వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి
పాలసముద్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుగ్లక్ పాలనను తలపిస్తున్నారని, ఎన్నికల సమయంలో పదవీ కాంక్షతో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతున్నందుకు పశ్చాత్తాపపడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శనివారం పాలసముద్రంలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే.శివప్రకాష్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చంద్రబాబుకు దిక్కు తెలియడం లేదన్నారు. అవినీతి సొమ్ము కోట్లాది రుపాయలు ఎరచూపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రైతు, చేనేత, డ్వాక్రా రుణమాఫీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ముద్రగడ దీక్ష చేస్తుంటే తీవ్రవాదిని అరెస్టు చేసిన రీతిలో అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు.
ఆయన కుటుంబ సభ్యులను, మద్దతుదారులను పోలీసులు తరిమి కొట్టడం చూస్తే నియంతపాలనలో ఉన్నామా అని అని పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్వేటినగరం మం డల అధ్యక్షుడు శ్రీరాములునాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ఎస్‌ఆర్‌పురం జెడ్పీటీసీ మా జీ సభ్యుడు ప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సుబ్రమణ్యరెడ్డి, ఉపాధ్యక్షుడు అన్బ్‌లగన్, పద్మనాధనాయు డు, పార్టీ ప్రధాన కార్యదర్శి రమణమూర్తినాయుడు, ప్రచార కార్యదర్శి గాలి మహేష్ బాబు, మాజీ మం డల అధ్యక్షుడు విజయరాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు ధనంజయులు, సర్పంచ్ ఆండాలు రవి పాల్గొన్నారు