గుర్తుండేలా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
గుర్తుండేలా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
Published Sat, Nov 26 2016 2:11 AM | Last Updated on Thu, May 24 2018 2:02 PM
ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ (ఓయూ) శతాబ్ది ఉత్సవాలను దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గుర్తుండేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ఓయూ వీసీ రామచంద్రం, ఇతర అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు.
ఈ భేటీలో ఎంపీ కె. కేశవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఓయూ ఉత్సవాలను జయప్రదం చేసేందుకు 28 కమిటీ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు కడియం చెప్పారు. దేశంలో వీసీలందరితో ఇక్కడ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఓయూ ఉత్తమ పబ్లికేషన్‌సతో పుస్తకం తెస్తామన్నారు. ఓయూ పూర్వ విద్యార్థులతో సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్సిటీలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్‌ను నెలకొల్పుతామన్నారు. ఉత్సవాల లోగో, బ్రోచర్, వెబ్‌సైట్‌ను రూపొందించి ఆవిష్కరిస్తామన్నారు.
Advertisement