
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటాకార్ప్ నేపాల్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. 2024 మార్చిలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సంస్థ ప్రకటించింది.
కంపెనీ ఉత్పత్తులకు నేపాల్ పంపిణీదారు అయిన సీజీ మోటార్స్ భాగస్వామ్యంతో ఏటా 75,000 యూనిట్ల సామర్థ్యం గల కేంద్రాన్ని నవల్‌పూర్ జిల్లాలో నెలకొల్పనుంది. 2014లో నేపాల్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో మోటోకార్ప్.. ఆ దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీగా నిలిచింది.
"నేపాల్‌లోని సీజీ గ్రూప్‌తో భాగస్వామి కావడానికి సంతోషిస్తున్నాం. నేపాల్ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్. ఇక్కడ కస్టమర్‌లకు అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలు అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తాం" అని హీరో మోటోకార్ప్ గ్లోబల్ బిజినెస్ హెడ్ సంజయ్ భాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment