Lions Fight Each Other While Eating Buffalo Then This Shocking Thing Happens - Sakshi
Sakshi News home page

Viral Video: నోటికందిన ఆహారాన్ని వదిలేసి కొట్లాట.. ‘పాపం సింహాలకు ఇక ఉపవాసమే’

Published Tue, Oct 25 2022 5:14 PM | Last Updated on Tue, Oct 25 2022 7:05 PM

Lions Fight Each Other While Eating Buffalo Then This Shocking Thing Happens. Watch - Sakshi

సింహాలు అడవికి రారాజు. సాధారణంగా సింహాలు వేటాడితే టార్గెట్‌ గురి తప్పదు. గంభీరత్వానికి నిదర్శనమైన ఇవి ఎప్పుడూ గుంపులుగా దర్శనమిస్తుంటాయి. ఒక్కసారి ఏదైనా జంతువును ఆహారంగా చేసుకోవాలని డిసైడ్‌ అయితే వార్‌ వన్‌సైడ్‌ అవ్వాల్సిందే. చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, అడవి దున్నలు, జిరాఫీలను సైతం తమ వశం చేసుకుంటాయి. సింహాలు ఎక్కువగా వేటాడే జంతువుల్లో గేదె ఒకటి. దీని సైజు పెద్దగా ఉండటం వల్ల దాదాపు అయిదు రోజుల వరకు మరే ఇతర జంతువును వేటాడాల్సిన పని ఉండదు.  

తాజాగా  ఓ సింహాల గుంపు కష్టపడి పొలంలో ఒంటరిగా మేస్తున్న గేదెపై దాడి చేసి ఆహారంగా తెచ్చుకున్నాయి. మిగతా గేదెల నుంచి దానిని దూరంగా తీసుకొచ్చి తినడం ప్రారంభించాయి. అయితే ఇంతలో ఏమయ్యిందో తెలిదు కానీ ఆడ సింహాల(శివంగి) మధ్య గొడవ ప్రారంభమైంది. నోటికి వరకు వచ్చిన ఆహారాన్ని పక్కకు పెట్టి మరీ ఒక్కొక్కటిగా దాడి చేసుకున్నాయి. శివంగిలు కొట్టుకుంటుంటే.. ఒక్క సింహం మాత్రం గేదెను అలాగే అదిమి పట్టుకుంది. చివరికి అది కూడా గొడవలో జాయిన్‌ అయ్యింది.

ఇంకేముంది ఇదే మంచి చాన్స్‌ అని భావించిన గేదె మెల్లగా అక్కడి నుంచి లేచి పరుగు అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘గేదె అదృష్టం బాగుంది. పాపం సింహాలకు ఈ రోజు ఉపవాసమే. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్‌ కూతురు.. రోడ్డుపై క్రికెట్‌ బ్యాట్‌తో రచ్చ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement