![Viral Video: Girl Dances In Front Of Buffalo As It Eats, See What Happens Next - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/21/viral.jpg.webp?itok=6L5K_vQZ)
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట్లో అప్‌లోడ్ చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాము ఏం చేస్తున్నమన్నది తెలియకుండా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే కొందరు తమ పిచ్చి ప్రవర్తనకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు.
తాజాగా ఓ యువతి కూడా ఇలాగే చేసింది. జంతువు ముందు ఓవరాక్షన్ చేసి చివరికి ఫలితం అనుభవించింది. గులాబీ, నీలిరంగు డ్రెస్ ధరించిన ఓ యువతి తాడుతో కట్టేసిన గేదేకు దానా వేస్తూ చిందులు వేసింది. ఆకలితో ఉన్న గేదే ముందు చిత్ర విచిత్రంగా డాన్స్ చేసింది. కుంగ్ ఫూ స్టెప్పులు చేస్తూ దానికి చిరాకు తెప్పించింది.. ఇంకేముంది చిర్రెత్తిపోయిన గేదే ఒక్కసారిగా తన రెండు కొమ్ములతో యువతిని దూరంగా నెట్టిపడేసింది. దీంతో యువతి ఎగిరి పక్కన ఉన్న కంచె మీద పడింది.
చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్‌చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!
ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ రెండు నెలల క్రితమే ఈ వీడియోను సైకో బిహారీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేయడంతో.. తాజాగా నెట్టింట్లో వైరలవుతోంది. ఆకలితో ఉన్న జంతువులను ఇబ్బంది పెట్టవద్దు. గేదేకు పాపం యువతి డ్యాన్స్ నచ్చలేదు. ఇంకొంచెం ప్రాక్టిస్ చేసుంటే బాగుండు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 5 లక్షలకు పైగా వ్యూస్, 25 వేల లైకులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment