
మొలకెత్తని ‘ఆశలు’
- వానల్లేక ఎండుతున్న పంటలు
- ఎదురుచూపుల్లో రైతులు
రేగోడ్: ఆశించిన వర్షాలు లేక వేసిన పంటలు పెరగడంలేదు. మండలకేంద్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. గ్రామ శివారులో.. 15ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. పత్తిపంట 420, మొక్కజొన్న 30, పెసర పంట 200, మినుము 150, కంది 25, సోయాబిన్ 75, కూరగాయలు 12ఎకరాల్లో సాగు చేశారు.
ప్రస్తుతం బ్యాంకుల అధికారులు రుణమాఫీ డబ్బులు ఇవ్వడం లే దు. ఇక రైతులు ప్రై వేటుగా అప్పులు తీసుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. పంటల సాగు సమయంలో సరిగా వర్షాలు పడలేదు. దీంతో పత్తి మొలకలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. రైతులు ఇంకా ఆశాభావంతోనే ఉన్నారు. వర్షాలు పడకపోతే పెట్టుబడులు నష్టపోవాల్సిందేనని దిగాలు చెందుతున్నారు.
వానలు పడకపోతే నష్టమే
పంటలు వేస్తున్నప్పుడు వానలు పడలేదు. పత్తి పంటకోసం ఇప్పటికి పదివేలు ఖర్చు చేసిన. మొలకలు పెరగలేదు. ఇకమీదటనైనా వానలు కురువకపోతే నష్టాలుపాలు కావాల్సిందే.
– ప్యారారం సంగప్ప, రైతు