చిన్నారిని ఆశీర్వదిస్తున్న లక్కినేని సుధీర్‌బాబు
ముదిగొండ : మాయమాటలతో ప్రజలను, రైతులను మభ్యపెడుతూ కాలం గడుపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు విమర్శించారు. మండలంలోని కట్టకూరు గ్రామంలోజరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరై ప్రసంగించారు. అనంతరం మా ట్లాడుతూ మంత్రి అనుచరులకు, రైతు లు కానివారికి ట్రాక్టర్లు మంజూరు చేయ డం చాలా దారుణమన్నారు. అర్హులైన రైతులను పక్కన పెట్టి టీఆర్ఎస్ నాయకులకే ట్రాక్టర్లు పంపిణీ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.
జిల్లాలో ట్రాక్టర్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఏళ్లు గడుస్తున్నా వారికి ఇవ్వకుండా వాటిని తమ కు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం ఈ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని, ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం సాగర్ జలాలతో చెరువులను నింపి సాగు, తాగు నీరు అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షు డు వేంరెడ్డి రోషిరెడ్డి, జిల్లా కార్యదర్శి రూప్లానాయక్, నేతలు పసుపులేటి సైదులు, కాకుమాని మల్లికార్జునరావు, కార్యదర్శి చిట్యాల సైదాబాబు, సూరపల్లి శ్రీను, వీరునాయక్, గుగులోతు నాగేశ్వ రరావు, కె రాము, షేక్ యాకూబ్మి యా, కొత్తపల్లి నాగార్జున, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment