ఫ్రీడమ్ విస్తరణకు ప్రణాళికలు - కేరళ, తమిళనాడులో ప్రవేశించడానికి సన్నద్ధం.. | Sunflower Oil Brand Freedom Oil Plans To Expand In Kerala And Tamil Nadu In 2024, See More Details Inside - Sakshi
Sakshi News home page

ఫ్రీడమ్ విస్తరణకు ప్రణాళికలు - కేరళ, తమిళనాడులో ప్రవేశించడానికి సన్నద్ధం..

Published Fri, Dec 1 2023 12:52 PM | Last Updated on Fri, Dec 1 2023 1:40 PM

Freedom Oil to Expand To Kerala And Tamil Nadu - Sakshi

BRAND SUTRA: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ 'ఫ్రీడమ్'.. 2024లో బ్రాండ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశిస్తుందని, ఆ తరువాత మహారాష్ట్రలో అరంగేట్రం చేయనున్నట్లు సేల్స్ అండ్ మార్కెటింగ్, జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా SVP పి చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు.

కంపెనీ అతి పెద్ద నగరాల్లో ప్రవేశించిన తరువాత మరిన్ని ఫ్రీమియం ఆఫర్ల కోసం ప్లాన్ చేస్తున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఈయన 2009లో బ్రాండ్ పేరు రూపొందించడానికి ముందు, చాలా కాలం ఎడిబుల్ ఆయిల్స్ విభాగంలో ఉన్నారు. ఆ తరువాత సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ 'ప్రదీప్ చౌదరి' బృందం సహకారంతో బ్రాండ్ వేగంగా స్థిరపడింది.

2010లో బ్రాండ్ దాని స్వంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. దక్షిణ భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల రెడ్డి బృందం ఇతర ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరువాత ఒరిస్సా, కర్ణాటకలో బ్రాండ్ ప్రారంభమైంది. ఆ తరువాత చత్తీస్‌గఢ్‌లో కూడా ప్రారంభమైంది. 2024లో తమిళనాడు, కేరళలో ప్రారంభించనున్నట్లు చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. 

బ్రాండ్ ప్రారంభమై దాదాపు 13 సంవత్సరాలు కావొస్తోంది. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు, రానున్న రోజుల్లో మరింత వృద్ధి పొందటానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఇది కేవలం మార్కెటింగ్‌ మాత్రమే కాదు, సరఫరా అవసరాలను నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా.

ప్రారంభంలో కొంత మందకొడిగా ఉన్నప్పటికీ 2014 - 15 నాటికి దేశంలోని వివిధ రాష్ట్రలో నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలిచింది. ఆ తరువాత 2022 నాటికి జాతీయ స్థాయిలో కూడా పొందగలిగినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత మార్కెట్‌కు అవసరమైన 2.2 మిలియన్ టన్నులలో దాదాపు 95 శాతం దిగుమతి ఉంది. ఇందులో 22 నుంచి 23 శాతం ఫ్రీడమ్ ఉండటం గర్వించదగ్గ విషయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement