అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్‌ చేసే విధానం..! | Cappuccino Served Inside A Waffle Cone Most Expensive Coffees | Sakshi
Sakshi News home page

అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్‌ చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది!

Published Sun, Jan 7 2024 3:25 PM | Last Updated on Sun, Jan 7 2024 5:13 PM

Cappuccino Served Inside A Waffle Cone Most Expensive Coffees - Sakshi

ఎన్నో రకాల ఖరీదైన కాఫీల గురించి విని ఉంటారు. కానీ ఇలాంటి కాఫీని చూసి ఉండరు, విని ఉండరు. అవును దీన్ని ఎంత వెరైటీగా సర్వ్‌ చేస్తారంటే..అంతకుముంచి దాన్ని సిప్‌ చేయడం ఓ సవాలు. ఇదేంటి? అంత ఖర్చుపెట్టుకుని తింటే..మళ్లీ ఇదేం తిరకాసు అనుకుంటున్నారా!. అయితే ఆ కాఫీ కహానీ ఏంటో చూసేద్దాం!.

కోల్డ్‌ కాఫీ, డార్క్‌ కాఫీ అంటూ మార్కెట్లో పలు రకాల కాఫీకేఫ్‌లు కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసిన కాఫీలు వందకు మించి ఖరీదు ఉండదు. మహా అయితే అది ఏ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ అయితే తప్ప కళ్లుబైర్లు కమ్మేలా అంతంత రేంజ్‌ ధరలు ఉండవు. అలాంటిది ఈ కాఫీ ధరలోనే కాదు దీన్ని సర్వ్‌ చేసే విధానం కూడా భలే విచిత్రంగా ఉంది. ఆ కాఫీని నేరుగా ఐస్‌క్రీం కోన్‌లో పోసి సర్వ్‌ చేస్తారు. పైగా ఓ అందమైన కళాకృతులతో ఈ కాఫీని అందిస్తారు ఫెన్‌స్టర్ అనే కేఫ్‌లో.

ఈ కేఫ్‌ ఆస్ట్రియాలోని వియాన్నలో ఉంది. దీని ధర మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 865/-. ఆ ఐస్‌క్రీం కోన్‌ కూడా నోరూరించేలా చాక్లెట్‌ లేయర్డ్‌ కోన్‌. దీనిలో మంచి రుచికరమైన కాఫీని అది కూడా ఓ మంచికళాకృతిలో సర్వ్‌ చేస్తారు. అయితే ఆ కాఫీ తాగడం ముగిసేలోపు ఆ కోన్‌ తినకుండా కంట్రోల్‌ చేసుకుంటూ తాగాలి ఓ పక్కన కోన్‌ నానకూడదు. లేదంటే అంత ఖర్చు చేసిన కాఫీ అంతా వేస్ట్‌ అయిపోతుంది కదా!. ఐడియా అదుర్స్‌ కదా!. అంతేకాదండోయ్‌ ఆ కాఫీ యజమానికి ఏడాదికి ఈ కాఫీకి సంబంధించి సుమారు ఒక లక్షకు పైనే ఆర్డర్‌లు వస్తాయట. అక్కడ ఈ పానీయాన్ని చాలామంది ఇష్టంగా తాగుతుంటారని సదరు కాఫీ యజమాని చెబుతున్నాడు. 

(చదవండి: నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement