Western look
-
Fashion: కేప్ స్టైల్.. వేడుక ఏదైనా వెలిగిపోవచ్చు!
మనవైన సంప్రదాయ దుస్తులు ఎప్పుడూ అన్నింటా బెస్ట్‌గా ఉంటాయి. కానీ, వీటికే కొంత వెస్ట్రన్ టచ్ ఇవ్వడం అనేది ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంటుంది. వెస్ట్రన్ లుక్స్‌ని కూడా మన వైపు కదిలించేలా కేప్స్‌ను డిజైన్ చేస్తున్నారు. డిజైనర్లు ఇవి అటు పాశ్చాత్య దుస్తులకు, ఇటు సంప్రదాయ దుస్తులకూ బాగా నప్పుతాయి. ఏ డ్రెస్‌లోనైనా స్టైల్‌గా కనిపించవచ్చు. వేడుక ఏదైనా బెస్ట్‌గా వెలిగిపోవచ్చు. వెస్ట్రన్ స్టైల్ మరింత అదనం స్కర్ట్ మీదకే కాదు జీన్స్ మీదకూ కేప్ ధరించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే జాకెట్‌కు మరో రూపం కేప్. సేమ్ కలర్ లేదా కాంట్రాస్ట్ కలర్ కేప్స్తో డ్రెస్సింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ప్రింటెడ్ ప్రింట్ చేసిన కేప్ క్లాత్కి రంగు రంగుల టాజిల్స్ జత చేసి కొత్త కళ తీసుకువస్తే, వేడుకలో ఎక్కడున్నా స్పెషల్‌గా కనిపిస్తారు. మిర్రర్ మెరుపులు సంప్రదాయ దుస్తులకు అద్దాల మెరుపులు తెలిసిందే. కానీ, వెస్ట్రన్ స్టైల్ కేప్‌కు అద్దాలను జతచేస్తే పెళ్లి కూతురి కళ్లలోని మెరుపులా మరింత అందంగా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ హంగులు నెటెడ్, క్రేప్, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లతో డిజైన్ చేసే కేప్ కి జరీ జిలుగులు తోడైతే ఆ అందమే వేరు. అందుకే బ్లౌజ్ నుంచి ఎంబ్రాయిడరీ కేప్‌కు కూడా మారింది. చదవండి: Pranitha Subhash: ఈ హీరోయిన్ కట్టిన గ్రీన్ సిల్క్ చీర ధర రూ. 44 వేలు! ప్రత్యేకత ఏమిటి? -
కట్టు కళ్లు చెదిరేట్టు
ఈ రోజుల్లో చీర సంప్రదాయ వేడుకల డ్రెస్ మాత్రమే కాదు ఈ రోజుల్లో చీర అమ్మలు, బామ్మలకే పరిమితం కాదు అమ్మాయిల వినూత్న కట్టులో విరివిగా మెరిసే ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ చీరతో ఇప్పుడిక స్టైల్‌గా ఆ‘కట్టు’కోవడంలోనే ఉంది అసలు సిసలు కిటుకు. 1 కుచ్చుల అంచులు వచ్చే చీరలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ కుచ్చుల వల్ల మరింత అందంగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలు, యువతులకు ఈ చీరలు బాగుంటాయి. 2 బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కంచి కుప్పడం శారీ ఇది. పూర్తి సంప్రదాయ వేడుకలకు ఎంపిక చేసుకునే ఈ చీరను వెస్ట్రన్ లుక్‌లో కట్టుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకొని, పెద్ద బెల్ట్ నడుముకు పెట్టుకొని ఇండోవెస్ట్రన్ లుక్‌లో రెడీ అవ్వచ్చు. 3 సీతాకోకచిలుకల ప్రింట్లు ఉన్న కాటన్ చీర ఇది. దీనిని అన్ని చీరల విధంగా కాకుండా మెడచుట్టూ పవిట కొంగు వచ్చేలా స్క్రార్ప్ స్టైల్లో కట్టుకోవచ్చు. వింటర్ సీజన్‌కి కూడా ఇది బాగుంటుంది. మోడ్రన్స్టైల్లో ఆకట్టుకుంటుంది. 4 గ్రీన్ లెనిన్ శారీని జెగ్గింగ్, లెగ్గింగ్ లేదా ప్యాంట్ మీధకు ధోతీ స్టైల్లో కట్టేయచ్చు. దీనికి బ్లౌజ్‌గా క్రాప్‌టాప్ వేసుకొని పైన బ్లేజర్ వేసుకోవచ్చు. ఈ లుక్ ఫార్మల్‌గానూ స్టైలిష్‌గానూ ఉంటుంది. 5 కుచ్చుల చీరకు కాంట్రాస్ట్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ ధరించి, నడుముకు సన్నని బెల్ట్ ధరిస్తే స్టైలిష్‌గా మెరిసిపోతారు. 6 ఎరుపు–నలుపు కాంబినేషన్‌తో ముందే కుట్టి సిద్ధంగా ఉన్న రెడీ మేడ్ చీర ఇది. దీనిని ఒన్ మినట్ శారీ అని కూడా అంటారు. చీరకట్టుకోవడం రాకపోయినా, కాలేజీ అమ్మాయిలు వేగంగా, సులువుగా చీర లుక్‌లో మెరిసిపోవచ్చు. నవ్యశ్రీ మండవ ఫ్యాషన్ డిజైనర్ స్టైల్ అప్ విత్ సృష్టి, హైదరాబాద్ navyasrigoud30 @gmail.com -
కాలర్ క్వీన్స్
పెళ్ళిళ్లకు కోట్లు, జాకెట్లు వేసుకొని వస్తారు మగాళ్లు.ఈ పెళ్ళిళ్ల సీజన్లో అమ్మాయిలు కూడా కాలర్ కోటు వేసుకొని హుందాగా వెళితే..వేడుకలో రాణుల్లా మెరిసిపోతారు.మహరాణుల్లా వెలిగిపోతారు. కాలర్ క్వీన్స్ అని కితాబులు అందుకుంటారు. రెట్రో స్టైల్ అలంకరణ: ఈ కోటు స్టైల్ కాలర్ నెక్ పొడవు హారం వేసుకోవచ్చు. లేదా మెడను పట్టి ఉంచే చోకర్‌ని జత చేసుకోవచ్చు. ఈ స్టైల్ బ్లౌజ్‌కి కొప్పు కేశాలంకరణ బాగా నప్పుతుంది. 70ల కాలం నాటì రెట్రో స్టైల్‌ని ఇండో వెస్ట్రన్ లుక్‌తో ఇప్పుడు మళ్లీ కొత్తగా మెరిపించవచ్చు. హ్యాండ్లూమ్స్కి నప్పే నెక్: రాబోయేది వేసవి కూడా కాబట్టి చేనేత కాటన్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. హ్యాండ్లూమ్ శారీలో రాణిలా వెలిగిపోవాలంటే కోటు స్టైల్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే చాలు. మీ లుక్‌కి గ్రాండ్ మార్కులు ఖాయం. ►పాశ్చాత్య దుస్తులలో భాగమైన ఓవర్‌కోటును గమనిస్తే ఈ నెక్ స్టైల్ వెంటనే కళ్లకు కడుతుంది. మెడకు హారంగా ఉండే పట్టీ మీద ఎంబ్రాయిడరీ చేయచ్చు. లేదంటే అంచులతో నెక్ పార్ట్‌ని మార్చచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్‌తోనూ లుక్ గ్రాండ్‌గా మార్చచ్చు. ►వేడుకకు చీరల రెపరెపల తర్వాతి ప్లేస్ లాంగ్ కుర్తాది. కుర్తాకి శాలువా స్టైల్ కాలర్ని డిజైన్ చేయించుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. ►పట్టు, ఫ్యాన్సీ శారీస్‌కు డిజైనర్ బ్లౌజ్ తప్పనిసరే. అయితే, ఆ బ్లౌజ్‌కి ఎలాంటి హంగులు అమర్చాలో కూడా సరిగ్గా తెలిస్తే... వేదిక, వేడుక ఏదైనా గ్రాండ్‌గా మెరిసిపోవచ్చు. నెటెడ్, రాసిల్క్, వెల్వెట్, బెనారస్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్లకు కోటు స్టైల్ నెక్ బాగా నప్పుతుంది. ►లెహంగా చోలీ స్టైల్ లుక్ మరింత ఆకట్టుకోవాలంటే బ్లౌజ్‌కి కోటు స్టైల్ కాలర్ నెక్‌తో డిజైన్ చేయాలి. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి డిజైన్స్‌లో ఈ స్టైల్ ఇప్పుడు కొత్తగా మెరుస్తోంది. ఆ హంగును ఈ మాఘమాసపు వేడుకకు మీరూ తేవచ్చు. -
రాణించండి
వేడుకలలో స్పెషల్‌గా కనిపించాలంటేఏ డ్రెస్సయినా వేసుకోవచ్చు.కానీ, రాణిలా.. యువరాణిలా దర్జా చూపించాలంటే ఈ లాంగ్ జాకెట్స్తొడుక్కోక తప్పదు. వీటినే కేప్స్ అని కూడా అంటారు. నెట్టెడ్, బనారస్, పట్టు వస్త్రాలతోచేసే ఈ లాంగ్ జాకెట్స్ ఏ డ్రెస్ మీదైనాహొయలు చిందిస్తాయి. మిమ్మల్ని రాణించేలా చేస్తాయి. వివాహ వేడుకలకుసంప్రదాయ వేడుకలకు రొటీన్ అలంకరణ బోర్ కొట్టచ్చు. అదే పలాజో డ్రస్మీదకు డిజైనర్ కేప్ ధరిస్తే వచ్చే ప్రశంసలే వేరు. డిజైనర్ స్కర్ట్ పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని క్రియేట్ చేశారు ఇది. పట్టు లెహెంగా మీదకు క్రాప్‌టాప్‌ని జత చేస్తేనే ఓ ఆకర్షణ. అలాంటిది దానికి నప్పే కోటును జత చేస్తే..వేడుకంతా ఒకే చోట కొలువుదీరనట్టే. ఈవెంట్ కాలేజ్ ఈవెంట్స్, స్టేజ్ షోస్ వంటి ప్రత్యేక సందర్భాలకు నప్పే స్టైలిష్ లుక్‌ని ఒక లాంగ్ కోటుతో తీసుకురావచ్చు. లాంగ్ వెస్ట్రన్ గౌన్ మీదకు ఫ్లోర్ లెంగ్త్ ఫ్లోరల్ జాకెట్ ధరిస్తే చాలు మహారాణి కళతో వెలిగిపోతారు. క్యాజువల్ లుక్ కాటన్ కుర్తా లేదంటే టాప్, బాటమ్ వేసుకొని పైన ఓ కాటన్ కేప్ వేసుకుంటే చాలు దుపట్టా అవసరం లేకుండా సౌకర్యంగా అదే సమయంలో స్టైలిష్‌గా లుక్‌ని మార్చుకోవచ్చు. పట్టు కుర్తా – స్కర్ట్పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని ఎప్పుడూ కొత్తగా క్రియేట్ చేస్తుంటారు డిజైనర్లు. పట్టు లెహెంగా, క్రాప్‌టాప్ వేసుకొని, దానికి నప్పే కోటును జత చేస్తే.. వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. జీన్స్‌తో జోడీ ఈ కాంబినేషన్‌కి మరో కట్ అవసరం లేదనుకుంటారు ఎవరైనా! కానీ, ఇప్పుడా మాటా కోటుతో మూలనపడింది. ఎందుకంటే ప్యాంట్ షర్ట్ లేదా ట్యూనిక్‌కి కోటు కూడా జత చేరి కొత్త హంగుతో చూపురుల మతులను పోగొడుతుంది. సాయంకాలం పార్టీలకు చెదురుముదురుగా పడే జల్లులు, సాయంకాలం కొద్దిపాటి చల్లదనం, రాబోయే చలికాలానికి ఇంకాస్త వెచ్చదనం.. ఇలా కాలానికి వెచ్చని స్నేహాన్ని పంచే లాంగ్ జాకెట్ పార్టీకి ఎనలేని హుషారునిస్తోంది. ఇండో వెస్ట్రన్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ అయి గెట్ టుగెదర్ పార్టీలకు ఉల్లాసాన్ని ఇస్తోంది. ∙ఇది ఇండో వెస్ట్రన్లుక్ కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణలు అక్కర్లేదు. ∙కోటు లేదా ఇన్నర్కుర్తా ప్లెయిన్‌గా ఉంటే సిల్వర్ జువెల్రీ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. ∙కేశాలంకరణకు ప్రత్యేక శ్రద్ద అవసరం లేదు. నిగనిగల కురులను పొడవుగా లేదా పొట్టిగా ఒదిలేసినా అలలుగా ఎగిసిపడుతున్న జుట్టు ఈ తరహా డ్రెస్‌కు బాగా నప్పుతుంది. ∙ప్యాంట్– షర్ట్, పలాజో లాంటివి అయితే మీడియమ్ లేదా పెన్సిల్ హీల్ని వాడచ్చు. మిగతా కాంబినేష్కి ప్లాట్ చెప్పల్ లేదా శాండిల్స్‌ను ఉపయోగించవచ్చు. ∙ఈ తరహా డ్రెస్‌కి మేకప్ హంగామా కూడా పెద్దగా అవసరం పడదు. నేచురల్‌గా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ∙కోటు డిజైన్లలో పాదాలను తాకేలా ఉన్నా, మోకాలు వరకే సరిపుచ్చినా భిన్నమైన స్టైల్‌తో మెరిసిపోవాల్సిందే! ధరించిన డ్రెస్‌కి జాకెట్ తెచ్చే సౌకర్యవంతమైన లుక్ ఇప్పుడు అమ్మాయిలకు ఆప్తురాలైంది. ∙ పాశ్చాత్య దేశాలలో వెచ్చదనానికి వేసుకునే ఈ లాంగ్ కోట్ ఇప్పుడు కొన్ని మార్పులతో స్టైలిష్ వేర్‌గా ఇండియాలో గ్రాండ్‌గా అడుగుపెట్టింది. అన్ని వయసుల వారు ఈ కేప్‌కి హార్ట్‌ఫుల్‌గా వెల్కమ్ చెప్పడమే కాకుండా, అన్ని హంగులు అద్ది హుందాగా ధరిస్తున్నారు. నిర్వహణ: ఎన్.ఆర్. -
పార్టీ టైమ్!
న్యూ ఇయర్ పార్టీలో కొత్తగా సరికొత్తగా కనిపించాలని తహత హలాడే అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు... ఇటీవల పార్టీ థీమ్స్‌లో చాలా రకాలు ఉంటున్నాయి. అందుకని సందర్భానుసారంగా దుస్తుల ఎంపిక ఉండాలి. న్యూ ఇయర్ పార్టీ పూర్తిగా పాశ్చాత్య తరహాకు చెందినది. అలాగని పూర్తిగా వెస్ట్రన్ లుక్‌తో వెళ్లాలని అనుకోకూడదు. పార్టీకి వెళ్లే ప్లేస్, వచ్చేవారినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇతరులను పోల్చి దుస్తులను ఎంచుకోకూడదు. తమ శరీరాకృతికి తాము ఎంచుకున్న దుస్తులు నప్పుతాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తమ ఎత్తు, లావు, శరీరాకృతిని బట్టి ధరించే దుస్తులు ఫిట్‌గా ఉండేలా ఎంచుకోవాలి. చక్కని డ్రెస్‌ను ఎంచుకున్నా చాలా మంది రంగుల విషయంలో పొరపాటుపడుతుంటారు. దీంతో పార్టీలో చార్మింగ్‌గా వెలిగిపోయేవారు సైతం గాడీ రంగులను ఎంచుకోవడంతో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. ఫలితంగా దుస్తుల ఎంపిక తెలియనివారుగా నలుగురిలో పేరుపడిపోతారు. అందుకే తమ మేనిరంగును బట్టి దుస్తుల రంగు ఉండేలా చూసుకోవాలి. నైట్ పార్టీ కనుక కాంతివంతమైన ముదురు రంగు దుస్తులను ఎంచుకోవాలి. సింపుల్‌గా అనిపించేలా వస్త్రాలంకరణ, అతి తక్కువ ఆభరణాలు ఉండాలి. బ్లూ డెనిమ్ జీన్స్, డీప్ యు-నెక్ టాప్ టీనేజ్ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. యాక్ససరీస్ కూడా సింపుల్‌గా, దుస్తులకు మ్యాచ్ అయ్యేవి ధరించాలి. ఒక చేతికి బ్రేస్లెట్, పెద్ద పెద్ద చెవి రింగులు లేదా హ్యాంగింగ్స్, ఒక స్టైలిష్ బెల్ట్, హీల్స్ వాడితే చాలు, అల్ట్రామోడ్రన్‌గా కనిపిస్తారు. చిన్న చిన్న స్కర్ట్లు, ఫ్రాక్‌లు ధరించినప్పుడు తప్పనిసరిగా డ్రెస్ మంచి ఫిటింగ్ ఉండేలా చూసుకోవాలి. స్లీవ్‌లెస్ టీ -షర్ట్ ధరించినప్పుడు పొడవాటి స్కర్ట్, ఫ్లిప్-ప్లాప్స్ అయితే పార్టీ లుక్ అదిరిపోతుంది.