డబల్‌రోడ్డుగా మారునున్న ఇటిక్యాల రోడ్డు
ఇటిక్యాల: నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రోడ్ల విస్తరణ అంశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లేఖ రాసినట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. వనపర్తి జిల్లాకు వెళ్లేందుకు అలంపూర్ ,గద్వాల్ నియోజకవర్గాల నుంచి రవాణ సౌకర్యలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు.
ఇటిక్యాల: నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రోడ్ల విస్తరణ అంశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లేఖ రాసినట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. వనపర్తి జిల్లాకు వెళ్లేందుకు అలంపూర్ ,గద్వాల్ నియోజకవర్గాల నుంచి రవాణ సౌకర్యలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఐజ మండల కేంద్రం నుంచి విఠలాపురం, మల్లెందొడ్డి, ఎల్కూరు, ఉదండాపురం, ఇటిక్యాల మండల కేంద్రం మీదుగా జింకలపల్లి వీఎస్టీ కంపినీ స్టేజీ 44 నంబర్ జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిరంజన్ రెడ్డి మంత్రికి రాసిన లేఖలో వివరించినట్లు అలంపూర్ టిఆర్‌ఎస్ నియోజకవర్గం మంద శ్రీనా«ద్, ఐజ మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ఇటిక్యాల మండల నాయకులు జయసాగర్ ,రాంరెడ్డి ,మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. విస్తరణ వల్ల వడ్డేపల్లి , ఐజ, ఇటిక్యాల, గద్వాల్ నియోజకవర్గంలోని మల్దకల్ మండల ప్రజలు వనపర్తికి చేరేందుకు 20 కిలోమీటర్ల్ దూరం తగ్గుతుందని వారు తెలజేశారు. ప్రస్తుతం ఎన్‌హెచ్ 44 జింకలపల్లి వీఎస్టీ కంపెనీ నుంచి ఇటిక్యాల మండల నుంచి మంజూరు అయ్యిందని తెలిపారు. త్వరలోనే రోడ్ల విస్తరణ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.