
మనవైన సంప్రదాయ దుస్తులు ఎప్పుడూ అన్నింటా బెస్ట్‌గా ఉంటాయి. కానీ, వీటికే కొంత వెస్ట్రన్ టచ్ ఇవ్వడం అనేది ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంటుంది. వెస్ట్రన్ లుక్స్‌ని కూడా మన వైపు కదిలించేలా కేప్స్‌ను డిజైన్ చేస్తున్నారు. డిజైనర్లు ఇవి అటు పాశ్చాత్య దుస్తులకు, ఇటు సంప్రదాయ దుస్తులకూ బాగా నప్పుతాయి. ఏ డ్రెస్‌లోనైనా స్టైల్‌గా కనిపించవచ్చు. వేడుక ఏదైనా బెస్ట్‌గా వెలిగిపోవచ్చు.
వెస్ట్రన్ స్టైల్ మరింత అదనం
స్కర్ట్ మీదకే కాదు జీన్స్ మీదకూ కేప్ ధరించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే జాకెట్‌కు మరో రూపం కేప్. సేమ్ కలర్ లేదా కాంట్రాస్ట్ కలర్ కేప్స్‌తో డ్రెస్సింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
ప్రింటెడ్
ప్రింట్ చేసిన కేప్ క్లాత్‌కి రంగు రంగుల టాజిల్స్ జత చేసి కొత్త కళ తీసుకువస్తే, వేడుకలో ఎక్కడున్నా స్పెషల్‌గా కనిపిస్తారు.
మిర్రర్ మెరుపులు
సంప్రదాయ దుస్తులకు అద్దాల మెరుపులు తెలిసిందే. కానీ, వెస్ట్రన్ స్టైల్ కేప్‌కు అద్దాలను జతచేస్తే పెళ్లి కూతురి కళ్లలోని మెరుపులా మరింత అందంగా కనిపిస్తుంది.
ఎంబ్రాయిడరీ హంగులు
నెటెడ్, క్రేప్, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లతో డిజైన్ చేసే కేప్ కి జరీ జిలుగులు తోడైతే ఆ అందమే వేరు. అందుకే బ్లౌజ్ నుంచి ఎంబ్రాయిడరీ కేప్‌కు కూడా మారింది.
చదవండి: Pranitha Subhash: ఈ హీరోయిన్ కట్టిన గ్రీన్ సిల్క్ చీర ధర రూ. 44 వేలు! ప్రత్యేకత ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment