123.03 అడుగుల పొడవైన లాంగెస్ట్ దోస గిన్నిస్ వరల్డ్ రికార్డు
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..:
కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్‌మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్‌ను తానే బద్దలు కొట్టింది.
చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట.
2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment