న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్‌జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్‌జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్‌జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
డన్‌జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్‌డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు.
70,000 మంది డెలివరీ పార్ట్‌నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment