
జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది.
స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్‌పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్‌ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు.
Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm
— CCTV IDIOTS (@cctvidiots) April 30, 2023
అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు.
మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్‌స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు.
చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం!