రుణమో.. చంద్రశేఖరా! | Expand funding are not available | Sakshi
Sakshi News home page

రుణమో.. చంద్రశేఖరా!

Published Fri, Nov 4 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

రుణమో.. చంద్రశేఖరా!

రుణమో.. చంద్రశేఖరా!

సుభాష్‌నగర్ :  తెలంగాణ సర్కారు రైతుల పాలిట గుదిబండగా మారింది. కరెంటు మినహారుుంచి ఏ విధమైన ప్రోత్సాహం అందించడం లేదు. ఈ ఏడాది చివరలో వర్షాలు సమృద్ధిగా కురిసి రబీకి అన్నదాత సిద్ధమవుతున్నా ఏ విధమైన రుణాలు అందించడం లేదు. మూడో విడత రుణమాఫీ నిధులు పూర్తిగా రావాల్సి ఉన్నా.. కేవలం సగం మాత్రమే రైతుల ఖాతాల్లో జమయ్యూరుు. గతేడాది ఇన్‌ఫుట్ సబ్సిడీ నిధుల ఊసేలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన సోయా రైతులకు ఫసల్ బీమా యోజన ధీమా ఇవ్వలేకపోతోంది. దీంతో రైతులు పెట్టుబడి కోసం బ్యాంకులకు  వెళ్లలేక.. ప్రైవేటు అప్పులకు భయపడి పాలుపోని స్థితిలో ఉన్నారు. అధికార యంత్రాంగం, ప్రభుత్వం స్పందించి రబీకి సిద్ధమైన అన్నదాతకు ప్రభుత్వం రుణమాఫీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

అందని రుణమాఫీ నిధులు
జిల్లాలో 4.25 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో వివిధ బ్యాంకుల్లో దాదాపు 3.95 లక్షల మంది అన్నదాతలు రుణాలు పొందారు. మిగతా 30 వేల మంది బ్యాంకులు, సొసైటీల్లో రుణాలు పొందలేదు. రైతులు తీసుకున్న రూ.లక్ష వరకు రుణాన్ని 4 విడతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రెండేళ్లుగా 25 శాతం చొప్పున నిధులు ఒకేసారి విడుదల చేసింది. కానీ. ఈ యేడు మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 25 శాతం నిధులను 6.25 శాతం చొప్పున ఇప్పటికి రెండు విడతలుగా విడుదల చేసింది. మరో 12.5 శాతం నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు రెండు నెలలుగా రుణమాఫీ నిధుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నేటికీ స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పత్తాలేని ఇన్‌ఫుట్ సబ్సిడీ
గతేడాది తీవ్ర కరువు నెలకొనడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.791 కోట్లు కరువు సాయంగా ప్రకటించింది. అందులో కొంతభాగం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేసింది. జిల్లా కు కరువు సాయంగా ప్రభుత్వం దాదాపు రూ.116 కోట్లు గత మార్చి, ఏప్రిల్ నెలలో ప్రకటించింది. వాటిని 3,79,542 మంది రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు చెప్పింది. ఆ నిధులను జూన్, జులై నెలల్లో రైతు ల ఖాతాల్లో జమ చేస్తామని సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ముందుగానే ఇవ్వడం వల్ల రైతులకు ఖరీఫ్ లో పెట్టుబడికి ఇబ్బందులు ఎదురవుతాయని, ఖరీఫ్ ప్రారంభంలో ఇస్తామని పేర్కొన్నారు. ఖరీఫ్ ముగిసి, రబీ వస్తున్నా.. ఇంతవరకూ వాటి ఊసేలేదు. అంతేగాకుండా ఇన్‌ఫుట్ సబ్సిడీలోనూ రాష్ట్రప్రభుత్వం కోత విధించినట్లు తెలిసింది. జిల్లాకు రూ.116 కోట్ల వరకు రావాల్సి ఉన్నా.. రాష్ట్రం తన వాటాను చెల్లించకుండానే ఉమ్మడి జిల్లాకు కేవలం రూ.82 కోట్ల వరకు చెల్లించనున్నట్లు సమాచారం. దీని వల్ల అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రబీ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోకుండా ఉంటారు.

దీమా ఇవ్వని ‘ఫసల్ బీమా’
కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ బీమా పరిహారం అందించే బాధ్యతను అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించింది. రైతులు తమ పట్టా భూమిలో పండించే పంటపై బీమా చెల్లించాలని సూచిం చింది. ప్రీమియం చెల్లించిన వారికే నష్టపరిహారం అందించనున్నామని పేర్కొంది. తద్వారా జిల్లాలోని 1,21,378 మంది రైతులు 1,04,225 హెక్టార్లకు రూ.16,06,85,378 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. రైతుల్లో ఫసల్ బీమా యోజనపై అవగాహన లేకపోవడం, రాష్ట్రప్రభుత్వం ప్రచారం చేపట్టకపోవడంతో జిల్లాలో కొంతమంది మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. ఇటీవల వరదల వల్ల జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకుపైనే సోయా నష్టం వాటిల్లింది. వ్యవసాయాధికారులు ఈ నష్టాన్ని ధ్రువీకరించారు. ఒకవైపు సోయా నష్టం వాటిల్లి రైతు విలవిల్లాడుతుంటే.. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టమేమీ లేదని చెప్పినట్లు తెలిసింది. కంపెనీ అధికారులు తూ.తూ.మంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా రుణమాఫీని, ఇన్సూరెన్స్‌తో లింకేజీ చేయడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రుణం అధికంగా వస్తుందనే భావనతో కొందరు రైతు లు సోయా వేసినప్పటికీ వరి సాగు చేస్తున్నామ ని రు ణాలు పొందారు. దీని వల్ల వరికి ఇన్సూరెన్స్ చెల్లించి సోయా సాగు చేసిన రైతన్నకు ఎలాంటి పరి హారమూ రాదని వ్యవసాయ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతో రైతలు ఇన్సూరెన్స్ చెల్లించి.. పరిహారం రాక రెండు విధాలుగా నష్టపోయారు.

సర్కారు రుణాలు ఇవ్వాలి
నా పేరు మహిపాల్. మాది జక్రాన్‌పల్లి మండలం  మనోహరాబాద్. రబీ సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నాను. పెట్టుబడికి డబ్బులు లేవు. బ్యాంకుల వద్దకు వెళ్తే రుణాలు ఇవ్వడం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుంచాల్సి వస్తోంది. ప్రభుత్వం పెట్టుబడిగా ఇస్తానని చెప్పిన ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీని వెంటనే విడుదల చేయాలి. రుణం కూడా ఇవ్వాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement