మంటలకు ఆహుతైన మగ్గాలు, ఫర్నీచర్
– రూ.2 లక్షల ఆస్తినష్టం
మదనపల్లెటౌన్: గ్యాస్ లీకై మంటలు వ్యాపించి మగ్గాలు దగ్ధమైన ఘటనలో రూ.2లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నీరుగట్టువారిపల్లెలో జరిగింది. అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్ కథనం మేరకు వివరాలు.. రామిరెడ్డి లేవుట్‌లోనివాసం ఉంటున్న లక్ష్మీనారయణ ఇంటిలో మగ్గాలు నేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అతని భార్య సరోజమ్మ, సాయంత్రం సిలిండర్‌తో స్టౌవ్ వెలిగించి వంటచేసింది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకవడంతో మంటలు వ్యాపించి మగ్గాల గది అగ్నికి ఆహుతైంది. మరో ఫుల్ సిలిండర్ కూడా పేలడంతో ఇంటిలోని వంట సామగ్రి, ఫర్నీచర్, బట్టలు, మగ్గాలు, పట్టుచీరలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రామచంద్రయ్య, సుబ్బరాజు, కిరణ్‌బాబు, సుబ్బయ్య, లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యం తదితరులు మంటలను అదుపు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.