
సాక్షి,ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై 80 శాతందాకా డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఆపిల్ ఐఫోన్13, నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్లు సహా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లను అందించనుంది. పేటీఎం యూపీఐ, పేటీఎం వాలెట్ చెల్లింపులపై ఆఫర్లను అందివ్వనుంది. ఇందుకోసం పేటీఎంతో డీల్ కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 250 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే రూ.25 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను, పేటీఎం యూపీఐ, వాలెట్ 500 రూపాయలు అంతకంటే ఎక్కువున్న చెల్లింపులపై రూ. 50 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022తో భాగస్వామ్యంపై పేటీఎం ప్రతినిధి సంతోషం ప్రకటించారు. దీని ద్వారా భారతదేశంలోని చిన్న నగరాలు పట్టణాల్లోని మిలియన్ల మంది షాపర్‌లకు సురక్షితమైన చెల్లింపుల అనుభవాన్ని అందించనున్నామన్నారు.
బిగ్ బిలియన్ డే 2022 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై డిస్కౌంట్లను, ఇంకా దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్, బ్యూటీ ఉత్పత్తులు, బొమ్మలు తదితర అనేక ఉత్పత్తులపై ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇప్పటికే ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌కొనుగోళ్లపై 10శాతం, గరిష్టంగా రూ.1500 దాకా ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment