
వాష్టింగన్: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రాణా ఆఖరి ప్రయత్నంగా అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఓ అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడతను.
భారత్‌కు తనను పంపొద్దని.. అక్కడ తనను దారుణంగా హింసించే అవకాశాలు ఉన్నాయని.. తాను పాకిస్థాన్ మూలాలున్న ముస్లింను కావడమే అందుకు కారణమని పిటిషన్‌లో తహవూర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో.. 2008 ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకరైన తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం ఖాయమని అంతా భావించారు.
Comments
Please login to add a commentAdd a comment