Century celebrations
-
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్‌ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
Talat Mahmood: ఆ చిరు లేత గానానికి నూరేళ్లు
జల్తే హై జిస్కే లియే... ఆ పాట చిరుకెరటాల అలికిడిలా ఉండేది. ఫిర్ వహీ షామ్.. వహీ గమ్... ఆ గొంతు సాయం సంధ్యలో వీచే వీవెన వలే ఉండేది. సీనే మే సులగ్తే హై ఆర్మాన్... ఆ గానం పడగ్గది దీగూటిలో శిఖను కంపించే దీపంలా అనిపించేది. తలత్ మెహమూద్.. గజల్ నవాబ్. మృదుగాన చక్రవర్తి. హిందీ సినిమా గోల్డెన్ ఎరాలో వెలిగిన త్రిమూర్తులు... రఫీ, ముఖేష్, తలత్లలో ఒకడు. నేడు అతని శతజయంతి. భారతీయ సినిమా సంగీతంలో మెత్తని గొంతును ప్రవేశపెట్టి శ్రోతలను సమ్మోహితులను చేసిన తొలి గాయకుడు తలత్ మెహమూద్. అతడు గజల్ గానానికి మార్గదర్శకుడు. నిరుపమానమైన గజల్ గాయకుడు మెహదీహసన్ కు కూడా తొలిదశలో తలత్ మెహమూదే స్ఫూర్తి. తలత్ది ఘనమైన గాన చరిత్ర. అందుకే అతని శతజయంతి సందర్భం గాన ప్రియులకు వేడుక. 1941–44 మధ్య కాలంలో ‘తపన్ కుమార్’ పేరుతో కలకత్తాలో బెంగాలీ పాటలు పాడాడు తలత్. 1945లో కలకత్తాలో నిర్మితమైన ‘రాజలక్ష్మీ’ హిందీ సినిమాలో నటుడు–గాయకుడుగా తలత్ తన మెదటి సినిమా పాట ‘ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్’ పాడాడు. 1951లో ‘తరానా’లో పాడిన ‘సీనేమే సులగ్తే హైన్ అర్మా’ పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు ‘ఆర్జూ’లోని ‘ఏ దిల్ ముఝే ఏసీ జగ్హ లేచల్’ పాటా, ‘బాబుల్’ లోని ‘మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా’ చెప్పుకోతగ్గవి. ‘సంగ్దిల్’ సినిమాలో తలత్ పాడిన ‘ఏ హవా.. ఏ రాత్... ఏ చాందినీ’ మన దేశంలో వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ‘సంగ్దిల్’ సినిమాలోనే ‘కహాన్ హో కహాన్’ అంటూ తలత్ మరో గొప్ప పాట పాడాడు. ‘దాగ్’లో పాడిన ‘ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్’ పాట దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. తలత్ పాడిన ‘బారాదరీ’ సినిమాలోని ‘తస్వీర్ బనాతా హూ’, ‘ఫుట్ పాత్’లోని ‘షామే గమ్ కీ కసమ్’, ‘ఠోకర్’లోని ‘ఏ గమే దిల్ క్యా కరూన్’, ‘దిల్–ఎ–నాదాన్’ సినిమాలోని ‘జిందగీ దేనే వాలే సున్’ పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లోనే పెద్ద పల్లవి పాట ‘ఉస్నే కహా థా’ సినిమాలోని ‘ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే’ తలత్ పాడాడు. అప్పటి వరకూ దేశం వింటూ వచ్చిన సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ క్రూనింగ్ (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. 1944లో తలత్ పాడిన ‘తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ’ గజల్ రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది. ఆ గజల్ గానం దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో ‘సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా...‘ గజల్‌ను రికార్డ్‌పై విడుదల చేశారు. ఆ తరువాత ‘గమ్ –ఎ–జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా’ (1947), ‘సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్’ (1947), ‘దిల్ కీ దునియా బసా గయా’ (1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో ‘రోరో బీతా జీవన్ సారా’, ‘ఆగయీ ఫిర్ సే బహారేన్’, ‘చన్ ్ద లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్’ వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. బేగం అఖ్తర్ గజల్ ధోరణికి భిన్నంగా గజల్ గానం పరివర్తనమవడానికి తలత్ ముఖ్యకారణమయ్యాడు. అందుకే అతను ‘గజల్ నవాబ్’ అనిపించుకున్నాడు. గైర్–ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్ లు, దుర్గా ఆర్తి, నాత్‌లు, గీత్‌లు చక్కగానూ, గొప్పగానూ పాడాడు. ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలోని ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ పాట మనకు తెలిసిందే. ఈ పాట ‘జంజీర్’లో మన్నాడే పాడిన ‘యారీ హైన్ ఇమాన్ మేరా’ పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్తో కలిసి తలత్ పాడిన ‘హమ్ సునాతే హైన్ మొహమ్మద్’ అన్న నాత్. ‘అమృత’ సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన ‘ఏ దేవి వరము నీవు’ పాట పల్లవి తలత్ పాడిన గజల్ ‘రాతేన్ గుజర్ దీ హైన్’ కు దగ్గరగా ఉంటుంది. తలత్ మహ్మూద్ 1959లో విడుదలైన ‘మనోరమ’ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో మూడు పాటలు ‘అందాల సీమ సుధా నిలయం’, ‘గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి’, ‘మరిచిపోయేవేమో ’ పాడాడు. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో1951లో ‘సంసార్’ హిందీ సినిమాలో ‘మిట్ నహీన్ సక్తా’, ‘యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్’ పాటలూ, 1952లో వచ్చిన ‘మిస్టర్ సంపత్’ సినిమాలో ‘ఓ మృగనయనీ...‘, ‘హే భగవాన్’ పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు ‘పాతాళభైరవి’, ‘చండీరాణి’ సినిమాలలో ఎన్.టి.రామారావుకు తలత్ పాడారు. 1964లో వచ్చిన ‘జహాన్ ఆరా’ సినిమాలోని ‘ఫిర్ వోహీ షామ్...‘ పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. అంతకు ముందు 1963లో ‘రుస్తమ్ సొహరాబ్’ సినిమాలో తలత్ ‘మాజన్దరాన్ మాజన్దరాన్’ అంటూ ఒక విశేషమైన పాట పాడాడు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడాడు. తలత్ 16 సినిమాల్లో నటించాడు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు తలత్. 1924 ఫిబ్రవరి 24న పుట్టిన తలత్ 1998లో తది శ్వాస విడిచాడు. తలత్ క్రూనింగ్ను దక్షిణ భారతదేశంలో పి.బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.బి. శ్రీనివాస్ నుండి అది కె.జె.ఏసుదాస్‌కు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు, ఇతరులకూ చేరింది. మనదేశంలో క్రూనింగ్ ఉంది అంటే అది తలత్ మెహమూద్ వచ్చింది అన్నది చారిత్రికం. 1968లో అమెరికాలో జరిగిన ఒక టాక్ షోలో తలత్‌ను ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి ‘ఫ్రాంక్ సినాట్రా ఆఫ్ ఇండియా‘ అని అన్నారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటాడు. – రోచిష్మాన్ -
Kohli 49th ODI Century Highlight Pics: కింగ్ కోహ్లి.. రికార్డుల రారాజు (ఫొటోలు)
-
ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం
‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగి΄ోయేవారు. నాగేశ్వరరావుగారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ విశ్వ విద్యాలయంలో విద్యార్థిననుకుని, ఆ గుణగణాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకున్నట్లవుతుంది’’ అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం (సెప్టెంబరు 20) ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు మహానటులు.. మహా మనిషి. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావుగారు. అవతలివాళ్లు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సంప్రదాయాలు, విలువల్లో ఆయన జీవించి, నటించి మనకు చూపించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. నాగేశ్వరరావుగారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకంలోనూ నటిస్తూనే ఉన్నారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. జీవిత కాలం పూర్తయిన తర్వాత కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుగారు అగ్రగణ్యులు. ఆయన మంచి నటులే కాదు.. పరిణతి చెందిన గొప్ప ఆశావాది కూడా. ఆయన నాస్తికుడు. గొప్ప తాత్త్వికుడు. ఆయన పెద్దగా చదువుకోలేదని అంటారు. కానీ జీవితాలను చదివారు. జీవితంలో ఆయన ΄ోరాటం చేశారు.. జీవితాన్ని ప్రేమించారు.. ఆస్వాదించారు. జీవితంలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు’’ అని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘1950 సమయంలో నాగేశ్వరరావుగారు సినిమాల్లో నటించడంప్రారంభించాక, సొంతిల్లు కట్టుకోవడానికి ముందే మద్రాస్ విశ్వ విద్యాలయానికి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతిక వేలు ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1959లోలక్ష రూపాయల విరాళం ఇచ్చి గుడివాడ కళాశాలను నిలబెట్టారు. నాలాంటివారు ఎందరో చదువుకోగలిగారు. ఆ విధంగా ఆప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఓ విప్లవానికి ఆయన నాంది పలికారు’’ అన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ – ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి కష్టం, కళల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయన్ను ఓ లెజెండ్‌ని చేశాయి. యువ నటీనటులకు నాగార్జునగారు స్ఫూర్తి అని నా ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో చెబుతుంటారు. నాగార్జునగారేమో తన తండ్రి చూపించిన మార్గంలో నడిచానని చెబుతుంటారు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే.. ఆయన ఓ మహానుభావుడు... ఆయన మనతో లేరనే భావన నా మనసులో చిన్నతనం నుంచే ముద్రపడింది. ఏ విగ్రహం చూసినా నాకు అదే అనిపించేది. అందుకే వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించేంతవరకూ నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాన్నగారు మాతో లేరనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోనని... శిల్పి వినీత్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కాడు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి.. ఇలా వివిధ రకాలుగా నాన్నగారు అందరికీ తెలుసు. మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నా తోబుట్టువులను, మా పిల్లలను.. అందర్నీ చల్లగా చూసిన వ్యక్తి. మాకు మనసు బాగున్నా, బాగోలేకున్నా నాన్నగారి దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు అన్నీ సర్దుకునేవి. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నగారికి నచ్చిన స్థలం. నచ్చిన చోట విగ్రహం పెడితేప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అంటారు. సో.. ఆయన ప్రాణంతో మా దగ్గరే ఉన్నారని,ప్రాణంతో మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. నా ఆలోచనల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో నాన్నగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినవారికి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన నాన్నగారి అభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు. ఏయన్నార్ పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘మనిషి ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ధనం గడించినా తలగడ మీద తల పెట్టగానే నిద్ర΄ోవడం అనే ఆస్తి, సౌకర్యం ఏ ధనం ఇవ్వలేదు. ఏయన్నార్‌గారు తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్ర΄ోయేవారు. 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ ముందు రోజు నర్సు నిద్రకోసం మాత్ర ఇస్తే తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్ర΄ోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అందరికీ తెలిసిందే. నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ, ఏయన్నార్ ఫిల్మ్ స్కూల్, కాలేజీ, ఆయన చిత్రాలు, ఫ్యాన్స్ తీపి గుర్తులు’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. ఆయన ‘మరపురాని మనుషులు’ సినిమాకు అసోసియేట్‌గా చేశాను. అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాల్లో నటించాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్న వ్యక్తి నాగేశ్వరరావుగారు. మహానట వృక్షం. కళాకారులకు గొప్ప వరం. స్వయంశిల్పి. స్నేహశీలి. అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి’’ అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఓ వేడుకలో నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం లభించింది. స్టార్ అయిన మీరు ‘మిస్సమ్మ’ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు చేశారు? అని ఆయన్ను అడిగాను. ‘దేవదాసు’ తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయని, ఇమేజ్ మార్చుకోక΄ోతే ఇబ్బందవుతుందేమోనని, ఆ పాత్రను తానే అడిగి మరీ చేశానని చె΄్పారు. నాగేశ్వరరావుగారికి ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకానికి నమస్కారం చేయాలనిపించింది’’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయడం నా అదృష్టం. క్రమశిక్షణతో పాటు ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. ఏయన్నార్ కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ– ‘‘అందరికీ పండగలు ఉంటాయి. కానీ మా అక్కినేని అభిమానులకు నాన్నగారి జయంతే పండగ. అభిమానుల ్ర΄ోత్సాహం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. అమ్మానాన్నలు మేం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేవారు. అలా మేమందరం కలిసే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేశాం’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ– ‘‘తాతగారు తన జీవితంలో కృతజ్ఞతకు విలువ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగిన ఆయనకు కళామతల్లికి తిరిగి ఇవ్వాలని ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏయన్నార్ నేషనల్ అవార్డు, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. ఇలా ఎన్నో ఆయన కృతజ్ఞతలోంచి వచ్చిన ఆలోచనలే’’ అన్నారు. ‘‘నాగేశ్వరరావుగారి విగ్రహం పనులను నాకు అప్పగించిన అక్కినేని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు. దాదాపు ఐదున్నర నెలలు వర్క్ చేశాం’’ అన్నారు విగ్రహ రూపకర్త వినేష్ విజయన్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్‌గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్‌లో చదువుతుంటారు. ఈ జాబితాలో నేనూ ఉన్నాను. తాతగారితో నేను కలిసి నటించడం నా అదృష్టం. మన పుట్టుక మన చేతిలో ఉండదు. అలాంటిది అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అని అన్నారు. తాత ఏయన్నార్‌కు అఖిల్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమల, సుప్రియ, సుమంత్.. ఇలా అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, నాని, నాజర్, అనుపమ్ ఖేర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, సి. కల్యాణ్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు, చినబాబు, నాగవంశీ, బి. గోపాల్, వైవీఎస్ చౌదరి, పి. కిరణ్, గుణ్ణం గంగరాజు, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొని, అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు. -
ఎన్టీఆర్ కు జరిగిన అవమానాలను నేను ప్రత్యక్షంగా చూశా
-
SRHvsRCB : కింగ్ కోహ్లితో అట్లుంటది మరి.. హైదరాబాద్ అంటే పూనకాలే (ఫొటోలు)
-
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదు
-
వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే?
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శతకంతో మెరిశాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అయ్యర్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ కాగా.. కేకేఆర్ తరపున ఇది రెండో ఐపీఎల్ సెంచరీ మాత్రమే. ఇంతకముందు ఐపీఎల్ తొలి సీజన్ 2008లో బ్రెండన్ మెక్కల్లమ్(158*పరుగులు) మాత్రమే కేకేఆర తరపున సెంచరీ సాధించాడు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వెంకటేశ్ అయ్యర్ తన తొలి ఐపీఎల్ శతకంతో మెరవడమే కాదు.. కేకేఆర్ తరపున సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక 49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో శతకం మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్ ఆ తర్వాత మరో నాలుగు పరుగులు చేసి 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే వెంకీ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శతకం సాధించగానే రెండు చేతులతో బ్యాట్‌ను పట్టుకొని భారతీయ సంప్రదాయ పద్దతిలో మొక్కుతూ కనిపించాడు. ఆ తర్వాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ ఈ సెంచరీ మీకోసమే అన్నట్లుగా గెస్టర్ ఇచ్చాడు.. మరి ఆ సైగ ఎవరికి ఇచ్చాడా అని తిరిగిచూస్తే ఎదురుగా కింగ్ ఖాన్.. షారుక్ కూతురు సుహానా ఖాన్ కనిపించింది.వెంకీ అలా చేయగానే ఆమె నవ్వుతూ చప్పట్లతో అభినందించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై, కేకేఆర్ మ్యాచ్ ఏమో గానీ ఇరుజట్లలో కీలకపాత్రల్లో ఉన్న సచిన్ టెండూల్కర్, షారుక్ ఖాన్ల ముద్దుల తనయలు ఈ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఒక ఎండ్‌లో సచిన్ కూతురు సారా టెండూల్కర్.. మరో ఎండ్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్లు తమ జట్లను ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక అర్జున్ టెండూల్కర్ కూడా ఇవాళ్లి మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. History Created... #venkateshiyer is the 2nd player to score 100 for KKR. 🔥🔥 What a Innings 🔥💪#KKRvMIpic.twitter.com/jiemQWEXkN — 𝐁𝐀𝐁𝐀 𝐘𝐀𝐆𝐀 (@yaga_18) April 16, 2023 చదవండి: #venkateshIyer: నొప్పిని భరిస్తూనే.. -
పంత్ వీరవిహారం గిల్‌క్రిస్ట్ విధ్వంసాలను గుర్తు చేసింది..
అహ్మదాబాద్: తనదైన రోజున ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే టీమిండియా డాషింగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ సెంచరీతో అదరగొట్టిన పంత్.. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. రూట్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసిన పంత్.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్ బౌలింగలో ఔటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. మొదట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆతరువాతే పంత్ విధ్వంసం మొదలైంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచి పూర్తి సహకారం లభించింది. సుందర్(117 బంతుల్లో 60 నాటౌట్, 8 ఫోర్లు), పంత్‌లు కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా, పంత్, సుందర్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్ దూకుడును, సుందర్ సంయమన్నాని వారు ఆకాశానికెత్తారు. ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.. అన్ని ఫార్మాట్లలో ఆల్ టైమ్ బెస్ట్ నువ్వే.. నువ్వు నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తాడు. జట్టుకు అవసరమైనప్పుడు అద్భుతమైన శతకాన్ని సాధించావు.. గతంలో గిల్‌క్రిస్ట్ చేసిన విధ్వంసాలను గుర్తు చేశావంటూ టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్ ఊచకోత, సుందర్ నిలకడ ప్రదర్శనకు అభినందనలు.. సుందర్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు.. యువ క్రికెటర్లు భవిష్యత్తులో మరింత నిలకడగా ఆడాలని ఆశిస్తున్నా... వీవీఎస్ లక్ష్మణ్ ఆండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేసి ఫోర్ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.. సెహ్వాగ్ అసాధారణ ప్రతిభ కలిగిన పంత్.. అసాధారణ శతకాన్ని పూర్తి చేశాడు.. అభినందనలు.. టామ్ మూడీ -
వీరుడా వందనం
న్యూఢిల్లీ : త్రివిధ బలగాల్లో సేవలందించి ప్రత్యేకత చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు, ప్రీతిపాల్ సింగ్ గిల్ 100 ఏళ్ల పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరుపుకున్నారు. ఆర్మీలో కల్నల్‌గా రిటైర్ అయిన ప్రీతిపాల్ సింగ్ గిల్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం తన నూరవ పుట్టిన రోజు నాడు బొటనవేలు పైకెత్తి చూపిస్తూ ప్రీతిపాల్ పోస్టు చేసిన ఫొటోకి నెటిజన్లు చెయ్యెత్తి జై కొట్టారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట జిల్లా పాఖీ గ్రామానికి చెందిన ప్రీతిపాల్ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది. 1920 డిసెంబర్ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్ సింగ్ 1942లో భారత వాయుసేనలో చేరారు. అయితే ఆయన తండ్రి తన కుమారుడు విమానం కూలి ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో నేవీకి పంపించారు. కార్గో నౌకలకు ఎస్కార్ట్‌గా ప్రీతిపాల్‌సింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ చేశారు. గ్వాలియర్ మౌంటెన్ రెజిమెంట్‌లో సేవలు అందిస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌గా పని చేస్తూ 1970లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య ప్రమీందర్ కౌర్‌కి ఇప్పుడు 95 ఏళ్లు. వారిద్దరికీ ఒకే ఒక్క కుమారుడు ఉన్నారు. సింగ్ శరీరానికే వయ సు వచ్చిందే తప్ప ఆయన మనసు ఎప్పు డూ నిత్య యవ్వనంతో ఉరకలేస్తూ ఉంటుం దని ప్రీతిపాల్ మనవడు అభయ్‌పాల్ చెప్పారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడడం అం టే ఆయనకి చాలా ఇష్టం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. -
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌కు వందేళ్లు..
సాక్షి, ఖైరతాబాద్: అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ.. ఎన్నెన్నో విజయాలను సొంతం చేసుకుంటూ.. నూరేళ్లు పూర్తి చేసుకుంది ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఐఈఐ)’.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఉత్తమ స్టేట్ సెంటర్ అవార్డు సైతం అందుకుంది. 34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్ సదస్సుకు హాజరైనరాష్ట్ర గవర్నర్ తమిళిసై (ఫైల్) 1920లో స్థాపించబడిన ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్’ స్వర్ణోత్సవాలు తెలంగాణ స్టేట్ సెంటర్లో నిర్వహించాలని నిర్ణయించడంతో సెప్టెంబర్ 15, 2019 నుంచి సెప్టెంబర్ 13, 2020 వరకు ఏడాది పాటు అంతర్జాతీయ, జాతీయ సదస్సులు నిర్వహించారు. 34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌ను 2019 డిసెంబర్లో నిర్వహించగా కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. క్లీన్ అండ్ సేఫ్టీ న్యూక్లియర్ పవర్ జనరేషన్‌పై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనింగ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, అధిగమించాల్సిన అంశాలు ఇలా అనేక సెమినార్లతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ చేపట్టిన అనేక కార్యక్రమాలు 2018–19కు గాను ఉత్తమ స్టేట్ సెంటర్‌గా అవార్డు దక్కింది. అంతర్జాతీయ సదస్సులో సావనీర్ ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా పరిస్థితుల నేపథ్యంలో వెబినార్ల ద్వారా సదస్సులు నిర్వహించడంతో పాటు స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి రూ.14 లక్షల చెక్కును అందజేశారు. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దేశం, రాష్ట్రాభివృద్ధికి అవసరమయ్యే అంశాలపై సదస్సులు నిర్వహించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఐఈఐ సెక్రటరి టి.అంజయ్య తెలిపారు. వందేళ్ల ముగింపు సందర్భంగా గౌవర కార్యదర్శి అంజయ్య, అదనపు గౌవర కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ రమణానాయక్, ప్రొఫెసర్ జి.రాధాకృష్ణ సిబ్బందితో కలిసి కార్యాలయంలో అవార్డులు, రివార్డులను ప్రదర్శించారు. ఉత్సాహంతో ముందుకు.. నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు పంచుకోవడంతో పాటు ఐఈఐ వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో మనం మరో వందేళ్లకు సరిపడా ఇంజినీర్లు ప్లానింగ్ చేసుకోవాలని, రాబోయే తరాలకు నాలెడ్జ్ అందించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ జి.రామేశ్వర్రావు, ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ నేడు ముగింపు వేడుక.. ఐఈఐ వందేళ్లు ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం వెబినార్ ద్వారా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్, గెస్ట్ హాఫ్ హానర్‌గా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. -
ఐదారేళ్ల క్రితమే ప్రమాదంలో పడింది
సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రారంభ సమావేశాల సందర్బంగా అసోచామ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు అందచేసిన మోదీ ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందనీ, అయితే తమ సర్కారు దానికి కాపాడుకుందని మోదీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వృద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన కృషి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థిక వృద్ధికి అన్నిరకాలుగా కృషి చేశామని మోదీ వెల్లడించారు. 5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్ మ్యాప్ సిద్ధమైందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్ మెరుగుపడిందని మోదీ తెలిపారు. అలాగే ఆర్థికవ్యవస్థ వృద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. -
గుర్తుండేలా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ (ఓయూ) శతాబ్ది ఉత్సవాలను దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గుర్తుండేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ఓయూ వీసీ రామచంద్రం, ఇతర అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ భేటీలో ఎంపీ కె. కేశవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఓయూ ఉత్సవాలను జయప్రదం చేసేందుకు 28 కమిటీ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు కడియం చెప్పారు. దేశంలో వీసీలందరితో ఇక్కడ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఓయూ ఉత్తమ పబ్లికేషన్సతో పుస్తకం తెస్తామన్నారు. ఓయూ పూర్వ విద్యార్థులతో సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్సిటీలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్‌ను నెలకొల్పుతామన్నారు. ఉత్సవాల లోగో, బ్రోచర్, వెబ్‌సైట్‌ను రూపొందించి ఆవిష్కరిస్తామన్నారు.