ఈ రోజుల్లో చీర సంప్రదాయ వేడుకల డ్రెస్ మాత్రమే కాదు ఈ రోజుల్లో చీర అమ్మలు, బామ్మలకే పరిమితం కాదు అమ్మాయిల వినూత్న కట్టులో విరివిగా మెరిసే ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్ చీరతో ఇప్పుడిక స్టైల్‌గా
ఆ‘కట్టు’కోవడంలోనే ఉంది అసలు సిసలు కిటుకు.
1 కుచ్చుల అంచులు వచ్చే చీరలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ కుచ్చుల వల్ల మరింత అందంగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలు, యువతులకు ఈ చీరలు బాగుంటాయి.
2 బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న కంచి కుప్పడం శారీ ఇది. పూర్తి సంప్రదాయ వేడుకలకు ఎంపిక చేసుకునే ఈ చీరను వెస్ట్రన్ లుక్‌లో కట్టుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకొని, పెద్ద బెల్ట్ నడుముకు పెట్టుకొని ఇండోవెస్ట్రన్ లుక్‌లో రెడీ అవ్వచ్చు.
3 సీతాకోకచిలుకల ప్రింట్లు ఉన్న కాటన్ చీర ఇది. దీనిని అన్ని చీరల విధంగా కాకుండా మెడచుట్టూ పవిట కొంగు వచ్చేలా స్క్రార్ప్ స్టైల్‌లో కట్టుకోవచ్చు. వింటర్ సీజన్‌కి కూడా ఇది బాగుంటుంది. మోడ్రన్‌స్టైల్‌లో ఆకట్టుకుంటుంది.
4 గ్రీన్ లెనిన్ శారీని జెగ్గింగ్, లెగ్గింగ్ లేదా ప్యాంట్ మీధకు ధోతీ స్టైల్‌లో కట్టేయచ్చు. దీనికి బ్లౌజ్‌గా క్రాప్‌టాప్ వేసుకొని పైన బ్లేజర్ వేసుకోవచ్చు. ఈ లుక్ ఫార్మల్‌గానూ స్టైలిష్‌గానూ ఉంటుంది.
5 కుచ్చుల చీరకు కాంట్రాస్ట్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ ధరించి, నడుముకు సన్నని బెల్ట్ ధరిస్తే స్టైలిష్‌గా మెరిసిపోతారు.
6 ఎరుపు–నలుపు కాంబినేషన్‌తో ముందే కుట్టి సిద్ధంగా ఉన్న రెడీ మేడ్ చీర ఇది. దీనిని ఒన్ మినట్ శారీ అని కూడా అంటారు. చీరకట్టుకోవడం రాకపోయినా, కాలేజీ అమ్మాయిలు వేగంగా, సులువుగా చీర లుక్‌లో మెరిసిపోవచ్చు.
నవ్యశ్రీ మండవ ఫ్యాషన్ డిజైనర్
స్టైల్ అప్ విత్ సృష్టి, హైదరాబాద్
navyasrigoud30 @gmail.com
Comments
Please login to add a commentAdd a comment