మాజీ మంత్రి సబితారెడ్డి
శంషాబాద్ రూరల్ : ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సన్నద్ధం కావాలని కార్యకర్తలకు మాజీ మంత్రి పీ సబితారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మల్కారంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాయకుడు ఎండీ ఫరూఖ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి సబితారెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోస పూరిత వాగ్దానాలతో కాలం గడుపుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని, రైతుల రుణమాఫీ పేరుతో మోసం చేస్తోందన్నారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్, మల్కారం సొసైటీ డెరైక్టర్ బూర్కుంట మహేష్, నాయకులు గోపాల్, సంజీవ, శేఖర్, సోను, లలిత్, ప్రకాష్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో వినయ్‌రెడ్డి, మహేందర్, రంజిత్, రాజు, ఇర్ఫాన్, వెంకటేష్, వినేష్‌రెడ్డి, హన్మంత్, మల్లేష్, మనివర్దన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, రాఘవేందర్, మధు, మల్లేష్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
Published Thu, Jul 23 2015 12:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement