ముంబై దాడుల కంటే ముందు భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌తోపాటు కొచ్చీ, ముంబై నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. 2008 నవంబర్ 26న దాడులు జరిగాయి. నవంబర్ 13 నుంచి 21 దాకా రాణా ఇండియాలోనే ఉన్నాడు. అతడు దేశం వదిలివెళ్లిపోయిన ఐదు రోజుల తర్వాత 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. భార్య డాక్టర్ సమ్రజ్ అక్త్తర్తో కలిసి రాణా నవంబర్ 13న ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్‌లోని సమ్రజ్ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత వేగన్ఆర్ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్లో బసచేశారు. మరుసటి రోజు తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. కొచ్చిలో రెండు రోజులు ఉన్నారు. తర్వాత ముంబైలో పోవై హోటల్లో, జలవాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో బస చేశారు. జలవాయు విహార్‌లో 1971 నాటి యుద్ధ వీరులు నివసిస్తుంటారు. ఈ యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కాంప్లెక్స్‌ను పేల్చివేయాలని రాణా భావించాడు. కానీ, అక్కడ దాడులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. నవంబర్ 21న ఇండియా నుంచి వెళ్లిపోయాడు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల కేసులో తహవ్వుర్ రాణాపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ అడ్వొకేట్ నరేంద్ర మాన్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన నియామకం రాబోయే మూడేళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యేదాకా అమల్లో ఉంటుంది. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేత కోర్టులతోపాటు అప్పిలేట్ కోర్టులో నరేంద్ర మాన్ వాదిస్తారు. దయాన్ కృష్ణన్ కృషి వల్లే.. తహవ్వుర్ రాణాను రప్పించడం వెనుక సీనియర్ లాయర్ దయాన్ కృష్ణన్ కృషి ఎంతో ఉంది. రాణా కేసులో భారత ప్రభుత్వం తరఫున అమెరికా కోర్టుల్లో ఆయన సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికా కోర్టులో రాణాపై విచారణ 2018లో ప్రారంభమైంది. 2023 మే 16న కృష్ణన్ చేసిన వాదనను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ సెంట్రల్ డి్రస్టిక్ట్ ఆఫ్ కాలిఫోరి్నయా మేజిస్ట్రేట్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. రాణాను ఇండియాకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. రాణాను రప్పించే విషయంలో ఈ తీర్పు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకే కేసులో రెండుసార్లు ఎలా శిక్షిస్తారంటూ రాణా తరఫు న్యాయవాది పాల్ గార్లిక్ క్యూసీ చేసిన వాదనను దయాన్ కృష్ణన్ గట్టిగా తిప్పికొట్టారు. రాణాపై ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించే బృందంలో కృష్ణన్ సైతం చేరబోతున్నట్లు తెలిసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్కు ఆయన సహకరిస్తారు. ఈ బృందంలో అడ్వొకేట్లు సంజీవి శేషాద్రి, శ్రీధర్ కాలే సైతం ఉంటారని సమాచారం. అప్పటి హీరోనే ఇప్పటి ఎన్ఐఏ చీఫ్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సదానంద్ దాతే 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులతో హోరాహోరీగా తలపడ్డారు. అప్పట్లో ఏసీపీగా పని చేస్తున్న సదానంద్ ఆ రోజు రాత్రి ముంబై కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్‌ను 40 నిమిషాలపైగా ఒంటరిగా ఎదుర్కొన్నారు. ముష్కరుల కాల్పుల్లో మిగతా పోలీసులు గాయపడగా, అయన ఒక్కరే ధైర్యంగా ముందడుగు వేశారు. ఎదురు కాల్పులు జరుపుతూ ఆ ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ పేలి సదానంద్ గాయపడ్డారు. అయినప్పటికీ కాల్పులు ఆపలేదు. 40 నిమిషాలపాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26/11 దాడుల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు సదానంద్ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్ 31దాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. -
Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) భారత్‌కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్ఏఐ(National Investigation Agency) అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్ రాణా గురించి ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్‌కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్‌లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్‌కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. -
తహవూర్ రాణా అరెస్ట్.. తీహార్ జైలుకు తరలించిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ, సాక్షి: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అనంతరం, తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు రాణాను ప్రవేశపెట్టనున్నారు. తీహార్‌లోని హై సెక్యూరిటీ జైల్లోనే రాణాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్లో ఎవరెవరున్నారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపనుంది.26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 🚨 BIG BREAKING NEWS26/11 mastermind Tahawwur Rana has ARRIVED in India, following his EXTRADITION from US [Bharti Jain/TOI] 🔥— NIA will take him into custody. pic.twitter.com/ELPwS28L5L— Megh Updates 🚨™ (@MeghUpdates) April 10, 2025తహవూర్ రాణాను విచారణ ఇలా ఉండనుంది26/11 దాడుల నిందితుడు రాణాపై దర్యాప్తు ఎలా జరుగుతుందనే అంశంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహవూర్ రాణాను ఎన్ఐఏ లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు అతనిని అరెస్ట్ చేస్తాయి. అనంతరం,ఎన్ఐఎలోని 12 మంది సీనియర్ అధికారుల బృందంతో విచారణ చేస్తారు. రాణా నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి, కోర్టులో పోలీస్ కస్టడీ కోరుతారు. ఈ దశలో అతని పాస్‌పోర్ట్‌లు, డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలను పరిశీలన జరుగుతుంది.అతని సహచరులతో సంబంధాలపై విచారణ చేపడతారు. కుట్రలు,ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ విచారణ ముగిసిన తర్వాత, అతనిని జైల్లో జుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ దశలో కోర్టులో చార్జ్ షీట్ దాఖలవుతుంది. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగింపు.ఎన్ఐఏ/సీబీఐ వంటి సంస్థలు సేకరించిన ఆధారాల ఆధారంగా యూఏపీఏ, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని సెక్షన్ల కింద కోర్టులో చార్జ్‌షీట్ నమోదు చేస్తారు. తహవూర్ రాణాకు శిక్ష పడేది అప్పుడే అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఉగ్రవాద సంస్థల నుండి మద్దతు, డబ్బు మార్పిడి లింకులు పరిశీలన ఉంటుంది. చార్జ్ షీట్ కోర్టు ఆమోదించిన తరువాత అభియోగాలపై రాణా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వ తరఫున ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పిస్తుంది. తుది తీర్పు రీత్యా శిక్ష అమలవుతుంది. ఆధారాల బలాన్ని బట్టి ఈ మొత్తం ప్రక్రియ నెలల నుంచి సంవత్సరాల వరకూ సాగే అవకాశం ఉంటుంది. ఎవరి తహవూర్ రాణాపాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి. -
రాణాకు వీఐపీ ట్రీట్మెంట్.. బిర్యానీలతో మేపొద్దు
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవుర్ రాణా (Tahawwur Hussain Rana) భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తహవుర్ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. ఈ తరుణంలో రాణాకు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అంటే ప్రత్యేక సెల్, బిర్యానీ వంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, అతన్ని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.తహవూర్ రాణాను ఉరితీయాలివారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మందిని ప్రాణాలు కాపాడిన స్థానిక టీసెల్లర్ ఛోటు చాయ్ వాలా అలియాస్ మహ్మద్ తౌఫిక్ సైతం ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడారు. అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవూర్ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs— ANI (@ANI) April 9, 2025‘రాణాను భారత్‌కు తీసుకుని రావడం శుభపరిణామం. కానీ అతనిని 15 రోజుల్లో లేదా రెండు మూడు నెలల్లో బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అజ్మల్ కసబ్‌కు జైల్లో అందించిన వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాంటి వారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా. రాణాను ఉరితీసేవరకు తాను ఎదురు చూస్తాను. నాటి ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వం సహాయం అందించింది. కానీ డబ్బుతో ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం కదా?’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రమూకల నుంచి ప్రజల్ని కాపాడి2008 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సమీపంలో మహ్మద్ తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నారు.ఆ సమయంలో ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని చూసిన తౌఫిక్ అప్రమత్తమయ్యారు.వెంటనే వారిని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తప్పించారు. అప్పటికే ముష్కరుల చేతిలో గాయపడిన బాధితుల్ని ఆస్పత్రి తరలించారు. -
మరికొన్ని గంటల్లో భారత్ కు తహవూర్ రాణా
-
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు. -
భారత్‌కు రాణా తరలింపు!
న్యూఢిల్లీ: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాణాను తీసుకొని భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రాణాను అధికారికంగా అరెస్టు చేస్తుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను తీహార్ జైలుకు తరలిస్తారు. రాణా భద్రత కోసం జైలులో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో రాణాపై విచారణ ప్రారంభం కానుంది. కేసు విచారణ ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి రాణాను ముంబైకి తరలించే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా నుంచి రాణా తరలింపు ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తనను ఇండియాకు అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తిరస్కరించింది. దాంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు అవరోధాలు తొలగిపోయాయి. -
రాణా పిటిషన్ తిరస్కరణ
న్యూయార్క్: ముంబై ఉగ్ర దాడుల నిందితుడు తహవ్వుర్ రాణా (64)కు మరోసారి చుక్కెదురైంది. తనను భారత్‌కు పంపొద్దంటూ అతను పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. న్యూయార్క్‌లోని భారత సంతతికి చెందిన అటార్నీ రవీ బత్రా పీటీఐకి ఈ మేరకు వెల్లడించారు. ముంబై దాడులకు తెగబడ్డ పాకిస్తానీ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాకు సాయపడటమే గాక డెన్మార్క్‌లో ఉగ్ర దాడికి అన్నివిధాలా మద్దతిచ్చారంటూ రాణాపై అమెరికాలో దాఖలైన అభియోగాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రస్తుతం అతను లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఖైదీగా ఉన్నాడు. రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టులు ఇప్పటికే అనుమతించాయి. కోర్టు విచా రణ ఎదుర్కొనేందుకు అతన్ని త్వరలో భారత్ పంపనున్నట్టు టంప్ కూడా వెల్లడించారు. -
తహవూర్ రాణాకు బిగ్ షాక్
వాషింగ్టన్: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana)కు బిగ్ షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.ముంబై దాడుల కేసులో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు(Extradition) అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో.. ఈ కారణాన్ని చూపిస్తూ భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీం కోర్టు(US Supreme Court)లో తహవూర్ పిటిషన్ వేశాడు. ‘‘ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న నన్ను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే. నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే. కనుక అప్పగింతపై స్టే విధించండి’’ అని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. పాక్ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను కచ్చితంగా హింసిస్తారని, భారత్‌కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడతను. అయితే తహవూర్ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే తహవూర్‌ను అమెరికా భారత్‌కు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరీ తహవూర్ రాణా..?పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా.. ప్రస్తుతం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో.. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయం ప్రకటన చేశారు. ఇందుకుగానూ ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావించారంతా. -
నన్ను భారత్‌కు పంపొద్దు.. ప్లీజ్
వాష్టింగన్: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రాణా ఆఖరి ప్రయత్నంగా అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఓ అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడతను.భారత్‌కు తనను పంపొద్దని.. అక్కడ తనను దారుణంగా హింసించే అవకాశాలు ఉన్నాయని.. తాను పాకిస్థాన్ మూలాలున్న ముస్లింను కావడమే అందుకు కారణమని పిటిషన్లో తహవూర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో.. 2008 ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకరైన తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం ఖాయమని అంతా భావించారు. -
భారత్ కస్టడికి ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణా..
-
రాణాకు మూసుకుపోయిన దారులు.. ఇక భారత్‌కు అప్పగింతే!
వాషింగ్టన్: ముంబయి దాడుల కేసు కీలక నిందితుడైన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే విషయంలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. రాణా వేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఆ దేశ లోయర్ కోర్టు గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేయడానికి రాణాకు ఇక అవకాశాల్లేకుండా పోయాయి.2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు. పాకిస్థాన్ మూలాలున్న కెనడియన్ రాణా. ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక, ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి ఇతడు అత్యంత సన్నిహితుడు. అలాగే.. దాడులకు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు. మరో కేసులో ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు గతంలో అనుకూలంగా కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాణా.. ఫెడరల్ కోర్టులతో సహా పలు పిటిషన్లు వేశాడు. చివరగా.. కిందటి ఏడాది నవంబర్ 13వ తేదీన సుప్రీం కోర్టులో రిట్ ఆఫ్ సెర్షియోరరి దాఖలు చేశాడు. డిసెంబర్ 16వ తేదీన వాదనలు జరిగాయి. కింది కోర్టులు లేదంటే ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు.కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు అమెరికా-భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని రెండు రకాలుగా ఉల్లంఘిస్తుందని రాణా తరఫు అటార్నీ వాదనలు వినిపించాడు. ఈ కేసులో ఇప్పటికే రాణాను ఇల్లినాయిస్(చికాగో) కోర్టు నిర్దోషిగా పేర్కొందనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. అమెరికాలో ఈ కేసుకు సంబంధించి అపరాధిగా తేలినా లేదంటే నిరపరాధిగా నిరూపించినా.. అమెరికా-భారత్ ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తిని అప్పగించడం కుదరదని రాణా తరఫు అటార్నీ వాదించాడు.మరోవైపు.. ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ ఎలిజబెత్ ప్రెలోగర్ వాదనలు వినిపించారు. భారత్ అభియోగాలను ఇల్లినాయిస్ పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చని, కాబట్టి ఆ దేశానికి అప్పగించే విషయంలో రాణాకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకూడదని కోర్టును కోరారామె. అలాగే.. ఈ కేసును ప్రత్యేకమైందిగా పరిగణించాలని ఆమె కోరారు. దీంతో.. రాణా వాదనలను తోసిపుచ్చిన కోర్టు అతడి పిటిషన్ కొట్టేస్తూ జనవరి 21వ తేదీన తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు దానిని కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతని ముందు దారులు మూసుకుపోయాయి. భారత్‌కు ఇదో విజయంతహవూర్ రాణా అప్పగింతకు అమెరికా సుప్రీం కోర్టు మార్గం సుగమడం చేయడాన్ని.. భారత విజయంగా అభివర్ణించారు సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్. అమెరికా సుప్రీం కోర్టు అతని వాదనలను, పిటిషన్లను తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం త్వరలోనే అతన్ని భారత్‌కు అప్పగిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారాయన.