ఎక్కువ మంది బీర్‌లు తాగేందుకు ప్రిఫర్ చేస్తారు. అది మంచిదని కొందరూ..గ్లామర్ కోసం అని మరికొందరూ తాగుతుంటారు. పైగా ఆ బీర్‌లో క్రిస్పీగా సైడ్ డిష్‌లు ఉండాల్సిందే. ఇక చూడు సామిరంగా మందుబాబులు ఓ రేంజ్‌లో కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్‌స్టెంట్ బీర్ పౌడర్‌లను తీసుకొచ్చింది. ఇక మందు బాబులు బయటకు అడుగుపెట్టకుండా ఇంట్లోనే గ్లాస్‌లో దర్జాగా ఐస్‌క్యూబ్లు వేసుకుని బీర్ తాగేయొచ్చు అంటోంది జర్మన్ కంపెనీ.
ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్‌స్టింట్ కాఫీ మాదిరిగా బీర్ పౌడర్‌ని తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లగా తయారు చేసుకుని క్రిస్పీ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టేయొచ్చు. ఇన్‌స్టెంట్ కాఫీ లేదా మిల్క్‌షేక్ మాదిరిగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్‌లో రెండు చెంచాల బీర్ పొడికి నీటిని జోడిస్తే చాలట. నిమిషాల్లో రెడీ అయిపోతుందట.
దీంతో ఇక టన్నుల కొద్ది బీర్ రవాణను భారీగా తగ్గుతుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్‌ను కూడా రూపొందిస్తున్నారట. ప్రస్తుతానికి సదరు జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను అందిస్తోందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్‌లను సైతం తయారు చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment