
భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నటి పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన పూనమ్, ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా పూనమ్ చేనేత వస్త్రాలను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని.. తాను ఆదర్శంగా భావించే వ్యక్తి బరాక్ ఒబామా అని తెలిపింది. ఆయనకు చేనేత వస్త్రాలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూనమ్ కౌర్‌ను ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రచార కర్తగా నియమించినట్టు ఇటీంల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment