![Harish Rao Tweet On Kingfisher Beer Being Stopped In Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/8/Harishrao1.jpg.webp?itok=LoRIS9jk)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేయడానికి యునైటెడ్ బ్రూవరీస్(UB) తీసుకున్న నిర్ణయం పలు ప్రశ్నలు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. బీర్లకు సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
బీర్లకు సంబంధించిన బకాయిలను బెవరేజెస్ కార్పొరేషన్(TGBCL) చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ పేర్కొందన్న హరీష్ రావు.. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హినెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారని చెప్పారు.
బూమ్ బూమ్, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్
Comments
Please login to add a commentAdd a comment