న్యూ ఇయర్ పార్టీలో కొత్తగా సరికొత్తగా కనిపించాలని తహత హలాడే అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు...
ఇటీవల పార్టీ థీమ్స్‌లో చాలా రకాలు ఉంటున్నాయి. అందుకని సందర్భానుసారంగా దుస్తుల ఎంపిక ఉండాలి. న్యూ ఇయర్ పార్టీ పూర్తిగా పాశ్చాత్య తరహాకు చెందినది. అలాగని పూర్తిగా వెస్ట్రన్ లుక్‌తో వెళ్లాలని అనుకోకూడదు. పార్టీకి వెళ్లే ప్లేస్, వచ్చేవారినీ దృష్టిలో పెట్టుకోవాలి.
ఇతరులను పోల్చి దుస్తులను ఎంచుకోకూడదు. తమ శరీరాకృతికి తాము ఎంచుకున్న దుస్తులు నప్పుతాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
తమ ఎత్తు, లావు, శరీరాకృతిని బట్టి ధరించే దుస్తులు ఫిట్‌గా ఉండేలా ఎంచుకోవాలి.
చక్కని డ్రెస్‌ను ఎంచుకున్నా చాలా మంది రంగుల విషయంలో పొరపాటుపడుతుంటారు. దీంతో పార్టీలో చార్మింగ్‌గా వెలిగిపోయేవారు సైతం గాడీ రంగులను ఎంచుకోవడంతో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. ఫలితంగా దుస్తుల ఎంపిక తెలియనివారుగా నలుగురిలో పేరుపడిపోతారు. అందుకే తమ మేనిరంగును బట్టి దుస్తుల రంగు ఉండేలా చూసుకోవాలి.
నైట్ పార్టీ కనుక కాంతివంతమైన ముదురు రంగు దుస్తులను ఎంచుకోవాలి.
సింపుల్‌గా అనిపించేలా వస్త్రాలంకరణ, అతి తక్కువ ఆభరణాలు ఉండాలి.
బ్లూ డెనిమ్ జీన్స్, డీప్ యు-నెక్ టాప్ టీనేజ్ అమ్మాయిలకు బాగా నప్పుతుంది.
యాక్ససరీస్ కూడా సింపుల్‌గా, దుస్తులకు మ్యాచ్ అయ్యేవి ధరించాలి. ఒక చేతికి బ్రేస్‌లెట్, పెద్ద పెద్ద చెవి రింగులు లేదా హ్యాంగింగ్స్, ఒక స్టైలిష్ బెల్ట్, హీల్స్ వాడితే చాలు, అల్ట్రామోడ్రన్‌గా కనిపిస్తారు.
చిన్న చిన్న స్కర్ట్‌లు, ఫ్రాక్‌లు ధరించినప్పుడు తప్పనిసరిగా డ్రెస్ మంచి ఫిటింగ్ ఉండేలా చూసుకోవాలి.
స్లీవ్‌లెస్ టీ -షర్ట్ ధరించినప్పుడు పొడవాటి స్కర్ట్, ఫ్లిప్-ప్లాప్స్ అయితే పార్టీ లుక్ అదిరిపోతుంది.
పార్టీ టైమ్!
Published Thu, Dec 26 2013 12:46 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement