‘పద్మ’వర్షిణి.. వర్ణ దర్శిని
ప్రకృతి సోయగాల సమ్మిళిత పట్టుచీర
డిజైన్ పేరు : పద్మవర్షిణి
రూపకర్త : మోహన్
ఆవిష్కర్త : బీరే ప్రసాద్
ఎక్కడ : బుధవారం ధర్మవరం పద్మారవింద ఫ్యాక్టరీలో
ప్రత్యేకత : భారతీయతకు దర్పణం. పట్టుదారంతో పద్మపుష్పాలను తీర్చిదిద్దారు. ఇది అధిక కాంతిలో ఓ రంగులో, చీకటిచిమ్మితే మరో వర్ణంలోనూ మెరిసిపోతుంది. కొంగులో రత్నాల కూజాభాండం అమరిక, సప్తపుష్పాల అల్లిక, కుచ్చిళ్లలో ఆరుతులాల మేలిమి ముత్యాలతో మంగళతోరణాల కూర్పు.
ఎంతమంది శ్రమిస్తే : పదిమంది 30 రోజులపాటు శ్రమిస్తే ఈ అద్భుత సృజనకు ఆవిష్కారం
ఖరీదు : రూ.38వేలు మాత్రమే
-ధర్మవరం