గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.చవితి రా.1.00 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ధనిష్ఠ రా.12.01 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.48 నుండి 9.36 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.18 వరకు, అమృత ఘడియలు: ప.1.55 నుండి 3.29 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.36, సూర్యాస్తమయం: 5.34.
మేషం...నూతన ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వృషభం..వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
మిథునం...కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కర్కాటకం....పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అప్రయత్నకార్యసిద్ధి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.
సింహం.....గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.
కన్య.....బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల...ముఖ్యమైన పనులలో ఆటంకాలు. « ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది.. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రులతో అకారణ వైరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు గందరగోళం.
వృశ్చికం.....శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.
ధనుస్సు..కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వృథా ఖర్చులు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మకరం......కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.
కుంభం... వ్యవహారాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
మీనం...కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment