పెళ్ళిళ్లకు కోట్లు, జాకెట్లు వేసుకొని వస్తారు మగాళ్లు.ఈ పెళ్ళిళ్ల సీజన్‌లో అమ్మాయిలు కూడా కాలర్ కోటు వేసుకొని హుందాగా వెళితే..వేడుకలో రాణుల్లా మెరిసిపోతారు.మహరాణుల్లా వెలిగిపోతారు. కాలర్ క్వీన్స్ అని కితాబులు అందుకుంటారు.
రెట్రో స్టైల్ అలంకరణ: ఈ కోటు స్టైల్ కాలర్ నెక్ పొడవు హారం వేసుకోవచ్చు. లేదా మెడను పట్టి ఉంచే చోకర్‌ని జత చేసుకోవచ్చు. ఈ స్టైల్ బ్లౌజ్‌కి కొప్పు కేశాలంకరణ బాగా నప్పుతుంది. 70ల కాలం నాటì రెట్రో స్టైల్‌ని ఇండో వెస్ట్రన్ లుక్‌తో ఇప్పుడు మళ్లీ కొత్తగా మెరిపించవచ్చు.
హ్యాండ్‌లూమ్స్‌కి నప్పే నెక్: రాబోయేది వేసవి కూడా కాబట్టి చేనేత కాటన్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. హ్యాండ్లూమ్ శారీలో రాణిలా వెలిగిపోవాలంటే కోటు స్టైల్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే చాలు. మీ లుక్‌కి గ్రాండ్ మార్కులు ఖాయం.
►పాశ్చాత్య దుస్తులలో భాగమైన ఓవర్‌కోటును గమనిస్తే ఈ నెక్ స్టైల్ వెంటనే కళ్లకు కడుతుంది. మెడకు హారంగా ఉండే పట్టీ మీద ఎంబ్రాయిడరీ చేయచ్చు. లేదంటే అంచులతో నెక్ పార్ట్‌ని మార్చచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్‌తోనూ లుక్ గ్రాండ్‌గా మార్చచ్చు.
►వేడుకకు చీరల రెపరెపల తర్వాతి ప్లేస్ లాంగ్ కుర్తాది. కుర్తాకి శాలువా స్టైల్ కాలర్‌ని డిజైన్ చేయించుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
►పట్టు, ఫ్యాన్సీ శారీస్‌కు డిజైనర్ బ్లౌజ్ తప్పనిసరే. అయితే, ఆ బ్లౌజ్‌కి ఎలాంటి హంగులు అమర్చాలో కూడా సరిగ్గా తెలిస్తే... వేదిక, వేడుక ఏదైనా గ్రాండ్‌గా మెరిసిపోవచ్చు. నెటెడ్, రాసిల్క్, వెల్వెట్, బెనారస్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్‌లకు కోటు స్టైల్ నెక్ బాగా నప్పుతుంది.
►లెహంగా చోలీ స్టైల్ లుక్ మరింత ఆకట్టుకోవాలంటే బ్లౌజ్‌కి కోటు స్టైల్ కాలర్ నెక్‌తో డిజైన్ చేయాలి. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి డిజైన్స్‌లో ఈ స్టైల్ ఇప్పుడు కొత్తగా మెరుస్తోంది. ఆ హంగును ఈ మాఘమాసపు వేడుకకు మీరూ తేవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment