handlooms
-
కళింగలో పట్టు ప్రదర్శన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ ఫౌండర్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. -
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ..
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ పలకరించే తమ స్నేహితుడి కోసం చేనేత వ్రస్తాలను ధరించే వారు కొందరైతే, వీఆర్ హ్యాండ్లూమ్.. బీ హ్యాండ్సమ్ అని చెబితే గానీ, చేనేత వస్త్ర ధారణ పై తమకు మక్కువ కలగలేదనే వారు మరి కొందరు. చేనేత వస్త్ర ప్రియుడిగా, ప్రోత్సాహకుడిగా తన ఉనికిని చాటుకునే మాచన రఘునందన వృత్తిరీత్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పౌర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్. చేనేత పట్ల ఆయనకున్న కమిట్మెంట్పై పలు విశేషాలు.. – సాక్షి,సిటీబ్యూరోమూడు దశాబ్దాలుగా చేనేత వస్త్రాలు మాత్రమే ధరిస్తూ చేనేత వ్రస్తాలపై విస్తత ప్రచారం చేస్తున్నారు. ‘చేనేత వస్త్రాలను ధరించండి.. నేతన్నను ఆదరించండి’. అంటూ తన మిత్రులు, సహచర ఉద్యోగులు హ్యాండ్లూమ్ బట్టలు ధరించేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషిస్తూ చేనేత వ్రస్తాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ప్రచారం కలి్పస్తున్నారు. హ్యాండ్లూమ్కు తన దైనందిన జీవితంలో అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో ఆదర్శ ప్రాయంగా మారారు.చదువుకునే రోజుల నుంచే..మాచన రఘునందన చదువుకునే రోజులనుంచే చేనేత వ్రస్తాలు ధరించడం ఆరంభించారు. తన వివాహ సమయంలో కూడా చేనేత వ్రస్తాలను మాత్రమే విధిగా ఉండేలా నిబంధన పెట్టి సఫలీకృతమయ్యారు. చేనేత ఉపయోగాలను జనబాహుళ్యానికి తెలిసేలా తన దైనందిన జీవితంలో అనుదినం చేనేత వ్రస్తాలనే ధరిస్తూ వస్తున్నారు. చేతిరుమాలు, తువ్వాలు, లుంగీలు, ఇలా ప్రతిదీ చేనేతనే ఉపయోగిస్తారు. తాను చేనేత వ్రస్తాలను ధరించడమే కాకుండా కుటుంబ సభ్యులను, తోటివారిని, ఇరుగు పొరుగు వారిని సైతం చేనేతనే వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.ఇంట్లోని దుప్పట్లు, మొదలు వివిధ రకాల అలంకరణ వ్రస్తాలను సైతం చేనేతవే వినియోగిస్తుంటారు. ఇక పుట్టినరోజు, వివాహాది శుభకార్యాలకు కానుకలుగా చేనేత ఉత్పత్తులనే అలంకార వస్తువులుగా తయారు చేయించి ఇస్తుండడం ఆయన ప్రత్యేకత. ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులను చేనేత తువ్వా ళ్లతో సత్కరించడం ఆయన ఆనవాయితీ. మిత్రుల వివాహాది శుభకార్యాలకు హ్యాండ్లూమ్ షోరూంను సందర్శించేలా చేసి, నచ్చిన వస్త్రాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా ప్రోత్సహిస్తున్న తీరును ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. హ్యాండ్లూమ్ను ఆదరిస్తే.. ఒక నేత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకున్నట్లేనని ఆయన అభిప్రాయం. మిత్రులు కలిసిన సందర్భంగా డియర్ ఫ్రెండ్.. వీఆర్ హ్యాండ్లూమ్ అంటూ కరచాలనం చేయడం ఆయన ప్రత్యేకత. -
అనార్కలీ డ్రస్‌లో అదిరిపోతున్న అదితి రావ్..ధర తెలిస్తే షాకవ్వుతారు!
సింప్లిసిటే తన స్టయిల్ సిగ్నేచరేమో అన్నట్టు ఉంటుంది అదితి రావ్ హైదరీ. ట్రెడిషనల్.. వెస్టర్న్ ఏ వేర్ అయినా ఆమె అందాన్ని పెంచడం కాదు.. ఆమే ఆ కాస్ట్యూమ్స్‌కు కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది! అదీ అదితి ఫ్యాషన్‌ను క్యారీ చేసే పద్ధతి. ఆ అదృష్టాన్ని వరించిన బ్రాండ్స్‌లో ఒకట్రెండు ఇక్కడ.. ఢిల్లీ వింటేజ్ కో మనీష్ ఛాబ్డాను ప్రముఖ డిజైనర్ అనేకంటే సంప్రదాయ చేనేత పరిరక్షకుడు అనొచ్చేమో! ‘ఢిల్లీ వింటేజ్ కో’ బ్రాండ్‌ను ప్రారంభించి.. గత 23 ఏళ్లుగా దేశీ నేత కార్మికులతో పనిచేస్తూ అద్భుతమైన డిజైన్స్‌ను సృష్టిస్తున్నాడు. ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. అదితి ధరించే ఢిల్లీ వింటేజ్ కో బ్రాండ్ డ్రస్ ధర రూ.1,22,000/- సిల్వర్ స్టీక్ స్టోర్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యూలరీ.. ఈ బ్రాండ్ బాణి. ఇండియన్ సెలబ్రిటీలకు హాట్ ఫేవరేట్ ఇది. ఆన్లైన్లోనే కొనుగోలు చేయాలి. ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్స్ ఓపెన్ కాలేదు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. నా దృష్టిలో డ్రెస్‌కి ఫిట్టింగ్ అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాతే ఫ్యాబ్రిక్.. డిజైన్.. స్టయిల్ ఎట్సెట్రా! డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే అందం ఆటోమేటిగ్గా ఫిక్స్ అవుతుంది! అపరాజితా తూర్ టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ ఫుట్‌వేర్ బ్రాండ్స్‌లో అపరాజితా తూర్ ఫుట్‌వేర్ ఒకటి. ముంబైలో మెయిన్ ఆఫీస్ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్కి ఇండియాలో మంచి గిరాకీ ఉంది. క్యాజువల్ ఫుట్‌వేర్ క్కూడా అందాన్ని అద్దడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. అందుకే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. అదితి రావ్ ధరించిన ఫుట్ వేర్ బ్రాండ్ ధర రూ. 6,399/-. (చదవండి: 'నా సామిరంగ’ మూవీ హీరోయిన్ చుడిదార్‌లో లుక్ మాములుగా లేదుగా!) -
నేతన్నకు భరోసా వస్త్ర ప్రదర్శనలతో మార్కెటింగ్‌కు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు ప్రచారం, విక్రయాలను విస్తృతం చేసేలా ఎగ్జిబిషన్(వస్త్ర ప్రదర్శన)లు దోహదం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు మార్కెటింగ్‌కు అవసరమైన సహకారం అందిస్తోంది. సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చేనేత వస్త్రాలను అపురూప నైపుణ్యం, సృజనాత్మకతతో అందించే నేతన్నలకు భరోసాగా నిలవడంలో ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. గత నాలుగేళ్లలో 23 భారీ చేనేత వస్త్ర ప్రదర్శనలు(ఎగ్జిబిషన్) నిర్వహించగా, 392 చేనేత సహకార సంఘాలు పాల్గొన్నాయి. మొత్తం ఎగ్జిబిషన్లలో రూ. 21.62 కోట్లు విక్రయాలు జరిగేలా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కోవిడ్ సమయంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌కు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ మిగిలిన సమయంలో వా టిని విరివిగా నిర్వహించి చేనేత సహకార సంఘా లకు తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఊతమిచ్చింది. ప్రతి యేటా అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యా తులు గడించిన చేనేత ఉత్పత్తి సంఘాలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఫ్యాషన్ షో నిర్వహించి చేనేత వస్త్రాలు ప్రదర్శించి వస్త్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వారంలో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సూచించింది. దేశంలో వ్యవ సాయ రంగం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆన్లైన్ మార్కెటింగ్, ఆప్కో షోరూమ్‌లతో పాటు వస్త్ర ప్రదర్శనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
హ్యండ్ల్యూమ్స్తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్ స్టైల్స్!
యువ ఆలోచనల్లో పర్యావరణం కళగా రూపుదిద్దుకుంటోంది. ఫ్యాషన్ వేర్లో ప్రత్యేకతతో పాటు నేచర్ పట్ల బాధ్యతనూ తెలుసుకుంటుంది. మనవైన చేనేతలు పెద్దవాళ్లకే సూట్ అవుతాయన్న ఆలోచన నుంచి మోడర్న్ టర్న్ తీసుకుంటోంది. హ్యాండ్లూమ్స్‌తో ఇండోవెస్ట్రన్ స్టైల్స్ ఆకట్టుకునేలా డిజైన్ చేయిస్తోంది హైదరాబాద్ వాసి, నటి, మోడల్ నిత్యాశెట్టి. హ్యాండ్లూమ్స్‌తో తన జర్నీఎప్పుడూ ప్రత్యేకమే అని చెబుతోంది నిత్య. ప్రొఫెషనల్స్ కాదు...ఈ డ్రెస్సులు ధరించడానికి మోడల్స్ ఎవరూ ప్రొఫెషనల్స్ కాదు. సాఫ్ట్వేర్, వెయిట్రెస్, ఇంటీరియర్ డిజైనర్, డెంటిస్ట్.. ఇలా ఇతర రంగాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు నేను చేసే డ్రెస్సులకు మోడల్స్‌గా చేస్తున్నారు. ఏ రంగంలో ఉన్నవారైనా వీటి ద్వారా దుస్తులు మన క్యారెక్టర్ని చూపాలన్నదే మెయిన్. మేకప్ వంటి హంగులేవీ లేకుండా నేచరల్‌గా మా డిజైన్స్‌ని ప్రెజెంట్ చేయాలయనుకున్నాను. దీనివల్ల అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజున నిర్వహించిన ఫ్యాషన్ షోలో మా డిజైన్స్‌ని కూడా ప్రదర్శించి, మాదైన ప్రత్యేకతను చూపాం. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్ పెట్టి, మా వర్క్‌ని మరింత మందికి చేరువయ్యేలా చూస్తున్నాను. బ్రెజిల్లో జరగబోయే కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పది యూనిట్స్ వెళుతున్నాయి. అందులో మా ఇతిహాస కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్నారు నిత్య. ‘‘హ్యాండ్లూమ్స్ అంటే నేటితరం చీరలు, కుర్తా పైజామా వరకే అనుకుంటారు. కానీ, యువత ధరించేందుకు వీలుగా రెగ్యులర్ వేర్‌గా, ఫ్యాషన్ వేర్‌గా హ్యాండ్లూమ్స్ను తీసుకు రావాలనుకున్నాను. ఇందుకు.. పోచంపల్లి, పుట్టపాక, పెడన, ఒరిస్సా, భువనేశ్వర్ హ్యాండ్లూమ్స్ వారిని కలిశాను. వీటిలో నుంచి చందేరీ, ఇక్కత్, చికంకారి, శిబోరి, బాందినీ, టై అండ్ డై .. వంటివి డ్రెస్ డిజైన్స్‌లో ప్రధానంగా తీసుకున్నాను. హ్యాండ్లూమ్స్‌తో బ్లేజర్లు, ఖఫ్తాన్స్, ప్లాజో, లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్, షర్ట్స్.. నేటి యువతకు మెచ్చేలా మెన్ అండ్ ఉమెన్‌కి క్యాజువల్ అండ్ ఆఫీస్వేర్ ‘ఇతిహాస’ పేరుతో రూపొందిస్తున్నాం. ఈ ఇండో–వెస్ట్రన్ స్టైల్స్‌తో నేటితరానికి మన హ్యాండ్లూమ్స్ని దగ్గర చేయాలని, చేనేతకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నదే నా ఆలోచన. (చదవండి: విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!) -
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్‌ని ఇప్పుడు యూత్ ఫాలో అవుతోంది. ఫోక్ సాంగ్స్‌ని ఆనందించినట్టే ఫోక్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవ్వద్దు, ట్రెండ్‌సెట్టర్‌గా ఉండాలి అనే ట్యాగ్‌తో కొంత వెస్ట్రన్ టచ్‌ని జత చేసి మరీ మెరిసిపోతున్నారు. ఈ గణపతి నవరాత్రులకు మనదైన కళతో వెలిగి పోవాలనుకునేవారికి ఈ స్టైల్ సరైన ఎంపిక అవుతుంది. ధోతీ ప్యాంట్స్‌లో ఎన్నో మోడల్స్ వచ్చాయి. ఇవి అబ్బాయిల కోసమే అనేది పాత మాట. ప్రాచీన జానపద మూలాంశాలతో మనదైన సంప్రదాయ కళతో రూపొందింది ఈ స్టైల్. టులిప్ ప్యాంట్‌గా టర్న్ అయిన ఈ స్టైల్ ఈ నవరాత్రి వేడుకలలో హైలైట్ కానుంది. హెవీ ఎంబ్రాయిడరీ, పొట్లీ, షెల్ లేస్ ఉన్న ఫ్లెయిరీ కేడియా టాప్ నవరాత్రి ఉత్సవంలో రాక్ అండ్ రోల్ చేయడానికి పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్. ఇవి విదేశాలలోనూ చాలా ప్రాచుర్యం పొందాయి. చందేరీ, మధుబని, బ్లాక్ ప్రింట్లతో కలిపి ఈ ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేస్తున్నారు డిజైనర్లు. షర్ట్ అండ్ స్కర్ట్ ప్రింటెడ్ స్కర్ట్ లేదా పలాజో స్కర్ట్, కాలర్ నెక్ షర్ట్ సౌకర్యంగానూ ఉంటుంది. విలేజ్ స్టైల్‌కి వెస్ట్రన్ టచ్ ఇచ్చినా సంప్రదాయ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ట్రైబల్ జ్యువెలరీ ధరిస్తే చాలు న్యూ లుక్‌తో మెరిసిపోతారు. చెక్స్ శారీస్.. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా మనదైన సంస్కృతిని ప్రతిబింబించేది చీరకట్టు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, పండగలు, ప్రత్యేక రోజుల్లో మాత్రం చీర ధరించడం ఇప్పటికీ చూస్తుంటాం. అయితే.. వింటేజ్, విలేజ్‌తో పాటు ఫోక్ స్టైల్ కూడా కట్టులో తీసుకురావాలంటే మాత్రం చెక్స్ కాటన్ శారీ, సిల్వర్ జ్యువెలరీ మంచి ఎంపిక అవుతుంది. మనవైన హ్యాండ్లూమ్స్ ఇక్కత్, బ్లాక్ ప్రింట్ అనార్కలీ, అంగరఖా, లాంగ్ గౌన్లు విలేజ్ స్టైల్లో ఆకట్టుకుంటాయి. ఘాగ్రా లేదా ఏదైనా పట్టు లెహంగా వంటివి ధరించినప్పుడు పటోలా దుపట్టాలు వేసుకుంటే విలేజ్ స్టైల్‌కి దగ్గరగా ఉన్నట్టే కాదు ప్రత్యేకంగానూ కనిపిస్తారు. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్ -
అరటి నార.. అందమైన చీర
పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత. మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది. బనానా సిల్క్ నేతపై శిక్షణ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. బనానా దారంతో నేత అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్‌కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్‌గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది. బనానా దారం తయారీకి చర్యలు .. బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ -
‘చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం చేనేత వస్త్రాలపై వేసిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ఆధారపడినవారిలో ఎక్కువ శాతం నిరుపేదలే ఉన్నారన్నారు. జీఎస్టీ వల్ల చేనేత వస్త్రాలు అందుబాటుధరల్లో లేకపోవడంతో చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోతుందని అన్నారు. -
చేనేతకు గుర్తింపుతో ఉపాధి అవకాశాలు
భూదాన్‌పోచంపల్లి: చేనేతకు గుర్తింపునివ్వడం ద్వారా మార్కెటింగ్ పెరిగి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని హైదరాబాద్ పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని టై అండ్ డై అసోసియేషన్ భవన్లో శుక్రవారం పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాల్‌పై తపాలా కవర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియోగ్రాఫికల్ ఇండెక్స్ కలిగిన పోచంపల్లి ఇక్కత్‌తో పాటు తేలియా రుమాల్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్లను ముద్రించిందన్నారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు పంపించడానికి తపాలా శాఖ పార్శిల్ సేవలను అందిస్తుందని తెలిపారు. నెలకు రూ.50 వేల కంటే ఎక్కువ పార్శిల్ బిల్లులు చెల్లించేవారికి 10 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు క్రెడిట్ అవకాశం కూడా కల్పిస్తామన్నారు. కాగా, ఇక్కత్ డిజైన్లపై తపాలా స్టాంప్‌ను కూడా విడుదల చేయాలని హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ కోరారు. చేనేత కార్మికులు తమకు అందుబాటులో ఉన్న మార్గాలను సద్వినియోగం చేసుకొని వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్‌ను మరింత విస్తరించుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ సూచించారు. ఈ కార్యక్రమంలో చేనేత టై అండ్ డై అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భారత లవకుమార్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోస్టల్ సూపరింటెండెంట్లు వెంకటసాయి, యెలమందయ్య తదితరులు పాల్గొన్నారు. -
కళలకు వారధి
ఆధునిక బ్రాండ్లు ఎన్ని వచ్చినా ప్రపంచం చూపు హస్త కళలవైపే అనేది నూటికి నూరు పాళ్లు వాస్తవం. ప్రాచీన కళను ఆధునిక కాలానికి తీసుకురావడానికి ఓ వారధిగా కృషి చేస్తున్నారు గుజరాత్ వాసి అయిన బృందాదత్. భారతీయ హస్త కళల సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కళావారధి తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ నుంచి క్రాఫ్ట్ ప్రెన్యూర్ సన్మాన్ అవార్డు అందుకున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన బృందా హస్తకళల గురించి ‘దేశంలో కళాకారులు ఏ మూలన ఉన్నా అక్కడ నేనుంటాను’ అని తెలిపారు. బృందాదత్ ఎంచుకున్న మార్గం గురించి మరింత వివరంగా.. భారతీయ హస్తకళల పట్ల అపారమైన గౌరవం, ఆధునిక భావాల అభిరుచితో భూత–భవిష్యత్తుల కలయికగా ‘మోరీ డైనమిక్ డిజైన్ స్టూడియో’ను గుజరాత్‌లోని గాం«దీనగర్‌లో 2019లో ప్రారంభించారు బృందాదత్. దేశం నలుమూలల నుండి క్రాఫ్ట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తూ, తన అనుభవాన్ని మెరుగుపరుచుకుంటూ కళ ఎప్పటికీ నిలిచేలా వినూత్న డిజైన్లను రూపొందిస్తున్నారు ఆమె. ఎంతో మంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. హస్తకళా నైపుణ్యంలో మహిళలు నిరంతర సాధన అవసరం బృందాదత్ అహ్మదాబాద్ ఎన్ఐడి నుండి టెక్స్టైల్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తన చదువుకు సార్ధకత చేకూరే పనిని ఎంచుకోవాలనుకున్నారు. అందుకు తగినట్టుగా ఆమె దృష్టి గ్రామీణ భారతం వైపుగా కదలింది. భారతీయ మూలాల్లో ఎన్నో ప్రాచీన కళలున్నాయి. అవన్నీ అత్యంత సామాన్యులు అనదగిన వారి చేతిలోనే రూపుదిద్దుకున్నాయి. అలాంటివారిని తన డిజైన్ స్టూడియోలో ఒక సభ్యునిగా చేర్చుకుంటారు. ‘ప్రతి కళాకారుడూ తన కళలో పూర్తి హృదయాన్ని పెడతాడు. ఆ కళాకారుడు సృష్టించినదానిపట్ల అతనికే పూర్తి యాజమాన్య హక్కు, బాధ్యత ఉంటుంది. అప్పుడే ఆ కళ జీవిస్తుంది. హస్తకళలు పునరుద్ధరింపబడాలంటే ఇందులో నిరంతర సాధన చాలా అవసరం. ఆ దిశగానే నా ప్రయత్నాలు ఉంటున్నాయి. గ్రామాల్లోని మహిళల చేతిలో ఉన్న కళను మరికొందరికి పంచి, వాటి ద్వారా ఇంకొంత మంది కళాకారులను తయారుచేయాలన్నదే నా లక్ష్యం’ అంటారు ఈ డిజైనర్. ఇందులో భాగంగానే స్త్రీ, పురుషుల గార్మెంట్స్‌తో పాటు ఇంటీరియర్‌లో ఉపయోగించే వాల్ ఆర్ట్స్, కుషన్స్... వంటివెన్నో కళాత్మకంగా రూపొందిస్తున్నారు. కళాకారుల గొలుసు హస్తకళలను పునరుద్ధరించాలంటే అందుకు అత్యంత సమర్ధులైన బృందాన్ని ఏర్పాటుచేసుకోవడం ముఖ్యం. తమ ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగడానికి రోజు రోజుకు పెరుగుతున్న కళాకారుల బృందమే అంటారీ యువ కళాకారిణి. ‘మా కళాకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటూ చరిత్రను ముందు తరాల వారికి మరింత వినూత్నంగా తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. కళాకారుల కమ్యూనిటీల నైపుణ్యాలను పెంచడం ద్వారానే మా కళాకృతులను వృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా భారతీయ గ్రామాలలోని నిపుణులైన కళాకారుల జీవనోపాధిని మెరుగుపరిచే గొలుసును సృష్టించడం మేం చేస్తున్న ప్రధానమైన పని. దానికి మా డిజైనర్ స్టూడియో ఒక కూడలిలాంటిది. మేం ఉపయోగించే ముడిసరుకంతా స్థానికంగానే లభిస్తుంది. సేంద్రీయ కాటన్‌తో రూపొందించిన ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు, సహజ రంగులను డిజైన్లలో ఉపయోగిస్తాం. ఇందుకోసం గ్రామాల్లోని కళాకారులకు వర్క్‌షాప్‌లను నెలలో రెండు సార్లు నిర్వహిస్తున్నాం. కళాకారులందరికీ వారి పనికి తగిన వేతనాలు చెల్లిస్తాం’ అని తెలియజేస్తారీ యువ డిజైనర్. అప్‌సైకిల్.. రీసైకిల్.. మన దేశ గ్రామీణం అభివృద్ధి పయనంలో సాగాలంటే యువచైతన్యం మూలాల్లో దాగున్న కళలను వెలికి తీసుకురావాలనే ఆలోచనను అందరిలోనూ కలిగిస్తున్నారు బృంద. ‘మా స్టూడియోలో ఏదీ వృథాగా పోదు. ప్రతి చిన్న క్లాత్ ముక్కను కూడా ప్యాచ్‌వర్క్‌గా ఉపయోగిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని కాళహస్తి, మచిలీపట్నం నుంచి తరతరాలుగా వస్తున్న కలంకారీ ఆర్ట్‌వర్క్‌ను తీసుకుంటున్నాం. బిహార్‌కి ప్రత్యేకమైన సుజ్ని అనే క్విల్ట్‌ల తయారీపై దృష్టి పెట్టాం. పాత క్లాత్‌లను కలిపి కుట్టే ఈ క్విల్ట్‌లు ఎంతో బాగుంటాయి. కచ్ ప్రాంతంలో ఉన్న కళాకృతులన్నీ మా డిజైన్స్‌లో ప్రతిఫలిస్తాయి. అంటే, అక్కడి కళామూలాలకు వెళ్లి, అక్కడి మహిళల హస్తకళను వృద్ధి చేసే పనిలో ఉంటున్నాం. ఇలా, దేశంలో ఏ ప్రాంతంలో ఏది ప్రత్యేకమైన ఆర్ట్ ఉందో తెలుసుకుంటూ, ఆ ప్రాంత కళాకారులతో మాట్లాడి వారి కళకు తగిన న్యాయం చేయడంపైనే దృష్టిపెడతాం’ అని తెలియజేస్తారు ఈ యువ కళావారధి. – నిర్మలారెడ్డి -
జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ‘మగ్గాలను పెట్టినాం.. నూలు నూలు ఒడికినాం.. మా నరాలనే దారాలుగా గుడ్డలెన్నో నేసినాం.. శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో అని ఆక్రోశించిన నేతన్నల బతుకు చిత్రం ఇప్పుడు మెరుగుపడుతోంది. నవరత్నాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సాయం చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దక్కేలా చేసింది. కరోనా కష్టకాలంలోనూ ‘నేతన్న నేస్తం’ ఆదుకుంది. చేనేత రంగం.. ఇప్పుడు సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం బతికి బట్టకడుతున్న వైనం పూర్వాపరాలపై ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. సుదీర్ఘ చరిత్ర గల చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రంగులు అద్దుతోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా మగ్గం కలిగివున్న 81,703 మందికి రూ.383.79 కోట్లు అందించి జీవనోపాధి కల్పించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు నేతన్న నేస్తం అందించిన ప్రభుత్వం మూడో పర్యాయం కూడా ఒక్కొక్కరికీ రూ. 24 వేల చొప్పున సాయమందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ( ఫైల్ ఫోటో ) చేనేత ఉపాధికి చేయూత.. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం ఒక కులానికి పరిమితం కాకుండా అనేక సామాజికవర్గాలకు ఉపాధి చూపుతోంది. పద్మశాలి, దేవంగ, కర్ణిభక్తులతోపాటు దాదాపు 18 ఉపకులాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. నాల్గవ అఖిల భారత చేనేత లెక్కలు 2019–2020 ప్రకారం చేనేత, నేత, అనుంబంధ కార్యకలాపాల్లో దేశంలో 31.45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 90,775 చేనేత కుటుంబాలు ఉన్నట్టు అంచనా. రాష్ట్రంలోని వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, ఉప్పాడ, రాజాం తదితర అనేక ప్రాంతాల్లో చేనేత రంగం రారాజుగా గుర్తింపు పొందింది. పట్టుచీరలు, జరీ చీరలు, కాటన్ చీరలు, కలంకారీ, పొందూరు ధోవతులు, పుత్తూరు లుంగీలు అంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో చేనేత వస్త్రం ప్రసిద్ధి పొందాయి. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి.. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెచ్చేలా ప్రతియేటా ఆగస్టు7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశానివే. చేనేత వస్త్రాలకు కొంతకాలంగా పవర్ లూమ్స్, షటిల్ మగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ మిల్లులతో పోటీ ఎదురవుతుండగా.. నేడు కంప్యూటర్ సాయంతో ఎయిర్‌జెట్ వంటి మగ్గాల నుంచి పోటీ వచ్చిపడింది. ఇటువంటి పరిస్థితిలో చేనేతను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ( ఫైల్ ఫోటో ) హామీలు మరచిన బాబు.. ‘నేతన్న నేస్తం’ అందించిన సీఎం జగన్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత మరిచిపోయారని ఇప్పటికీ నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ తదితర పథకాల ద్వారా చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్నారని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి చూపారు నేతన్న నేస్తం ద్వారా రూ.24వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా కష్టకాలంలో మా కుటుంబానికి ఉపాధి చూపారు. మొత్తంతో ముడి సరుకులు(మెటీరియల్) కొనుక్కున్నాను. పెట్టుబడి పెట్టిన రూ.24 వేలు రాగా, రోజువారీ కూలీ డబ్బులు(ఉపాధి) గిట్టుబాటు కాగా, అదనంగా మరో రూ.3వేల లాభం వచ్చింది. –జంజనం లక్ష్మీ, మంగళగిరి, గుంటూరు జిల్లా మగ్గాన్ని ఆధునీకరించుకున్నాను పాత మగ్గంతో ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడ్డాను. ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలకు తోడు.. నేను కొంత సొమ్ము కలిపి లిఫ్టింగ్ మిషన్, జాకార్డ్ అమరికం ఏర్పాటు చేసుకున్నాను. దీని వల్ల నాకు నేత పని ఎంతో సులువు అయ్యింది. 2019 నుంచి మా జీవితాల్లో కొత్త కాంతి వచ్చింది. –జక్కుల వెంకట సుబ్బారావు, పెడన, కృష్ణా జిల్లా జీవితాల్లో రంగులు నింపారు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేతకు ఎంతో ఊతమిచ్చారు. అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతన్నలను ఆదుకోవడంలో నిజంగానే నేస్తం అన్పించుకున్నారు. మహానేత వైఎస్‌ను గుర్తు చేస్తున్నారు. కళా విహీనంగా మారిన చేనేత బతుకుల్లో రంగులు నింపుతున్నారు. – ఊటుకూరి రంగారావు, పెడన, కృష్ణా జిల్లా -
డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్
ఇరవై ఏళ్లలో నలభై బదిలీలు ఉమాభారతి మాజీ సీఎం, మాజీ మంత్రి. హుబ్లీలో ఆమెను అరెస్టు చేయవలసి వచ్చింది! ఎవరున్నారు అరెస్ట్ చెయ్యడానికి?! రూప, ఐపీఎస్! శశికళ శక్తిమంతురాలైన ఖైదీ. పరప్పన జైల్లో ఆమెను వీవీఐపీలా చూస్తున్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టిందెవరు? రూప, ఐపీఎస్! బెంగళూరు ‘సేఫ్ సిటీ’.. వందల కోట్ల ప్రాజెక్ట్. టెండర్లలో గోల్మాల్ జరుగుతోంది. ఆ అవినీతి గుట్టును రట్టు చేసిందెవరు? రూప, ఐపీఎస్. ఏం పోలీస్ ఆఫీసర్! ఎంత పవర్ఫుల్!! ఆ పవర్‌కు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇరవై ఏళ్లలో నలభై ట్రాన్స్ఫర్లు!! జనవరి ఒకటిన మళ్లీ ఇంకో బదిలీ. నేరస్థులకు హ్యాండ్‌కఫ్స్ వేయవలసిన రూప..‘హ్యాండ్లూమ్స్’ ఎండీ సీట్లో కూర్చున్నారు. రూప 2000 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటక క్యాడర్. యూపీఎస్సీలో ఆలిండియాలో 5వ ర్యాంకు. హైదరాబాద్‌లోనే.. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషల్పోలీస్ అకాడమీ’లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఎం.ఎ. సైకాలజీ చేసి ఐపీఎస్ వైపు వచ్చారు. నేరాన్ని, అవినీతిని తేలిగ్గా పసిగట్టేయడం ఆమె సహజ నైజమేమో అనిపిస్తుంది. అందుకే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి దేశంలోనే తొలి లేడీ బాస్ అయ్యారు రూప! యువతలో స్ఫూర్తిని నింపడానికి తరచు ‘టెడెక్స్’ టాక్స్ (టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, డిజైన్) కూడా ఇస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితమే ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఇప్పటికీ కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్లానే చురుగ్గా, వేగంగా ఉంటారు. ఉండకూడదని కాదు. ఇరవై ఏళ్లల్లో నలభైసార్లు ఆమె బదిలీ అయ్యారు. ప్రమోషన్ మీద కొన్నిసార్లు, ప్రమోషన్ పేరుతో చాలాసార్లు. ఆమె తెగింపు కొన్నిసార్లు ప్రభుత్వానికి ఉపయోగపడింది. చాలాసార్లు తలనొప్పి అయింది. హుబ్లీ అల్లర్ల కేసులో విచారణ కోసం వచ్చిన ఉమాభారతిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి రూప అవసరం అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీగా ఉన్నప్పుడు శశికళకు ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయని బయటపెట్టినందుకు మాత్రం ప్రభుత్వానికి ఆమె తలనొప్పి అయ్యారు. నెల తిరగ్గానే అక్కడి నుంచి ఆమెను ‘ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ’ కమిషనర్‌గా బదిలీ చేశారు. తాజా ట్రాన్స్ఫర్ కూడా అటువంటిదే. నగర మహిళల భద్రత కోసం సౌకర్యాలు కల్పించే ‘సేఫ్ సిటీ ప్రాజెక్టు’ టెండర్లో ఒక ఏసీపీ డబ్బు మూట కట్టుకుంటున్నాడని ఆరోపించినందుకు అతడిపై ఎంక్వయరీ చెయ్యకుండా (అతడిపై సీబీఐ చార్జిషీటు ఉన్నప్పటికీ) ఆమెను హస్తకళల వస్తూత్పత్తి విక్రయ కేంద్రానికి ఎండీగా బదిలీ చేశారు! బదలీకి ముందు ఆమె కర్ణాటక రాష్ట్రానికి తొలి మహిళా హోంశాఖ కార్యదర్శి! అంతెత్తు నుంచి కిందికి తోసేశారు. అయితే రూప ఎప్పుడూ హోదాలను ఉన్నత స్థానాలుగా భావించలేదు. ఎంత ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా మనిషిగా ఉండటం కన్నా పెద్ద డిజిగ్నేషన్ లేదంటారు ఆమె. ‘‘ప్రభుత్వం నియమించుకున్న ఒక ప్రజాసేవకురాలిని మాత్రమే నేను’ అంటారు. ఇరవై ఏళ్ల క్రితం ధార్వాడ్ జిల్లా ఎస్పీగా ప్రారంభమైన రూప కెరియర్ అనేక మలుపులు తిరుగుతూ, అనేక శాఖలను తాకుతూ ప్రస్తుతానికి కర్ణాటక హస్తకళాకేంద్రం ‘కావేరీ ఎంపోరియం’కి చేరుకుంది. ‘‘నేనేమీ చిన్నతనంగా భావించడం లేదు. బాధ్యత ఏదైనా బాధ్యతే. తక్కువ ఎక్కువ ఉండదు. కర్ణాటక హోయసల సాంస్కృతిక హస్త కళలకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. లక్షలాది మంది చందనశిల్ప, బిద్రీ లోహ కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తాను’’ అంటున్నారు రూప. అయితే మరొకసారి ఆమెను బదిలీ చేయవలసిన అనివార్యతల్ని ప్రభుత్వం ఎదుర్కొనేలా ఉంది! రెండుసార్లు రాష్ట్రపతి అవార్డు పొందిన ఈ పవర్ఫుల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌ను కక్ష సాధింపుగా మాత్రమే ప్రాధాన్యంలేని పోస్టులోకి మార్చారన్న అసంతృప్తి కర్ణాటక ప్రజల్లోనే కాదు, దేశవ్యాప్తంగానూ వ్యక్తం అవుతూ ఉండటమే అందుకు కారణం. రూప, ఐపీఎస్ ఈ నెలలోనే తన పోలీస్ డ్యూటీలోకి తను మళ్లీ వెనక్కి వచ్చేయొచ్చు. ఈసారి మరింత శక్తిమంతంగా! మ్యూజిక్ ఇష్టం రూప తండ్రి దివాకర్ రిటైర్డ్ ఇంజినీర్. తల్లి హేమావతి గృహిణి. కర్ణాటకలోని దావణగెరె వారి స్వస్థలం. ఇద్దరే సంతానం. రూప, రోహిణి. ఆమె చెల్లెలు రోహిణి ఐఆర్ఎస్ ఆఫీసర్. రూప పెళ్లి 2003లో మునీష్ మౌద్గిల్‌తో జరిగింది. ఆయన ఐఎఎస్ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు అనఘ, రోషిల్. రూపకు మ్యూజిక్ అంటే ఇష్టం. లలిత సంగీతంలో కొంత ప్రవేశం కూడా ఉంది. 2018లో మహిళా దినోత్సవం కోసం ఒక స్ఫూర్తిదాయకమైన మ్యూజిక్ వీడియోను కూడా రూపొందించారు. 2019 లో రిలీజ్ అయిన ‘బయలాతడ భీమన్న’ చిత్రంలో ‘కెంపానే సూర్య’ అనే పాట పాడారు. రూప, ఐపీఎస్ : చేనేత అభివృద్ధి కార్పోరేషన్ ఎండీగా పదవీ స్వీకారం -
కాలర్ క్వీన్స్
పెళ్ళిళ్లకు కోట్లు, జాకెట్లు వేసుకొని వస్తారు మగాళ్లు.ఈ పెళ్ళిళ్ల సీజన్లో అమ్మాయిలు కూడా కాలర్ కోటు వేసుకొని హుందాగా వెళితే..వేడుకలో రాణుల్లా మెరిసిపోతారు.మహరాణుల్లా వెలిగిపోతారు. కాలర్ క్వీన్స్ అని కితాబులు అందుకుంటారు. రెట్రో స్టైల్ అలంకరణ: ఈ కోటు స్టైల్ కాలర్ నెక్ పొడవు హారం వేసుకోవచ్చు. లేదా మెడను పట్టి ఉంచే చోకర్‌ని జత చేసుకోవచ్చు. ఈ స్టైల్ బ్లౌజ్‌కి కొప్పు కేశాలంకరణ బాగా నప్పుతుంది. 70ల కాలం నాటì రెట్రో స్టైల్‌ని ఇండో వెస్ట్రన్ లుక్‌తో ఇప్పుడు మళ్లీ కొత్తగా మెరిపించవచ్చు. హ్యాండ్లూమ్స్కి నప్పే నెక్: రాబోయేది వేసవి కూడా కాబట్టి చేనేత కాటన్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. హ్యాండ్లూమ్ శారీలో రాణిలా వెలిగిపోవాలంటే కోటు స్టైల్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే చాలు. మీ లుక్‌కి గ్రాండ్ మార్కులు ఖాయం. ►పాశ్చాత్య దుస్తులలో భాగమైన ఓవర్‌కోటును గమనిస్తే ఈ నెక్ స్టైల్ వెంటనే కళ్లకు కడుతుంది. మెడకు హారంగా ఉండే పట్టీ మీద ఎంబ్రాయిడరీ చేయచ్చు. లేదంటే అంచులతో నెక్ పార్ట్‌ని మార్చచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్‌తోనూ లుక్ గ్రాండ్‌గా మార్చచ్చు. ►వేడుకకు చీరల రెపరెపల తర్వాతి ప్లేస్ లాంగ్ కుర్తాది. కుర్తాకి శాలువా స్టైల్ కాలర్ని డిజైన్ చేయించుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. ►పట్టు, ఫ్యాన్సీ శారీస్‌కు డిజైనర్ బ్లౌజ్ తప్పనిసరే. అయితే, ఆ బ్లౌజ్‌కి ఎలాంటి హంగులు అమర్చాలో కూడా సరిగ్గా తెలిస్తే... వేదిక, వేడుక ఏదైనా గ్రాండ్‌గా మెరిసిపోవచ్చు. నెటెడ్, రాసిల్క్, వెల్వెట్, బెనారస్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్లకు కోటు స్టైల్ నెక్ బాగా నప్పుతుంది. ►లెహంగా చోలీ స్టైల్ లుక్ మరింత ఆకట్టుకోవాలంటే బ్లౌజ్‌కి కోటు స్టైల్ కాలర్ నెక్‌తో డిజైన్ చేయాలి. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి డిజైన్స్‌లో ఈ స్టైల్ ఇప్పుడు కొత్తగా మెరుస్తోంది. ఆ హంగును ఈ మాఘమాసపు వేడుకకు మీరూ తేవచ్చు. -
లోకల్ బ్రాండ్లకు.. ‘పిక్ ఎన్ హుక్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని వస్తువులనూ విక్రయించే ఈ–కామర్స్ కంపెనీగా ఆరంభమైన హైదరాబాద్ కంపెనీ ‘పిక్ ఎన్ హుక్’... ఇపుడు మిగతా చోట్ల దొరకని విభిన్న ఉత్పత్తుల విక్రయంపై దృష్టిపెట్టింది. తెలంగాణ చేనేత.. నిర్మల్ బొమ్మలు.. గద్వాల, ధర్మవరం, వెంకటగిరి చీరలు, కొండపల్లి బొమ్మల వంటి ప్రత్యేక వస్తువులను దేశవ్యాప్తంగా విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. మార్చి నుంచి ఈ వస్తువులన్నీ అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా ‘పిక్ ఎన్ హుక్’ ఫౌండర్ సీఈఓ మోనిష్ పత్తిపాటి ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో తన అనుభవాల్ని పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... ‘‘స్థానికంగా ఉండి, సొంతంగా వ్యాపారం చేయాలన్నదే నా కల. అందుకు తగ్గట్టే నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బీబీఏ పూర్తి చేశాక 2016లో ‘పిక్ ఎన్ హుక్’ను ఆరంభించాం. రూ.కోటి పెట్టుబడితో మా నాన్నగారు ప్రసాద్ పత్తిపాటి సాయంతో ఆరంభించాం. ఆయనే చైర్మన్‌గా వెన్నంటి నడిపిస్తున్నారు. అనతికాలంలోనే లక్ష మందికిపైగా కస్టమర్లు వచ్చారు. 1,000కి పైగా వెండర్లు తమ ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పై విక్రయిస్తున్నారు. మంచి ధర.. వేగంగా డెలివరీ అనే రెండంశాలే మా ప్రత్యేకత. ఈ ఏడాది మార్చి నుంచి కొత్త రూపుతో రంగంలోకి దిగుతున్నాం. యాప్‌తో పాటు వెబ్‌సైట్‌కు కూడా మరిన్ని ఫీచర్లు జోడిస్తాం. ఉత్పత్తుల శ్రేణి పెంచుతున్నాం. ఫ్రాడ్ డెలివరీని నిలువరించి క్వాలిటీ చెక్ వ్యవస్థను పటిష్టం చేశాం. తద్వారా ఫిర్యాదులు అర శాతం లోపే ఉంటున్నాయి. ప్రొడక్టుల ధరను సెల్లర్లే నిర్ణయిస్తారు. ఇక నిధుల విషయానికి వస్తే ప్రస్తుతానికి సొంత వనరులే ఖర్చు చేస్తున్నాం. నిధుల సమీకరణ గురించి మార్చి చివరికల్లా ఒక స్పష్టత వస్తుంది. పోటీ ఎంతున్నా ఈ రంగంలో నిలదొక్కుకుంటామన్న ధీమా ఉంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్లాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నాం. లోకల్ బ్రాండ్స్‌ను దేశ, విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకు రావాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని మోనిష్ వివరించారు. -
తెలంగాణ చేనేత దేశానికి ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఒడిశా ఉన్నతాధికారుల బృందం కితాబు ఇచ్చింది. భారీ నిధుల కేటాయింపు, వినూత్న పథకాల అమలు, ప్రోత్సాహకాలు, పవర్లూమ్ క్లస్టర్లు, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు వంటి చర్యలతో చేనేత రంగం పునరుజ్జీవం పొందిందని పేర్కొన్నారు. ఒడిశా చేనేత, టెక్స్టైల్స్, హస్తకళల శాఖ కార్యదర్శి శుభాశర్మ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పోచంపల్లి, సిరిసిల్లలోని చేనేత, టెక్స్టైల్ పార్కులు, పవర్‌లూమ్‌లు, విక్రయ కేంద్రాలను, అబిడ్స్, నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం(టెస్కో) కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, రాష్ట్ర చేనేత, టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, చేనేత, హస్తకళల విభాగం అధికారి సురయ హసన్, మల్ఖా ట్రస్ట్ డైరెక్టర్ ఉజ్రమ్మ, నిఫ్ట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీఆర్ నాథన్‌లతో చేనేత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శుభాశర్మ మాట్లాడుతూ తెలంగాణ స్ఫూర్తితో తమ రాష్ట్రంలోనూ చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
‘టీఆర్ఎస్ ప్లీనరీలో సమాధానమిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: హస్తకళల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో గురువారం అన్ని రాష్ర్టాల జౌళి శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్తకళల రంగానికి ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జియోట్యాగింగ్ ద్వారా చేనేత మగ్గాలను గుర్తించి, వారి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణలో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నూలుకు, అద్దకాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. చేనేత మగ్గాలు ఎక్కడున్నా వాటికి యూనిక్ కోడ్లు ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులకు హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడమంటే కాంగ్రెస్ నాయకులకు చేతకాదని విమర్శించారు. అసెంబ్లీ బయట సమస్యలపై మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్నీ విమర్శలకు సమాధానమిస్తామని కేటీఆర్ అన్నారు. Attended an important meeting chaired by @smritiirani Ji on Centre- State collaboration to promote Handloom & Handicrafts Shared Telangana progress on Geotagging of Handlooms, 50% subsidy on Yarn & Dyes, Thrift scheme, Buy back scheme. Flagged concerns on GST & health Insurance pic.twitter.com/5IBWQjqrXs — KTR (@KTRTRS) April 26, 2018 -
చేనేత ఎగ్జిబిషన్.. మ్యాజిక్ షాపింగ్
సాక్షి, హైదరాబాద్ : భారతదేశపు మొదటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ గో కో-ఆప్ ‘'గో స్వదేశీ' పేరుతో చేనేత, చేతివృత్తి నిపుణుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఉత్పత్తులతో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో అయిదు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ప్రారంభించింది. చేతివృత్తి నిపుణులచే తయారు చేసిన ప్రామాణికమైన చేనేత చీరలు సహా ఇతర ఉత్పత్తులు విస్తృత శ్రేణిలో ప్రదర్శనకు ఉంచింది. భారతదేశంలోని అత్యుత్తమ నేత కళాకారులచే రూపొందించిన, అందమైన క్లిష్టమైన కళాఖండాలతో ఈ సీజన్లో, ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ఉత్పత్తులను అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. సమకాలీన, సంప్రదాయ పరిపూర్ణ కలయికతో, గో స్వదేశీ ఎక్సిబిషన్ లో క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, జమ్మూ & కాశ్మీర్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల చేనేతకారుల ఉత్తమమైన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అందమైన డిజైన్లతో పాటు, ఆక్షణీయమైన క్లాసిక్ ఉప్పాడ, పోచంపల్లి, ఒడిషా ఐకాట్స్, టస్పర్, ఇల్కల్ చీరలు ఇక్కడ లభ్యం. అలాగే కర్ణాటక కు చెందిన అద్భుతమైన మొలకల్మూరు, ఇల్కల్ చీరలు, ఉత్సాహపూరితమైన బెంగాల్ జామ్ దానిస్ & తంగైల్ చీరలు, మహేశ్వరీస్ & చందేరిస్ లాంటి అందమైన చేనేత చీరలు ఇక్కడ కొలువు దీరాయి. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సరసమైన ధరల్లో స్వచ్ఛమైన పట్టు బనారాసీ చీరలు నేరుగా కొనుగోలు చేసే అవకాశం. తమిళనాడు హ్యాండ్ లూమ్స్ ప్రియుల కోసం కో-ఆప్టెక్స్తన స్టాల్‌ను మొదటిసారి తన ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది. కో -ఆప్టెక్స్ షాపులో తమిళనాడు సిల్క్ కాటన్ చీరలు మీకోసం.. అంతేకాదు బీహార్ ,కశ్మీర్ కు చెందిన ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్రదర్శనలో ఉన్నాయి. కశ్మీర్ సంస్కృతిని, అక్కడి చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాన్ని తలపించే బీడ్, థ్రెడ్ వర్క్ కు పేరు పొందిన కషిడ ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు అలరిస్తున్నాయి. వీటితోపాటు హోం ఫుర్నిషింగ్స్, మెన్స్ వేర్ తో చేతితో తయారు చేసిన వెరైటీ స్టోల్స్, దుప్పట్టాలు మీమ్మల్ని ఆకట్టుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? గో కో-ఆప్ 'గో స్వదేశీ' ఎగ్జిబిషన్ ను సందర్శించండి .. వార్డ్ రోబ్ కు చేనేత మ్యాజిక్‌ను జోడించండి!!! ప్రదేశం: కళింగ కల్చరల్ హాల్, బంజారా హిల్స్ సమయం: ప్రతి రోజు ఉదయం 11గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు ఎప్పటివరకు: మార్చి 9వ తేదీ- మార్చ్ 13 వ తేదీ వరకు -
ఒబామాకు నటి ప్రత్యేక కానుక
భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నటి పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన పూనమ్, ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా పూనమ్ చేనేత వస్త్రాలను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని.. తాను ఆదర్శంగా భావించే వ్యక్తి బరాక్ ఒబామా అని తెలిపింది. ఆయనకు చేనేత వస్త్రాలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూనమ్ కౌర్‌ను ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రచార కర్తగా నియమించినట్టు ఇటీంల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. -
అంచనాలు.. అను‘మతిపోవాల్సిందే’ !
► నీరు–చెట్టులో ఆమ్యామ్యాలు ► అధికారులకు ఏకంగా 22 శాతం కమీషన్ ► అధికార పార్టీ నేతలకు 15 శాతం ► కలెక్టర్‌కు చేరిన ఫిర్యాదులు ► సీఎంఓకూ ఫిర్యాదు చేసేందుకు మరికొందరు సమాయత్తం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీరు–చెట్టు పనుల్లో అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అంచనాలు వేయడం మొదలు.. అనుమతులు వచ్చే వరకూ కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయంతో వ్యవహారం మొదలవుతోంది. ఇక నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు తమకు ఇష్టం వచ్చిన వారికి పనులు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు 15 శాతం మేరకు కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నేతలను తలదన్నేలా అధికారులు ఏకంగా 22 శాతం కమీషన్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలు రూపొందించడంలోనే అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కమీషన్ల దందాపై నేరుగా కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరోవైపు నీరు–చెట్టు పనుల్లో కమీషన్లు బాగా ముట్టజెప్పిన నియోజకవర్గాల్లో పనుల విలువను అమాంతంగా పెంచేస్తున్నారని కొద్ది మంది అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంఓ) ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అంచనాల నుంచే మొదలు...! నీరు–చెట్టు పనుల్లో అవినీతి వ్యవహారం మొత్తం అంచనాల వద్దే మొదలవుతోంది. ఒక్కో పనిని అంచనాలను రూపొందించేందుకే అధికారులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లను దండుకోవడం ప్రారంభమవుతోంది. ఒక్కో పని అంచనాను రూపొందించేందుకు రూ.15 వేల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఇక అంచనాలను రూపొందించడంలోనే పని విలువను 30 నుంచి 50 శాతం వరకూ పెంచేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకూ ఏకంగా 22 శాతం మేర కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్టర్లే వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు అధికార పార్టీ నేతలకు 15 శాతం మేర కమీషన్ సమర్పించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విధంగా కేవలం కమీషన్ల రూపంలోనే 37 శాతం పోను మిగిలిన దాంట్లో పనిచేసేది 40 నుంచి 50 శాతానికి మించే అవకాశం లేదని సాగునీటి శాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల విలువ చేసే 2,086 పనులకు అధికారిక అనుమతి లభించింది. ఫిర్యాదుల పరంపర...! నీరు–చెట్టు పనుల విషయంలో అధికార పార్టీ నేతల మధ్యే రగడ మొదలయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. ఈ విధంగా కొన్ని నియోజకవర్గాల్లో నీరు–చెట్టు పనుల్లో జరుగుతున్న తంతుపై అధికారపార్టీకి చెందిన నేతలే కొందరు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంచనాల విలువను కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా 50 శాతం వరకూ పెంచిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. మరోవైపు ఒక నియోజకవర్గంలో తన వ్యతిరేకులకు నీరు–చెట్టు కాంట్రాక్టు పనులను సదరు ఎమ్మెల్యే 15 శాతం కమీషన్ తీసుకుని అప్పగించారంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే మండిపడుతున్నారు. ఈ విషయంపై నేరుగా సీఎంఓకే ఫిర్యాదు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. నీరు–చెట్టు పనుల అప్పగింత వ్యవహారంలో ఉన్నతాధికారి భారీగానే కమీషన్లు దండుకుంటున్న విషయంపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద రూ.200 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులపై ఫిర్యాదులు కూడా అంతకు మించి వస్తుండటం గమనార్హం. -
చేనేతకు చేయూత ఏదీ ?
-
గ్యాస్ సిలిండర్ పేలి మగ్గాలు దగ్ధం
– రూ.2 లక్షల ఆస్తినష్టం మదనపల్లెటౌన్: గ్యాస్ లీకై మంటలు వ్యాపించి మగ్గాలు దగ్ధమైన ఘటనలో రూ.2లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నీరుగట్టువారిపల్లెలో జరిగింది. అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్ కథనం మేరకు వివరాలు.. రామిరెడ్డి లేవుట్లోనివాసం ఉంటున్న లక్ష్మీనారయణ ఇంటిలో మగ్గాలు నేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అతని భార్య సరోజమ్మ, సాయంత్రం సిలిండర్‌తో స్టౌవ్ వెలిగించి వంటచేసింది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకవడంతో మంటలు వ్యాపించి మగ్గాల గది అగ్నికి ఆహుతైంది. మరో ఫుల్ సిలిండర్ కూడా పేలడంతో ఇంటిలోని వంట సామగ్రి, ఫర్నీచర్, బట్టలు, మగ్గాలు, పట్టుచీరలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రామచంద్రయ్య, సుబ్బరాజు, కిరణ్‌బాబు, సుబ్బయ్య, లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యం తదితరులు మంటలను అదుపు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఆప్కో చేనేత వస్త్రాలపై ప్రత్యేక డిస్కౌంట్
కర్నూలు(అర్బన్): విజయ దశమి, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం, ఎంపిక చేసిన చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆప్కో బోర్డు డైరెక్టర్ పి. నాగలక్ష్మయ్య తెలిపారు. స్థానిక కొత్త బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్ వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగలక్ష్మయ్య మాట్లాడుతూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా గ్రామీణ చేనేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి సహాయ సంచాలకులు పి. సత్యనారాయణ రావు, ఆప్కో అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ పి. భారతీ, రిటైర్డు మార్కెటింగ్ ఆఫీసర్ బి. పంపయ్య, నరసింహరావు, ఆప్కో ఎగ్జిబిషన్ కర్నూలు ఇన్చార్జీ కె.రోజ్ మాణిక్యం, జేటీఓ ఎస్ బాలసుబ్రమణ్యం, డీఈఓలు జీవన్‌కుమార్, పుల్లయ్య పాల్గొన్నారు. -
ఆశల మగ్గంపై నేతన్న కన్నీరు
జిల్లాలో నష్టాల్లో 39 చేనేత సంఘాలు సంఘాలకు రుణ మాఫీ లేనట్టేనా! నేడు జాతీయ చేనేత దినోత్సవం విదేశీ వస్త్రాలు బహిష్కరించి మగ్గంపై తయారు చేసే ఉత్పత్తులనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుతున్నాయి. వ్యవసాయం తర్వాత అతి పెద్ద ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ నేడు మనుగడ సాగించలేని దుస్థితిలో ఉంది. ఉపాధి కరువవ్వడంతో ప్రత్యామ్నాయ మార్గాలవైపు నేతన్నలు వలస పోతున్నారు. – అమలాపురం రూరల్ ఓవైపు ఆన్లైన్ మార్కెటింగ్ అంటూ దూసుకుపోతుంటే, చేనేత రంగం మాత్రం ఆప్కోను నమ్ముకుని నష్టాల్లోకి వెళ్లిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆప్కో విభజన ఇంకా జరగకపోవడం చేనేత సంఘాలకు శాపంగా మారింది. జిల్లాలో 50 చేనేత సంఘాల్లో సుమారు రూ.7 కోట్ల విలువైన ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయి. కార్మికులకు పనుల్లేక పస్తులుంటుంటే, సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే రూ.12 కోట్ల వరకు నష్టాల్లో ఉన్న సంఘాలు, ఆప్కో దెబ్బతో మరింత కుదేలవుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో ఈ రంగానికి అరకొర నిధులు కేటాయించడంతో దీని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆప్కో విలీనం జరగలేదు రాష్ట్ర విడిపోయి రెండేళ్లయినా ఆప్కో విలీనం జరగడం లేదు. ఉమ్మడిగా ఉండడం వల్ల చేనేత సంఘాలకు సహకారం అందడం లేదు. 1976లో చేనేత సంఘాలకు మాతృసంస్థగా ఆప్కో ఆవిర్భావమైంది. చేనేత సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చేది. నిర్లక్ష్య విధానాలతో ఈ సంస్థ కాలక్రమంలో రూ.130 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. దీనితో అన్ని జిల్లాల్లోని సంఘాలు నష్టపోయాయి. చేనేత కార్మికుల స్థితిగతులపై హ్యాండ్లూమ్ అధికారులు సర్వే చేసి, వారికి చేయూతనివ్వాల్సి ఉంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పనుల్లేక చేనేతలు మాస్టర్ వీవర్స్ వద్ద తక్కువ జీతాలకు పనిచేయాల్సి వస్తోంది. సంఘాలకు రుణమాఫీ హుళక్కేనా! గత ఎన్నికల సమయంలో చేనేత రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల తర్వాత వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తున్నారు. ఆదివారం ధర్మవరం సభలో ముఖ్యమంత్రి రుణమాఫీపై ప్రకటన చేయనున్నారు. జిల్లాలో కార్మికుల వ్యక్తిగత రుణాలు సుమారు రూ.10 కోట్ల వరకు రుణమాఫీ జరగనుంది. ఇప్పటి వరకు చేనేత సంఘాలకు రూ.12 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంది. కోనసీమలోని 11 సంఘాల్లో కె.జగన్నాథపురం మాత్రమే రూ.7 లక్షల లాభాల్లో ఉంది. మిగిలిన 10 సంఘాలు నష్టాల్లో ఉన్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేత సంఘాలకు రూ.325 కోట్ల రుణమాఫీ ప్రకటించగా, ఆయన మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రూ.160 కోట్ల మేర రుణమాఫీ చేసింది. సంఘాలతో పాటు కార్మికుల వ్యక్తిగత రుణాలు కూడా అప్పట్లో మాఫీ అయ్యాయి. 39 శాతం రిబేటు ఏమైంది? ఎన్నికల ప్రచార సమయంలో పెద్దాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో చేనేత వస్త్రాలపై 39 శాతం రిబేటు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. చేనేత సంఘాల్లో పేరుకుపోయిన రూ.7 కోట్ల విలువైన ఉత్పత్తులు అమ్మాలంటే రిబేటు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం రూ.15 వేల నుంచి రూ.37,500కు పెంచారు. అది అమలుకు నోచుకోలేదు. కార్మికులు అనారోగ్యానికి గురైతే ఈ పథకంలో ఆర్థిక సాయం లభించేది. ఇది అమలులోకి రాకపోవడంతో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. -
‘పద్మ’వర్షిణి.. వర్ణ దర్శిని
ప్రకృతి సోయగాల సమ్మిళిత పట్టుచీర డిజైన్ పేరు : పద్మవర్షిణి రూపకర్త : మోహన్ ఆవిష్కర్త : బీరే ప్రసాద్ ఎక్కడ : బుధవారం ధర్మవరం పద్మారవింద ఫ్యాక్టరీలో ప్రత్యేకత : భారతీయతకు దర్పణం. పట్టుదారంతో పద్మపుష్పాలను తీర్చిదిద్దారు. ఇది అధిక కాంతిలో ఓ రంగులో, చీకటిచిమ్మితే మరో వర్ణంలోనూ మెరిసిపోతుంది. కొంగులో రత్నాల కూజాభాండం అమరిక, సప్తపుష్పాల అల్లిక, కుచ్చిళ్లలో ఆరుతులాల మేలిమి ముత్యాలతో మంగళతోరణాల కూర్పు. ఎంతమంది శ్రమిస్తే : పదిమంది 30 రోజులపాటు శ్రమిస్తే ఈ అద్భుత సృజనకు ఆవిష్కారం ఖరీదు : రూ.38వేలు మాత్రమే -ధర్మవరం -
వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి
నెల్లూరు (సెంట్రల్): వారంలో ఒకరోజు అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరిస్తే చేనేత కార్మికులకు మంచి జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన చేనేత మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారాలు లేకపోవడంతో చేనేత కార్మికులు దీనావస్థలో ఉన్నారన్నారు. చేనేత వస్త్రాలను తయారు చేసి అగ్గిపెట్టెలో అమర్చి దేశ ఘనతను నలుదిశలా చేనేత కార్మికులు వ్యాపింపజేశారన్నారు. అలాంటి చేనేతలను ఆదుకుని భారతదేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే నిధులను ఎక్కువగా చేనేతలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేస్తానని కోటంరెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేనేత కార్మికులకు ఏవేవో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం దారుణం అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోని అధికార పార్టీని అసెంబ్లీలో నిలదీస్తానన్నారు. చేనేతల పోరాటాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కోటంరెడ్డి అన్నారు. నిరుపేదలకు, సామాన్యులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం కష్టమైందని విమర్శించారు. పెద్దపెద్ద వాళ్లకు లోన్లు ఇస్తూ పేద వాళ్లను మరచిపోవడం సిగ్గుచేటన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందరరావు మాట్లాడుతూ చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తొలుత చేనేత కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి జింకా చలపతి, చేనేత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.దశరథరామయ్య, జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.రామరాజు, చేనేత సంఘం జిల్లా నాయకుడు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
హ్యాండ్లూమ్స్ ఆల్వేస్ ఎవర్గ్రీన్..
వైవిధ్యం చేనేత పరిశ్రమ అనగానే మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అనే మాట గుర్తుకు వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తూ ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లో దూసుకుపోతున్నారు చేనేత వీవర్స్. హ్యాండ్లూమ్స్ ఆల్వేస్ ఎవర్గ్రీన్ అంటూ కొత్తకొత్త డిజైన్స్‌ని మార్కెట్‌కు పరిచయం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ‘చేనేత కలర్ వీవ్స్’లో. సౌత్ ఇండియాలో స్వయంగా చేనేత కార్మికులు నిర్వహించేసంస్థ ఇదొక్కటే. నల్లగొండ జిల్లా చౌటుప్పల్, నారాయణపురం, సిరిపురం, చిట్యాలతదితర 17 గ్రామాలకు చెందిన 120 మంది చేనేత కార్మికులు సెర్ప్ సహకారంతో ‘చేనేత కలర్ వీవ్స్’ను ప్రారంభించారు. ‘ఎంతోమంది రాజకీయు నాయకులు, సినిమావాళ్లు మేం తయారుచేసిన వాటిని ఇష్టంగా తీసుకుంటున్నార’ని మహిళా చేనేత కార్మికులు చెబుతున్నారు. విజయారెడ్డి -
‘చేనేత’కు కత్తెర
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో చేనేత రంగం కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. చేనేత ఉత్పత్తులు తగ్గడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కరువైంది. కష్టకాలంలో ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చేయి చూపాయి. అదీగాక చేనేత సహకార సంఘాలకు అందించే మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీం, చేనేత అమ్మకాలపై అందజేసే పది శాతం రిబేట్ పథకాన్ని ఎత్తివేయాలని నిర్ణయం ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై చేనేత సహకార సంఘాల కార్మికులు, ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సంఘాల పరిస్థితి ఇది.. జోగిపేట, నారాయణఖేడ్, దుద్దెడ, దుబ్బాక, సిద్దిపేటలో చేనేత సహకార సంఘాలు కొంత చురుగ్గా పనిచేస్తున్నాయి. ఆయా సంఘాల్లోని కార్మికులు ఉత్పత్తులను తయారు చేయడంతోపాటు బహిరంగ మార్కెట్లోనూ విక్రయిస్తున్నారు. ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పథకాన్ని అమలు చేస్తుంది. ఏడాదిలో తయారు చేసిన ఉత్పత్తులు, అమ్మకాలపై పరిగణలోకి తీసుకుని వాటిలో పది శాతం మొత్తాన్ని ఈ పథకం కింద సహకార సంఘాలకు నేరుగా నిధులు అందేవి. గత ఏడాది జోగిపేట, నారాయణఖేడ్, దుద్దెడ, దుబ్బాక, సిద్దిపేటలోని చేనేత సహకార సం ఘాలు బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 1.73 కోట్ల అమ్మకాలు చేశాయి. దీంతో మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీం కింద రూ.5.86 లక్షల ఇన్సెంటివ్(పోత్సాహక నిధు లు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయి. అయితే ప్రస్తుత ఏడాది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీంను ఎత్తివేసినట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపనుందని సహకార సంఘానికి చెందిన అధికారి ఒకరు తెలి పారు. ఇన్సెంటివ్ స్కీం కింద నిధులు నిలిపివేయటంతో సహకార సంఘాల మూల నిధి నిల్వలు తగ్గి తద్వారా చేనేత ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సహకార సంఘాల వారు మండిపడుతున్నారు. వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిబేటుపైనా.. చేనేత ఉత్పుత్తులను ఎక్కువ శాతం ఆప్కో కొనుగోలు చేస్తుంది. మిగితా ఉత్పత్తులను సహకార సంఘాల వారు విక్రయ కేంద్రాలు, ఎగ్జిబిషన్లలో అమ్ముతుంటారు. అమ్మకాలను పెంచేందుకు ప్రభుత్వం ఎగ్జిబిషన్ అమ్మకాలపై పది శాతం రిబేటు ఇచ్చేందుకు సహకార సం ఘాలకు వీలు కల్పించింది. పది శాతం రిబేటు సొమ్మును సహకార సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం తర్వాత జమచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం రిబేటుగా ఇచ్చే నిధులను సైతం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీం, పది శాతం రిబేటు ఎత్తివేతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులకు అందాల్సి ఉందని చేనేత, జౌళి శాఖ ఏడీ రమేశ్ తెలిపారు.