Instant
-
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
అమర్నాథ్ యాత్రకు వచ్చే మహాశివుని భక్తుల కోసం జమ్మూ సిద్ధమయ్యింది. జూన్ 26 నుంచి తత్కాల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు టోకెన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నేటి(బుధవారం) నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం నుంచి టోకెన్ తీసుకునే యాత్రికులకు తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.ఏడీసీ శిశిర్ గుప్తా రిజిస్ట్రేషన్ కేంద్రాలను సందర్శించి యాత్రకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎండ నుంచి రక్షణకు కేంద్రాల వద్ద షెడ్లు, టెంట్లు వేస్తున్నమని, తాగునీరు, ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుప్తా తెలిపారు. సరస్వతి ధామ్, జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో భక్తులు తమ ప్రయాణపు టోకెన్లు అందుకోవచ్చు. అనంతరం కేంద్రంలో యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం వారు గాంధీనగర్ ప్రభుత్వ ఆస్పత్రి, సర్వల్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది.యాత్రికుల కోసం బేస్ క్యాంప్ అయిన బాల్తాల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. జూన్ 29 నుంచి వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. జూన్ 28, శుక్రవారం నాడు జమ్ము నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి యాత్రికుల బృందం కశ్మీర్ వ్యాలీకి బయలుదేరనుంది. -
వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!
సమ్మర్ వచ్చిందంటే..వెడ్డింగ్ సీజన్ వచ్చేసినట్టే.. ఒక్కోసారి అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. తీరిగ్గా తయారయ్యేంత సమయం ఉండకపోచ్చు. అందంగా, సూపర్ స్టైలిష్ లుక్‌తో అందరిలో స్పెషల్‌గా కనిపించాలి అందరీకి ఉంటుంది. అందులోనూ చాలా మంది ఆఫీసులో పని తర్వాత పెళ్లికో, రిసెప్షన్కో హాజరు కావాల్సిన పని ఉంటుంది. పని ఒత్తిడి ఖచ్చితంగా ముఖం మీద కనిపిస్తుంది. మరి అలాంటి ఇన్స్టెంట్గా ఫేస్‌లో గ్లో కావాలంటే ఏం చేయాలి. చిన్న టిప్స్ ద్వారా చర్మానికి తక్షణ నిగారింపు తీసుకురావచ్చు. అవేమిటో చూద్దాం.. క్లెన్సింగ్: ముందుగా కొద్దిగా రోజ్ వాటర్ ని తీసుకుని.. దానిని ముఖం అంతా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్ కి టోనర్ గా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుస్తాయి. చర్మానికి మేలు చేస్తుంది. స్క్రబ్బింగ్: ఆ తర్వాత ఫేస్ కి స్క్రబ్బింగ్ చేయాలి. ఇందుకోసం టమాటాను తీసుకుని దాన్ని మధ్యలోకి కట్ చేయాలి. ఇలా తీసుకున్న టమాటా మీద కాస్త పంచదార అద్ది దానితో ముఖంపై రుద్దాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే నల్లమచ్చలు, ట్యాన్ తొలగి చర్మం మిలమిలలాడుతుంది. మసాజ్: కలబంద గుజ్జు... అదేనండీ... కాస్తంత అలోవెరా జెల్‌ను తీసుకుని దీనితో చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. ఆలోవెరాలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల అది మీ చర్మాన్ని కాంతిమంతంగా, మృదువుగా ఉండేలా చేస్తుంది. బొప్పాయి: ఇంట్లో బొప్పాయి పండు ఉందా? కేవలం 10 నిమిషాల్లో ముఖానికి అందమైన మెరుపు కావాలంటే బొప్పాయిని మించింది లేదు.బొప్పాయిలో విటమిన్ ఏ, సీ,మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చిన్న బొప్పాయిని ముక్క తీసుకొని ముఖమంతా 10 నిమిషాలు మసాజ్ చేస్తే, చక్కటి గ్లో వస్తుంది. పాలు: పాలలో విటమిన్ ఏ, సీ, బి6, బి12, కాల్షియం, పొటాషియం , చర్మానికి మేలు చేస్తాయి. పచ్చి పాలలో కాటన్ ప్యాడ్‌ని ముంచి ముఖం, మెడ అంతటా అప్లై చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. కాంతి వంతంగా, ఫ్రెష్‌లుక్ మీ సొంతం. -
Madhabi Puri Buch: ఇక అదే రోజు సెటిల్మెంట్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రానున్న(2024) మార్చికల్లా స్టాక్ ఎక్సే్ఛంజీలలో నిర్వహించే లావాదేవీల సెటిల్మెంట్ను అదే రోజు పూర్తిచేసేందుకు వీలు కలి్పంచనుంది. ఇప్పటికే లావాదేవీ చేపట్టిన ఒక్క రోజులోనే(టీప్లస్ 1) సెటిల్మెంట్ పూర్తవుతోంది. అయితే మార్చికల్లా లావాదేవీ నిర్వహించిన రోజే(టీప్లస్0) సెటిల్మెంట్కు తెరతీసే లక్ష్యంతో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ పేర్కొన్నారు. ఆపై మరో 12 నెలల్లోగా లావాదేవీ నమోదైన వెంటనే అప్పటికప్పుడు(ఇన్స్టెంట్) సెటిల్మెంట్కు వీలు కలి్పంచాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రియల్‌టైమ్ ప్రాతిపదికన లావాదేవీల పూర్తిని చేపట్టాలని ఆశిస్తున్నట్లు సెబీ బోర్డు సమావేశం తదుపరి విలేకరుల సమావేశంలో మాధవి వెల్లడించారు. స్టాక్ మార్కెట్ లావాదేవీల ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఆలోచనపై మార్కెట్ మేకర్స్ నుంచి ఈ సందర్భంగా సలహాలు, సూచనలను ఆహా్వనిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త సెటిల్మెంట్ను ప్రస్తుత సెటిల్మెంట్కు సమాంతరంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చని మాధవి తెలిపారు. అయితే కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే అది కూడా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ గడువును టీప్లస్ 2 నుంచి టీప్లస్ 1కు తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే
ఎక్కువ మంది బీర్లు తాగేందుకు ప్రిఫర్ చేస్తారు. అది మంచిదని కొందరూ..గ్లామర్ కోసం అని మరికొందరూ తాగుతుంటారు. పైగా ఆ బీర్లో క్రిస్పీగా సైడ్ డిష్‌లు ఉండాల్సిందే. ఇక చూడు సామిరంగా మందుబాబులు ఓ రేంజ్లో కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్స్టెంట్ బీర్ పౌడర్లను తీసుకొచ్చింది. ఇక మందు బాబులు బయటకు అడుగుపెట్టకుండా ఇంట్లోనే గ్లాస్లో దర్జాగా ఐస్‌క్యూబ్‌లు వేసుకుని బీర్ తాగేయొచ్చు అంటోంది జర్మన్ కంపెనీ. ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్‌స్టింట్ కాఫీ మాదిరిగా బీర్ పౌడర్ని తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లగా తయారు చేసుకుని క్రిస్పీ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టేయొచ్చు. ఇన్స్టెంట్ కాఫీ లేదా మిల్క్‌షేక్ మాదిరిగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్లో రెండు చెంచాల బీర్ పొడికి నీటిని జోడిస్తే చాలట. నిమిషాల్లో రెడీ అయిపోతుందట. దీంతో ఇక టన్నుల కొద్ది బీర్ రవాణను భారీగా తగ్గుతుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్‌ను కూడా రూపొందిస్తున్నారట. ప్రస్తుతానికి సదరు జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను అందిస్తోందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్లను సైతం తయారు చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ పేర్కొంది. -
విస్తరణ బాటలో డన్జో4బిజినెస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డన్జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు. 70,000 మంది డెలివరీ పార్ట్నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి..
జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్‌పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్‌ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm — CCTV IDIOTS (@cctvidiots) April 30, 2023 అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు. మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు. చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం! -
ఇన్ స్టెంట్ లోన్స్ తీసుకుంటున్నారా ..?
-
ఫ్లిప్‌కార్ట్ పేటీఎంతో డీల్: ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్
సాక్షి,ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై 80 శాతందాకా డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఆపిల్ ఐఫోన్13, నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ఫోన్లు సహా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లను అందించనుంది. పేటీఎం యూపీఐ, పేటీఎం వాలెట్ చెల్లింపులపై ఆఫర్లను అందివ్వనుంది. ఇందుకోసం పేటీఎంతో డీల్ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 250 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే రూ.25 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను, పేటీఎం యూపీఐ, వాలెట్ 500 రూపాయలు అంతకంటే ఎక్కువున్న చెల్లింపులపై రూ. 50 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022తో భాగస్వామ్యంపై పేటీఎం ప్రతినిధి సంతోషం ప్రకటించారు. దీని ద్వారా భారతదేశంలోని చిన్న నగరాలు పట్టణాల్లోని మిలియన్ల మంది షాపర్లకు సురక్షితమైన చెల్లింపుల అనుభవాన్ని అందించనున్నామన్నారు. బిగ్ బిలియన్ డే 2022 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై డిస్కౌంట్లను, ఇంకా దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్, బ్యూటీ ఉత్పత్తులు, బొమ్మలు తదితర అనేక ఉత్పత్తులపై ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇప్పటికే ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్కొనుగోళ్లపై 10శాతం, గరిష్టంగా రూ.1500 దాకా ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. -
షావోమీ యూజర్లకు బిగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ఫోన్లతో భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకున్న చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రెడ్ మి వినియోగదారులకు తక్షణమే లోన్ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. ఇందుకు క్రెడిట్ బి (KreditBee )అనే సంస్థతో కలిసి షావోమీ 'ఎంఐ క్రెడిట్ సర్వీస్' అనే ప్రాజెక్ట్‌ను ఇండియాలో ప్రారంభించినట్టు తెలిపింది. ఎంఐ క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. ముఖ్యంగా "యువ నిపుణులు కోసం తక్షణ వ్యక్తిగత రుణ వేదిక" ద్వారా ఆర్థిక రుణాన్ని అందివ్వనుట్టు షావోమీ తెలిపింది. సాధారణ కేవైసీ ధృవీకరణతో కేవలం 10 నిమిషాల్లోఈ పక్రియ పూర్తవుతుందని వివరించింది. యంగ్ ప్రొఫెనల్స్ కోసం క్రెడిట్‌బీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు షావోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ చెప్పారు. ‘ఎం ఐ క్రెడిట్’ మరో కీలక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సేవల మధ్య స్థిరమైన అనుసంధానంతో తమ స్మార్ట్ఫోన్లు యూజర్లకు మంచి అనుభవాన్ని అందించడానికి ఈ ప్లాట్‌ఫాం బాగా ఉపయోగపడుతుందన్నారు. తమ వినియోగదారులకు ఇది నిజంగా లాభదాయకంగా ఉంటుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఇందుకోసం యూజర్లు తమ వివరాలను యూజర్ (ఆధార్,పాన్)ఎంఐ క్రెడిట్ సర్వీస్‌లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాల ఆధారంగా కేవైసీ వెరిఫికేషన్ అనంతరం లోన్‌కు అర్హత ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. కేవలం పది నిమిషాల్లోపే ఈ ప్రక్రియ ముగుస్తుంది. కావాల్సిన లోన్ మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన వినియోగదారులకు యూజర్ బ్యాంక్ అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా పొందిన పర్సనల్ లోన్‌పై 3 శాతం వడ్డీని వసూలు చేస్తారు. 15 నుంచి 90 రోజుల్లో లోన్ క్లియర్ చేయవచ్చు. క్రెడిట్ బీ యాప్ ద్వారా ఈ లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు. అయితే ఈ అవకాశం ఎంఐయుఐ యూజర్లకు మాత్రమేనని, షావోమీ ఎంఐ ఎ1 లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ లోన్ సదుపాయం వర్తించదని షావోమి స్పష్టం చేసింది. -
గ్యాస్ సిలిండర్ పేలి మగ్గాలు దగ్ధం
– రూ.2 లక్షల ఆస్తినష్టం మదనపల్లెటౌన్: గ్యాస్ లీకై మంటలు వ్యాపించి మగ్గాలు దగ్ధమైన ఘటనలో రూ.2లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నీరుగట్టువారిపల్లెలో జరిగింది. అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్ కథనం మేరకు వివరాలు.. రామిరెడ్డి లేవుట్లోనివాసం ఉంటున్న లక్ష్మీనారయణ ఇంటిలో మగ్గాలు నేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అతని భార్య సరోజమ్మ, సాయంత్రం సిలిండర్‌తో స్టౌవ్ వెలిగించి వంటచేసింది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకవడంతో మంటలు వ్యాపించి మగ్గాల గది అగ్నికి ఆహుతైంది. మరో ఫుల్ సిలిండర్ కూడా పేలడంతో ఇంటిలోని వంట సామగ్రి, ఫర్నీచర్, బట్టలు, మగ్గాలు, పట్టుచీరలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రామచంద్రయ్య, సుబ్బరాజు, కిరణ్‌బాబు, సుబ్బయ్య, లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యం తదితరులు మంటలను అదుపు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ట్వీట్‌తో రైల్వే సేవలు ఆ ముగ్గురి చలువే!
న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో పిల్లలు, పెద్దలు అనారోగ్యం పాలైనప్పుడు వెంటనే వైద్య సాయం అందించేందుకు, క్యాటరింగ్ సర్వీస్ నుంచి కావాల్సిన ఆహార పదార్థాలు తీసుక రావాలన్నా, ఆపదలో సకాలంలో పోలీసు భద్రత కావాలన్నా కేవలం ఒక ట్వీట్ ద్వారా రైల్వే సిబ్బంది ఈ మధ్య వేగంగా స్పందించి మన అవసరాలను తీరుస్తున్నారు. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందనే ఆసక్తి ఎవరికైనా కలుగొచ్చు. ఇదంతా రైల్వే మంత్రిత్వ శాఖా కార్యాలయం, నాలుగో అంతస్తులోని 454 గది నుంచి జరుగుతుంది. దానిలో ట్విట్టర్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని నిర్వహిస్తున్న అధికారులు ముగ్గురు. వారిలో ఒకరు అనంత్ స్వరూప్. పబ్లిక్ గ్రివెన్సెస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్. 1992 ఐఆర్పీఎస్ బ్యాచ్ అధికారి. మొత్తం కంట్రోల్ రూమ్‌ను చూసే బాధ్యత ఆయనదే. రెండో వ్యక్తి హసీన్ యాదవ్. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. మెకానికల్ ఇంజనీర్. ఆయన 2003 ఐఆర్ఎస్ఎంఈ బ్యాచ్ అధికారి. మూడో వ్యక్తి వేద్ ప్రకాష్. సమాచార, ప్రసారాల డెరైక్టర్. 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో అపార అనుభవం ఉన్న అధికారి. రైల్వే సోషల్ మీడియా సెల్ అధికారి కూడా ఆయనే. ఈ ముగ్గురు టీమ్ తమ విధుల్లో ఎప్పుడు చురుగ్గా ఉంటారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నేరుగా వీరి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ప్రయాణికుడి నుంచి ట్వీట్ వచ్చిన ఐదు నిమిషాల్లో స్పందిస్తారు. ఎక్కువ సందర్భాల్లో రిప్లై కూడా ఐదు నిమిషాల్లో ఇస్తారు. ముగ్గురి టీమ్ కథనం ప్రకారం రోజుకు 5,000 ట్వీట్లు వస్తాయి. వాటిలో 30 శాతం రీట్వీట్లు ఉంటాయి. 20 నుంచి 30 శాతం వరకు కామెంట్లు ఉంటాయి. మిగతా ట్వీట్లకు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ట్వీట్ బట్టి రైల్వేలోని ఆయా విభాగాలను అలర్ట్ చేసి పని సకాలంలో పూర్తయ్యేలా చూస్తారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి 7, 75, 000 ట్వీట్లు వచ్చాయి. వారి పని వేళలు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకు, రెండు నుంచి రాత్రి పది వరకు, రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు ఉంటాయి. -
టీస్టాలు పెట్టినంత సులువుగా బీయర్ కేఫ్