రైతుల గోడు పట్టని ప్రభుత్వం
రైతుల గోడు పట్టని ప్రభుత్వం
Published Sat, Nov 12 2016 10:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం నేతల ధ్వజం
కర్నూలు(ఓల్డ్‌సిటీ): టీడీపీ ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర నేతలు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పిట్టం ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర లేక ఉల్లిరైతులు తీవ్రంగా నష్టపోతుంటే పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. రైతు విభాగం ఆధ్వర్యంలో ఉల్లికి మద్దతు ధర కల్పించాలని ధర్నా చేస్తే మంత్రి పత్తిపాటి పుల్లారావు రూ. 600లకు కొంటామంటూ హామీ ఇచ్చారన్నారు. అయితే ఆ హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కరువు మండలాలను ప్రకటించి నేటి వరకు వారికి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని చెపా్పరు. దీన్ని బట్టి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోందన్నారు. పాత నోట్ల రద్దు నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, రైతు నాయకులు మోహన్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, శివరామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement