Expand
-
క్విక్ కామర్స్ విస్తరణలో ఫ్లిప్‌కార్ట్
కోల్‌కత: ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ క్విక్ కామర్స్ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వేగవంతమైన డెలివరీల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుండి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో.. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, ముంబై, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో మినట్స్ పేరుతో క్విక్ కామర్స్ సేవలను నిర్వహిస్తోంది.డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ రంగం 2024లో 6.1 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ 70 బిలియన్ డాలర్లు ఉంది. ఇది దేశంలోని మొత్తం రిటైల్ మార్కెట్లో 7 శాతం మాత్రమేనని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఆన్లైన్ షాపింగ్ జోరు.. భారత్‌లో రిటైల్ రంగం మొత్తంగా వృద్ధి చెందుతున్నందున ఆన్లైన్ షాపింగ్ గణనీయంగా పెరుగుతుందని నమ్ముతున్నామని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీశ్ కుమార్ తెలిపారు. 2028 నాటికి భారత రిటైల్ మార్కెట్లో దాదాపు 12 శాతం వాటాను ఈ–కామర్స్ దక్కించుకుంటుందని గణాంకాలు సూచిస్తున్నాయని వివరించారు.గ్రామీణ, సెమీ–అర్బన్ వినియోగదారుల కోసం కంపెనీ ప్రధాన భారతీయ భాషల్లో యాప్‌ను రూపొందించింది. ఇంగ్లీష్ తెలియని కస్టమర్లు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా సుమారు 15 లక్షల మంది వర్తకులు ఉన్నారు. సరఫరా వ్యవస్థలో 3,00,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని కంపెనీ వివరించింది. -
నేపాల్‌లో హీరో మోటోకార్ప్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటాకార్ప్ నేపాల్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. 2024 మార్చిలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సంస్థ ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తులకు నేపాల్ పంపిణీదారు అయిన సీజీ మోటార్స్ భాగస్వామ్యంతో ఏటా 75,000 యూనిట్ల సామర్థ్యం గల కేంద్రాన్ని నవల్పూర్ జిల్లాలో నెలకొల్పనుంది. 2014లో నేపాల్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో మోటోకార్ప్.. ఆ దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీగా నిలిచింది. "నేపాల్‌లోని సీజీ గ్రూప్‌తో భాగస్వామి కావడానికి సంతోషిస్తున్నాం. నేపాల్ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్. ఇక్కడ కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలు అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తాం" అని హీరో మోటోకార్ప్ గ్లోబల్ బిజినెస్ హెడ్ సంజయ్ భాన్ అన్నారు. -
ఫ్రీడమ్ విస్తరణకు ప్రణాళికలు - కేరళ, తమిళనాడులో ప్రవేశించడానికి సన్నద్ధం..
BRAND SUTRA: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ 'ఫ్రీడమ్'.. 2024లో బ్రాండ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశిస్తుందని, ఆ తరువాత మహారాష్ట్రలో అరంగేట్రం చేయనున్నట్లు సేల్స్ అండ్ మార్కెటింగ్, జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా SVP పి చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. కంపెనీ అతి పెద్ద నగరాల్లో ప్రవేశించిన తరువాత మరిన్ని ఫ్రీమియం ఆఫర్ల కోసం ప్లాన్ చేస్తున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఈయన 2009లో బ్రాండ్ పేరు రూపొందించడానికి ముందు, చాలా కాలం ఎడిబుల్ ఆయిల్స్ విభాగంలో ఉన్నారు. ఆ తరువాత సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ 'ప్రదీప్ చౌదరి' బృందం సహకారంతో బ్రాండ్ వేగంగా స్థిరపడింది. 2010లో బ్రాండ్ దాని స్వంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. దక్షిణ భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల రెడ్డి బృందం ఇతర ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరువాత ఒరిస్సా, కర్ణాటకలో బ్రాండ్ ప్రారంభమైంది. ఆ తరువాత చత్తీస్‌గఢ్‌లో కూడా ప్రారంభమైంది. 2024లో తమిళనాడు, కేరళలో ప్రారంభించనున్నట్లు చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. బ్రాండ్ ప్రారంభమై దాదాపు 13 సంవత్సరాలు కావొస్తోంది. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు, రానున్న రోజుల్లో మరింత వృద్ధి పొందటానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఇది కేవలం మార్కెటింగ్ మాత్రమే కాదు, సరఫరా అవసరాలను నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా. ప్రారంభంలో కొంత మందకొడిగా ఉన్నప్పటికీ 2014 - 15 నాటికి దేశంలోని వివిధ రాష్ట్రలో నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలిచింది. ఆ తరువాత 2022 నాటికి జాతీయ స్థాయిలో కూడా పొందగలిగినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత మార్కెట్‌కు అవసరమైన 2.2 మిలియన్ టన్నులలో దాదాపు 95 శాతం దిగుమతి ఉంది. ఇందులో 22 నుంచి 23 శాతం ఫ్రీడమ్ ఉండటం గర్వించదగ్గ విషయం. -
ఎంజీ మోటార్స్.. ఏడాది చివరి నాటికి 400 షోరూమ్స్ దిశగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ దేశీయంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దాదాపు 330 స్టోర్స్ ఉండగా.. ఏడాది ఆఖరు నాటికి వీటిని 400కు పెంచుకోనుంది. తెలంగాణలో 9 స్టోర్స్ ఉండగా.. వీటిని 20కి పెంచుకోనుంది. హైదరాబాద్‌లో కొత్తగా మూడు స్టోర్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డిప్యుటీ ఎండీ గౌరవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు. తెలంగాణలో 13,000 పైచిలుకు వాహనాలను విక్రయించినట్లు ఆయన వివరించారు. గతేడాది ఇక్కడ 4,000 పైచిలుకు వాహనాలను విక్రయించగా, ఈసారి 5,000 వాహనాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుప్తా తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పుంజుకుంటోందని చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో తమ స్టోర్స్ ఉన్నట్లు తెలిపారు. ఏడాదికో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలనే వ్యూహంతో ముందుకెడుతున్నామని.. వచ్చే సంవత్సరం మరో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని ఆయన వివరించారు. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం హెక్టర్, జియస్, కామెట్ తదితర వాహనాలను విక్రయిస్తోంది. -
విస్తరణ బాటలో డన్జో4బిజినెస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డన్జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు. 70,000 మంది డెలివరీ పార్ట్నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
NUDA: వడివడిగా నుడా విస్తరణ అడుగులు
నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. గత ప్రభుత్వ హయాంలో నుడా ఆవిర్భవించినప్పటికీ నిధులివ్వకుండా నిస్తేజంగా మార్చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సుమారు మూడు వేల చ.కి.మీ. పరిధిలోని గ్రామాలను నుడాలోకి తీసుకురావడంతో పాటు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నుడా అధికారాలను అడ్డం పెట్టుకుని అప్పటి పాలకులు అడ్డంగా దోచుకున్నారే తప్ప.. నుడా పేరుతో చేపట్టిన అభివృద్ధి శూన్యంగానే చెప్పొచ్చు. నెల్లూరు సిటీ: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధి భారీగా విస్తరిస్తోంది. పట్టణ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల నుంచి పల్లెల వరకు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా నుడా పరిధిని విస్తరిస్తూ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు పలు మండలాలు, గ్రామాలను నుడాలో కలుపుతూ జీఓలు విడుదల చేసింది. తాజాగా ఈ నెల 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 13 మండలాల పరిధిలోని 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందులో ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు ఉండడం విశేషం. మూడేళ్లలో భారీగా విస్తరణ 2017 మార్చి 24న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆవిర్భవించింది. తొలుత నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం ప్రాంతాల్లోని మొత్తం 21 మండలాల పరిధిలోని 156 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 1,644.17 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న నుడా పరిధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 5,023.44 చ.కి.మీ. వరకు విస్తరించింది. ► 2020 ఏప్రిల్ 24న 135 జీఓ నంబర్‌తో రెండు మండలాల్లోని 65 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో 567.49 చ.కి.మీ. పెరిగింది. ► 2022 జూన్ 15న జీఓ నంబరు 97తో మరో రెండు మండలాల్లోని 39 గ్రామాలను నుడాలో కలపడంతో మరో 475.54 చ.కి.మీ. పరిధి పెరిగింది. ► తాజాగా 2022 సెప్టెంబరు 15న జీఓ నంబర్ 132 ద్వారా 13 మండలాల పరిధిలో 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో మరో 2,336.24 చ.కి.మీ. పరిధి పెరిగింది. ప్రస్తుతం 31 మండలాల పరిధిలోని 426 గ్రామాలతో మొత్తం 5,023.44 చ.కి.మీ. నుడా విస్తరించింది. 97 ఎకరాల్లో 1,112 ప్లాట్లు ఏర్పాటు నుడా అభివృద్ధిలో భాగంగా కావలికి సమీపంలోని జలదంకి మండలం జమ్మలపాళెం వద్ద ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పథకం కింద 97 ఎకరాల్లో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో ప్లాట్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ ఇచ్చారు. రూ.50 కోట్లతో లేఅవుట్లో పార్కులు, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ లైట్లు, పచ్చదనంతో కూడిన అన్ని వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే 250 ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్లో ప్లాట్లు దరఖాస్తు చేసుకునేందుకు mig.apdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 9121162478 నంబరులో సంప్రదించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అక్రమ లేఅవుట్లపై కొరడా నుడా పరిధిలో అక్రమలేఅవుట్లపై నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, నుడా వైస్ చైర్మన్ నందన్ ప్రత్యేక దృష్టి సారించారు. 300కు పైగా లేఅవుట్లను నుడా పరిధిలో ఏర్పాటు చేశారు. వాటిలో 118 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించి ఎల్ఆర్ఎస్ స్కీం కింద క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 55 అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించారు. మరో 20 లేఅవుట్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. 180 ప్లాట్ల యజమానులు వ్యక్తిగతంగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 46 దరఖాస్తులు మంజూరు చేశారు. ఇప్పటికే నుడాకు రూ.60 లక్షలు వరకు ఫీజు రూపంలో వచ్చింది. రూ.3.18 కోట్లతో నుడా కార్యాలయ నిర్మాణం నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఫుడ్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక వైపు నుడా కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. రెండు అంతస్తులతో మొత్తం 10,650 చదరపు అడుగుల స్థలంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఐదేళ్లుగా అద్దె భవనంలో నుడా కార్యాలయ కలాపాలు జరుగుతున్నాయి. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేక చొరవ తీసుకుని నుడాకు చెందిన స్థలంలో కార్యాలయం నిర్మాణం చేపట్టారు. కొన్ని నెలల్లోనే కార్యాలయం నిర్మాణం పూర్తి కానుంది. మూడేళ్లలో రూ. 54.32 కోట్లతో అభివృద్ధి నుడా పరిధిలో గత మూడేళ్లలో రూ.54.74 కోట్లు నిధులతో పార్కులు, పాఠశాల నిర్మాణాలు, సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రెయిన్లు, కమ్యునిటీ హాల్స్ నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 135 పనుల్లో 57 పనులు పూర్తయ్యాయి. మరో 30 పనులు జరుగుతున్నాయి. 40 పనులు ప్రారంభించనున్నారు. 3 పనులు టెండర్ ప్రాసిసెంగ్‌లో ఉన్నాయి. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుడాకు రూ.61.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం!) ► నెల్లూరు నగరంలో రూ.6.90 కోట్లతో 15 పార్కులు నిర్మించారు. రూ.2.2 కోట్లతో మరో 4 పార్కులు నిర్మాణంలో ఉన్నాయి. నర్తకీ థియేటర్ వద్ద రూ.3 కోట్లతో ఫుట్‌పాత్, డివైడర్, రోడ్డు నిర్మాణాలకు కేటాయించారు. చింతారెడ్డిపాళెం బలిజపాళెంలో రూ.35 లక్షలతో పాఠశాల భవనం, రూ.15 లక్షలతో ధోబీఘాట్ నిర్మాణం జరిగింది. నవాబుపేటలో రూ.30 లక్షలతో వజూఖానా, రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోన్నాయి. 48వ డివిజన్లో రూ.50 లక్షలతో కమ్యూనిటీహాల్, రూ.30 లక్షలతో తోటబడి వద్ద పార్కు నిర్మాణం జరుగుతోంది. ► నెల్లూరు రూరల్ పరిధిలో రూ.72 లక్షలతో షాద్కాలనీ, మారుతీనగర్‌లో పార్కుల నిర్మాణం జరిగింది. డైకాస్‌రోడ్డులోని మహిళా ప్రాంగణం సమీపంలో రూ.30 లక్షలతో ఏవీకే ఎస్టేట్ పార్కు నిర్మాణం జరుగుతోంది. రూ.48 లక్షలతో ఆనం వెంకురెడ్డి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ జరిగింది. అన్నమయ్య సర్కిల్ వద్ద ఎన్టీఆర్ పార్కులో రూ.30 లక్షలతో టెన్నిస్ కోర్టు, రూ.13 లక్షలతో అదనంగా మరికొన్ని ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రూ.50 లక్షలతో ఆరు ప్యాకేజీ కింద సీసీరోడ్డు నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. 4వ మైలులో రూ.76 లక్షలతో ప్రేయర్ హాల్, మరుగుదొడ్లు, వాచ్‌మన్ గది నిర్మాణం చేస్తున్నారు. మినీబైపాస్‌రోడ్డులోని హీరో హోండాషోరూమ్ వద్ద రూ.19.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రూ.కోటితో బారాషహీద్ దర్గాలోకి ప్రవేశమార్గం వద్ద రెండు ఆర్చ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రూ.17.5 కోట్లతో నెక్లెస్‌రోడ్డులో పార్కు, మరమ్మతులు చేయనున్నారు. ► కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెంలో రూ.5.10 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం జరిగింది. కోవూరు, మైపాడు, నార్త్‌రాజుపాళెం ప్రాంతాల్లో రూ.1.50 కోట్లతో డ్రెయినేజీలు నిర్మించారు. బుచ్చిరెడ్డిపాళెంలో రూ.కోటితో బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు నిర్మాణం చేశారు. రూ.3.25 కోట్లతో బుచ్చిరెడ్డిపాళెంలో డ్రెయినేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ► సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.1.40 కోట్లతో 5 కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ప్రారంభించనున్నారు. రూ.5.54 కోట్లతో 21 శ్మశానాలను నిర్మించారు. మరిన్ని ప్రగతి పనులు చేస్తాం నుడా పరిధి విస్తరించడంతో పాటు రాబడిపై దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కంటే రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. నుడా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. అక్రమలేఅవుట్లకు అవకాశం లేకుండా నుడా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు కూడా అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలు చేసి ఇబ్బందులు పడకండి. – ముక్కాల ద్వారకానాథ్, నుడా చైర్మన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం నుడా పరిధిలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సూచనల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కావలి నుంచి తడ, కృష్ణపట్నం నుంచి కడప మీదుగా ఉన్న ప్రాంతాలు నుడాలో కలిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగవంతంగా అభివృద్ధి జరగనుంది. – ఓ నందన్, నుడా వైస్ చైర్మన్ -
భారత్‌లోకి ‘ఆపిల్’.. భారీగా పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత మార్కెట్ పట్ల ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్.. అతి పెద్ద వ్యాపార ప్రణాళికతో ఇక్కడ విస్తరించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు భారత్ ఎగుమతుల హబ్‌గా మారనుందన్నారు. ఇక తమ హయాంలోనే భారత్‌లోని మొబైల్ ఫ్యాక్టరీలు రెండు నుంచి 268కి చేరాయని చెప్పారు. మన దేశంలో బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆపిల్ సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫండ్స్ పెట్టుబడుల్లో చిన్న పట్టణాల హవా న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చిన్న పట్టణాల్లోని ఇన్వెస్టర్లనూ పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు ఆగస్ట్ చివరికి రూ.25.64 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం జూలై చివరికి ఉన్న రూ.24.53 లక్షల కోట్లతో పోలిస్తే 4 శాతం పెరిగాయి. దేశంలోని టాప్ 30 పట్టణాలు కాకుండా.. ఇతర పట్టణాల (బియాండ్ 30) నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా మొత్తం రూ.25.64 లక్ష కోట్లలో 15.3 శాతంగా ఉన్నట్టు ‘యాంఫి’ డేటా తెలియజేస్తోంది. జూలై చివరికి ఉన్న 14.48 శాతం నుంచి సుమారు ఒక్క నెలలోనే ఒక శాతం పెరిగింది. చిన్న పట్టణాలకూ విస్తరించే దిశగా సెబీ గత కొన్ని సంవత్సరాలుగా తీసుకొస్తున్న ఒత్తిడి ఫలితాలనిస్తోంది. ఫండ్స్ పెట్టుబడి ఆస్తుల్లో అత్యధికంగా 41.80 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్ల వాటా 52.60 శాతంగా ఉంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 47.40 శాతంగా ఉంది. ఫండ్స్ పెట్టుబడులు చౌక: మార్నింగ్ స్టార్ కాగా, సెబీ తీసుకున్న చర్యలతో ఫండ్స్‌లో పెట్టుబడులు చౌకగా మారినట్టు మార్నింగ్‌స్టార్ నివేదిక పేర్కొంది. అప్‌ఫ్రంట్ కమీషన్లపై నిషేధం, ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే వ్యయ చార్జీలపై పరిమితులు వంటి అంశాలను ప్రస్తావించింది. -
మహిళలకు ఆసరా
సాక్షి, కాకుళం పాతబస్టాండ్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా స్వయం శక్తి సంఘాల రుణ మాఫీకి సిద్ధమయ్యారు. రుణం పొందిన ప్రతి సంఘంలోని ప్రతి సభ్యురాలికీ ప్రయోజనం చేకూరేలా వైఎస్సార్ ఆసరా పేరిట కార్యాచరణ రూపొందించారు. దీనిప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల 11 నాటికి మహిళా సంఘాలకు ఉన్న బ్యాంకు రుణాలు తీర్చేం దుకు నడుం కట్టారు. ఈ సంఘాలు ఎన్నికల సమయం నాటికి బ్యాంకుల నుంచి పొందిన రుణ నిల్వలను వారి సంఘాల ఖాతాలో జమ చేయడానికి సీఎం మాట ఇచ్చారు. అందుకు గాను వచ్చే ఏడాది నుంచి నాలుగు విడతలుగా వారి రుణ మొత్తాన్ని ఆయా సంఘాల బ్యాంకుల్లో జమ చేయనున్నారు. ఎన్నికల సమయం నాటికి జిల్లాలో 46,272 మహిళా సంఘాలు రూ.1340.74 కోట్ల రుణ భారం కలిగి ఉన్నాయి. వీరందరికీ వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరగనుంది. అందుకు గాను ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులు, వారి పరిస్థితి, ఆర్ధిక లావాదేవీలు, రుణ వివరాలు తదితర అంశాలపై ప్యూరిఫికేషన్ మొదలు పెట్టారు. జిల్లాలో ఈ ప్రక్రియ 30 శాతం వరకు పూర్తయింది. ఈనెల 20 నాటికి ప్యూరిఫికేషన్ పూర్తి చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలను మోసగించిన గత ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంఘాలను మోసం చేసింది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు మహిళ సంఘాల బ్యాంకుల రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ బ్యాంకులకు రుణ వాయిదాలు చెల్లించవద్దని చెప్పారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తరువాత మాటమార్చారు. రుణమాఫీ సాధ్యం కాదని, ప్రతి మహిళకు పది వేలు ఇస్తామని చెప్పారు. అది కూడా మూడు విడతల్లో ఇచ్చారు. అందులో ఎక్కువ మొత్తం జన్మభూమి కమిటీలకు మామూళ్ల రూపంలో చెల్లించడంతోనే సరిపోయింది. వాయిదాలు కట్టకపోవడంతో రుణభారంలో సంఘాలు కురుకుపోయాయి. దీంతో బ్యాంకు అధికారులు సంఘల పొదుపు మొత్తాలను రుణ ఖాతా లకు మళ్లించారు. దీంతో సంఘాలు చాలా వరకు దివాళా తీశాయి. మరికొన్ని సంఘాలు వివాదాలతో నిర్వీర్యంగా మారాయి. -
రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలని, ఇందుకోసం పాలకులు సరైన విధానాలను రూపొందించాలని ఏఐసీసీ కిసాన్ సెల్ చైర్మన్ నానాపటోలే అన్నారు. రైతులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నానా పటోలే మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రైతు రుణమాఫీ హామీ నెరవేర్చే వరకు పాలకులను నిద్రపోనివ్వద్దని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా రైతాంగం రోడ్ల మీదకు వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందని, కార్పొరేట్ కంపెనీల కోసమే ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతాంగాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైఎస్ హయాంలో 15 రోజులకోసారి సమీక్ష ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ తాను చూసిన ముఖ్యమంత్రుల్లో రైతుల సమస్యలపై 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విదేశాల్లో తిరిగే మోదీ, సచివాలయానికి రాని కేసీఆర్‌ల పాలనలో రైతులు నానాకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్ నేత వి. హనుమంతరావు తదితరులు సదస్సులో రైతులనుద్దేశించి ప్రసంగించారు. సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ నేతలు అన్వేశ్‌రెడ్డి, కె.వి.రామారావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంట పరిహారం అందిన దాఖలాల్లేవు: భట్టి విక్రమార్క కిసాన్ కాంగ్రెస్ సదస్సులో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తమ హయాంలోనే వ్యవసాయం పండుగలా మారిందని అటు మోదీ, ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్న దేశాన్ని ఆహార ధాన్యాలను ఎగుమతిచేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిందని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే రైతులు, రైతు కూలీలు ఈ మాత్రమైనా బతకగలుగుతున్నారని అన్నారు. -
గెలిస్తే ‘మహిళా బిల్లు’కు మోక్షం
కొచ్చి: 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు.మహిళల్ని నాయకత్వ స్థానాల్లో చూడాలనుకుంటున్నామని ఓ మహిళా కార్యకర్త చేసిన సూచనకు రాహుల్ ఈ మేరకు స్పందించారు. సామాన్య కార్యకర్తలు పార్టీ అధిష్టానంతో మాట్లాడేలా ‘శక్తి’ అనే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కేరళలోని కొచ్చిలో మంగళవారం జరిగిన బూత్ కమిటీల సమావేశంలో 50,000 మంది కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో సగం మంది మహిళలే ఉన్నారు. దేశమంతటా రుణమాఫీ చేస్తాం.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడుతూ.. ‘ఒకదాని తర్వాత మరో అబద్ధం చెబుతూ ప్రధాని మోదీ దేశానికి చెందిన ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేశారు. ప్రతీఏటా 2 కోట్ల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం తన 15 మంది స్నేహితులకు కనీస ఆదాయ భద్రతను కల్పించారు. అదే సమయంలో దేశం లోని వేలాది మంది యువతకు మొండిచెయ్యి చూపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే రైతు రుణా లను కాంగ్రెస్ మాఫీ చేసింది. అలాగే కేంద్రం లో అధికారంలోకి వస్తే దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తాం’ అని అన్నారు. బీజేపీ, సీపీఎం శైలిపై స్పందిస్తూ.. ‘బీజేపీ, సీపీఎం తీరు ఒక్కటే. వీరి పాలనలో సొంత పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందారు. బీజేపీ, సీపీఎం రాష్ట్రంలో హింసను రెచ్చగొడుతున్నాయి. మహిళల హక్కులను, కేరళ సంప్రదాయం, ఆచారాలను కాంగ్రెస్ గౌరవిస్తుంది’ అని రాహుల్ అన్నారు. గోవా సీఎం పరీకర్‌తో రాహుల్ భేటీ పణజీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా సీఎం మనోహర్ పరీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్..పరీకర్ ఆరోగ్యానికి సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరీకర్ క్లోమ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందానికి సంబంధించి రహస్య పత్రాలు పరీకర్ దగ్గర ఉన్నందునే ఆయన సీఎం పదవిలో ఉన్నారని రాహుల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత ఆయన పరీకర్‌తో భేటీ అవడం గమనార్హం. ‘రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారని విపక్ష నేత చంద్రకాంత్ చెప్పారు. -
ఫలితం పొంది విమర్శించడమా?
అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో సీఎం సాక్షి ప్రతినిధి, అనంతపురం: రుణమాఫీలో రూ.1.50 లక్షలు తీసుకున్నారు.. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తీసుకున్నా రు... అయినా నన్ను విమర్శిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ నేపథ్యంలో ‘రైతు కృతజ్ఞత యాత్ర’ పేరుతో చంద్రబాబు అనంతపు రం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. మొదట కనగానపల్లి మండలం ముక్తాపురంలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో నిర్మించిన 32 ఇళ్లను ప్రారంభించారు. తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో రూ.24,500 కోట్ల రుణమాఫీ చేయగా.. రూ.2,728 కోట్లు అనంతపురానికి వచ్చింది. రాష్ట్రానికి ఇన్పుట్, ఇన్సూరెన్స్ కలిపి రూ.2,214 కోట్లు ఇస్తే రూ.1451 కోట్లు అనంతపురానికి ఇచ్చాను. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాలోని చెరువులను నింపుతాం. మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోస్తాం. రైతులు పండ్లు విక్రయించే సమయంలో వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సూట్ వసూలు చేస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. రాష్ట్ర బహిష్కరణ చేస్తా’’ అని సీఎం చెప్పారు. అనాథగా మారిన బాలికకు అండ తాడిపత్రిలో మంగళవారం తల్లీ ఇద్దరు కూతుళ్లు దారుణహత్యకు గురికాగా.. తండ్రి కూడా బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మరో కుమార్తె ప్రసన్న అనాథగా మారింది. ఈ నేపథ్యంలో ప్రసన్నను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి సభకు తీసుకొచ్చారు. స్పందించిన సీఎం ప్రసన్న పేరుతో రూ.20లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసన్నను చదివించే బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీసుకున్నారు. -
తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ రైతులకు రూ. 50 వేల కోట్ల రుణమాఫీని కేంద్రప్రభుత్వమే భరిస్తోందని.. మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గణేష్ గుప్తా, చింతా ప్రభాకర్‌లు టీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. తాము నాలుగు విడతలుగా 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. కేంద్రం తెలంగాణ రైతుల రుణ మాఫీ విషయంలో భాద్యత తీసుకోదా? అని సూటిగా అడిగారు. కనీసం తెలంగాణ రుణంలో 50 శాతం కేంద్రం భరించ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అన్నింటా వివక్షతకు గురైన రాష్ట్రం అని పేర్కొన్నారు. దోచుకోబడ్డ తెలంగాణకు మీరు న్యాయం చేయరా అని అడిగారు. దోచుకున్న ఏపీకి ప్రత్యేక ప్యాకేజీయా? అని మండిపడ్డారు. బనారస్ హిందూ విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఉస్మానియాకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కానీ కొన్ని విషయాల్లో కేంద్రం తీరు సక్రమంగా లేదన్నారు. రాజకీయ కోణంలో రాష్ట్రాలకు కేటాయింపులు సరికాదని అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు పీఎం మోదీపై ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చేయాలని కోరారు. వెంటనే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రైతులకు సంబంధించిన విషయంలో జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. -
లోకేశ్ కోసం ఏపీ క్యాబినెట్ విస్తరణ
-
అడిగింది చెబుతా.. అంతా చెబుతా!
మండలిలో సుదీర్ఘంగా సమాధానాలిచ్చిన పోచారం • ‘వ్యవసాయం’ అంశంపై ప్రశ్నలడిగిన సభ్యుల ఓపికకు పరీక్ష • చివర్లో పప్పుధాన్యాలపై ప్రశ్నించిన బీజేపీ సభ్యుడు • ‘మీరు అడుగుతారు బాగానే ఉంది.. • ఆయన గంట సమాధానం చెబుతా’రన్న చైర్మన్ స్వామిగౌడ్ • కృష్ణా బోర్డు చంద్రబాబు మేనేజ్మెంట్ బోర్డుగా మారింది: కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో గురువారం‘వ్యవసాయ ఆధునీకరణ, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపు’ అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆసక్తికర పరిణామాలు, సరదా వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సావధానంగా, సుదీర్ఘంగా ఇచ్చిన సమాధానాలు సభలో ఉన్న వారి ఓపికను పరీక్షించాయి. తొలుత తాము లేవనెత్తిన అంశాలపై కాకుండా అంతా బాగుందంటూ మంత్రి సుదీర్ఘ సమాధానం ఇవ్వడంతో.. ‘ఆకలవుతున్నా కడుపు నిండిపోయింద’ని పొంగులేటి సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైనందున, మంత్రి ఇచ్చిన సమాధానం సరిగ్గా లేనందున వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అన్నీ మాట్లాడి ఇప్పుడు వాకౌట్ అంటున్నారని, విపక్ష సభ్యులు చేస్తున్నది రాజకీయ ఆరోపణలేనని మంత్రి పోచారం పేర్కొన్నారు. వాస్తవాలు చెబుతున్నా అల్లరి చేస్తున్నారని.. వారి బతుకులు బయటపడతాయనే భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము విపక్షంలో ఉన్నపుడు రైతు సమస్యలపై అప్పటి సీఎం కిరణ్ చాంబర్ వద్ద ధర్నా చేస్తే.. తమ తొడలపై కాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారని పోచారం గుర్తు చేశారు. ఈ సమయంలో బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ... రాష్ట్ర ప్రభుత్వం పప్పు ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్.. అప్పటికే ఆయా అంశాలపై సుదీర్ఘంగా జరుగుతున్న చర్చను ఉటంకిస్తూ ‘మీరు అడుగుతారు బాగానే ఉంది. కానీ ఆయన (మంత్రి పోచారం) గంట సేపు సమాధానం చెబుతారు.’ అని వ్యాఖ్యానించారు. దీంతో సభ మొత్తం ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. మళ్లీ మంత్రిని ఉద్దేశిస్తూ.. ‘వారు అడిగినంతే చెప్పండి’ అని స్వామిగౌడ్ సూచించారు. అయినా మంత్రి పోచారం మాత్రం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఏయే పప్పుధాన్యం పంటను ఎంత విస్తీర్ణంలో వేశారు, గతేడాది కంటే ఎంత ఎక్కువ, పప్పుధాన్యాలకు ప్రోత్సాహం, సబ్సిడీపై విత్తనాల సరఫరా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలన్నీ వివరిస్తూ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. రైతులను ఆదుకోవడంలో విఫలం రాష్ట్రానికి కృష్ణా నీళ్లు ఆశించిన విధంగా రావడం లేదని.. కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు కాస్తా చంద్రబాబు మేనేజ్మెంట్ బోర్డుగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. నాగార్జునసాగర్ నుంచి తెలంగాణకు నీళ్లు విడుదల కావడం లేదని.. వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకునే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. కేంద్రం మాట మార్చినా మేం నిలబడ్డాం • రూ 30.82 కోట్లతో స్పైస్ పార్క్ ఏర్పాటు: పోచారం • మంత్రి వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో స్పైస్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చి మాట మార్చినా, తాము నిలబడి రూ.30.81 కోట్లతో స్పైస్ పార్కును నెలకొల్పుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పసుపు సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, పసుపు పంట, దాని అనుబంధ ఉత్పత్తులపై పరిశోధనలు చేసి వాటి ఫలితాలను రైతులకు అందించే లక్ష్యంతో పార్కు ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు. మంత్రి వివరణతో సంతృప్తి చేందని కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు. బుధవారం శాసన మండలిలో వ్యవసాయం ఆధునికీకరణ, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపుపై ప్రారంభమైన లఘు చర్చ గురువారం కూడా కొనసాగింది. కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ అడిగిన ప్రశ్నలపై పోచారం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ ఏడాది యాసంగి కోసం ఎరువులు, విత్తనాలను ఎప్పుడూలేని విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు యూనిట్‌గా పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి శాసనసభ, మండలిలో తీర్మానం చేసి పంపగా కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వడగండ్ల వాన, నీట మునిగిన పంట, కోత అనంతరం పొలంలో తడిసిన పంటకు రైతుకు వ్యక్తిగతంగా పరిహారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని చెప్పారు. కాగా, రైతులకు బ్యాంకు రుణాలు ఎంత ఇచ్చారనే ప్రశ్నకు మంత్రి పొంతన లేని సమాధానం చెప్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు సభ నుంచి వాకౌట్ చేశారు. -
రుణమో.. చంద్రశేఖరా!
సుభాష్‌నగర్ : తెలంగాణ సర్కారు రైతుల పాలిట గుదిబండగా మారింది. కరెంటు మినహారుుంచి ఏ విధమైన ప్రోత్సాహం అందించడం లేదు. ఈ ఏడాది చివరలో వర్షాలు సమృద్ధిగా కురిసి రబీకి అన్నదాత సిద్ధమవుతున్నా ఏ విధమైన రుణాలు అందించడం లేదు. మూడో విడత రుణమాఫీ నిధులు పూర్తిగా రావాల్సి ఉన్నా.. కేవలం సగం మాత్రమే రైతుల ఖాతాల్లో జమయ్యూరుు. గతేడాది ఇన్‌ఫుట్ సబ్సిడీ నిధుల ఊసేలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన సోయా రైతులకు ఫసల్ బీమా యోజన ధీమా ఇవ్వలేకపోతోంది. దీంతో రైతులు పెట్టుబడి కోసం బ్యాంకులకు వెళ్లలేక.. ప్రైవేటు అప్పులకు భయపడి పాలుపోని స్థితిలో ఉన్నారు. అధికార యంత్రాంగం, ప్రభుత్వం స్పందించి రబీకి సిద్ధమైన అన్నదాతకు ప్రభుత్వం రుణమాఫీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అందని రుణమాఫీ నిధులు జిల్లాలో 4.25 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో వివిధ బ్యాంకుల్లో దాదాపు 3.95 లక్షల మంది అన్నదాతలు రుణాలు పొందారు. మిగతా 30 వేల మంది బ్యాంకులు, సొసైటీల్లో రుణాలు పొందలేదు. రైతులు తీసుకున్న రూ.లక్ష వరకు రుణాన్ని 4 విడతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రెండేళ్లుగా 25 శాతం చొప్పున నిధులు ఒకేసారి విడుదల చేసింది. కానీ. ఈ యేడు మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 25 శాతం నిధులను 6.25 శాతం చొప్పున ఇప్పటికి రెండు విడతలుగా విడుదల చేసింది. మరో 12.5 శాతం నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు రెండు నెలలుగా రుణమాఫీ నిధుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నేటికీ స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తాలేని ఇన్‌ఫుట్ సబ్సిడీ గతేడాది తీవ్ర కరువు నెలకొనడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.791 కోట్లు కరువు సాయంగా ప్రకటించింది. అందులో కొంతభాగం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేసింది. జిల్లా కు కరువు సాయంగా ప్రభుత్వం దాదాపు రూ.116 కోట్లు గత మార్చి, ఏప్రిల్ నెలలో ప్రకటించింది. వాటిని 3,79,542 మంది రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు చెప్పింది. ఆ నిధులను జూన్, జులై నెలల్లో రైతు ల ఖాతాల్లో జమ చేస్తామని సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ముందుగానే ఇవ్వడం వల్ల రైతులకు ఖరీఫ్ లో పెట్టుబడికి ఇబ్బందులు ఎదురవుతాయని, ఖరీఫ్ ప్రారంభంలో ఇస్తామని పేర్కొన్నారు. ఖరీఫ్ ముగిసి, రబీ వస్తున్నా.. ఇంతవరకూ వాటి ఊసేలేదు. అంతేగాకుండా ఇన్‌ఫుట్ సబ్సిడీలోనూ రాష్ట్రప్రభుత్వం కోత విధించినట్లు తెలిసింది. జిల్లాకు రూ.116 కోట్ల వరకు రావాల్సి ఉన్నా.. రాష్ట్రం తన వాటాను చెల్లించకుండానే ఉమ్మడి జిల్లాకు కేవలం రూ.82 కోట్ల వరకు చెల్లించనున్నట్లు సమాచారం. దీని వల్ల అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రబీ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోకుండా ఉంటారు. దీమా ఇవ్వని ‘ఫసల్ బీమా’ కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ బీమా పరిహారం అందించే బాధ్యతను అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించింది. రైతులు తమ పట్టా భూమిలో పండించే పంటపై బీమా చెల్లించాలని సూచిం చింది. ప్రీమియం చెల్లించిన వారికే నష్టపరిహారం అందించనున్నామని పేర్కొంది. తద్వారా జిల్లాలోని 1,21,378 మంది రైతులు 1,04,225 హెక్టార్లకు రూ.16,06,85,378 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. రైతుల్లో ఫసల్ బీమా యోజనపై అవగాహన లేకపోవడం, రాష్ట్రప్రభుత్వం ప్రచారం చేపట్టకపోవడంతో జిల్లాలో కొంతమంది మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. ఇటీవల వరదల వల్ల జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకుపైనే సోయా నష్టం వాటిల్లింది. వ్యవసాయాధికారులు ఈ నష్టాన్ని ధ్రువీకరించారు. ఒకవైపు సోయా నష్టం వాటిల్లి రైతు విలవిల్లాడుతుంటే.. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టమేమీ లేదని చెప్పినట్లు తెలిసింది. కంపెనీ అధికారులు తూ.తూ.మంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా రుణమాఫీని, ఇన్సూరెన్స్‌తో లింకేజీ చేయడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రుణం అధికంగా వస్తుందనే భావనతో కొందరు రైతు లు సోయా వేసినప్పటికీ వరి సాగు చేస్తున్నామ ని రు ణాలు పొందారు. దీని వల్ల వరికి ఇన్సూరెన్స్ చెల్లించి సోయా సాగు చేసిన రైతన్నకు ఎలాంటి పరి హారమూ రాదని వ్యవసాయ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతో రైతలు ఇన్సూరెన్స్ చెల్లించి.. పరిహారం రాక రెండు విధాలుగా నష్టపోయారు. సర్కారు రుణాలు ఇవ్వాలి నా పేరు మహిపాల్. మాది జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్. రబీ సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నాను. పెట్టుబడికి డబ్బులు లేవు. బ్యాంకుల వద్దకు వెళ్తే రుణాలు ఇవ్వడం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుంచాల్సి వస్తోంది. ప్రభుత్వం పెట్టుబడిగా ఇస్తానని చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీని వెంటనే విడుదల చేయాలి. రుణం కూడా ఇవ్వాలి. -
విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం
టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ నేత కుంతియా ధ్వజం హుజూర్నగర్: విద్యార్థుల బలిదానాలు చూసే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, అలాంటి రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను విస్మరించడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి రామచంద్ర కుంతియా విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొ న్నారు. రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అవినీతికరమైనదిగా అభివర్ణించారు. పాలకుల విధానాల వల్ల రైతులు, విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు. -
ఆశల పల్లకీలో...!
-
మంత్రి దృష్టికి రోడ్ల విస్తరణ
ఇటిక్యాల: నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రోడ్ల విస్తరణ అంశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లేఖ రాసినట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. వనపర్తి జిల్లాకు వెళ్లేందుకు అలంపూర్ ,గద్వాల్ నియోజకవర్గాల నుంచి రవాణ సౌకర్యలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఐజ మండల కేంద్రం నుంచి విఠలాపురం, మల్లెందొడ్డి, ఎల్కూరు, ఉదండాపురం, ఇటిక్యాల మండల కేంద్రం మీదుగా జింకలపల్లి వీఎస్టీ కంపినీ స్టేజీ 44 నంబర్ జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిరంజన్ రెడ్డి మంత్రికి రాసిన లేఖలో వివరించినట్లు అలంపూర్ టిఆర్ఎస్ నియోజకవర్గం మంద శ్రీనా«ద్, ఐజ మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ఇటిక్యాల మండల నాయకులు జయసాగర్ ,రాంరెడ్డి ,మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. విస్తరణ వల్ల వడ్డేపల్లి , ఐజ, ఇటిక్యాల, గద్వాల్ నియోజకవర్గంలోని మల్దకల్ మండల ప్రజలు వనపర్తికి చేరేందుకు 20 కిలోమీటర్ల్ దూరం తగ్గుతుందని వారు తెలజేశారు. ప్రస్తుతం ఎన్‌హెచ్ 44 జింకలపల్లి వీఎస్టీ కంపెనీ నుంచి ఇటిక్యాల మండల నుంచి మంజూరు అయ్యిందని తెలిపారు. త్వరలోనే రోడ్ల విస్తరణ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రుణమాఫీ అందకపొతే అసెంబ్లీ ముట్టడే
డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి పెద్దేముల్: ప్రతి రైతుకు రుణమాఫీ అందకపొతే అసెంబ్లీని ముట్టడిస్తామని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేష్‌మహరాజ్ అన్నారు. పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేస్తుందన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాలకు చెందిన రైతులకు సుమారు రూ.13 కోట్ల పంట రుణాలు రావలసి ఉందన్నారు. ఈ విషయమై తాండూరు నియోజక వర్గంలో పెద్దఎత్తున ధర్నా కూడా చేశామని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ అంటూ రైతులను నిలువునా మోసం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేవలం పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్, ఇందూరు, గార్మీపూర్‌తోపాటు పలు గ్రామాల్లో సుమారు 1,600 మంది రైతులకు రూ.9 కోట్లపై పంట రుణమాఫీ రావలసి ఉందని వారు తెలిపారు. రుణమాఫీ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయకపొతే కలెక్టర్‌తోపాటు అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దేముల్ రైతు సేవాసహకార సంఘం చైర్మన్ ధారాసింగ్, కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గోన్నారు. -
మొలకెత్తని ‘ఆశలు’
వానల్లేక ఎండుతున్న పంటలు ఎదురుచూపుల్లో రైతులు రేగోడ్: ఆశించిన వర్షాలు లేక వేసిన పంటలు పెరగడంలేదు. మండలకేంద్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. గ్రామ శివారులో.. 15ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. పత్తిపంట 420, మొక్కజొన్న 30, పెసర పంట 200, మినుము 150, కంది 25, సోయాబిన్ 75, కూరగాయలు 12ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం బ్యాంకుల అధికారులు రుణమాఫీ డబ్బులు ఇవ్వడం లే దు. ఇక రైతులు ప్రై వేటుగా అప్పులు తీసుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. పంటల సాగు సమయంలో సరిగా వర్షాలు పడలేదు. దీంతో పత్తి మొలకలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. రైతులు ఇంకా ఆశాభావంతోనే ఉన్నారు. వర్షాలు పడకపోతే పెట్టుబడులు నష్టపోవాల్సిందేనని దిగాలు చెందుతున్నారు. వానలు పడకపోతే నష్టమే పంటలు వేస్తున్నప్పుడు వానలు పడలేదు. పత్తి పంటకోసం ఇప్పటికి పదివేలు ఖర్చు చేసిన. మొలకలు పెరగలేదు. ఇకమీదటనైనా వానలు కురువకపోతే నష్టాలుపాలు కావాల్సిందే. – ప్యారారం సంగప్ప, రైతు -
మాఫీ తృణమే!
♦ రుణమాఫీకి నిధుల కొరత ♦ ఏటా ఇవ్వాల్సింది పావువంతు నిధులు ♦ ఈసారి మంజూరైనవి6.25 శాతమే ♦ పంపిణీపై తలలుపట్టు కుంటున్న వ్యవసాయశాఖ ♦ వచ్చిన వాటితో సరిపెడదామని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ రుణమాఫీ పథకానికి నిధుల కొరత వచ్చింది. రాష్ట్ర అవతరణ రోజు నాటికి తీసుకున్న పంటరుణాలపై రూ.లక్ష వరకు మాఫీ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకానికి యేటా 25శాతం నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 25శాతం చొప్పున నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసింది. తాజాగా మూడో విడత కింద జిల్లాకు రూ.250.166 కోట్లను 1,99,653 మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తాజాగా జిల్లాకు కేవలం రూ.62.83 కోట్లు మాత్రమే విడుదల కావడం గమనార్హం. సాక్షి, రంగారెడ్డి జిల్లా : రుణమాఫీ నిధుల్లో ప్రభుత్వం కోత పెట్టడంతో వ్యవసాయ శాఖ గందరగోళంలో పడింది. వాస్తవానికి 25శాతం నిధులు వస్తే.. రైతులకు గతంలో పంపిణీ చేసిన విధంగా ఈసారి అదేతరహాలో నిధులను రైతు ఖాతాల్లో జమచేయవచ్చని అధికారులు భావించారు. కానీ 25శాతం నిధులు కాకుండా 6.25 శాతం నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో నిధులను రైతులకు సమానంగా పంచాలని యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి రైతు ఖాతాలో 25శాతం కాకుండా 6.25 శాతం నిధులు జమచేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ బిల్లులు సిద్ధం చేస్తోంది. వారంలోగా ఈ బిల్లులు ఖజానా విభాగానికి పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంటరుణాలపై ప్రభావం.. ఖరీఫ్ రుణాలపై పంటరుణ మాఫీ ప్రక్రియ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉం డడం.. వర్షాలు ఓ మోస్తరుగా పడుతుండడంతో సాగుపనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలో పెట్టబడుల కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేందుకు రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బ్యాంకులకు రావాల్సిన రుణమాఫీ నిధులకు ప్రభుత్వం కోత పెట్టడంతో కొత్తగా రుణాలివ్వడంలో బ్యాంకులు వెనక్కు తగ్గే అవకాశాలున్నాయి. బ్యాంకుల వారీగా లక్ష్యాలుండడం... రుణమాఫీ నిధులు సకాలంలో రాకపోవడంతో రైతులకు ఇచ్చే ఖరీఫ్ పంటరుణాలను పరిమితం చేసే అవకాశం లేకపోలేదు. దీంతో ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతులకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం అంతంతమాత్రమేనని తెలుస్తోంది. -
మంత్రి ఇంటిని ముట్టడిస్తాం
పెడన : టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత రుణమాఫీ తక్షణం అమ లు చేయకపోతే చేనేత, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని ముట్టడిస్తామని వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు ఆనంద్ ప్రసాద్ హెచ్చరించారు. స్థానిక 16వ వార్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనంద్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు చేనేత రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వటం వలన చేనేత కార్మికులు రుణాలు చెల్లించలేదని చెప్పారు. రుణాలకు వడ్డీలు పెరిగిపోవటంతోపాటు బ్యాంకర్ల ఒత్తిళ్లు పెరగటం వలన రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, దావు భైరవలింగం, పార్టీ మండల పరిషత్ ప్రతిపక్ష నేత రాజులపాటి అచ్యుతరావు, పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు పిచ్చిక సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
బాబుది తుగ్లక్ పాలన
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పాలసముద్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుగ్లక్ పాలనను తలపిస్తున్నారని, ఎన్నికల సమయంలో పదవీ కాంక్షతో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతున్నందుకు పశ్చాత్తాపపడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శనివారం పాలసముద్రంలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే.శివప్రకాష్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చంద్రబాబుకు దిక్కు తెలియడం లేదన్నారు. అవినీతి సొమ్ము కోట్లాది రుపాయలు ఎరచూపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రైతు, చేనేత, డ్వాక్రా రుణమాఫీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ముద్రగడ దీక్ష చేస్తుంటే తీవ్రవాదిని అరెస్టు చేసిన రీతిలో అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన కుటుంబ సభ్యులను, మద్దతుదారులను పోలీసులు తరిమి కొట్టడం చూస్తే నియంతపాలనలో ఉన్నామా అని అని పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్వేటినగరం మం డల అధ్యక్షుడు శ్రీరాములునాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ఎస్ఆర్పురం జెడ్పీటీసీ మా జీ సభ్యుడు ప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సుబ్రమణ్యరెడ్డి, ఉపాధ్యక్షుడు అన్బ్‌లగన్, పద్మనాధనాయు డు, పార్టీ ప్రధాన కార్యదర్శి రమణమూర్తినాయుడు, ప్రచార కార్యదర్శి గాలి మహేష్ బాబు, మాజీ మం డల అధ్యక్షుడు విజయరాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు ధనంజయులు, సర్పంచ్ ఆండాలు రవి పాల్గొన్నారు -
ప్చ్.. అమలుకు నోచుకోని హామీలు
రాజధాని చుట్టే చక్కర్లు అయినా ఒక్క అడుగూ ముందుకు పడని వైనం ప్రజా సమస్యలు గాలికి రుణమాఫీ పుణ్యంతో కొత్త రుణాలకు కోత నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు కాసుల వేటలో అధికార పార్టీ నేతలు అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు.. దాడులు అమరావతి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లయింది. ఈ రెండేళ్లూ చంద్రబాబు పాలన మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతోంది. అదీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల ప్రారంభం తప్ప ఒక్క అడుగూ ముందుకు పడకపోవటం గమనార్హం. ఇకపోతే ప్రజలకు ఏమైనా చేశారా అంటే.. శూన్యమనే చెప్పాలి. అధికార యంత్రాంగం మొత్తం రాజధాని నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నామంటూ రెండేళ్లు పూర్తిచేశారు. సీఎం, మంత్రులు, చైనా, జపాన్, సింగపూర్ బృందాల సేవలకే వారు పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తంగా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు. తొలిరోజు నుంచీ షాకులే... సరిగ్గా రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆరోజు కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తారని ఆశతో ఓట్లేసి గెలిపించారు. అదేరోజు వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆరోజు దశలవారీగా.. లక్షలోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ రోజు మొదలైన చంద్రబాబు షాక్‌లు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బలవంతపు భూసేకరణ రాజధాని పేరు చెప్పి గుంటూరు జిల్లా పరిధిలోని 29 గ్రామాల పరిధిలోని రైతుల నుంచి భూముల సేకరణకు నిర్ణయించారు. రైతులు అడ్డం తిరగటంతో ల్యాండ్‌పూలింగ్ పేరుతో బలవంతంగా భూములను లాక్కున్నారు. భూములు తీసుకునే సమయంలో పాలకులు రకరకాల హామీలు ఇచ్చారు. నేటికీ ఒక్క హామీ కూడా అమలు కాకపోవటం గమనార్హం. ఇదే ల్యాండ్‌పూలింగ్ పేరుతో బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం, ఏలూరు కాలువ మళ్లింపునకు భూ సేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. అక్కడి రైతులు ఎదురుతిరగటంతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. రుణాలు మాఫీ కావు... కొత్త రుణాలు ఇవ్వరు రైతు, డ్వాక్రా రుణాలు ఇప్పటి వరకు మాఫీ కాకపోవటం గమనార్హం. మొదటి విడతగా విడుదల చేసిన నిధులు వారు తీసుకున్న వడ్డీకే చాల్లేదు. రెండో విడత నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు మాఫీ చేస్తానని చెప్పి ఏడాదికి రూ.3 వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో అటు రైతులు.. ఇటు డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. రుణాలు కావాలంటే తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని పట్టుబడుతున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవటంతో అనేక మంది బంగారు ఆభరణాలను బ్యాంకర్లు వేలం వేశారు. తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, మట్టిని అమ్ముకున్న తమ్ముళ్లు కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో తెలుగు తమ్ముళ్లు తెగబడ్డారు. అడ్డుకున్న స్థానికులు, అధికారులపై దాడులకు తెగబడ్డారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పలుచోట్ల స్థానికులపై దాడులు చేశారు. నిలదీసిన వారిపై తప్పుడు కేసులు బనాయించారు. నీరు-చెట్టు పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతలు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. గతంలో ఉపాధి హామీ కింద చేపట్టిన పనులను చూపించి బిల్లులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. చెరువుల్లోని మట్టిని సైతం అమ్మి సొమ్ము చేసుకోవటం గమనార్హం. ప్రొటోకాల్ బిజీలో అధికార యంత్రాంగం అమరావతిని రాజధానిగా ప్రకటించటం, నిర్మాణానికి వివిధ దేశాల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పాలన అంతా విజయవాడ కేంద్రంగా చేసుకోవటంతో సీఎం, మంత్రులు, చైనా, జపాన్, సింగపూర్ నుంచి ప్రతినిధులు పలుమార్లు విజయవాడకు వచ్చారు. సీఎం, మంత్రులు విజయవాడ కేంద్రంగా ఉండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు వారికి వసతి సౌకర్యాలతో పాటు, సమావేశాలకు ఏర్పాట్లు చేయటంలోనే రెండేళ్లు గడిచిపోయింది. దీంతో ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. పెరిగిన ఇంటి అద్దెలు.. నిత్యావసర వస్తువుల ధరలు అమరావతిని రాజధానిగా ప్రకటించటంతో విజయవాడ, గుంటూరు పరిధిలో నివాసాల అద్దెలు అమాంతం పెంచేశారు. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల పరిధిలో 34 వేల ఎకరాలకు పైగా భూములు తీసుకోవటంతో ఆ ప్రాంతం అంతా ముళ్లచెట్లను తలపిస్తోంది. కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్యుడి జీవనం భారంగా మారింది. -
మూడో విడత రుణమాఫీ ఎప్పుడు?
- సొమ్ము కోసం బ్యాంకులు.. రుణం కోసం రైతుల ఎదురుచూపులు - ఖరీఫ్ విత్తనాలు, ఎరువులు, సాగు పెట్టుబడులు లేక అన్నదాతల అవస్థలు - రుణమాఫీ నిధులు విడుదల చేయకుంటే బ్యాంకులు రుణమిచ్చే పరిస్థితి లేదు - కరువు సాయం విడుదలపైనా అస్పష్టత.. ఖరీఫ్‌తోనే కష్టాలూ మొదలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌తో పాటు రైతులకు కష్టాలూ మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాలతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పెట్టుబడులకు పైసా లేని దుస్థితి. రుణం కోసం బ్యాంకులకు వెళితే.. ‘రుణమాఫీ’ మూడో విడత సొమ్ము విడుదలయ్యాకే ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నాయి. రుణమాఫీ సొమ్ముకు, కొత్త రుణాల మంజూరుకు సంబంధం లేదని సర్కారు చెబుతున్నా.. బ్యాంకులు మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనలో కూరుకుపోతున్నారు. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు మాఫీ పథకాన్ని ప్రకటించింది. 35.82 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్లను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందులో మొదటి విడతగా 2014లో రూ.4,230 కోట్లు, గతేడాది రెండో విడతగా రూ.4,040 కోట్లు విడుదల చేసింది. మరో రెండు విడతల సొమ్ము రూ.8,080 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ ఏడాది మూడో విడత కింద రూ.4,040 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. దీనికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినా.. విడుదల చేయలేదు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతుండడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. బోగస్‌లను గుర్తించాకే! మూడో విడత నిధులను విడుదల చేయడానికి ముందు రుణమాఫీ పొందిన బోగస్ రైతులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. అనర్హులను గుర్తించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది కూడా. తొలి, రెండు విడతల్లో విడుదల చేసిన మాఫీ సొమ్ములో ఎంత మేరకు అక్రమాలు జరిగాయన్న దానిపై సమగ్ర పరిశీలన చేసే అవకాశాలున్నాయి. ఇక కేంద్రం విడుదల చేసిన ఇన్పుట్ సబ్సిడీ సొమ్మును రైతులకు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడంపై విమర్శలు వస్తున్నాయి. -
మాట మార్చారు.. పరువు తీశారు!
ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో బాబు హామీ జిల్లాలో మొత్తం వ్యవసాయ రుణాలు రూ.9,137 కోట్లు మాఫీ చేసింది రూ.1490 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది రూ.573 కోట్లు రైతు సాధికార సంస్థకు నిధులేవీ? డ్వాక్రా సభ్యులకు రూ.3 వేలతో సరి బ్యాంకర్లు, రైతుల మధ్య బంధాన్ని విడదీసిన సర్కారు మచిలీపట్నం : ‘టీడీపీ అధికారంలోకి వస్తే బ్యాంకులో తాకట్టు పెట్టిన పుస్తెలతాళ్లు తీసుకువచ్చి ఇంటి వద్ద ఇస్తాం. రైతులు పంట రుణాలు తీసుకుంటే ఎవరూ చెల్లించవద్దు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తాం’ గత ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇది. హామీలతో పాటు స్థానిక టీడీపీ నేతల మాటలు నమ్మిన రైతులు తాము తీసుకున్న రుణాలను చెల్లించకుండా నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు మొట్టమొదటి సంతకం చేసిందీ రుణమాఫీ ఫైలుపైనే. ఆచరణలో మాత్రం రెండేళ్లు గడిచినా రుణమాఫీ అంశం కొలిక్కి రాలేదు. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లూ రుణమాఫీ ప్రక్రియ కొనసాగించే దిశగా సర్కారు అడుగులు వేసింది. ప్రస్తుతం రైతుల పరిస్థితేమిటంటే.. పాత బకాయిలు అలాగే ఉండిపోయాయి. కొత్త రుణం కోసం బ్యాంకు గుమ్మం తొక్కాలంటే ముందూవెనకా ఆలోచించాల్సిన స్థితి. రుణమాఫీ పదానికి కొత్త అర్థం చెప్పిన పాలకులు తమను నట్టేట ముంచారనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. మచిలీపట్నం : రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కారు ఈ అంశంపై రకరకాలుగా మాట మార్చింది. ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని ఒకసారి, కాదు కాదు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మాఫీ జరుగుతుందని మరోసారి, ఏదైనా ఒక బ్యాంకులో తీసుకున్న రుణమే మాఫీ అవుతుందని ఇంకోసారి.. ఇలా రకరకాలుగా రైతులను అయోమయానికి, ఇబ్బందులకు గురిచేశారు. చివరికి పుస్తెల తాళ్లు ఇంటికి రాకపోగా బంగారు నగల బహిరంగ వేలం ప్రకటనలతో తమ పరువు బజారున పడిందని రైతులు వాపోతున్నారు. మరోపక్క బంగారం తాకట్టు పెట్టినా ఎకరాకు రూ.20 వేలకు మించి రుణం ఇవ్వబోమని బ్యాంకులు స్పష్టం చేస్తుండటంతో ప్రస్తుత ఖరీఫ్‌లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. కౌలు రైతుల రుణమాఫీ ఊసే సర్కారు పట్టించుకోవటం లేదు. రైతు సాధికార సంస్థ ద్వారా రుణమాఫీ జరుగుతుందని ప్రకటించారు. ఈ సంస్థకు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశారు. మొత్తం బకాయిలు రూ. 9,137 కోట్లు జిల్లాలో 2014 డిసెంబరు 31 నాటికి 7.03 లక్షల మంది రైతులు రూ. 9,137 కోట్ల మేర పంట రుణాలు బకాయి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో రైతులు ఎవ్వరూ రుణాలు చెల్లించలేదు. కొంతకాలం పాటు రుణాలు రీషెడ్యూలు చేస్తామని, అనంతరం రుణమాఫీ చేస్తామని చెబుతూ వచ్చారు. పంట రుణాలుగా రూ.3,088 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు రూ.3,276 కోట్లు, టెర్మ్ లోన్స్ రూ.2,773 కోట్లు తీసుకున్నారు. ఒక రైతు కుటుంబం ఎంతమేర పంట రుణం తీసుకున్నా వారికి రూ.1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని ప్రకటించారు. అనంతరం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) ఆధారంగా ఎకరానికి రూ.19,500 మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పారు. రూ.50 వేల లోపు ఉన్న రుణాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. జిల్లాలో 4,04,402 మంది రైతులకు రూ.1490 కోట్లు రుణమాఫీ జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.573 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెబుతున్నారు. వడ్డీకి సరిపోవటం లేదు... రెండెకరాలున్న రైతు పంట రుణంగా రూ.70 వేలు తీసుకుంటే సకాలంలో చెల్లించని కారణంగా వడ్డీ, అపరాధ వడ్డీ కలుపుకుని రూ.78 వేలు అయ్యింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రెండు ఎకరాలకు రూ.39 వేలు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. రూ.78 వేలు బకాయి ఉండటంతో ఈ రుణాన్ని ఐదు విడతల మాఫీకి నిర్ణయించారు. మొదటి విడతగా సంబంధిత రైతు ఖాతాలో రూ.8,500 జమ చేశారు. దీంతో ప్రభుత్వం రుణమాఫీగా జమ చేసిన నగదు రైతు తీసుకున్న రుణానికి వడ్డీ కింద కూడా చాలని పరిస్థితి నెలకొంది. ఈ ఐదేళ్ల పాటు ఈ మొత్తానికి వడ్డీ, అపరాధ వడ్డీతో కలుపుకొంటే సగం బాకీ అలాగే ఉండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సభ్యులకు రూ.3వేలతో సరి జిల్లాలో 57,130 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలో 6,16,552 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీ అధికారం చేపట్టే నాటికి డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు రూ.938 కోట్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ రుణాలన్నీ మాఫీ చేస్తారనే ఆశతో ప్రతి నెలా డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం మాట మార్చిన పాలకులు డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ కావని, ఒక్కొక్క సభ్యురాలి పేరున రూ.10 వేలు నగదు జమ చేస్తామని ప్రకటించారు. మొదటి విడతగా రూ. 3 వేలను డ్వాక్రా సభ్యురాలి ఖాతాకు జమ చేశారు. ఈ నగదు రివాల్వింగ్ ఫండ్‌గానే ఉంటుందని, డ్రా చేసుకునేందుకు వీలులేదని నిబంధన విధించారు. దీంతో డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాకపోవడం గమనార్హం. ఇక రెండో విడత రూ.3 వేలను ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. -
అనర్హులను గుర్తించండి
రుణమాఫీపై బ్యాంకర్లకు మంత్రి ఈటల పిలుపు హైదరాబాద్: నకిలీ పాసు పుస్తకాలతో రుణమాఫీ పొందిన రైతులను గుర్తించడంలో ప్రభుత్వానికి బ్యాంకులు సహకరించాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మొదటి, రెండో విడత రుణమాఫీ సొమ్ము అనేక మంది అనర్హులకు చేరిందని తమకు నివేదికలు వచ్చాయన్నారు. వచ్చే విడత రుణమాఫీ సొమ్ము అనర్హులైన రైతులకు చేరకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ తమ సొమ్ము కాదని నకిలీ పాసు పుస్తకాల ద్వారా రుణమాఫీ పొందే వారి పట్ల బ్యాంకులు చూసీచూడనట్లుగా వ్యవహరించొద్దన్నారు. పేద పిల్లలు చదువుకోవడానికి విద్యా రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికీ కొన్ని బ్యాంకులు రైతుల నుంచి రుణంపై వడ్డీ వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. వడ్డీల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని కూడా చాలా బ్యాంకులు పూర్తిస్థాయిలో బీమా కంపెనీలకు పంపలేదని పేర్కొన్నారు. దీనివల్ల అనేక మంది రైతులు బీమా సొమ్ము రాక నష్టపోయారన్నారు. పత్తి పంట ప్రీమియం చెల్లింపునకు గడువును జూన్ 14గా కేంద్రం నిర్ణయించిందని, ఈ విషయంలో బ్యాంకులు వ్యవసాయశాఖకు సహకరించాలన్నారు. ఎస్బీహెచ్ ఎండీ సంతాను ముఖర్జీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
వర్చువల్ రియాల్టీపై ఫేస్బుక్ దృష్టి
వర్చువల్ రియాల్టీలో అగ్రగామిగా నిలవడానికి సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తీవ్రంగా కృషిచేస్తోంది. యూరప్ లో తన వొకొలస్ వర్చువల్ రియాల్టీ డివిజన్ ను విస్తరించడానికి లండన్ లో నిపుణులను నియమించుకుంది. 2014 లో 200 కోట్ల డాలర్ల వొకొలస్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న ఆరునెలల్లోనే బ్రిటిష్ టీమ్ ఇంజనీర్లను, డెవలపర్ సిబ్బందిని పెంచుకోవడం ప్రారంభించింది. భవిష్యత్తులో పెరగబోతున్న వర్చువల్ రియాల్టీ డిమాండ్ కు తగ్గట్లుగా మారి.. ఆ రంగంలో తామే అగ్రగామిగా నిలవాలని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయించారు. గతేడాది బ్రిటన్‌కు చెందిన వర్చుయువల్ రియాల్టీ స్టార్టప్ సర్ రియల్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. ఈ టీమ్ ను రెడ్ మాండ్ లోని వొకోలస్ ఆఫీసుకు తరలించింది. గూగుల్ లో సీనియర్ ఇంజనీర్ గా పనిచేసిన మైక్ లీబ్యూను బ్రిటన్ వొకొలస్ టీమ్ కు అధినేతగా కంపెనీ నియమించింది. జనవరిలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. వచ్చే తరమంతా సోషల్ మీడియాలో వర్చువల్ రియాల్టీ మీదే ఎక్కువ సమయం గడుపుతుందని అంచనా. ఒకరితో మరొకరు సంప్రదింపులు జరపడానికి ఇది అతి పెద్ద టెక్నాలజీగా రూపొందనుందని జుకర్ బర్గ్ విశ్వసిస్తున్నారు. సోషల్ ప్లాట్ ఫాంలో వర్చువల్ రియాల్టీ ఎక్కువగా అభివృద్ధి చెందబోతుందని, వచ్చే తరంలో రాబోతున్న సోషల్ యాప్స్ కు, వర్చువల్ రియాల్టీకి కొత్త టీమ్ ను నియమించుకోబోతున్నట్టు మార్క్ జుకర్ బర్గ్ ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించారు. వర్చువల్ రియాల్టీ రంగంలో అగ్రస్థానాల కోసం ఫేస్ బుక్, గూగుల్, సోనీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. యాపిల్ సైతం ఈ టెక్నాలజీపై దృష్టి సారించింది. -
ఇదేం రుణమాఫీ?
♦ రైతుకు నిష్ర్పయోజనం ♦ 20,848 మందికి నిరాశ ♦ అర్హులైనా అందని రూ.107.98 కోట్లు ♦ కలెక్టర్ నివేదిక బుట్టదాఖలు నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేశారు. రుణమాఫీ ద్వారా లబ్ధి పొందలేకపోయిన రైతులకు రూ.5,000 ప్రోత్సాహకం ఇచ్చారు. నేడు రుణమాఫీ ప్రకటించి రెండేళ్లయినా మీనమేషాలు లెక్కిస్తున్నారు. విడతల వారీగా మాఫీ వర్తింపజేస్తూ రైతులను మళ్లీ వడ్డీవ్యాపారుల వైపు నడిపిస్తున్నారు. రుణమాఫీకి అర్హత సాధించిన 20,848 మంది రైతులకు ఈ పథకం వర్తించకుండా పోయింది. రూ.107.98 కోట్లు మాఫీ కాకుండా పోయాయి. ఖమ్మం వ్యవసాయం: జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ సంబంధిత రైతులు రుణమాఫీకి అర్హులని, వారి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయినా ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. ప్రభుత్వం రుణమాఫీకి అర్హులుగా గుర్తించని రైతులు జిల్లాలో ఇంకా మరో 30 వేల మంది ఉంటారని అంచనా. వీరికి రూ. 30 కోట్ల మేరకు రుణాలు మాఫీ కావాల్సి ఉందని రైతు సంఘాలు అంటున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కొందరు అర్హులైన రైతుల రుణాలు కూడా మాఫీలో చేర్చలేదు. నివాసం ఒక రాష్ట్రంలో, భూమి మరో రాష్ట్రంలో ఉన్న రైతుల రుణాలు ఎటూ కాకుండా పోయాయి. జిల్లాలో రుణమాఫీ ఇలా.. రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల్లో ఇంటికొకరిని అర్హులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తొలుత ప్రాథమికంగా 3,80,009 మంది రైతులను రుణమాఫీలో అర్హులుగా గుర్తించారు. వారికి 1,724.80 కోట్లు మాఫీ చేయాలని నివేదికలు రూపొందించారు. ఆ తర్వాత రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకింగ్ శాఖలను కమిటీలుగా చేసి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం తుది జాబితాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 3.58 లక్షల మం ది రైతులను అర్హులుగా ప్రకటించారు. రూ.1,637 కోట్లను రుణమాఫీలోకి చేర్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేసిన రైతుల వివరాలు, రుణ మాఫీల వివరాలు గ్రామపంచాయతీల్లో, బ్యాంక్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. అర్హత ఉన్నా మాఫీ వర్తించని రైతులు ప్రజా ప్రతినిధులను, బ్యాంక్ మేనేజర్లను, తహ సీల్దార్లను, వ్యవసాయాధికారులను, లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను, జిల్లా వ్యవసాయాధికారిని, జిల్లా కలెక్టర్‌ను అనేక పర్యాయాలు కలిశారు. జిల్లాలో అర్హులై ఉండి మిగిలిన రైతుల వివరాలతో కూడిన జాబితాలను పంపాలని కలెక్టర్ వ్యవసాయశాఖను కోరారు. జిల్లా వ్యవసాయశాఖ 48 బ్యాంక్ బ్రాంచీల నుంచి 17,642 మంది రైతులు రుణమాఫీకి అర్హులని, వీరికి రూ.84.43 కోట్లు రుణమాఫీలో చేర్చాలని నివేదిక ఇచ్చింది. బంగారం తాకట్టుపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు జిల్లాలో 3,206 మంది ఉన్నారని.. రూ.23.55 కోట్లు రుణమాఫీలో చేర్చాలని నివేదికలు అందించారు. మొత్తం 20,848 మంది రైతులకు చెందిన రూ.107.98 కోట్లు రుణమాఫీలో చేర్చాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి గత ఏడాది జూన్ నెలలో నివేదిక ఇచ్చారు. రుణమాఫీ అందని రైతులు అటు కొత్త రుణాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇలా రెండు రకాలుగా నష్టపోతూ రుణదాతల నుంచి నూటికి రూ.5 వడ్డీ చొప్పున తీసుకుంటున్నారు. మాఫీ విధానంపై రైతుల్లో అసంతృప్తి పంట రుణాల మాఫీ విధానంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జిల్లాలకు రుణమాఫీ నిధులు రూ.1,637 కోట్లు అందాల్సి ఉండగా వాటిని 25 శాతం చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు రూ.820.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఏటా వచ్చే నాలుగో వంతు రుణ మొత్తం పంటల పెట్టుబడులకు ఏ మాత్రం సరిపోవటం లేదు. ఆ రుణాలు కూడా వ్యవసాయ సీజన్లో అందటం లేదు. పంట సాగు చేసి పెట్టుబడులు పూర్తయ్యే దశలో అందుతున్నాయి. అధిక వడ్డీలతో సెలమయ్య అవస్థలు తల్లాడ మండ లం వెంకటగిరి గ్రామానికే చెందిన మరో రైతు దేవల సెలమయ్య కూడా ఏపీజీవీబీ నుంచి రూ.15వేలు రుణం తీసుకున్నాడు. రుణమాఫీ జాబితాలో ఈ సన్నకారు రైతు పేరు లేదు. తనకున్న కొద్దిపాటి భూమిలో పంట సాగు చేసేందుకు అప్పుకోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లాడు. అప్పు ఉన్న వారికి మళ్లీ రుణం ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పారు. దిక్కు తోచని సెలమయ్య అధిక వడ్డీకి అప్పు తెచ్చుకొని పంటకు పెట్టుబడి పెట్టాడు. ప్రోత్సాహకం మంచి విధానం వ్యవసాయంలో ప్రతికూలత, రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితులున్నప్పుడు ప్రోత్సాహక విధానాలను అమలు చేయటం మంచిది. ఇన్పుట్ సబ్సిడీ వంటి విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. రుణమాఫీ విధానంలో బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. రుణమాఫీలో ఉన్న రైతులైనప్పటికీ వారికి కేటాయించిన రుణ మాఫీని మాత్రమే తిరిగి రుణంగా ఇస్తాం. మిగిలిన మొత్తాన్ని రైతు చెల్లిస్తే తిరిగి కొత్త రుణాలు ఇస్తాం. రుణమాఫీ ఎప్పుడు వస్తే అప్పుడు రైతు ఖాతాలో జమ చేస్తాం. - డి.సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ, ఖమ్మం రూరల్ బ్యాంక్ మేనేజర్ -
రుణమాఫీ.. అధోగతి
అప్పు కట్టాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకులు తాకట్టు బంగారాన్నివేలం వేస్తున్న వైనం ఆందోళనలో అన్నదాతలు పెనుమూరు మండలం పెరుమాళ్లకండ్రిగకు చెందిన రైతు వెంకటాచలం నాయుడు పెనుమూరు కార్పొరేషన్ బ్యాంకులు రూ.75 వేలు రుణం తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.1,11,343 అయ్యింది. వెంకటాచలం నాయుడుకు రుణమాఫీ వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం లేఖ పంపింది. తొలి విడత కింద రూ.21,292 మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని మూడు కంతులుగా ఇస్తామని చెప్పినా రెండో విడత మొత్తాన్ని ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. బాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు. ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని ఇచ్చేది .. చచ్చేది లేదు.. ముందు మా అప్పు కట్టండంటూ బ్యాంకు రైతుకు నోటీసు పంపింది. ఒక్క వెంకటాచలంనాయుడికే కాదు జిల్లాలో చాలా మంది రైతులకు బ్యాంకులు తాజాగా నోటీసులిచ్చాయి. చిత్తూరు: రుణమాఫీని చంద్రబాబు సర్కారు గంగలో కలపడంతో జిల్లాలోని అన్నదాతలు రోడ్డునపడ్డారు. జిల్లావ్యాప్తంగా 2013 డిసెంబర్ 31వ తేదీ నాటికి వివిధ బ్యాంకుల్లో 7,43,158 మంది రైతులు రూ.5,404.30 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే చంద్రబాబు సర్కారు కేవలం 3,67,993 మంది రైతులే రుణమాఫీకి అర్హులంటూ లెక్కలు తేల్చింది. రూ.50 వేలు లోపు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని, రూ.50 వేలు నుంచి రూ.1.50 లక్షల రుణాలను నాలుగు కంతుల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.50 వేలు లోపు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటించినా వాస్తవానికి వాటిల్లో 60 శాతం రుణాలను కూడా మాఫీ చేయలేదు. ఇక రూ.50వేల పైన రుణాలకు సంబంధించి కేవలం తొలి కంతు మాత్రమే బ్యాంకుల్లో జమ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు కంతుల సంగతిని గాలికొదిలేసింది. రుణమాఫీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్ల రూపంలో జమ చేస్తుందని భావించిన బ్యాంకులకు చుక్కెదురైంది. రెండో కంతు చెల్లిస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి పదే పదే చెప్పినా ఆచరణలో అది అమలుకు నోచుకోలేదు. బ్యాంకర్ల దాష్టీకం.. రుణమాఫీ కింద ఇస్తానన్న మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో బ్యాంకులు రుణ వసూళ్లకు దిగాయి. ఉన్నఫలంగా రూ.లక్షల రుణం ఎలా తీర్చాలంటూ రైతులు లబోదిబోమంటున్నారు. అసలే అరకొర రుణమాఫీతో రైతులను మోసం చేసిన ప్రభుత్వం చెప్పిన మొత్తాన్ని కూడా చెల్లించక పోవడంతో అన్నదాతలు ఆందోళనలో చెందుతున్నారు. వేలానికి తాకట్టు బంగారం.. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకులు తాకట్టు పెట్టిన రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా పలు బ్యాంకుల్లో బంగారం వేలం పాటలు ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 3,49,268 మంది రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.2,910 కోట్ల రుణాలను పొందారు. రుణాలు పొంది నిర్దేశిత గడువు 18 నెలలు దాటిపోవడంతో బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. దీంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. -
రుణభారం పెను శాపం
⇒రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు ⇒ఆ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం ⇒బకాయిలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకర్ల నోటీసులు ⇒పంటలు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక ఆందోళనలో అన్నదాత ‘రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణమాఫీతో మాకు సంబంధం లేదు.. బకాయిలు చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోతాయి.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రావు..’ రైతులను బ్యాంకర్లు, సొసైటీల అధ్యక్ష కార్యదర్శులు బెదిరిస్తున్న తీరిది. అంతేకాదు.. బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు వేలం వేస్తామంటూ నోటీసులకు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకుగురవుతున్నారు. ఒకపక్క పంటలు పండక, చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వం నుంచి రుణమాఫీ రెండో విడత సొమ్ము విడుదల కాక, బ్యాంకర్ల బెదిరింపులు తాళలేక అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. విజయవాడ : రుణభారం రైతన్నకు పెనుశాపంగా మారింది. తీసుకున్న బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు, సహకార సంఘాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆందోళనకు గురవుతున్నాడు. పంటలు పండకపోవడంతో ఏడాదంతా ఎలా జీవనం సాగించాలా అని మధనపడుతున్న రైతులకు బ్యాంకర్లు నోటీసులిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోపక్క రుణమాఫీ రెండో విడత సొమ్ము విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 4.04 లక్షల మంది రుణమాఫీ లబ్దిదారులు... రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 5.54 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ కింద మూడు విడతల్లోనూ కలిపి 4,04,000 మందిని గుర్తించారు. వారి బకాయిల మాఫీ కోసం రూ.1,490 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రూ.50 వేల లోపు ఉన్నవారికే ఒకేసారి రుణమాఫీ చేస్తానని ప్రకటించిన ప్రభుత్వం మిగిలిన రైతులకు ఐదు భాగాలుగా ఐదేళ్లలో విడుదల చేస్తామంటూ ప్రకటించింది. రూ.50 వేల రుణమాఫీతో కలిపి మొత్తం రూ.573 కోట్లు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది చెల్లించాల్సిన రెండో విడత సొమ్ము ఊసే ఇంతవరకూ ప్రకటించలేదు. దీంతో బ్యాంకర్లు తమను బకాయిలు చెల్లించాలని వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు వేలం వేసేందుకు నోటీసులు ఇస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సిన రెండో విడత సొమ్ము చెల్లించాక ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని చెబుతున్నారని, అయితే అసలే కుటుంబం గడవని పరిస్థితుల్లో ఉన్న తాము బకాయిలు ఎలా చెల్లించగలమని వారు ఆవేదన చెందుతున్నారు. మిగిలిన నాలుగేళ్ల సొమ్మును ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తద్వారా తమకు వేధింపులు తగ్గుతాయని చెబుతున్నారు. సాగు లేక.. కుటుంబం గడవక.. కృష్ణా డెల్టాలో 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్‌కి, రబీకి ప్రభుత్వం నీరు అందించలేకపోయింది. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల భూమికి గాను ఖరీఫ్‌లో కేవలం 4.64 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. రబీలో 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, ఏమాత్రం జరగలేదు. పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఎకరాకు సగటున 28 బస్తాలు ధాన్యం పండాల్సి ఉండగా కేవలం 20-22 బస్తాలు మాత్రమే పండాయని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో రైతులు డబ్బులు సరిగా అందక బకాయిలు తీర్చలేని దుస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. -
అధికారులను నిలదీసిన నేతలు
జి.కొండూరు : సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని గ్రామ సభలు పెట్టినా ప్రజలకు ఉపయోగం ఏంటని సీపీఎం మండల కార్యదర్శి బురుసు శివ అధికారులను నిలదీశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జన్మభూమి గ్రామ సభ నిర్వహించారు.సభలో పింఛన్లు,రేషన్ కార్డులు,పక్కా ఇళ్లు ఎక్కడ పంపిణీ చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. గత రెండు జన్మభూమి కార్యక్రమాల్లో పెట్టిన అర్జీలకే ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయింద ని బురుసు శివ అధికారులపై ధ్వజమెత్తారు. 20ఏళ్లుగా గ్రామంలో నివేశన స్థలాలు సమస్య ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి దేవినేని ఉమా తాము అధికారంలోకి వస్తే నివేశన స్థలాలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీ మాయగానే మిగిలిందని ధ్వజమెత్తారు.హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు.ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించిన నాథుడే లేరని వాపోయారు.గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమి గొల్లవాని కుంటలో నివేశం ఉంటున్న వారికి అధికారులు కనీస సౌకర్యాలు కల్పించటం లేదన్నారు.నివేశన స్థలాలు పంపిణీకి స్థలాల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం జి+2 ఇళ్లు ఏలా కట్టిస్తుందని అధికారులు చెబుతున్నారని తహశీల్దార్ కె.సుధారాణిని ప్రశ్నించారు..అయితే పొలీసులు మాట్లాడింది చాలు అంటూ శివను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో ఆ పార్టీ నేతలు ,పొలీసులు,జన్మభూమి కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం లోటు బడ్జెట్ ఉందని చెపుతూ పథకాలకు సక్రమంగా నిధులు కేటాయించకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.కొత్తగా మంజూరు చేస్తున్న గృహ నిర్మాణాలకు సబ్సిడీ పేరుతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటూ మెలిక పెడుతుండడం వలన లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు.మరుగుదొడ్లు నిర్మాణాలకూ ఇదే పరిస్థితి అన్నారు. జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య మాట్లాడుతూ సాగర్ జలాలు రాక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు.కోట్లు వెచ్చించి పట్టిసీమ నీళ్లు తెచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం పక్కనే ఉన్న తారక రామ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయిందో ఆ శాఖకు మంత్రిగా ఉన్న ఉమాకే తెలియాలన్నారు.అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కెడీసీసీ బ్యాంకు జిల్లా ఉపాధ్యక్షుడు వేములకొండ రాంబాబు సూచించారు.ప్రభుత్వ పథకాల పై ఏఎంసీ చైర్మన్ ధనేకుల బుల్లిబాబు మాట్లాడారు.ఫించన్లు కూడ ప్రాధాన్యత క్రమంలో ఇవ్వటం లేదని వార్డు సభ్యుల అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు బట్టపర్తి రాజు ఎంపీడీవో జ్యోతిబసుకు విన్నవించారు.అనంతరం కొత్తగా మంజూరైన రేషన్,పాసుపుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.పినపాక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మరుగుదొడ్లు బిల్లులు మంజూరు కావటం లేదని అధికారులను నిలదీశారు. సర్పంచ్‌లు అంజన,స్వామిదాసు పాల్గొన్నారు. -
స్పందించకుంటే ఉద్యమం ఉధృతం
రుణమాఫీపై ప్రభుత్వానికి టీడీఎఫ్ హెచ్చరిక హైదరాబాద్: రైతులకు ఒకేసారి మొత్తం రుణమాఫీ, వరంగల్ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) హెచ్చరించింది. రైతులకు మొత్తం రుణాన్ని మాఫీ చేయడంతోపాటు శ్రుతి, సాగర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నెల 10న రైతుల ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలను కోరింది. గురువారం మఖ్దూం భవన్లో రాష్ట్ర బంద్ పోస్టర్‌ను చాడ వెంకటరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వరవరరావు(విరసం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకి రాములు (రెవల్యూషనరీ సోషలిస్ట్‌పార్టీ), సంధ్య(పీఓడబ్ల్యూ), విమలక్క(అరుణోదయ) తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ విమర్శలు, నిరసనలను సహించే పరిస్థితులలో కేసీఆర్ లేరని, ఆయన పాలన దొరల పాలనను తలపిస్తోందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వరవరరావు విమర్శించారు. -
మాఫీ అంతా అయ్యేదాకా వదలం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రేపటి బంద్ వ్యూహంపై టీపీసీసీ ముఖ్యుల భేటీ హైదరాబాద్: పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ, ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 10న నిర్వహించనున్న బంద్ విజయవంతానికి అనురించాల్సిన వ్యూహంపై గురువారం టీపీసీసీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం నేతలతో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని విమర్శించారు. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రమని, ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్‌కు రైతుల కష్టాలు కన్పించడం లేదన్నారు. లక్ష కోట్ల బడ్జెట్లో రైతుల రుణమాఫీ చేయడానికి ఆయనకు చేతులు రావడం లేదని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 90 వేల కోట్లు, వాటర్ గ్రిడ్‌కోసం 30 వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు మూడేళ్లలో 75 వేల కోట్లు ఖర్చుచేస్తామంటున్నారు... కానీ, రైతుల కోసం కేవలం 8 వేల కోట్లు ఖర్చుచేయలేరా అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను తక్కువ చేసి చూపించే యత్నాలు జరుగుతున్నాయని, గ్రామసభలు ఏర్పాటుచేసి వాటిని నిర్దారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నింటితో కలసి ఈనెల 10న పెద్ద ఎత్తున బంద్ నిర్వహిసున్నట్టు ఉత్తమ్ చెప్పారు. సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పార్టీ నేతలు దానం నాగేందర్, ఎం.అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు భారీ ప్రదర్శన 10న జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఉత్తమ్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ తెలిపారు. బంద్ ఏర్పాట్లు, వ్యూహంపై గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఉత్తమ్ సమావేశమయ్యారు. -
రుణం.. భారమై..!!
- బోర్లు.. పంట సాగుకోసం రూ.2లక్షల మేర అప్పు - రుణమాఫీ మొత్తాన్ని వడ్డీకిందికి జమకట్టుకున్న బ్యాంక్ అధికారులు - దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతన్న - శాలిపేటలో విషాదం చిన్నశంకరంపేట: సాగును వదులుకోలేక అప్పు తెచ్చిమరీ బోర్లు వేశాడు కానీ, ఎందులోనూ చుక్క నీరు రాలేదు. సరేలే అని మొక్కజొన్న సాగుచేశాడు.. వర్షం లేక అదీ ఎండిపోయింది. మరోవైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంక్ అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు.. దీంతో కలత చెందిన ఓ రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన భల్యాల ఎల్లం(34) తన వాటాగా వచ్చిన రెండు ఎకరాల్లో వరిసాగు కోసం రూ.60వేలు అప్పు తెచ్చి ఆరు నెలల క్రితం రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీరు రాలే దు. దీంతో వరి సాగును విరమించుకుని మొక్కజొన్న సాగు చేశాడు. కానీ, వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోతుంది. పంట చేతికొచ్చే మార్గం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. మరో వైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు. అలాగే భూమి కంటే ఎక్కువ రుణం పొంది నట్లు పేర్కొంటూ బ్యాంక్‌లోని రూ.8 వేల ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా కలుపుకున్నారు. రెండో విడత రుణమాఫీ మొత్తాన్ని కూడా వారే పట్టుకున్నారు. దీంతో పంట సాగు కోసం మరో రూ.50వేలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద తెచ్చాడు. బ్యాంక్ రుణంతో కలిపి రూ.2లక్షలకు అప్పులు చేరుకున్నా యి. సాగుచేసిన పంట కూడా ఎండిపోతుండడంతో కలత చెందిన రైతు ఎల్లం సోమవారం ఉదయం తల్లి, భార్య మొక్కజొన్న చేను వద్దకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృ తుడి భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ నగేష్ పేర్కొన్నారు. -
ఒకే దఫాలో రుణమాఫీ అమలు చేయాలి: ఉత్తమ్
హుజూర్నగర్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఒకే దఫాగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకాన్ని ఒకేసారి అమలు చేయకపోవడం, రాష్ట్రంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 1300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం ఆ సంఖ్యను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తూ ప్రజలకు తాగునీరు లభించక, పశువులకు పశుగ్రాసం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. -
రుణమాఫీలో అవకతవకలు
{పభుత్వ సర్వేలో బట్టబయలు బోగస్ రైతులను తొలగించేందుకు ప్రయత్నాలు అందుకు బాధ్యులైన బ్యాంకులపైనా చర్యలు సొమ్ము రికవరీకి సర్కారు కసరత్తు హైదరాబాద్: రైతులకు మొదటి విడత విడుదల చేసిన రుణమాఫీ సొమ్ములో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం అందిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రుణమాఫీలో అవకతవకలపై జిల్లాల్లో ర్యాండమ్ సర్వేకు ఆర్థికశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 శాతం ఖాతాలను సర్వే చేసినట్లు తెలిసింది. సర్వే అనంత రం నివేదిక సమర్పించారు. అనేక అక్రమాలు జరిగినట్లు నివేదికలో నిర్ధారించారు. అయితే ఎంత మొత్తంలో అక్రమాలు జరిగాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. దీనిపై సర్కారు కసరత్తు చేస్తోంది. బ్యాంకులు, రైతులపై చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ. లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి, 35.82 లక్షల రైతు ఖాతాలను గుర్తించింది. మొదటి విడతగా గత ఏడాది రూ. 4,230 కోట్లను రుణమాఫీ కింద జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. బ్యాంకులు ఇప్పటివరకు రూ. 4,086.22 కోట్లను రైతుల ఖాతాల్లో మాఫీ అయినట్లు జమచేశాయి. సర్కారు రెండో విడతకింద ఈ ఏడాది రూ. 4,083 కోట్లు రెండు దఫాలుగా అందజేసింది. మొదటి విడతలో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనేక అక్రమాలు జరిగాయని సర్కారు భావించింది. దీనిపై నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో అక్రమాలు బట్టబయలయ్యాయి. అయితే అక్రమాలకు ప్రధాన కారణం బ్యాంకులేనని చెబుతున్నారు. బ్యాంకు రికార్డుల ఆధారంగానే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా రూపొందించిందని, కాబట్టి బ్యాంకు అధికారులే అక్రమాలకు బాధ్యులని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అందువల్ల సంబంధిత బ్యాంకు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. మరోవైపు బోగస్ రైతులకూ నోటీసులు జారీచేస్తారా లేదా చూడాల్సి ఉంటుందంటున్నారు. అలా నోటీసులిస్తే సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఎలాగైనా అక్రమంగా వెళ్లిన సొమ్మును రికవరీ చేయాల్సిందేనని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు బోగస్ రైతులనూ రుణమాఫీ జాబితాల్లోంచి తొలగిస్తారని అంటున్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
మాజీ మంత్రి సబితారెడ్డి శంషాబాద్ రూరల్ : ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సన్నద్ధం కావాలని కార్యకర్తలకు మాజీ మంత్రి పీ సబితారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మల్కారంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాయకుడు ఎండీ ఫరూఖ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి సబితారెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మోస పూరిత వాగ్దానాలతో కాలం గడుపుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని, రైతుల రుణమాఫీ పేరుతో మోసం చేస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్, మల్కారం సొసైటీ డెరైక్టర్ బూర్కుంట మహేష్, నాయకులు గోపాల్, సంజీవ, శేఖర్, సోను, లలిత్, ప్రకాష్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో వినయ్‌రెడ్డి, మహేందర్, రంజిత్, రాజు, ఇర్ఫాన్, వెంకటేష్, వినేష్‌రెడ్డి, హన్మంత్, మల్లేష్, మనివర్దన్రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, రాఘవేందర్, మధు, మల్లేష్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ..
హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలువురిని నియమిస్తూ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ర్ట పార్టీ కార్యదర్శులుగా కె.రుక్మారెడ్డి (రంగారెడ్డి), సయ్యద్ అలీ సయ్యద్ (హైదరాబాద్), సంయుక్త కార్యదర్శులుగా మహ్మద్ అష్వఖ్అలీఖాన్, జెఎల్ మేరీ, డాక్టర్ ఎం.వరలక్ష్మీ, మహ్మద్ అజ్మేరీ ఖురేషి, రాష్ట్రకార్యాలయంలో పదిజిల్లాల సమన్వయకర్తగా ఆరె లింగారెడ్డి(నల్లగొండ) నియమితులయ్యారు. అనుబంధ విభాగాలకు.. పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శిగా జాలా మహేశ్‌యాదవ్ (హైదరాబాద్ జిల్లా), రాష్ట్ర విద్యార్తి విభాగం కార్యదర్శిగా కుక్కల హనుమంతరెడ్డి (నల్లగొండ జిల్లా)లను నియమించారు. మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా ఇందిరారెడ్డి.. పార్టీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధానకార్యదర్శి సింగిరెడ్డి ఇందిరారెడ్డి (కరీంనగర్జిల్లా), కార్యదర్శులుగా కట్టా సంధ్యారాణి (కరీంనగర్జిల్లా), ఎస్కె బీబీజాన్ (హైదరాబాద్) నియమితులయ్యారు. -
16న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
గవర్నర్‌కు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్ తుమ్మల, జూపల్లి, లక్ష్మారెడ్డిలకు ఖాయమే మరో మూడింటికోసం ఆరుగురి పోటీ దాస్యం, ఇంద్రకరణ్లకు అవకాశం! చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్ నియామకం విప్‌లుగా గోవర్ధన్, సునీత, ఓదేలు కొత్తగా ‘పార్లమెంటరీ కార్యదర్శి’ నలుగురు లేదా ఆరుగురికి అవకాశం మిగతావారికి కార్పొరేషన్ పదవులు సీనియర్లలో అసంతృప్తి రాగాలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎంతోకాలం నుంచి నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించనున్నట్టు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి ఆయన సమాచారం అందించారు. వీటితోపాటు నామినేటెడ్ తదితర పదవుల భర్తీకి కూడా సీఎం సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్‌ను, విప్‌లుగా గంపా గోవర్ధన్ (కామారెడ్డి), గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి (ఆలేరు), నల్లాల ఓదేలు (చెన్నూరు) లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక మంత్రివర్గం విషయానికొస్తే, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వర్రావుకు చోటు ఖాయమని సీఎం సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలకూ బెర్తులు ఖరారయ్యాయి. మిగతా మూడింటికోసం కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి ఆజ్మీరా చందూలాల్, కొండా సురేఖ, దాస్యం వినయ్భాస్కర్ల్లో చందూలాల్‌కు ఎక్కువగా అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, కోవా లక్ష్మి పోటీపడుతుండగా ఇంద్రకరణ్‌కు చాన్సుందంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వకూడదని సీఎం భావిస్తున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా బలంగా విన్పిస్తోంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన తలసానికి మంత్రివర్గంలో చోటిస్తే సాంకేతిక సమస్యలు వస్తాయా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. చీఫ్‌విప్‌గా కొప్పుల తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్‌ను నియమిస్తున్నట్టుగా సీఎం కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ముగ్గురు విప్‌లు, మంత్రివర్గ విస్తరణతోపాటు, కీలక స్థానాల నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించింది. విస్తరణకు ముందుగానే కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీచేయనున్నట్టు తెలిపింది. కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను కూడా సీఎం తెరపైకి తెస్తున్నారు. విస్తరణలో అవకాశం దక్కని నలుగురు, లేదా ఆరుగురు ఎమ్మెల్యేల ఈ పదవుల్లో నియమించనున్నట్టు ప్రకటనలో ఆయన వెల్లడించారు. మొత్తంమీద సుమారు 20 మందికి పైగా కేబినెట్ హోదా కలిగిన పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జలగం వెంకట్రావు(కొత్తగూడెం), వి.శ్రీనివాస్‌గౌడ్(మహబూబ్‌నగర్) తదితరులతోపాటు నలుగురు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించనున్నట్లు సీఎం తెలిపారు. ఐదారుగురు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసంతృప్తిలో పాతకాపులు విస్తరణ ఖరారైన నేపథ్యంలో... మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు పలువురు తాజా పరిమాణాలపై తీవ్ర అసంతప్తితో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయని ఇప్పటిదాకా కేసీఆర్ చెబుతూ వచ్చినా, ఆచరణలో మాత్రం పదవులు అందని ద్రాక్షలే అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే ఆరుగురిలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నది ఒక్క సి.లక్ష్మారెడ్డి మాత్రమే. మిగతావారంతా మధ్యలో వచ్చినవారేనన్నది సీనియర్ల వాదన. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని కాదని, రాజకీయ అవసరాలకోసం వచ్చినవారికే అవకాశాలన్నీ ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్‌కు చీఫ్ విప్‌తో సరిపెట్టారు. ఈ పదవికి ఆయన విముఖంగా ఉన్నారు. ఉద్యోగసంఘాల నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పినా ఆచరణలో చూపించడం లేదని వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా తన సన్నిహితులతో ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్‌కు చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా కూడా మంత్రివర్గంలో చోటును ఆశించి నా వారికీ అవకాశం రావడం లేదు. పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మరికొందరంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాని తుమ్మలకు అవకాశమెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. విస్తరణ పూర్తయిన తర్వాత ఈ అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి అంటే... వీరు రాష్ట్ర సహాయ మంత్రి హోదాతో పనిచేస్తారు. సీఎం ఇష్టానుసారం వీరిని నియమించుకోవచ్చు. జీతభత్యాలు, వసతులు, ఇతర రవాణా సౌకర్యాల వంటివన్నీ దాదాపు మంత్రితో సమానంగానే ఉంటాయి. పంజాబ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఇప్పటికే ఉంది. సీఎం కేటాయించే శాఖలకు, సంబంధిత మంత్రి ఆధ్వర్యంలో వీరు బాధ్యులుగా పని చేస్తారు. మంత్రివర్గం పరిమాణం ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతానికి మించకూడదన్న నిబంధనకు ఈ పదవులు తూట్లు పొడుస్తున్నాయంటూ పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కోర్టుల్లో ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. ఇది రాజ్యాంగంలోని 164(1ఎ)కు విరుద్ధమని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో టీఆర్ఎస్కు 73 మంది (కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్సీపీల నుంచి చేరిన ఎమ్మెల్యేలతో కలిపి) ఉన్నారు. వీరిలో సీఎంతో కలిపి ఇప్పటికే 12 మంది మంత్రులుగా ఉన్నారు. విస్తరణ తర్వాత సలహాదారులు, పార్లమెంటరీ కార్యదర్శులు, కార్పొరేషన్ల చైర్మన్లతో కలిపి కేబినెట్ హోదాతో కూడిన పదవుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. కాగా, కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయించేందుకు సీఎస్ శనివారం సచివాలయం డి-బ్లాక్‌ను పరిశీలించారు. -
నేడు కేంద్ర కేబినెట్ తొలి విస్తరణ
-
నేడు కేంద్ర కేబినెట్ తొలి విస్తరణ
మరో 20 మందికి చోటు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం తెలంగాణ నుంచి దత్తాత్రేయ, ఏపీ నుంచి సుజనా చౌదరిలకు చోటు శివసేన సభ్యులు చేరే అవకాశం లేనట్టే! సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ తొలి విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దాదాపు మరో 20 మందికి చోటు దక్కనుంది. వీరు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిలకు చోటు ఖాయమైంది. గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ ఖరారైంది. అయితే, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న బీజేపీ-శివసేన సంబంధాలు విస్తరణ నేపథ్యంలో శనివారం రాత్రి మరింత దిగజారాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అపరిష్కృత సమస్యల కారణంగా కేంద్ర కేబినెట్లో శివసేన సభ్యుల చేరికకు చివరి నిమిషంలో ఆటంకాలు తలెత్తాయి. సేన నుంచి ఎవరూ కేబినెట్లో చేరే అవకాశం లేనట్లు సంకేతాలు వెలువడ్డాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత జరుగుతున్న కేబినెట్ తొలి విస్తరణలో కొంతమంది మంత్రులకు కేబినెట్ హోదా కల్పించే అవకాశముంది. ఇద్దరు ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆరుగురికి పైగా మంత్రులు ఒకటికంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్నారు. ప్రమాణానికి ముందు విందు.. దత్తాత్రేయ, సుజనా చౌదరి, బాబుల్ సుప్రియో (పశ్చిమ బెంగాల్) తదితరులను కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు మోదీ స్వయంగా వారికి ఫోన్లు చేశారని సమాచారం. మిగతా వారికి ప్రధానమంత్రి కార్యాలయం ఫోన్లు చేసింది. కొత్త మంత్రులకు, కేబినెట్ హోదా పొందనున్న వారికి ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ తన అధికార నివాసంలో తేనీటి, అల్పాహార విందు ఇవ్వనున్నారు. విందులోనే మంత్రుల శాఖలను ఆయన వెల్లడి స్తారని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 45 మంది ఉన్నారు. వీరిలో ప్రధాని సహా 23 మంది మంత్రి కేబినెట్ మంత్రులు కాగా, 22 మంది సహాయ మంత్రులు. సహాయ మంత్రుల్లో 10 మంది స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్తమంత్రులను కలుపుకుంటే మంత్రుల సంఖ్య దాదాపు 65కు చేరుతుంది. రాష్ట్రాలకు విస్తృత ప్రాతినిధ్యం.. ప్రతిభావంతులకు స్థానం, రాష్ట్రాలకు విస్తృత ప్రాధాన్యం, ప్రస్తుత మంత్రులకు అదనపు శాఖల భారాన్ని తప్పించడం లక్ష్యంగా మోదీ కేబినెట్లో మార్పుచేర్పులు చేపట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల వారికి విస్తరణలో చోటు దక్కనుంది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అదనంగా నిర్వహిస్తున్న రక్షణ శాఖను చేపట్టనున్న పారికర్ గోవా నుంచి తొలి కేబినెట్ మంత్రి కానున్నారు. ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశముంది. బీజేపీ ముస్లిం ముఖంగా పేరున్న ముక్తార్ అబ్బాస్ నక్వీ 15 ఏళ్ల తర్వాత, రాజీవ్ ప్రతాప్ రూడీ పదేళ్ల తర్వాత తిరిగి కేబినెట్లోకి రానున్నారు. బొగ్గు కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన బీజేపీ ఎంపీ హంస్రాజ్ అహిర్(మహారాష్ట్ర)కు బొగ్గు శాఖ దక్కే అవకాశముంది. గీతేతో భేటీకి మోదీ నిరాకరణ! బీజేపీ-శివసేన మధ్య పొరపొచ్చాలు తీవ్రమయ్యాయి. శివసేన రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, ఆ పార్టీ సీనియర్ నేత సురేశ్ ప్రభుకు చోటు దక్కే అవకాశముందని వార్తలు రావడం తెలిసిందే. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణపై సేన ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ గీతే శనివారం రాత్రి మోదీని కలసి మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆయనను కలవడానికి మోదీ నిరాకరిచారని సమాచారం. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంప్రదింపుల కోసం గీతేను ముంబైకి పిలిపించుకున్నారు. దీంతో శివసేన నుంచి ఎవరూ కొత్తగా మంత్రి పదవి చేపట్టే అవకాశం కాని, ప్రమాణ కార్యాక్రానికి హాజరయ్యే అవకాశం కానీ కనిపించడం లేదు. తాను మోదీని కలవలేకపోయానని గీతే విలేకర్లకు చెప్పారు. తమ పార్టీ నుంచి కొత్త ప్రాతినిధ్యంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఈ నెల 12 అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనేలోపు ఆ ప్రభుత్వలో తమను చేర్చుకోవాలని ఉద్ధవ్ డిమాండ్ చేయడం, దీనిపై ఇంకా చర్చలు సాగుతుండడం తెలిసిందే. -
రుణమాఫీ అంటే రీషెడ్యూలా..?
రైతులను మోసం చేస్తే సహించం ప్రభుత్వమే రైతుల డాక్యుమెంట్లు, నగలు విడిపించాలి ఉప్పులేటి కల్పన పామర్రు : రైతులకు రుణాలు మాఫీ చేస్తారో లేదో చెప్పకుండా రీషెడ్యూలింగ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్రామాలాడుతున్నారని పామర్రు ఎమ్మెల్యే, శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తున్నానని రైతులను వంచించారని, నెల గడుస్తున్నా ఈ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై టీడీపీ ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అన్ని హామీలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటుంటే ఇక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని చెప్పారు. వ్యవసాయ రుణాలు పూర్తి మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల ఆంక్షలు పెడుతూ రైతులను నిలువునా మోసం చేస్తోందని కల్పన ఆరోపించారు. ముఖ్యమంత్రితో సహా ఆర్థిక, వ్యవసాయశాఖ మంత్రులు రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకడం లేదని, అధిక వడ్డీకి అప్పులు చేయాల్సివస్తోందన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు రీషెడ్యూల్ దిశగా ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వమే బ్యాంకులకు హామీ ఇచ్చి రైతుల తాకట్టు పెట్టిన భూమి డాక్యుమెంట్లు, నగలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలు తీరేలా పూర్తిగా 10 టీఎంసీల నీరు విడుదల య్యేలా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు శ్రద్ధ చూపాలని కోరారు. రైతులకు అన్యాయం చేస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని వారితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నత్తారవి, కారపాటి కోటేశ్వరరావు, గారపాటి సతీష్, విమలారావు, శ్రీపతి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బీమాపై వేటు... వడ్డీకి రిబేటు
పంట రుణమాఫీ తప్పుకునేందుకు కొత్త ఆఫర్లు అప్పు చెల్లిస్తే వడ్డీ రిబేటు ఇస్తామంటూ బేరం పంట బీమా వర్తించదంటూ నోటీసులు లబోదిబోమంటున్న రైతులు ఓ మారు అతివృష్టి, మరోమారు అనావృష్టి, ఇంకోమారు ప్రభుత్వ అనాలోచిత విధానాలతో తీవ్ర నష్టాలపాలవుతున్న రైతుల పాలిట బ్యాంకర్ల నోటీసులు గోరుచుట్టుపై రోకటిపోటులా వెంటాడుతున్నాయి. అసలే రుణమాఫీ విషయంలో తీవ్ర అయోమయానికి నిత్య గందరగోళానికి గురౌతున్న రైతన్నను ప్రభుత్వం, బ్యాంకర్లు ప్రకటిస్తున్న కొత్త ఆఫర్లు మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గుడ్లవల్లేరు :కొత్త ప్రభుత్వం హాయాంలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీతో సహా సరికొత్త పథకాలు వర్తింపజేస్తారనుకుంటే రైతుల్ని ముంచేసే అర్ధంకాని ఆఫర్లు ఇస్తూ రుణమాఫీనుంచి తప్పించుకునేందుకు చూడడం చంద్రబాబు నైజాన్ని మరోమారు చాటిందని రైతులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 30వ తేదీ లోగా పంట రుణాల్ని చెల్లించేసిన రైతులకు వడ్డీ రిబేటు ఇస్తామన్న కొత్త ఆఫర్‌తోపాటు 2013 ఆగస్టు ఒకటవ తేదీ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు పంట బీమా వర్తించదని వివరిస్తూ కౌతవరం ఆంధ్రాబ్యాంకు నోటీసు బోర్డులో ప్రకటించారు.అలాగే స్థానిక పీఏసీఎస్ నుంచి కూడా రుణమాఫీ హామీని తప్పించుకునే విధంగా కొన్ని కరపత్రాల్ని రైతుల ఇంటింటికీ పంచిపట్టారు.దీనికి సమ్మతిస్తేనే, పంట రుణాలకు ముందుకు రావాలంటూ ఆ నోటీసులో ప్రకటించడం రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. చంద్రబాబు విధానం చూస్తుంటే 2003 నాటి పాలన గుర్తుకు వస్తుందని బాధిత రైతులంటున్నారు. వ్యవసాయం దండగ అన్న ఆయన ఆ జ్ఞాపకాలకు తిలోదకాలివ్వలేకే తొలి సంతకంలోనే నైజాన్ని చాటుకున్నారని విమర్శిస్తున్నారు. కళ్ల ముందు ఖరీఫ్ సాగు కనబడుతుందని, ఇంకా ఎన్ని రోజుల తర్వాత రుణమాఫీ ప్రకటిస్తారని అడుగుతున్నారు. కాగా గుడ్లవల్లేరు మండలంలోని ఒక్క కౌతవరం ఆంధ్రాబ్యాంకు పరిధిలోనే 30మంది రైతులకు పంట రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దాదాపు రూ.12లక్షల మేరకు బంగారు నగల మీద సాగుకు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాల్ని వెంటనే చెల్లించకపోతే 28వ తేదీన రుణగ్రస్తుల బంగారు నగల్ని వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీచేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి నోటీసులు ఇవ్వాల్సిందిగా తమకు ఆదేశాలు వచ్చినందునే నోటీసులు ఇచ్చామని కౌతవరం ఆంధ్రాబ్యాంకు మేనేజరు ప్రసాద్ చెబుతున్నారు. పొలాల పాసు పుస్తకాల నకలు పెట్టి రుణాలు తీసుకోని బంగారు నగల రుణగ్రస్తుల్ని వ్యాపారులుగా గుర్తించి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. రెండెకరాలు చేస్తున్నా... వ్యవసాయానికే రుణం తీసుకన్నా. రూ.79వేలు సాగుకు ఖర్చయ్యింది. ఇపుడు మేనేజరు పొలం కాగితాలు పెట్టలేదు కాబట్టి అప్పు కట్టాల్సిందేనని అంటున్నారు. మాకు రుణమాఫీ చేయకుండా బడారైతులకే ఆ పథకం వర్తింపజేచేలా చేసేలా ఉన్నారు. - షేక్ అల్లాబక్షు, కౌతవరం రైతు రోజుల్లో చెల్లించమంటే ఎలా? నాలుగు రోజుల్లో పంట రుణం చెల్లించమని నోటీసులిస్తే, ఎలా చెల్లించగలం. మూడెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా. నగలు తీసుకెళ్లకపోతే ఈ నెల 28వ తేదీన బహిరంగ వేలం వేసేస్తానని బ్యాంకువారు అంటున్నారు. రుణమాఫీ చేసేంతవరకూ రుణాలు చెల్లించనే చెల్లించం. - ఈడె చలపతిరావు, కౌతవరం రైతు మహిళా రైతులెంతమంది.... ఐదెకరాల పొలాన్ని సాగు చేస్తున్నా నన్ను రైతును కాదంటే ఎలా? రైతును కాదంటూ బంగారం అప్పు కట్టమని నోటీసులివ్వడం దారుణం. మహిళా రైతులంటున్నారు. నూటికి అలాంటి రైతులు ఎంతమంది ఉంటారు. రుణమాఫీ హామీ తప్పుకునేందుకే ఇలాంటి చేతకాని సాకులు వెతుక్కుంటున్నారు. - బోట్ల జగన్మోహనరావు, కౌతవరం రైతు -
అసలుకే ఎసరు!
డ్వాక్రాలో పొదుపు సొమ్ము వడ్డీలకే జమ బంగారం వేలం వేస్తామని కృత్తివెన్ను ఇండియన్ బ్యాంకు నోటీసు నీటి మీద రాతలుగా మారుతున్న చంద్రబాబు హామీలు డ్వాక్రా రుణమాఫీని నమ్ముకుంటే మహిళలకు బ్యాంకు ఖాతాల్లో పొదుపు మొత్తం గల్లంతయ్యే విధంగా కనబడుతోంది. చంద్రబాబు హామీని నమ్మి మూడు నెలలుగా వాయిదాలు చెల్లించని వారి సొమ్మును బ్యాంకర్లు నేరుగా పొదుపు ఖాతా నుంచి జమ చేసుకుంటున్నారు. దీంతో మహిళలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. మరోపక్క బంగారం రుణాలు తీసుకున్న వ్యవసాయదారుల పరిస్థితీ గందరగోళంగా ఉంది. రుణమాఫీ హామీపై ప్రభుత్వం నేటికీ స్పష్టత ఇవ్వలేదు.. బ్యాంకర్లు మాత్రం బంగారం రుణాలపై వేలం నోటీసులు ఇస్తున్నారు. గుడ్లవల్లేరు : ఎన్నికల్లో రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా ఆడపడుచుల రుణాలు మాఫీ చేసి, అప్పుల వెతల నుంచి విముక్తుల్ని చేస్తానని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అమలు ప్రక్రియలో కమిటీ పేరిట జాప్యం చేస్తుండటంతో రైతులు, డ్వాక్రా మహిళలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుత ప్రభుత్వ లెక్కల ప్రకారం డ్వాక్రాలో 5.50 లక్షల మంది మహిళలు ఉన్నారు. 55 వేల గ్రూపుల వారు రూ.930 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. బాబు హామీతో ఎన్నికల ముందు నుంచి రుణాలు రద్దవుతాయని చాలామంది మహిళలు కనీసం పొదుపు కూడా చెల్లించటం లేదు. మరోపక్క వారు తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో బకాయిలు మూడు నెలలు దాటిన డ్వాక్రా మహిళల ఖాతాల్లోని పొదుపు సొమ్మును బ్యాంకర్లు వడ్డీల కింద జమ వేసేసుకుంటున్నారు. ప్రతి నెలా ఐదోతేదీ లోగా రుణాలు చెల్లించకపోతే వడ్డీ రాయితీలు వర్తించవనే విషయం తెలిసినా చంద్రబాబు రుణమాఫీ హామీతో మహిళలు ఒకింత ధీమాగా ఉన్నారు. రుణాలు రద్దయ్యాక ఇంక రాయితీలతో పనేమిటనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమైంది. తీరాచూస్తే బ్యాంకర్లు పొదుపు నుంచి బకాయిలను జమ చేసుకుంటుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మాఫీపై నోరు విప్పని ప్రభుత్వం... రుణాల రద్దుపై బాబు ప్రభుత్వం నోరు విప్పకపోవటంతో రుణాలు చెల్లిద్దామన్నా తడిసి మోపెడైంది. ఎన్నికల ముందు నుంచి బకాయిలు అధికంగా పెరిగిపోయాయి. రుణాలు చెల్లించాలంటే మెడలో పుస్తెలు తాకట్టు పెట్టుకోవలసిన దుస్థితి కొన్ని కుటుంబాల్లో చోటు చేసుకుంది. దిక్కు తోచని స్థితిలో డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఇక రుణాల రద్దుపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని ఆందోళనకు గురవుతున్నారు. రుణాల రద్దుపై ఆదేశాలు రాలేదు : డీఆర్డీఏ పీడీ ఈ విషయమై జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ పి.రజనీకాంతారావును వివరణ కోరగా జిల్లాలో ఆరువేల గ్రూపులు కొద్ది నెలలుగా రుణాలు చెల్లించటం లేదన్నారు. కొత్త ప్రభుత్వంలో రుణాల రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఇప్పటి వరకూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు నెలవారీ వాయిదాలు నిలిపివేసిన గ్రూపులు వెంటనే చెల్లించాలని మహిళలను కోరారు. బాబూ.. మాట పోషించుకో మాట పోషించుకోలేనపుడు ఎన్నికల్లో చంద్రబాబు డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానని ఎందుకు హామీ ఇచ్చారు? రుణాల్ని రద్దు చేయటంలో తాత్సారం చేస్తూ మహిళల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. ఆయన హామీని నమ్మి బ్యాంకు ఖాతాలకు రుణ బకాయిలు జమచేయకపోవడం వల్ల పొదుపు మొత్తం నుంచి రూ.3 వేలు ఈ నెలలో బ్యాంకు వారు జమ చేసుకున్నారు. - చిట్టూరి రంగామణి, చిత్రం వీవో అసిస్టెంట్ బాబు కట్టొద్దంటేనే చెల్లించలేదు... రుణాలు చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే అప్పులు రద్దు చేయిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పటం వల్లనే రుణ వాయిదాల్ని మా గ్రూపు చెల్లించలేదు. కానీ మా గ్రూపు పొదుపులో రూ.3 వేలను బ్యాంకు వారు జమ చేసుకున్నారు. రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చిన బాబు తన సొంత నిధులతో అయినా రుణమాఫీ చేయాల్సిందే. - గోన ధనలక్ష్మి, చిత్రం డ్వాక్రా మహిళ బకాయిలు చెల్లించని బంగారం వేలమే కృత్తివెన్ను : ‘ఆడపడుచులారా కంగారు పడకండి.. మరికొన్ని రోజులు ఆగితే మేము అధికారంలోకి వస్తాం.. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం మీ ఇళ్లకు చేర్చుతాం’ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని లబోదిబోమంటున్నారు కృత్తివెన్ను మండల ప్రజలు. రుణమాఫీలో బంగారంపై ఉన్న బకాయిలు మాఫీ అవుతాయనుకున్న వారికి స్థానిక ఇండియన్ బ్యాంకు అధికారులు బకాయిలు చెల్లించకుంటే బంగారం వేలం వేస్తామని నోటీసు జారీ చేయడమే దీనికి కారణం. ఈ ప్రకటనతో బకాయిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కృత్తివెన్ను ఇండియన్ బ్యాంకులో బంగారంపై బాకీలు ఉన్న 65 మంది పేర్లను మేనేజరు వి.శ్రీనివాస్ నోటీసులో ప్రకటించారు. వీరి వద్ద నుంచి రూ.28.68 లక్షలు బకాయిలు ఉన్నాయని, త్వరలో చెల్లించని పక్షంలో పై అధికారుల సూచనలతో వేలం వేయనున్నామని పేర్కొన్నారు. రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమకు మొండిచేయే మిగలనుందా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. -
బ్యాంకులకుబకాయిల బెంగ
నిలిచిపోయిన టర్నోవర్ భారీగా పేరుకుపోయిన రుణాలు రైతాంగంలో రుణమాఫీపై చర్చ కోటి ఆశల్లో అన్నదాత విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ స్తంభించింది. రుణమాఫీ ప్రచారంతో గత నాలుగు మాసాలుగా రుణాల రికవరీ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీపై పట్టణాలు, పల్లెల్లో వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో ఆచరణ సాధ్యం కాదని బ్యాంకర్లు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల నాయకులు రుణమాఫీ హామీ తప్పక ఇస్తారనే భావనతో ఈ ఏడాది రైతులు జనవరి నుంచే బ్యాంకు రుణాలను చెల్లించటం మానేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల బ్యాంకుల్లో లావాదేవీలు పెద్ద ఎత్తున స్తంభించాయి. వ్యవసాయ బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదారొందల కోట్ల రూపాయల రుణాలు టర్నోవర్ నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేస్తుందని రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఇలా... గతంలో దేవీలాల్ ప్రభుత్వం రైతుకు రూ.10 వేల లోపు రుణాలను మాఫీ చేసింది. ఆ మొత్తం దేశ వ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచన మేరకు రూ.78 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించింది. లక్ష రూపాయలలోపు బకాయి ఉన్న రైతులకు రుణాలను రద్దు చేసింది. దీంతో వరుసగా మూడేళ్ల పాటు బకాయి పడిన రైతుల పంట రుణాలు, బంగారం రుణాలు, ఇతర చిన్నతరహా బకాయిలు మాఫీ అయ్యాయి. పేరుకుపోయిన రూ.500 కోట్ల బకాయిలు... జిల్లాలో 425 సహకార బ్యాంకు శాఖలు ఉన్నాయి. 501 వాణిజ్య బ్యాంకులు, 54 సప్తగిరి గ్రామీణ బ్యాంకులు, 50 కేడీసీసీ బ్యాంకు బ్రాంచిలు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి ఐదారు వందల కోట్ల రూపాయల బకాయిలు జిల్లాలో పేరుకుపోయినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి రైతులు రుణాలు చెల్లించకపోవటం, పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, బంగారం రుణాలు, భూ అభివృద్ధి పథకం కింద ఇచ్చిన రుణాలు భారీగా పేరుకుపోయాయి. ఈ మార్చి నాటికి జిల్లాలో అన్ని బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దాదాపు సహకార బ్యాంకులన్నింటా రుణాల చెల్లింపు నిలిచిపోయింది. పాత బకాయిలు చెల్లించక పోవటంతో రైతులకు వచ్చే ఖరీప్‌లో తిరిగి పంట రుణాల పంపిణీ ప్రశ్నార్థకమేనని బ్యాంకర్లు అంటున్నారు. పాత బకాయిలు రద్దు చేస్తారా, లేకుంటే గత మార్చి వరకు తీసుకున్న అన్ని రకాల రుణాలను రద్దు చేస్తారా అనే విషయమై ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. రుణమాఫీ వ్యవహారంతో ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి. నిలిచిన డ్వాక్రా రుణాలు... డ్వాక్రా సంఘాలు కూడా ప్రతినెలా చెల్లించే రుణాలను నిలుపుదల చేశాయి. జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల డ్వాక్రా వాయిదాలు కూడా గత మూడు నెలల నుంచి చెల్లించటం లేదని బ్యాంకర్లు తెలిపారు. డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ పొదుపు డబ్బు మాత్రమే చెల్లించి, తీసుకున్న రుణాలను జమ కట్టడం లేదని వారు పేర్కొన్నారు. అన్ని రకాల రుణాలు జమ పడకపోవటంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు బకాయిలపై ఒత్తిడి అధికంగా వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీని అమలు చేయటంలో సాధ్యాసాధ్యాలపై కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. -
విస్తరిస్తున్న మహమ్మారి!
అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కడంలేదన్న ఆందోళనలు అరణ్యరోదన లవుతుంటే... దాని విషఫలాలు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. ప్రతి ఏడాదీ మన దేశంలో కొత్తగా దాదాపు పది లక్షలమంది పౌరులు కేన్సర్ బారినపడుతుంటే దాదాపు ఏడు లక్షల మంది వ్యాధిగ్రస్తులు మరణిస్తున్నారని తాజా గణాంకాలు వెల్లడి స్తున్నాయి. వీరిలో అత్యధికులు 50 ఏళ్లలోపువారే. ఈ సంఖ్య 2035 నాటికి రెట్టింపవుతుందని అంచనా. రాచపుండుగా, రాచకురుపుగా పేరుబడి ఎవరికో, ఎక్కడో వచ్చిందని చెప్పుకునే ఈ వ్యాధి ఇప్పుడు మన ఇరుగుపొరుగునూ, మన పరిచయస్తులనూ, మన సన్నిహితు లనూ తాకిందని తరచుగా వినబడుతోంది. ఆ వ్యాధిని గుర్తించడానికి అవసరమైన పరీక్షలైనా, అందుకవసరమైన ప్రాథమిక సౌకర్యాలైనా పూర్తిగా అందుబాటులోకి రాకుండానే ఇది తన దోవన తాను విస్తరిం చుకుంటూ పోతున్నదని అర్ధమవుతుంది. ఈ వ్యాధి గురించి ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడేందుకు, దానిపై చర్చించేందుకు చాలామంది భయపడుతుంటారు. కారణం అవగాహనలేమి కావొచ్చు...అపోహలు కావొచ్చు. కానీ ప్రభుత్వాలు వీటిని పట్టించుకుని, సరిచేస్తున్న దాఖలాలు కనబడవు. మన దేశంలో ఇప్పటికీ కేన్సర్ చికిత్స మెజారిటీ ప్రజలకు అందుబాటులో లేదు. దానికయ్యే తడిసిమోపెడు వ్యయాన్ని జనం భరించే స్థితిలో లేరు. 95 శాతం వైద్యకళాశాలల్లో కేన్సర్ గుర్తింపు, నివారణకు సంబంధించిన సమగ్ర వ్యవస్థలు లేవు. కేన్సర్ వైద్య నిపుణులు, శస్త్ర చికిత్స నిపుణుల సంగతి చెప్పనవసరమే లేదు. కొత్తగా బయటపడే 5,000 కేసులను చూడటానికి ఒక్క వైద్య నిపుణుడు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు పూర్తిగా శూన్యం. దేశ జనాభా 120 కోట్లు దాటగా, కేన్సర్ నిపుణుల సంఖ్య వేలల్లో మాత్రమే ఉంటున్నది. నిజానికి కేన్సర్‌ను ముందుగా గుర్తించడానికైనా, దాన్ని నివారించడానికైనా ఎన్నో అవకాశాలుంటాయని నిపుణులు చెప్పే మాట. ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని చెబుతారు. ఈ వ్యాధిని మృత్యువుకు మారుపేరుగా పరిగణించాల్సిన అవసరమే ఉండదంటారు. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయినుంచి వైద్య సేవలు అందుబాటులో ఉండి, సకాలంలో గుర్తించగలిగితేనే ఇది సాధ్యం. ఇందుకు అవసరమైన విధాన రూపకల్పనలో పాలకులు విఫలమవుతుండటంవల్ల పరిస్థితులు తల్లకిందులవుతున్నాయి. దేశవ్యాప్తంగా కేన్సర్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటుచేయబోతున్నట్టు నిరుడు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ. 4,700 కోట్లు వ్యయమయ్యే పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పింది. కానీ, అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. కేన్సర్ చికిత్సలో కీలకపాత్ర పోషించే ఔషధాలను గుర్తించి, వాటి ధరలను నియంత్రించడం లేదా ఆ ఔషధాలను తామే చవగ్గా అందుబాటులోకి తీసుకురావడంవంటి చర్యల గురించి పాలకులు దృష్టిపెట్టడంలేదు. అసలు కేన్సర్ ఎలా వస్తుంది, ఎందుకొస్తుందన్న విషయంలో అవగాహన లేమి ఆ వ్యాధి విస్తరణకు పరోక్షంగా కారణమవుతోంది. మంచి జీవనశైలి, శరీరానికి తగిన వ్యాయామం, తగినంత బరువుం డేలా చూసుకోవడం, టుబాకో ఉత్పత్తులు, మద్యంవంటివాటికి దూరంగా ఉండటంలాంటివి అమలుచేయగలిగితే చాలా కేన్సర్లను నివారించవచ్చంటారు. ఇవన్నీ మన ఆచరణవల్ల సాధ్యమయ్యేవి. కానీ మన ప్రమేయంలేని, మన అదుపులోలేని అనేకానేక పరిణామాలు కూడా కేన్సర్‌ను పెంచి పోషిస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం, పంటపొలాల్లో అపరిమితంగా రసాయనాల వాడకంవంటివి సగటు మనిషి తినే తిండిని, పీల్చేగాలిని, తాగే నీటినీ విషతుల్యం చేస్తున్నాయి. అడవులను సక్రమంగా పరిరక్షించగలిగితే నిత్యమూ గాలిలో కలిసే వేల టన్నుల హానికారకాలను వృక్షాలు పీల్చుకుని మనకు ఆరోగ్యకరమైన ఆక్సిజెన్‌ను అందిస్తాయని పర్యావరణవేత్తలంటారు. కానీ, ఏటా విడుదలయ్యే కాగ్ నివేదికలు చూస్తే అడవులు తరిగిపోతున్న వైనం కళ్లకు కడుతుంది. అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, వాటి పరిరక్షణకు కేటాయించే నిధుల వినియోగం అంతంతమాత్రంగా ఉంటుంటే అభివృద్ధి పేరిట వాటిని తెగనరికే సంస్కృతి పెరుగుతోంది. ఒక తీరూ తెన్నూ లేకుండా ఏటా రోడ్లపైకొచ్చే మోటారు వాహనాలవల్ల కూడా కాలుష్యం కమ్ముకుంటోంది. దేశంలో 90 శాతం నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రెండేళ్లక్రితం చెప్పింది. అపరిమితంగా వాడే ప్లాస్టిక్ సంచులు కూడా ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయని లెక్కేసి వాటి ఉత్పత్తి, వినియోగంపై ఎన్నో ఆంక్షలు విధించారు. కానీ, అమలు విషయంలో నిరాశే మిగులుతోంది. యాంటిబయాటిక్స్ అపరిమిత వాడకం కూడా కేన్సర్ కారకాల్లో ఒకటిగా గుర్తించారు. నిపుణులు ఎంతో పోరాడాక ఇలాంటి 24 ఔషధాలను వైద్యులు సూచించకుండా అమ్మకూడదని నియంత్రణ విధించారు. అయినా ఇంకా ఈ కేటగిరీలోకి తీసుకురావలసిన ఔషధాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ఒక చిన్న రక్తపరీక్షతో కేన్సర్‌ను పసిగట్టే పద్ధతులు ఆచరణలోకొస్తుంటే దానికి పోటీగా ప్రజారోగ్య పరిరక్షణలో పాలకుల నిర్లక్ష్యమూ... ప్రకటించిన పథకాలనైనా సక్రమంగా అమలు చేయడంలో చూపే అలసత్వమూ ఆ వ్యాధి వేగంగా విస్తరించడానికి కారణమవుతోంది. తాజా నివేదికైనా పాలకుల కళ్లు తెరిపించాలి. ఈ ప్రాణాంతక వ్యాధికి దారితీస్తున్న పరిస్థితులను అదుపు చేయడంతోపాటు దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య నిపుణులను, సౌకర్యాలను అందుబాటులోకి తేవాలి.