Deputy Chief Minister Kadiyam Srihari
-
ఓరుగల్లుకు మరో మూడు ఐటీ కంపెనీలు
హసన్‌పర్తి: హైదరాబాద్–వరంగల్‌ను ఐటీ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇన్నోవేషన్ ఎక్సే్ఛంజ్ సెంటర్‌ను సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవీన ఆవిçష్కరణాలకు నాంది పలకాలని కోరారు. ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన చింతకింది మల్లేశం (పదో తరగతి చదివిన యువకుడు) ఆవిష్కరించిన ‘లక్ష్మీ ఆసు యంత్రం’ (చేనేత యంత్రం)తో పదివేల మందికి ఉపాధి చేకూరిందన్నారు. దీంతో అతడికి ప్రోత్సాహకంగా రూ.కోటి రుణం అందించినట్లు మంత్రి చెప్పారు. డిసెంబర్లో మరో మూడు ఐటీ కంపెనీలు ఓరుగల్లులో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని తెలిపారు. ఇప్పటికే సైయంట్ కంపెనీ ప్రారంభమైందని, త్వరలోనే మహేంద్ర కంపెనీ వరంగల్‌కు వస్తుందని వివరించారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో విద్యార్థులకు ఎక్కువ మొత్తంలో ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. కేటీఆర్ కేంద్ర మంత్రి అయితే అమెరికా కంటే అభివృద్ధి మంత్రి తారక రామారావు కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తే అమెరికా కంటే భారతదేశం ఐటీ అభివృద్ధిలో ముందు వరుసలో ఉండేదని పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పష్టం చేసిన ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గుర్తు చేశారు. వరంగల్ జిల్లాలో మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకురావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, మేయర్ నన్నపునేని నరేందర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మ, జేఎన్టీయు వీసీ వేణుగోపాల్‌రెడ్డి, టై కంపనీ ఉపా«ధ్యక్షుడు సురేష్‌రెడ్డి, ఎన్‌ఎస్‌టీఈడీబీ కార్యదర్శి వర్గ సభ్యుడు హరికేష్‌కుమార్ మిట్టల్, ఎస్ఐడీబీఐ మేనేజింగ్ డైరెక్టర్ రవిత్యాగి, ఎస్సార్ ఐఎక్స్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఎంపీపీ కొండపాక సుకన్యరఘు ,గ్రామసర్పంచ్ రత్నాకర్‌రెడ్డి, జక్కు రమేష్ గౌడ్,రాజునాయక్ పాల్గొన్నారు. -
15న కొత్త కేజీబీవీలు, యూఆర్ఎస్ల ప్రారంభం
డిప్యూటీ సీఎం కడియం వెల్లడి ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి 50 వేల మంది విద్యార్థులు పెరిగారు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న 84 కొత్త కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లను (యూఆర్ఎస్) ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభి స్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలి పారు. ఈలోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పాఠశాల విద్యా కార్యక్రమాలపై గురువారం డీఈవోలతో సమీక్ష తర్వాత కడియం మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో కలెక్టర్లు, డీఈవోలు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను అన్ని జిల్లాల్లో అమలు చేసేలా వచ్చే నెలలో 3 రోజులపాటు డీఈవోలకు వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి సర్కారు ప్రతిష్టను పెంచేలా డీఈవోలు పని చేయాలన్నారు. ఒకటో తరగతిలో ఈసారి విద్యార్థుల సంఖ్య గతేడాదికన్నా 50 వేలు తగ్గిం దని, మొత్తంగా చూస్తే గతేడాదికన్నా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులు పెరిగారన్నారు. కొత్తగా 525 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు ఇంగ్లిష్ మీడియంలో రావడం వల్ల పాఠశాలల నుంచి గురుకులాలకు వెళ్తున్నారన్నారు. తరగతి గదిలో సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదిలేదన్నారు. పదో తరగతి ఫలితాలను పెంచేందుకు వచ్చే నెల 10వ తేదీ తరువాత ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో అదనంగా 2 గంటలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ సారి జూన్ కంటే ముందే 95% పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించామన్నారు. యూనిఫా రాల బట్ట అన్ని స్కూళ్లకు సరఫరా అయిందని, వాటిని కుట్టించే పని కూడా 80% పూర్తయిందన్నారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం పూర్తవుతుందన్నారు. ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్లు ఉన్నప్పటికీ, ఈసారి ఒక్క పాఠశాలనూ మూసివేయలేదన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇన్చార్జి కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఉనికి కోల్పోయిన ప్రతిపక్షాలు
తొర్రూరులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తొర్రూరు(పాలకుర్తి): రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోల్పోయి కాపాడుకోలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈనెల 27న హన్మకొండలో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతానికి పాలకుర్తి నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎల్వైఆర్ గార్డెన్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు, పార్టీ కార్యకర్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జలయజ్ఞం పేరుతో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు మింగేశారన్నారు. వారి కళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అవినీతి, అక్రమాలుగానే కనిపిస్తాయన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి అసలు నాయకత్వమే లేక, ఉన్న ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే రానున్న సీఎంగా మారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు ఉండదన్నారు. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, రైతు రుణమాఫీ, ఖరీఫ్, రబీలకు రూ.8వేలు ఇచ్చే పథకాలతో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.10కోట్ల నిధులు మంజూరు చేసేందుకు, పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 27న హన్మకొండలో జరిగే పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు పçసునూరి దయాకర్, అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, నాయకులు జన్ను జఖార్య, సీతారాములు, రాంబాబు, యాదగిరిరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సిహ్మనాయక్, రమేష్‌గౌడ్, కర్నె సోమయ్య, దాలత్కౌర్, జాటోతు కమలాకర్, బాకీ లలిత, అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, రమాశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూళ్ల పరిధిలోకి అంగన్వాడీలు
► ఇరు శాఖల అంగీకారం.. కార్యాచరణకు ఆదేశాలు ► ముందుగా పాఠశాలల సమీపంలోని కేంద్రాల విలీనం ► ఏప్రిల్ 15లోగా విధివిధానాలు, చేపట్టాల్సిన బోధన ఖరారు ► జూన్ 12 నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేజీ టు పీజీ’ విద్యా విధానంలో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశా లల ఆవరణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు సూత్రప్రాయంగా అంగీక రించారు. గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాథ మిక పాఠశాలలను గుర్తించి, వాటి వద్దకు అంగన్ వాడీ కేంద్రాలను తరలించాలని... 2017–18 విద్యా సంవత్సరం నుంచే వాటిలో బోధించేలా చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలు ఇప్పటివరకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మాత్రమే పనిచేశాయని, ఇక నుంచి ‘ప్లేస్కూల్’గా మార్చేందుకు ప్రతిపాద నలు రూపొందించాలని సూచించారు. సౌకర్యాలూ ఏర్పడతాయి రాష్ట్రవ్యాప్తంగా చాలా అంగన్ వాడీ కేంద్రాల కు పక్కా భవనాలు, వసతులు లేవు. దీంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అధి కారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అదే స్కూళ్ల ఆవరణలోకి అంగన్ వాడీ కేంద్రాలను తరలిస్తే పిల్లలకూ అన్ని వసతులు అందు బాటులోకి వస్తాయని.. పర్యవేక్షణ, నిర్వహణ సులభతరమవుతుందని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబం ధించి వచ్చే నెల 15లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూన్ 12 నుంచే అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల ల్లో నడిపించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఓ వైపు ఆట, పాటలతో పిల్లలకు చదువు నేర్పిస్తూ, మరోవైపు పౌష్టికా హారం అందిస్తూ అంగన్వాడీలు ప్లేస్కూళ్లుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. 6.54 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రాష్ట్రంలో 35,750 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో 6.54 లక్షల మంది మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలు నమోదై ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 18,162 ప్రాథమిక పాఠశా లలు ఉండగా... వాటిలో 9,742,464 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం అదనపు తరగతి గదులున్న వాటిని ముందుగా గుర్తించి.. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను వాటిలోకి తరలి స్తారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో తెలుగు మీడియంలో ప్లేస్కూళ్లను నిర్వహిస్తారు. ఇంగ్లిషు మీడియం పాఠాలు కూడా నేర్పిం చేలా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సిలబస్‌ను రూపొందించింది. అనుమతి రాగానే పాఠ్య పుస్తకాలు రాయిం చి అమలు చేయనున్నారు. అంగన్వాడీ పిల్లల కోసం యూనిసెఫ్ రూపొందించిన పుస్తకాలను పరిశీలించి వీటిని సిద్ధం చేయనున్నారు. ఇక ఈ ప్లేస్కూళ్లలో విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా ఆరు వేలకు పైగా విద్యా వలంటీర్లను నియమించే అవకాశముంది. -
కేసీఆరే బాహుబలి: కడియం
హన్మకొండ: ‘మా నాయకుడు సీఎం కేసీఆరే బాహుబలి.. ఆయనకు ఎదురు వచ్చే వారే లేరు’ అని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆదివారం టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో కడియం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి ఎజెండా అంటూ లేదన్నారు. ఆ పార్టీకి నాయకత్వమే లేనప్పుడు.. బాహుబలి ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. ఇక కమ్యూనిస్టులను ప్రజలు విశ్వసించరని, టీడీపీ తెలంగాణలో కనుమరుగైన పార్టీ అన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్లాన్, నాన్ ప్లాన్‌ను తీసివేయడంతో ఎస్సీలకు ప్రత్యేక ఉప ప్రణాళిక అమలు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకువచ్చిందన్నారు. ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకురానున్నట్లు చెప్పారు. ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వాసవి కాలేజీ విద్యార్థులకు ‘అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ’ అవకాశం
ఉప ముఖ్యమంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: వాసవి జూనియర్ కాలేజీ విద్యార్థులు మే/జూన్‌లో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని పేర్కొన్నారు. మార్చిలో పరీక్షలు రాయకపోయినా ఆ కాలేజీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులని, ప్రభుత్వాన్ని మోసం చేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. పిల్లలను కాలేజీల్లో చేర్పించే ముందు కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? కాలేజీ ట్రాక్ రికార్డు మంచిదా? కాదా? చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పర్యావరణ విద్య, ఎథిక్స్, హ్యూమన్‌వ్యాల్యూస్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ కూడా చేయలేదన్నారు. ఈ రెండు చేయలేదని తెలిసిన వెంటనే స్పందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉందన్నారు. వీటిని అప్పుడే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకునేవాళ్లమని తెలిపారు. -
లభించని కడియం అపాయింట్మెంట్..
కలవలేకపోయిన కోదండరాం సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యు కేషన్లో (బీఎడ్) ప్రవే శాల కోసం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చించేందుకు బుధవారం సచివాలయానికి వచ్చిన టీజే ఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి అపాయింట్మెంట్ లభించలేదు. బీఎడ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో సచివాలయానికి బయలుదేరిన ఆయన ఫోన్లో కడియం శ్రీహరి పేషీకి ఫోన్ చేసి, అపాయింట్మెంట్ కావాలని కోరారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం.. వీసీల సమావేశంలో ఉండటంతో అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ తరువాత సచివాల యంలోని ఉప ముఖ్యమంత్రి పేషీకి బీఎడ్ కాలేజీ ప్రతినిధులు వచ్చి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. అప్పుడూ వీసీల సమావేశంలోనే కడియం ఉండ టంతో కలిసేందుకు అవకాశం కుదరలేదు. దీంతో కోదండరాం సచివాలయంలోని ఇతర విభాగాల అధికారులను వేరే సమస్యలపై కలిసి వెళ్లిపోయారు. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, మెదక్: మెదక్ చర్చిలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలో రోజంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో వేకువజామున 4.30 గంటలకు దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థనల అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో చర్చి కిటకిటలాడింది. ప్రార్థనల్లో సుమారు 3 లక్షల మంది పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి కడియం కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ బాసలికా చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్ తుమ్మ బాల ప్రత్యేక ప్రార్థనలుS చేసి, క్రీస్తు సందేశాన్ని అందించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. -
గుర్తుండేలా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ (ఓయూ) శతాబ్ది ఉత్సవాలను దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గుర్తుండేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ఓయూ వీసీ రామచంద్రం, ఇతర అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ భేటీలో ఎంపీ కె. కేశవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఓయూ ఉత్సవాలను జయప్రదం చేసేందుకు 28 కమిటీ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు కడియం చెప్పారు. దేశంలో వీసీలందరితో ఇక్కడ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఓయూ ఉత్తమ పబ్లికేషన్సతో పుస్తకం తెస్తామన్నారు. ఓయూ పూర్వ విద్యార్థులతో సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్సిటీలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్‌ను నెలకొల్పుతామన్నారు. ఉత్సవాల లోగో, బ్రోచర్, వెబ్‌సైట్‌ను రూపొందించి ఆవిష్కరిస్తామన్నారు. -
మైనారిటీలకు నాణ్యమైన విద్య
మహబూబాబాద్ : మైనార్టీలకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మహబూబాబాద్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 121 మైనార్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని, ఈ విద్యా సంవత్సరం 71 పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. భవన నిర్మాణాలు, ఇతర ఖర్చుల కోసం రూ. 20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలంలో 240 గురుకుల పాఠశాలలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) ఏర్పాటు చేస్తే, వాటిలో 1.40 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం 319 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి 1.60 లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించిందని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు బడ్జెట్ పెంచామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కౌన్సిలర్లు ఎడ్ల పద్మ, యాళ్ల పుష్పలత, ముస్లిం పెద్దలు ఎక్బాల్, మెడికల్ బాబు, ఇబ్రహీం, చాంద్, టీఆర్ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, గడ్డం అశోక్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, పొనుగోటి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యతోనే బంగారు తెలంగాణ
డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి బెల్లంపల్లి : నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు, ప్రగతిపథంలో పరుగెడుతున్న సంక్షేమ రంగాన్ని చూసి దేశం యావత్తు సీఎంను పొగుడ్తుంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కళ్లు తెరవాలని హితవుపలికారు. సభలో మంత్రి జోగు రామన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీ జి.నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్.దివాకర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఎస్.నర్సింగం, ఆర్.ప్రవీణ్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అభివద్ధి పనులు ప్రారంభం రాష్ట్ర డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం బెల్లంపల్లిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి బెల్లంపల్లి బస్తీలో కొత్తగా రూ.3 కోట్ల అంచనాతో నిర్మించిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఆతర్వాత గురిజాలకు వెళ్లే రహదారి పక్కన రూ.13 కోట్లతో నిర్మాణం పూర్తై రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల ఉన్నత పాఠశాల భవనాన్ని డెప్యూటీ సీఎం ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో డెప్యూటీ సీఎం మొక్కలు నాటారు. ఘనస్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు బెల్లంపల్లికి తొలిసారిగా విచ్చేసిన డెప్యూటీ సీఎం కడియం శ్రీహరికి టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల నుంచి కాన్వాయితో బెల్లంపల్లికి వచ్చిన డెప్యూటీ సీఎంకు రైల్వేస్టేషన్ వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ నుంచి బజార్ ఏరియా వరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఎస్.నర్సింగం, ఆర్.ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ తదితరులు పాల్గొన్నారు. నీటి వాట కోసం పోరాటం చేస్తాం మంచిర్యాల టౌన్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నీటి వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, ట్రిబ్యునల్‌కి వెళ్లి తమ వాటాను తాము కచ్చితంగా సాధిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మంచిర్యాలకు విచ్చేసిన డిప్యూటీ సీఎం పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌజ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీటికోసమే తమ పోరాటమన్నారు. ఇందుకోసమే తెలంగాణలోని ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంతో పాటు, ప్రాజెక్టులను నదులపై చేపడుతున్నామని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు నిపుణులతో కలిసి అధ్యయనం చేసి, నీటి కోసం పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అటవీశాఖా మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేశ్, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ప్రక్షాళన దిశగా విద్యాశాఖ
► సర్కారు సూళ్ల బలోపేతంపై దృష్టి ► ఇకపై నియోజకవర్గస్థాయి సమీక్షలు, సమావేశాలు ► మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యేల నిధులు ► జూలైలో టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ► వీవీల నియామక బాధ్యత కలెక్టర్లకు ► డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షి, మంచిర్యాల/మంచిర్యాల రూరల్ : ‘ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాశాఖ ప్రక్షాళన ఎంతో అవసరం. ఆ మేరకు ప్రభుత్వమూ పని చేస్తోంది. జిల్లాలో సర్కారు స్కూళ్లు.. కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నం. భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్థిని కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్‌కు వెళ్లనీయం. ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కారు స్కూల్లో చేరేలా ప్రభుత్వ పాఠశాలన్నీ బలోపేతం చేస్తాం. ఈ విద్యా సంవత్సరం సర్కారు స్కూళ్లలో విద్యార్థుల నమోదు పది శాతం పెరిగేలా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తం..’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సోమవారం తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రిలో విస్తృతంగా పర్యటించిన ఆయన సీసీసీ సింగరేణి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి జిల్లా విద్యావ్యవస్థ-ప్రగతిపై మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. సమీక్ష అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై విలేకరులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. సర్కారీ స్కూళ్లలో గతేడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల నమోదు కనీసం పది శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సర్కారీ స్కూళ్లపై ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంను విధిగా చేస్తూ పాఠశాలల పని తీరును సమీక్షించి మెరుగైన విద్య అందేలా చూస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత గాడిలోకి తీసుకువచ్చేలా జిల్లాలోని విద్యాసంస్థల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ సమీక్ష జరిపేలా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే నిధుల కింద రూ.కోటి మంజూరు చేస్తే విద్యాశాఖ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేస్తూ విద్యాసంస్థలను ఆధునిక వసతుల కల్పనకు పాటుపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు కూర్చుండేలా రూ.40 కోట్ల విలువ చేసే బెంచీలు(డెస్క్‌లు) అవసరమని గుర్తించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ముందుగా ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.25 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తూ బేంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ ప్రక్రియను ఇక టీఎస్పీఎస్సీకి అప్పగించామని అన్నారు. రెగ్యులర్, మోడల్ పాఠశాలల్లో కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని, జూలైలో ఇందుకు నోటిఫికేషన్ వెలువడనున్నాయని అన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో చేపట్టే వీవీల నియామక బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ కళాశాలలకు ప్రహరీల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, మంచినీటి వసతి, మూత్రశాలల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు ఆదర్శంగా నిలిచేలా ఉపాధ్యాయులు పని తీరు మార్చుకోవాలని, ఇదే క్రమంలో మెరుగైన విద్యను అందిస్తూ అవసరమైతే ప్రైవేట్ నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు చూడాలని అన్నారు. దోస్త్ పథకం ద్వారా కళాశాలల్లో జరిగే అడ్మిషన్ల ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఒక విద్యార్థి ఏ కళాశాలలోనైనా కానీ తనకు నచ్చిన కోర్సులో చేరవచ్చన్నారు. ప్రైవేట్ కళాశాలలో కోర్సులో చేరినా ప్రభుత్వ విద్యాశాఖ నిర్దారించిన ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో బోగస్ విద్యాసంస్థలు కూడా బయటపడే అవకాశం ఉందని, ఇలాంటి విద్యా సంస్థలను ఉపేక్షించేది లేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి వెంట అటవీ, పర్యావరణ శాఖ, బీసీ శాఖా మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీ గెడెం నగేశ్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ కిషన్, డైరైక్టర్ అశోక్ పాల్గొన్నారు. -
అక్షరాస్యత పెంపునకు కృషి చేయూలి
► కలెక్టర్ ఎం.జగన్మోహన్ ► జిల్లా అధికారులతో సమావేశం ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో ప్రస్తుతమున్న 61.01 అక్షరాస్యతా శాతాన్ని వందశాతానికి పెంచి, అధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జూన్ 6న మంచిర్యాలకు రానున్న సందర్భంగా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య అందించడంతో పాటు విద్యార్థులకు మౌలిక సౌకర్యాల ఏర్పాటుపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో విద్యను పటిష్టం చేయడానికి అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ముందుగానే సిద్ధం చేసుకొని రావాలని డీఈవో, ఆర్వీఎం పీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీవో కేశవ్‌రావ్, ఆర్వీఎం పీవో రాజేశ్వర్, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, నాబార్డ్ ఏజీఎం పురోహిత్, గిరిజన శాఖ డీడీ రాంమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాగునీటిపై ఫిర్యాదులు రాకుండా చూడాలి ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదులు రాకుండా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా ఏవిధంగా చేస్తున్నారో తెలుసుకున్నారు. ఎక్కడైనా ఇబ్బందులున్నాయా అని వివరాలు అడిగారు. జిల్లా వ్యాప్తంగా 498 ఆవాస ప్రాంతాలకు రవాణా ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, రవాణా సౌకర్యం లేని గ్రామాలకు ఎడ్లబండ్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. సమస్యలున్నట్లైతే తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎడ్లబండ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న వారికి డబ్బులు చెల్లింపులు చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల ప్రగతిపై వాటర్ గ్రిడ్ ఎస్ఈ ఎన్. ప్రసాద్‌రెడ్డి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 30లోగా 169 గ్రామాల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలని, మిగితా గ్రామాలకు ఆగష్టు 30లోగా అందించాలన్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేష్‌గౌడ్, ఈఈ మూర్తి, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, ఐలయ్య, అయేషా మస్రత్ ఖానమ్, తహసీల్దార్లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
పప్పు దినుసుల సాగుపై దృష్టి
► పత్తికి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లింపు ► ‘మన తెలంగాణ - మన వ్యవసాయం’లో రైతులకు అవగాహన ► రేపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ప్రారంభం హన్మకొండ : రైతులను ప్రత్యామ్నాయ లాభదాయ క పంటల సాగు చేసేందుకు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతివృష్టి, అనావృష్టితో పంటలు పాడై దిగుబడులు తగ్గి మార్కెట్లో మద్ద తు ధర లభించక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నా రు. ఈసారి పత్తి కొనుగోళ్లు అంతర్జాతీయ మార్కెట్లో నిలిచేపోయే అవకాశం ఉంది. ఏదేశంలో పండిన పంటలు ఆ దేశంలోనే వినియోగించుకోవాలని ఒప్పందం జరిగింది. ఈ పరిస్థితుల్లో పత్తి సాగు విస్తీర్ణం తగ్గించాలని ప్రభుత్వం యోచి స్తోంది. ప్రభు త్వం, వ్యవసాయ శాఖ రైతులను పత్తికి ప్రత్యమ్నాయంగా పప్పు దినుసుల పంటల సాగు వైపు దృష్టిసారించే యోచనలో ఉన్నాయి. ఇందుకు శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి మే 5 వరకు జరిగే ‘మన వ్యవసాయం - మన తెలంగా ణ’ కార్యక్రమంలో పప్పు దినుసులు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి 2,47,608 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ విస్తీర్ణాన్ని తగ్గించే అదే స్థారుులో కంది, పెసర తదితర పప్పు దినుసుల పంటలు, మొక్కజొన్న సాగును గణనీయంగా పెంచాలని వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొం దించింది. పైగా జిల్లాలో పప్పుదినుసుల సాగు చాలా తక్కువ ఉంది. కంది సాధారణసాగు 11,045 హెక్టార్లు, పెసర 21,219 హెక్టార్లు, సోయాబీన్ 119 హెక్టార్లు, మినుములు 218 హెక్టార్లలో సాగవుతోంది. పప్పు దినుసులు స్థానికంగా పండిం చక పోవడంతో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ధర ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం రాయితీపై విని యోగదారులకు అందించాల్సిన పరిస్థితులు ఉ న్నారుు. నూనె గింజల పంటలు కూడా పండించేలా రైతులను అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణంలో 20శాతం తగ్గించాలని వ్యవసాయ శాఖ కార్యాచరణ తయా రు చేసింది. ఈ లెక్కన పత్తి సాధారణ విస్తీర్ణం నుంచి 49,522 హెక్టార్లు తగ్గించి ఈ మేరకు పప్పు దినుసుల విస్తీర్ణం పెంచాలని నిర్ణయించింది. ఒక శాతం కింద సోయాబీన్‌ను ప్రస్తుత సాధారణ సాగు విస్తీర్ణానికి అదనంగా 2,476 హెక్టార్లు, 7 శాతం కింద మొక్కజొన్నను సాధారణ విస్తీర్ణానికి అదనం గా 17,333 హెక్టార్లు, 5శాతం కింద కందిని సాధారణ విస్తీర్ణానికి అదనంగా 12,380 హెక్టార్లు, 6 శాతం కింద పెసరను సాధారణ విస్తీర్ణానికి అదనం గా 14,856 హెక్టార్లు, ఒక శాతం పెంపు కింద మినుములను సాధారణ విస్తీర్ణానికి అదనంగా 2,476 హెక్టార్లలో పండించాలని ప్రణాళిక రూపొందించిం ది. జాతీయ ఆహారభద్రత మిషన్ కింద పప్పు దినుసులు, నూనె గింజలు, మొక్కజొన్న పంటల సాగు ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మన తెలంగాణ - మన వ్యవసాయంలో వీటితోపాటు నేల ఆరోగ్యం, ఎరువులు, విత్తనాలు, సస్యరక్షణ చర్యలు, పంట రుణాలు, బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యా న పంటలు, మార్కెంటింగ్ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమంలో కార్యక్రమం ప్రతి మండలంలో ప్రతి రోజు రెండు, నుంచి మూడు గ్రామాలలో సమావేశాలు నిర్వహించనున్నారు. పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్ర మ శాఖ, మత్స్యశాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 25వ తేదీన ఉదయం 7 గ ంటలకు హసన్‌పర్తి మండలం మడిపల్లిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించనున్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
► ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ► ‘మిషన్’ పనులపై కలెక్టరేట్లో సమీక్ష హన్మకొండ అర్బన్ : రెండో దశ మిషన్ కాకతీయ పనులు గడువులోగా నాణ్యతతో పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయ స్థారుు గుర్తింపు వచ్చిందని, దీన్ని దృష్టి లో ఉంచుకొని అధికారులు మరింత బాధ్యతగా పనిచేయూలన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరం లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి మిషన్ కాకతీయ పనులపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రెండో దశ పనులు ఆశించిన మేరకు వేగంగా జరగడంలేదన్నారు. క్షేత్రస్థారుులో సాంకేతిక సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మొదటి విడతలో 1075 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదించగా 1063 చెరువులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, ఇందులో 483 చెరువుల పనులు పూర్తిస్థారుులో బిల్లులు చెల్లించామని, 355 చెరువుల పనులు పూర్తి కాగా బిల్లులు చెల్లించాల్సి ఉందని వివరించారు. రెండో దశలో 1268 చెరువులకు ప్రతిపాదనలు పంపగా 824 చెరువులకు అనుమతులు లభించాయని తెలిపారు. వీటిలో 266 చెరువులకు టెండర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 94 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అదేవిధంగా మొదటి దశ పెండింగ్ పనులు ఈ సీజన్లో పూర్తి చేయాలని సూచించారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ మిషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు వాహనం, కంప్యూటర్ ఆపరేటర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ తిరుపతిరావు, ఎస్ఈ విజయభాస్కర్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఉదయం 11.35 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నివిధాలా దోపిడీకి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దగాపడ్డ రైతన్నలకు మేలు చేకూర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీహబ్ తదితరాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షణీయం. ఈ ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణం’’ అన్నారు. కడియం ప్రసంగిస్తుండగా అధికార పక్ష సభ్యులు చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఆయన ప్రసంగం పూర్తవగానే సభను 16వ తేదీకి మండలి చైర్మన్ స్వామిగౌడ్ వాయిదా వేశారు. -
రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మడికొండ : రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మడికొండలో కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, అరూరి రమేశ్, దాస్యం వినయ్ భాస్కర్, 33,34,53 డివిజన్ల ఇన్చార్జిలు ముత్తిరెడ్డి యాదవరెడ్డి, రాజారపు ప్రతాప్ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.300 కోట్లను ప్రకటించారన్నారు. వరంగల్‌ను విద్యకేంద్రంగా అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని కేసీఆర్ 20 నెలల్లోనే చేసి నిరూపించారని పేర్కొన్నారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్‌లో తాగునీరు, రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఔటర్‌రింగ్ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 33,34,53 డివిజన్ల అభ్యర్థులు ఇండ్ల నాగేశ్వర్రావు, జోరిక రమేశ్, ఆవాల రాధికరెడ్డి, ఊకంటివనంరెడ్డి, మేరుగు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మరో కానుక ఇవ్వాలి కాజీపేట / కాజీపేట రూరల్ : వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలిపించినట్లుగానే టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులను గె లిపించి సీఎం కేసీఆర్‌కు మరో కానుక అందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు ఆవాల రాధికారెడ్డి, నార్లగరి రాజమణి, అబూబక్కర్, సంకు రేణుక గెలుపు కోసం సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మడికొండ. బాపూజీనగర్, డీజిల్కాలనీల్లో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్‌తో పాటు రాజారపు ప్రతాప్‌తో కలిసి డిప్యూటీ సీఎం ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి తెలంగాణలో ఉనికి లేకుండా పోయినా డిపాజిట్లు గల్లంతు చేసుకునేందుకే పోటీకి దిగాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రప్రభుత్వం నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ సందర్భంగా భాపూజీనగర్లో టీఆర్ఎస్ కార్యాలయూన్ని కడియం శ్రీహరి ప్రారంభించారు. -
మనోళ్ల సత్తా
సాక్షిప్రతినిధి, వరంగల్ :రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మన జిల్లా అధికార పార్టీ నేతల వ్యూహాలు ఫలించాయి. జిల్లా నేతలు ఇన్చార్జులుగా వ్యవహరించిన డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజారిటీతో విజయం సాధించారు. హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రభావితం చేస్తాయని టీఆర్ఎస్ నేతలుభావిస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం జిల్లాకు చెందిన 14 మంది కీలక నేతలకు హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలనుఅప్పగించింది. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎక్కువ మంది నేతలు తమకు కేటాయించిన డివిజన్లలో టీ ఆర్ఎస్ను గెలిపించుకున్నారు. అరుుతే, కాం గ్రెస్ నేతలకు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన మంగల్హాట్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పరమేశ్వరిసింగ్ 9,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మె ల్యే మాలోత్ కవిత ఈ డివిజన్‌లోనే ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు వెంకటేశ్వరకాలనీ డివిజన్లో ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె కవిత 8,181 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల వరకు కాం గ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ డివిజన్‌లోనే టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఇళ్లు ఉంది. గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ ప్రచార బాధ్యతలు నిర్వహిం చిన మల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవేందర్‌రెడ్డి 7,989 ఓట్ల మెజారిటీతో గెలి చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉప్పల్ నియోజకవర్గం మొత్తాన్ని సమన్వ యం చేయడంతోపాటు ఈ డివిజన్లో ప్రచా రం నిర్వహించారు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లు ఏఎస్.రావు నగర్ డివిజన్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పజ్జూరి పావని 7,987 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్ చిలుకానగర్ డివిజన్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. వినయ్భాస్కర్ది నగర నియోజకవర్గం(గ్రేటర్ వరంగల్) కావడంతో అక్కడ పక్కా ఎన్నికల వ్యూహం అమలు చేశా రు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సరస్వతి 7,982 ఓట్లతో విజయం సాధించారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ నర్సింగరావు చర్లపల్లి డివిజన్లో ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి బొంతు రామ్మోహన్ 7,869 ఓట్ల ఆధిక్యంతో గెలి చారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా ఈ డివిజన్‌లోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించిన హబ్సీగూడ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నారెడ్డి గెలిచారు. ఆమెకు 7,468 ఓట్ల మెజారిటీ లభించింది. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాదాపూర్ డివిజన్లలో ప్రచారం బాధ్యతలు చేపట్టారు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ 6,005 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మీర్‌పేట డివిజన్లో ప్రచారం బాధ్యతలు నిర్వర్తించా రు. టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య 5707 ఓట్ల ఆధిక్యంతో ఈ డివిజన్లో గెలిచారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన జగద్గిరిగుట్టలో టీ ఆర్ఎస్ అభ్యర్థి జగన్ 5,559 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచార బాధ్యతలు నిర్వహించిన రామాంతపూర్ డివి జన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి జోత్స్న 5,157 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనగామ ఎమ్మెల్యే ఎం.యాదగిరిరెడ్డి కాప్రా డివిజన్లో ప్రచార విధులు నిర్వహించారు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణ్‌రాజ్ 5029 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముషీరాబాద్ డివిజన్లో ప్రచార బాధ్యతలు చేపట్టా రు. టీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి 4,124 ఓట్ మెజారిటీతో గెలిచారు. ఇక్కడి టీఆర్ఎస్ అ భ్యర్థిపై మొదట వ్యతిరేతక వ్యక్తమైంది. అరూ రి రమేశ్ స్థానిక నేతలను సమన్వయం చేసి భాగ్యలక్ష్మి గెలుపులో కీలకపాత్ర పోషించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్ ప్రచార బాధ్యతలు తీసుకున్న బోలక్పూర్ డివిజన్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై 2,029 ఓట్ల మెజారిటీతో గెలిచారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ప్రచా ర బాధ్యతలు నిర్వహించిన నాచారం డివి జన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శాంతి 152 ఓట్ల ఆధికత్యంతో గెలిచారు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రచారం చేసిన జాంబాగ్ డివిజన్‌లోనూ టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ డివిజన్లో ఎంఐ ఎం అభ్యర్థి మోహన్ ఐదు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
సర్కారీ బడులపై నమ్మకం కలిగించాలి
‘నూతన విద్యా విధానం’పై సదస్సులో కడియం * అది లేదు గనుకే ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలు * ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడాలని టీచర్లకు హితవు * పలు సలహాలిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే, మెరుగైన విద్య కోసం అప్పు లు చేసైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది పాఠశాల విద్యార్థుల్లో 29 లక్షలు ప్రభుత్వ, 31 లక్షలు ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉం డాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారం 21 మందికి ఒకరున్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాల్సి ఉంటే 19 మందికి ఒకరున్నారు. అయినా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంటే ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘నూతన విద్యా విధానం’పై గురువారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన అతిథిగా పాల్గొని, 48 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు. అందరికీ విద్య-అందరి బాధ్యత రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొటోందని, ప్రభుత్వ విద్యావ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత టీచర్లతో పాటు అందరిపైనా ఉందని కడియం అన్నారు. కేంద్రం సంకల్పించిన నూతన విద్యా విధానానికి రాష్ట్రం తరఫున నివేదిక పంపాల్సి ఉందని గుర్తు చేశారు. నిపుణులు, మేధావుల నుంచి సూచనలు స్వీకరించేందుకు త్వరలో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నాయంటే.. టోల్‌ఫ్రీతో అవమానించొద్దు: సరోత్తమ్ అన్ని వ్యవస్థల మాదిరిగానే విద్యావ్యవస్థ కూడా కలుషితమైందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. పాఠశాలలపై పర్యవేక్షణకు కాదని పోలీసు అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తుం డడం సరికాదన్నారు. టీచర్లపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ఇవ్వడం అవమానించడమేనన్నారు. పోలీసులను నియమించే యోచన లేదని కడియం స్పష్టం చేశారు. ‘‘సమాచార సేకరణ నిమిత్తమే టోల్ ఫ్రీ నంబరి చ్చాం’’అని అన్నారు. కంప్యూట ర్ విద్య అటకెక్కింది: మోహన్‌రెడ్డి సర్కారీ స్కూళ్లలో కంప్యూటర్ విద్య అటకెక్కిందని పీఆర్టీయూ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, స్కూళ్లలో సదుపాయాలు కల్పించాలన్నారు. వీటిపై మార్చిలో ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ అవుతామని కడియం చెప్పారు. వృత్తి విద్యకు ప్రాధాన్యం: హర్షవర్ధన్ వృత్తి విద్యపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఆసక్తిని పెంపొదిస్తే మేలని, నూతన విద్యా విధానంలో దీనికి ప్రాధాన్యమివ్వాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. విధానపత్రం సరిగా లేదు: నర్సిరెడ్డి కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధాన పత్రం సరిగా లేదని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. హెచ్ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు: శర్మ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరిగినందున కాంప్లెక్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు తమ పరిధిలోని స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్షుడు మల్లిఖార్జున శర్మ సూచించారు. పాఠశాల మాదనే భావన: రాజిరెడ్డి ప్రభుత్వ పాఠశాల తమదనే భావన సమాజంలో వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎస్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి సూచించారు. పనిచేసే టీచర్లను ప్రోత్సహించాలని.. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలకు రెసిడెన్షియల్ విద్య:కొండల్‌రెడ్డి బాలికలకు రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని తప్పనిసరి చేయాలని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి అన్నారు. -
నెలాఖరు వరకు ఫీజు రీయింబర్స్మెంట్
► కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సరళతరం ► జనవరి 26లోగా వెయ్యి ఎకరాల భూపంపిణీ ► వికలాంగుల శాఖ భవనానికి రూ.కోటి ► ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ► సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ నెల 15తో ముగిసిన చివరి తేదీని డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద వర్గాల వారి వివాహాలకు ప్రభుత్వం ఇచ్చే రూ.51వేల ఆర్థిక సహాయం పెళ్లికి ముందే అందేలా నిబంధనలు సరళతరం చేసేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో సంక్షేమ శాఖల పనితీరుపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంతి కడియం శ్రీహరి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రెండు నెలలుగా సమీక్షలు జరగలేదు. సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్షతో కడియం శ్రీహరి మళ్లీ ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల శాఖ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఏ ఇబ్బందీ లేకుండా సంక్షేమ శాఖల వసతి గృహాలను తీర్చిదిద్దాలని అధికారులకు చెప్పారు. కరెంటు, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో ఏ సమస్యలూ లేకుండా చర్యలు తీసుకోవాలని.. భవనాలకు రంగులు సైతం వేయించాలని ఆదేశించారు. 2016 జనవరి 15లోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అధికారులు, సంక్షేమ వసతిగృహాలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన సౌకర్యాలపై అంచనా నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతిపాదనల ఆధారంగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే మార్చిలో 10 తరగతి పరీక్షలు జరుగనున్నందున సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరంగల్‌లోని వికలాంగుల శాఖ వసతి గృహం నూతన భవనానికి ఒక కోటి రూపాయలు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కడియం శ్రీహరి తెలిపారు. సంక్షేమ శాఖలు పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలకు అందించేలా అవసరమైతే మార్గదర్శకాలకు సవరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న పథకాల కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వ ఆమోదం పొందిందని, లబ్దిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్, గ్రామసభల ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించాలన్నారు. దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించి అర్హుల జాబితా కలెక్టర్ పంపించాలని, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అర్హుల జాబితాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం అందుతుందని చెప్పారు. ఇలాంటి పథకాలలో సబ్సిడీని ప్రభుత్వం భారీగా పెంచిందని పేర్కొన్నారు. 2016 జనవరి 26 నాటికి జిల్లాలోని భూమి లేని నిరుపేదలకు వెయ్యి ఎకరాలను పంపిణీ చేయాలని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వంద ఎకరాల చొప్పున.. వచ్చే జనవరి 25న ఎమ్మెల్యేలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీల పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. అంగన్వాడీలలో ఎక్కువ పిల్లలను చూపించి ప్రభుత్వం అందించే సౌకర్యాలను దుర్వినియోగపరుస్తున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అదనపు జేసీ తిరుపతిరావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. -
‘మాస్టర్ ప్లాన్’పై కలకలం
పాఠశాల స్థలం ధారాదత్తంపై నివేదిక కోరిన డిప్యూటీ సీఎం విచారణ జరిపిన డీఈవో రాజీవ్ స్థలం ఇచ్చినప్పుడు డీఈఓగా చంద్రమోహనే.. వరంగల్ : హన్మకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 887 చదరపు మీటర్ల భూమిని ప్రైవేటు అవసరాల కోసం అప్పగించిన అంశం విద్యా శాఖలో కలకలం రేపింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సూచన మేరకు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసిన విషయంపై శుక్రవారం సాక్షిలో ‘మాస్టర్ ప్లాన్ మతలబేంది?’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యా శాఖ అధికారి పి.రాజీవ్‌ను ఆదేశించారు. డీఈఓ శుక్రవారం విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డెరైక్టర్ యాదయ్యతో కలిసి సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు అప్పగించిన స్థలం ఫొటోలు, వివరాలు సేకరించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి నివేదిక పంపించారు. ఇచ్చింది చంద్రమోహనే... సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 887 చదరపు మీటర్ల భూమిని వరంగల్ నగరపాలక సంస్థకు ఇచ్చిన సమయంలో జిల్లా విద్యా శాఖ అధికారిగా వై.చంద్రమోహన్ ఉన్నట్టు ఉత్తరప్రత్యుత్తరాలు స్పష్టం చేస్తున్నాయి. పాఠశాల వెనుక విద్యా శాఖ పరిధిలో ఉన్న 887 చదరపు మీటర్ల భూమిని రోడ్డుకు వినియోగించనున్నట్లు పేర్కొంటూ వరంగల్ మహా నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్ 29న విద్యా శాఖకు లేఖ రాసింది. దీనికి సమ్మతిస్తూ 2015 మే 22న డీఈవో కార్యాలయం నగరపాలక సంస్థకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. మహా నగరపాలక సంస్థ ప్రతిపాదన వచ్చిన సమయంలో, దీనిపై నిర్ణయం తీసుకున్న సమయంలోనూ డీఈఓగా వై.చంద్రమోహన్ ఉన్నారు. ఆయన హయాంలోనే దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన విద్యా శాఖ భూమి పరాధీనమైనట్లు స్పష్టమవుతోంది. భూమిని ఇతర శాఖలకు అప్పగించే విషయంలో డీఈఓకు ఎలాంటి అధికారమూ లేదని నిబంధనలు చెబుతునాయి. వరంగల్ మహానగరపాలక సంస్థ నుంచి భూమి కావాలనే ప్రతిపాదన లేఖ వచ్చినప్పుడు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికిగానీ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దృష్టికిగానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి మేరకే భూమి కేటాయింపుపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అరుుతే, ఇవేమీ పట్టించుకోకుండా వై.చంద్రమోహన్ డీఈవోగా ఉన్నప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భూమిని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. -
కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి
♦ పేద దళితుడికి టిక్కెట్, నిధులు ఇచ్చారు ♦ ఉప ముఖ్యమంత్రి కడియం సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఉప ఎన్నికలో పసునూరి దయాకర్‌కు టిక్కెట్, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అంకానికి తెర తీశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పేద దళితుడికి టిక్కెట్, ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చిన కేసీఆర్‌కు వరంగల్ ప్రజల తరపున, టీఆర్ఎస్ జిల్లా శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల్లోని పేద అభ్యర్థులు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతో దోహదం చేస్తాయని, ఈ విషయంలో అన్ని రాజకీయపార్టీలు కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక ఒకరికి అవకాశం ఇవ్వగా.. బీజేపీకి అభ్యర్థే దొరకడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు బి.వినోద్‌కుమార్, ఎ.సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్ పాల్గొన్నారు -
డీఎస్సీతోపాటే టెట్?
- దీనిపై డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో స్పష్టత ఇస్తాం - జనవరి లేదా ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - రాష్ట్రవ్యాప్తంగా 7,491 మంది విద్యా వలంటీర్ల నియామకం - ఈనెల 5 వరకు స్కూళ్లలో చేరేందుకు గడువు పెంపు - సుప్రీం తీర్పు మేరకు ఏకీకత సర్వీసు రూల్స్‌పై నిర్ణయం - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గురువారం సచివాలయంలో కడియం విలేకరులతో మాట్లాడుతూ జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లలో కొత్త టీచర్లు ఉండేలా చూస్తామన్నారు. అయితే డీఎస్సీ, టెట్‌ను వేర్వేరుగా నిర్వహించాలా లేక కలిపి చేపట్టాలా అనే దానిపై డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేప్పుడు స్పష్టత ఇస్తామని, దానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల తరువాత విద్యార్థుల సంఖ్యనుబట్టి అవసరమైన ఖాళీలపై స్పష్టత వచ్చిందని..అందుకే 7,994 విద్యా వలంటీర్ల భర్తీకి ఆమోదించినా అవసరాలను బట్టి 7,759 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దాదాపు 59 వేల మంది దరఖాస్తు చేసుకోగా అర్హతలు, రోస్టర్, రిజర్వేషన్లు, మెరిట్‌ను (ఇంటర్, డిగ్రీ, ఉపాధ్యాయ కోర్సు, టెట్ మార్కుల వెయిటేజీ ప్రకారం) బట్టి అభ్యర్థులను ఆన్లైన్ పద్ధతిలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక చేసినట్లు కడియం తెలిపారు. మండలాల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను గత నెల 18న ఎంఈవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వాటిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించామన్నారు. 21న తుది ఎంపిక జాబితాలను ప్రకటించి 23లోగా స్కూళ్లలో చేరాలని సూచించామన్నారు. అయితే జిల్లా కలె క ్టర్ల విజ్ఞప్తి మేరకు ఆ గడువును ఈ నెల 5 వరకు పొడిగించినట్లు కడియం చెప్పారు. నోటిఫై చేసిన 7,759 పోస్టుల్లో 7,491 పోస్టులను భర్తీ చేయగా ఇప్పటివరకు 6,488 మంది విధుల్లో చేరారని, మిగిలినవారు ఈ నెల 5లోగా విధుల్లో చేరాల్సి ఉందన్నారు. ఈ నియామకాలపై ఇంకా అభ్యంతరాలుంటే ఆధారాలతో పాఠశాల విద్యా డెరైరక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని కడియం సూచించారు. విద్యా వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి తమ ప్రభుత్వం రూ. 8 వేలకు పెంచినట్లు కడియం తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి తదితర కొన్ని జిల్లాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనంగా విద్యావలంటీర్లు కావాలని జిల్లా కలెక్టర్లు కోరారన్నారు. ఈనెల 5న చివరి జాయినింగ్ తరువాత ఆ నియామకాలపై దృష్టిపెడతామన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పూర్తిస్థాయి కాపీ అందలేదని, కోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఇకపై మన భాష.. మన సంస్కృతి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలువురికి సాహితీ పురస్కారాల ప్రదానం సాక్షి,సిటీబ్యూరో : ఇంతకాలం అణచివేతకు గురైన తమ భాష, సంస్కృతిని పరిరక్షించుకునే దిశగా తెలంగాణ రచయితలు, కవులు రచనలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ కళామందిరంలో 2012 సంవత్సర సాహితీ పురస్కార ప్రదాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా ప్రమాణాలు అడుగంటుతున్నాయని, ప్రపంచంలోని 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో మనది ఒకటీ లేకపోవడం బాధాకరమన్నారు. తెలుగు వర్సిటీ నుంచి రచయితలు తమ గ్రంథాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించే నిమిత్తం రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. తెలంగాణ రచయితలకు మునుపటికంటే ఎక్కువ సహాయం అందించాలన్నారు. ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి వచ్చిందన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. వచన కవితా ప్రక్రియలో ‘దండెడ’ గ్రంథానికి పొన్నాల బాలయ్య, బాలసాహిత్యం ప్రక్రియలో ‘శృతిలయలు’ గ్రంథానికి ఆలపర్తి వెంకట సుబ్బారావు, కథా ప్రక్రియలో ‘గదిలోపలి గోడ’ రచయిత పలమనేరు బాలాజి, సాహిత్య విమర్శలో ‘సాహిత్యాకాశంలో సగం’ గ్రంథకర్త ఆచార్య కాత్యాయని విద్మహే, అనువాద ప్రక్రియలో ‘అనంతాకాశం’ గ్రంథానికి గోవిందరాజు రామకృష్ణారావు, నవలా ప్రక్రియలో ‘జిగిరి’ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, నాటక ప్రక్రియలో ‘లవంగి’ నాటకానికి కేవీఎల్ఎన్ శర్మ, వచన రచనలో ‘ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం’ గ్రంథానికి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, రచయిత్రి ఉత్తమ గ్రంథంలో ‘తెలుగు నృత్యకళా సంస్కృతి’ రచయిత ఆచార్య కె. కుసుమారెడ్డి పురస్కారాలు అందుకున్నారు. పద్య కవితా ప్రక్రియలో ‘సప్తగిరిథామ కలియుగ సార్వభౌమ’ గ్రంథానికి దివంగత రాళ్లబండి కవితాప్రసాద్ తరపున ఆయన సతీమణి నాగినీదేవి పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ తోమాసయ్య, డాక్టర్ జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్
* విద్యార్థులను సతాయించొద్దు * డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భీమారం: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందలేదని విద్యార్థులను సతాయించొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండ పరిధిలోని భీమారంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్ విద్యపై నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అందలేదని కొన్ని కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. డబ్బులు చెల్లించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 2014-2015కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు త్వరలో అందజేస్తామని చెప్పారు. 2015-16కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జనవరి నెలాఖరు వరకు పూర్తిగా విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే కొన్ని కళాశాలలు అధ్యాపకులకు వేతనాలివ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం పాలసీ మేరకు ప్రైవేట్ కళాశాలలు మూతపడుతాయని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచిం చారు. ఇంటర్‌బోర్డును ఆన్లైన్ చేస్తున్నట్లు కడియం ప్రకటించారు. ఇప్పటికే విద్యార్థుల దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రైవేట్ కళాశాల అఫ్లియేషన్‌ను ఐదేళ్లకు పెంచే విషయాన్ని చర్చిస్తామని పేర్కొన్నారు. అవినీతి వాస్తవమే.. ప్రభుత్వశాఖల్లో అవినీతి జరుగుతున్న మాట వాప్తవమేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెం ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరదారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ బోర్డుకు వెళ్తే పైసా లేకుండా పని జరగడం లేదని..అక్కడి అధికారులు యాజమాన్యానికి కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. స్పందిం చిన కడియం శ్రీహరి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన వారు ఆత్రుతతో పని కావాలని ఎంతో కొంత ముట్టుజెప్పి పనులు చేయించుకుంటున్నారని.. కళాశాలల యాజమాన్యాలు వారి అవినీతిని ప్రోత్సహించాయని చెప్పారు. టీప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు నర్సింహులులతో పాటు పది జిల్లాల నుంచి సుమారు 150 కళాశాలల ప్రతి నిధులు హాజరయ్యారు. 3నెలల్లో ప్రతి పేదవారి ఇంటికి గ్యాస్ కనెక్షన్ హన్మకొండ: తెలంగాణలో మూడు నెలల్లో ప్రతి పేద ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, బానోత్ శంకర్‌నాయక్‌తో కలసి కడియం శ్రీహరి దీపం పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించి వారికి రాయితీపై గ్యాస్ కనెక్షన్ అందించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో గుడుంబా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. గుడుంబా అమ్మితే ఎమ్మెల్యేలు, పోలీసు, ఎక్సైజ్ అధికారులకు చెప్పాలని గ్రామస్తులను కోరారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్ల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి కనెక్షన్ అవసరముంటుందని భావించామన్నారు. సీఎం ఆలోచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఈటల చెప్పారు. -
‘నాన్ డిటెన్షన్’నే కొనసాగించాలి
- పాఠశాల విద్యలో ప్రస్తుత పద్ధతివైపే సర్కారు మొగ్గు - అఖిలపక్ష భేటీలో ఈ విధానానికే నేతల మద్దతు - దీనిపై కేంద్రానికి సిఫారసు చేస్తాం: డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో ప్రస్తుతం అమల్లో ఉన్న నాన్ డిటెన్షన్ విధానాన్ని కొనసాగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో విద్యాశాఖ శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీలన్నీ ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో సర్కారు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. ‘గతంలో డిటెన్షన్ విధానం ఉండగా 1971లో ఆ పాలసీని రద్దు చేశారు. అప్పటి నుంచి 7, 10 తరగతుల్లోనే బోర్డు పరీక్షల విధానం ఉండేది. 2008లో 7వ తరగతిలో బోర్డు పరీక్ష విధానాన్ని తొలగించారు. ప్రస్తుతం మళ్లీ డిటెన్షన్ విధానంపై కేంద్రం దృష్టి సారించి రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. అయితే రాష్ట్రంలో నాన్ డిటెన్షన్‌ను కొనసాగించాలన్నదే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం అయినందున మా అభిప్రాయం కూడా అదే. దీనిపై సీఎంతో చర్చించి నాన్ డిటెన్షన్నే కొనసాగించాలని కేంద్రానికి సిఫారసు చేస్తాం’ అని కడియం పేర్కొన్నారు. పేద వర్గాల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాన్ డిటెన్షన్ విధానం కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నామన్నారు. వార్షిక పరీక్షల మార్కులతో నిమిత్తం లేకుండా నిర్ణీత హాజరు శాతాన్నిబట్టి విద్యార్థులను ఎగువ తరగతులకు ప్రమోట్ చేయడమే నాన్ డిటెన్షన్ విధానమనేది తెలిసిందే. అయితే దేశంలో నూతన విద్యా విధానంపై దృష్టి సారించిన కేంద్రం డిటెన్షన్ విధానం (వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యే విద్యార్థులను తిరిగి అదే తరగతి చదివేలా చేయడం)పై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ఇటీవల డీఈవోలు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవోలు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ ఈవో, ఎంఈవోలు, ఉపాధ్యాయులతోనూ చర్చించింది. అఖిలపక్ష భేటీలో ఎవరేమన్నారంటే... డిటెన్షన్ విధానం తేవడం విద్యా హక్కును కాలరాయడమే అవుతుంది. ఇది అమల్లోకి వస్తే నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారు. -ప్రస్తుత విధానంలో లోటుపాట్లు ఉంటే సరిచేయాలి. - జె.గీతారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డిటెన్షన్ విధానం వల్ల డ్రాపవుట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా విధానం మూస ధోరణిలో కాకుండా విద్యార్థుల ప్రతిభను గుర్తించేలా ఉండాలి. కనుక 7వ లేదా 8వ తరగతిలో బోర్డు పరీక్షా విధానం ఉండాలి. - ఎన్.రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్సీ డిటెన్షన్ పద్ధతి సరైంది కాదు. పిల్లల సామర్థ్యాలు తగ్గకుండా నాన్‌డిటెన్షన్ విధానాన్ని అవలంబించాలి. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని పక్కాగా అమలు చేయాలి. - సుధాకర్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ నాన్ డిటెన్షన్ పద్ధతినే కొనసాగించాలి. డిటెన్షన్ విధానం వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఫెయిల్ అవుతామేమోనన్న భయం ఏర్పడుతుంది. - పెద్దిరెడ్డి, టీడీపీ నేత డిటెన్షన్ విధానానికి మేం వ్యతిరేకం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో డిటెన్షన్ విధానం ప్రవేశపెడితే మరీ దారుణంగా తయారవుతుంది. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులకుగాను ప్రభుత్వ స్కూళ్లలో కేవలం 29 లక్షల మంది మాత్రమే ఉన్నారు. డిటెన్షన్ వల్ల పేద విద్యార్థుల డ్రాపవుట్స్ పెరుగుతాయి. - కె.శివకుమార్, వైఎస్సార్సీపీ నేత డిటెన్షన్ విధానానికి మేం వ్యతిరేకం. నాన్ డిటెన్షన్ విధానం వల్ల విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలు అలవడుతాయి. - పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ నేత ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేని నేపథ్యంలో డిటెన్షన్ విధానం సరైనది కాదు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగలబెట్టినట్లు ఉంది. - చెరుపల్లి సీతారాములు, సీపీఎం నేత విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం ప్రైవేటీకరించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే డిటెన్షన్ విధానాన్ని తెరపైకి తెస్తోంది. - ప్రభాకర్, ఎల్లన్న, బీఎస్పీ నేతలు -
20లోగా స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలి: కడియం
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఈ నెల 20లోగా చెల్లించాలని వివిధ సంక్షేమ శాఖలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫీజుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. విద్యార్థులకు మెస్ ఫీజులు, స్కాలర్‌షిప్‌ల బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంటీఎఫ్‌లను అక్టోబర్‌లోగా, ఆర్‌టీఎఫ్‌లను డిసెంబర్‌లోగా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్మెంట్ (2014-15)కు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు, కాలేజీలు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువిచ్చినందున, 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను వారంలోగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ కలుపుకొని మొత్తం రూ.820 కోట్ల బడ్జెట్ విడుదల చేయగా, అందులో ఇప్పటివరకు రూ.444 కోట్లు మంజూరుచేసినట్లు సమాచారం. ఆర్టీఎఫ్ కింద 1,884.26 కోట్లు అవసరం ఉండగా, రూ.499.81 కోట్లు బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చినట్లు తెలిసింది. ఎంటీఎఫ్ కింద రూ.567.76 కోట్లు అవసరం ఉండగా, రూ.313 కోట్లకు బీఆర్వోలు విడుదల చేసినట్లు సమాచారం. 2014-15కు సంబంధించి ఇప్పటివరకు 14,31,469 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 13,62,860 మంది విద్యార్థుల వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిసింది. -
డీఈఈసెట్లో 67.6 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2015 ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలో 67.6 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 268 కాలేజీల్లో (10 ప్రభుత్వ, 216 ప్రైవేటు, 42 మైనారిటీ కాలేజీలు) 14,500 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వచ్చే నెల మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి స్థాయి షెడ్యూలును త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా డీఈఈసెట్‌కు 1,11,413 మంది దరఖాస్తు చేసుకోగా 1,05,382 మంది ఈ నెల 9న పరీక్షకు హాజరయ్యారు. 71,317 మంది అర్హత సాధించారు. 10 వేల మంది బాలికలకు హాస్టల్ రాష్ట్రంలోని 100 మోడల్ స్కూళ్ల ఆవరణలో నిర్మించిన బాలికల హాస్టళ్లు సెప్టెంబర్ 1 నుంచి ఆచరణలోకి వస్తాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఒక్కో హాస్టల్లో 100 మంది బాలికల చొప్పున 10 వేల మంది బాలికలకు వసతితో కూడిన విద్యను అందించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని హాస్టళ్లను గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రారంభించాన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల కేటాయించాలన్న దానిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యా హక్కు చట్టం కింద చేయాల్సిన ఈ ఖర్చును ప్రభుత్వ పాఠశాలల్లోనే వెచ్చించి, వాటిని బలోపేతం చేసేలా యోచిస్తున్నామన్నారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చని, దీనిపై ప్రభుత్వ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
పర్వతగిరికి డిప్యూటీ సీఎం మార్క్
సాక్షి కథనానికి కడియం శ్రీహరి స్పందన సాక్షిలో వచ్చిన అన్ని పనులకు గ్రీన్ సిగ్నల్ పర్వతగిరి :పుట్టిన ఊరికి తన మార్క్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, ప్రజలు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరగా పర్వతగిరిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. సాక్షిలో ప్రచురితమైన కథనాలకు కడియం స్పందిం చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో గ్రామజ్యోతిలో భాగంగా సర్పంచ్ గోనె విజయలక్ష్మి అధ్యక్షత ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి కడియం ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలు సమస్యలపై ‘అయ్యా మా మొర అలకిం చరూ..’ అనే శీర్షికతో ప్రచురితమైన సాక్షి కథనాన్ని కడియం చదివారు. స్పందించి ఆరు నెలల్లో ఈ పనులన్నీ చేయటానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఓహెచ్ఎస్ఆర్ కింద రూ. 34 లక్షలను తక్షణమే మం జూరు చేరుుస్తున్నట్లు, 15 రోజుల్లో ఎమ్మెల్సీ నిధుల కింద రూ.25 లక్షల మంజూరుకు హామీ ఇచ్చారు. శ్మాశనవాటికకు పది లక్షలతో పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. రూ. 54కోట్లతో ఊకల్ నుంచి తొర్రూర్ వరకు 53 కిలోమీటర్లలో డబుల్ రోడ్డు విస్తరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రంలో జెడ్పీటీసీ మాదసి శైలజా, ఎంపీపీ రంగు రజిత, ఎంపీటీసీ రాయపురం రమేష్, ఆర్డీఓ మాధవరావు, వర్ధన్నపేట స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకయ్యనాయుడు, తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడుద్డొడ్ల జితేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాటి రతన్‌రావు, మట్టపల్లి ప్రవీణ్‌రావు, సర్పంచ్‌లు ఏర్పుల శ్రీనివాస్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కల్లెడ సర్పంచ్ శ్రీనివాస్, లూనవత్ బీలునాయక్, రాజు, జుంకజువ్వ కొంరమ్మ, సంద్యారాణి, ఎంపీటీసీలు ఈరగాని రాధిక, పట్టాపురం తిరుమల ఏకాంతంగౌడ్, మహిళ విభాగం మండల అధ్యక్షురాలు బరిగెల విజయ, టీఆర్ఎస్ నాయకులు జూలపల్లి దేవేందర్‌రావు, రంగు కుమారస్వామి, దద్దు రవి, జీడి గట్టయ్య, దూద రవి, జంగిలి బాబు, యాకయ్య,శ్యాం, ఈరగాని సాంబయ్య, బూర యాకయ్య, ప్రభాకర్‌రావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల ఏర్పాటుకు సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గురుకుల పాఠశాలల ఏర్పాటు పథకానికి సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి 10 చొప్పున.. 1,190 గురుకులాలను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటి ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బుధవారమిక్కడ కొత్త విద్యావిధానం అమలు తీరుతెన్నులపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. బాలికా విద్య కోసం కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. కొత్త విద్యా విధానం ద్వారా ్రైపైవేటు, ప్రభుత్వ పాఠశాలల మధ్య అంతరం మరింత పెరిగే ప్రమాదం ఉందని, దీనిపై ప్రాథమిక, ఉన్నత పాఠశాల, సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో ఉప కమిటీలు ఏర్పాటు చేసి సంప్రదింపులు చేస్తే బాగుంటుందని సూచించారు. తాము సంప్రదింపుల ప్రక్రియను వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో మొదలుపెడతామని చెప్పారు. విద్యాహక్కు చట్టం ద్వారా లాభనష్టాలున్నాయని, వాటిని సమీక్షించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల నుంచి 25 శాతం పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించి, వారి ఖర్చులను ప్రభుత్వమే తిరిగి చెల్లించే ప్రక్రియలో అవినీతికి ఆస్కారముంటుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు బడులకు చెల్లించే డబ్బును ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఉపాధ్యాయుల భర్తీ, అత్యున్నత శిక్షణకు వినియోగిస్తే సర్కారు బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. తెలంగాణలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఆ విషయం తెలియదు నాయకులు, అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజ్యాంగపరంగా అమలు చేయవచ్చో.. లేదో..? న్యాయపరంగా ఎలా ఉంటుందో తనకు తెలియదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడిగిన ప్రశ్నకు కడియం బదులిచ్చారు. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాల్లో యోగ్యులైన టీచర్లున్నారని, సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదన్నారు. -
పల్లెల ప్రగతి కోసమే.. గ్రామజ్యోతి
ప్రజలు సంఘటిత శక్తిగా కదలాలి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి నిధులు వస్తాయనే భ్రమలు వీడాలి అందుబాటులోని నిధులు వాడాలి గ్రామసభలో నిర్ణయాలు జరగాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : పల్లెల అభివృద్ధి కోసమే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజలు సంఘటితంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో గ్రామజ్యోతిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామజ్యోతిలో ప్రజలు భాగస్వాములు అయ్యేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామజ్యోతి అనగానే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే భ్రమలు వీడాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించాలన్నారు. గ్రామసభ నిర్వహించి పనులు గుర్తించాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నియోజక అభివృద్ధి నిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, గ్రామపంచాయతీ ఆదాయం వీటి ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించాలన్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని భావించవద్దన్నారు. గంగదేవిపల్లి స్ఫూర్తి ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ అభివృద్ధికి స్ఫూర్తి గంగదేవిపల్లి గ్రామం అని కడియం అన్నారు. గంగదేవిపల్లి ప్రజలు అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి చేసుకున్నారన్నారు. 25 కమిటీలు వేసుకొని ఈ కమిటీల ఆధ్వర్యంలో ఒక్కో పనిని చేసుకుంటున్నారన్నారు. గ్రామ ఆర్థిక స్థితిగ తులు కాని, గ్రామంలో శ్రీమంతులు ఎవరు లేరన్నారు. అయినా సంఘటితంగా ముందుకు సాగి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. గ్రామంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉంటుందన్నారు. గుడుంబా తయారి, విక్రయాలు లేవన్నారు. గ్రామంలో ఎక్కడైన చెత్త ఉంటే సమష్టిగా తొలగిస్తారన్నారు. ఈ గ్రామానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉందన్నారు. సందర్శకులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎవరి ఇష్టానుసారం వారు ఓటు వేస్తారన్నారు. జిల్లాలో మరిన్ని గ్రామాలు గంగదేవిపల్లిగా అభివృద్ధి సాధించాలన్నారు. ఈ దిశగా సర్పంచులు, అధికారులు కృషి చేయాలన్నారు. అభివృద్ధిలో పోటీ పడతాం.. 2011 జనాభా లెక్కల ప్రకారం మానవ వనరుల అభివృద్ధిలో జిల్లా వెనకబడి ఉందన్నారు. కొత్త రాష్ట్రం అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అనుకున్న మేరకు అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. చేసే కార్యక్రమాలు ప్రణాళికబద్ధంగా, ప్రాధాన్యత క్రమంలో చేయాలని సూచించారు. జిల్లా అనేక అంశాల్లో వెనకబడి ఉన్నామన్నారు. గుడుంబా తయారి, విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. 25 ఏళ్ల యువతికి పింఛన్ ఇవ్వాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ మహబూబాబాద్ నుంచి గుడుంబా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తలచుకుంటే అభివృద్ధిలో వరంగల్‌ను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలపవచ్చన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పోటీ పడి పని చేద్దామన్నారు. ఎవరు మందు స్థానంలో ఉంటారో చూద్దామన్నారు. ప్రజలకు చేరువుగా పథకాలు తీసుకెళ్లాలన్నారు. వ్యక్తిగత ఇబ్బందులంటే ముందుగానే తప్పుకోవాలని, ఇష్టం లేని పనులు చేసి అప్రతిష్ట తీసుకురావద్దని అధికారులకు సూచించారు. గ్రామజ్యోతిలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌కు ఎకరం నుంచి ఎకరంన్నర వరకు, స్మశాన వాటికకు అర ఎకరం స్థలం గుర్తించాలన్నారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రైవేటు స్థలాన్ని గుర్తించాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేద్దామన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోతే గుర్తించి వారి వివరాలు కలెక్టర్‌కు అందించాలని సూచించారు. గ్రామాలను దత్తత తీసుకోవాలి.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. గ్రామజ్యోతిలో శానిటేషన్‌కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. తాను పది నియోజకవర్గాల్లో పది గ్రామాలను దత్తత తీసుకోనున్నట్లు చెప్పారు. దత్తత తీసుకొన్న గ్రామాల వివరాలు అధికారులు కలెక్టర్‌కు అందించాలని సూచించారు. గ్రామాలకు సంబంధించిన పూర్తి వివరాలు నోడల్ అధికారుల వద్ద ఉండాలన్నారు. రెండవ గ్రామజ్యోతిలో అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయ సగటు అక్షరాస్యతను మించి అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పెట్టుకోనున్నట్లు చెప్పారు. ఈనెల 16వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో గ్రామజ్యోతి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇందులో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు భాగస్వాములను చేయాలన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మాసాగర్ మండలంలోని మల్లికుదుర్ల, షోడాషపల్లి, గుండ్ల సాగరం గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, కమిషనర్ సుధీర్‌బాబు, జేసీ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు. -
ఎర్రబెల్లికి గుణపాఠం చెబుతాం:వంగపల్లి
ముషీరాబాద్: దళిత నేత, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని అవమానించే విధంగా పదేపదే మాట్లాడుతున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాదిగలు తగిన గుణపాఠం చెబుతారని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. గురువారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి ద్రోహం చేసిన ఎర్రబెల్లికి కడియం శ్రీహరిని విమర్శించే హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ఉప ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకే ఎర్రబెల్లి ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇకపై విమర్శలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దండు సురేందర్, గడ్డం అంజన్న, విజయరాజు, ఇటుక గోపి, పొన్నాల కుమార్, మనోజ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాది డీఎస్సీ లేదు
స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించబోమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు చాలా జిల్లాల్లో అవసరానికి మించి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో మాత్రం స్వల్పంగా అవసరం ఉందని చెప్పారు. మరికొన్ని జిల్లాల్లో ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అవసరమైతే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు లేదా విద్యా వలంటీర్లను నియమిస్తామని వివరించారు. బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష అనంతరం కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు కడియంపై పైవిధంగా స్పందించారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకు అనుగుణంగా టీచర్లు ఆంగ్ల మాధ్యమంలో చెప్పగలిగేలా మెథడాలజీలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. అందుకే ఈ విద్యా సంవత్సరం డీఎస్సీ నిర్వహించబోమని చెప్పారు. 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిపై సాధారణ పరిపాలన శాఖ (జే ఏడీ), న్యాయశాఖ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాల అవసరం ఉందా అన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చిస్తామన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సమస్యలపై బుధవారం ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, ఇతర సమస్యలను కడియంకు తెలియజేశారు. నెలాఖరులోగా హాస్టళ్లలో ప్రవేశాలు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో నిర్మించిన 102 బాలికల హాస్టళ్లలో ఈ నెలాఖరులోగా విద్యార్థులకు ప్రవేశాలను కల్పించనున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. వచ్చేనెల 1 నుంచి బాలికలు హాస్టళ్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ‘‘ఒక్కో హాస్టల్లో 25 గదులు నిర్మించాం. ఒక్కో గదిలో నలుగురు బాలికలకు వసతి కల్పిస్తాం. ఇలా 102 హాస్టళ్లలో 10,200 మంది బాలికలకు హాస్టల్ సదుపాయం కల్పిస్తాం. వీటిని ప్రభుత్వం ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రారంభిస్తాం. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు రూ.247 కోట్లతో ఈ హాస్టళ్లను నిర్మించాం. వీటి నిర్వహణ బాధ్యతను సీనియర్ టీచర్లకు అప్పగించాలా? ఔట్‌సోర్సింగ్‌పై ఇతరులకు అప్పగించాలా? అన్నది ఆలోచిస్తున్నాం. బాలికల హాస్టళ్లు కాబట్టి భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని ఆయన వివరించారు. రాష్ట్రానికి మొదటి విడతలో మంజూరైన 192 మోడల్ స్కూళ్లలో 177 స్కూళ్లను ఇప్పటికే ప్రారంభించామని, ఈ ఏడాది శంకర్పల్లి, షాబాద్, మంచిర్యాల, నర్నూర్, కొడిమ్యాలలో ప్రవేశాలు చేపట్టామన్నారు. స్కూళ్లల్లో రికార్డు స్థాయిలో 18,820 మరుగుదొడ్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందులో 30 శాతం మరుగుదొడ్లలో నీటి సదుపాయం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు విభాగాలుగా కేజీ టు పీజీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కేజీ టు పీజీని మూడు విభాగాలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా ఏడున్నర లక్షల మందికి ప్రయోజనం చేకూరే.. కేజీ టు పీజీ పథకం అమలుపై సచివాలయంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది (2016-17) కేజీ టు పీజీని ప్రారంభించాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలోని గురుకులాలన్నీ కేజీ టు పీజీలో భాగంగా చేసి, ఒకే డెరైక్టరేట్ నేతృత్వంలో వీటిని నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆలస్యమైనా కేజీ టు పీజీని పకడ్బందీగా నిర్వహించే ఉద్దేశంతోనే నిఫుణుల సలహాల కోసం వేచి ఉన్నామన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిని కొనసాగిస్తూ గురుకుల విద్యాలయాల వ్యవస్థను కేజీ టు పీజీ పరిధిలోకి తేనున్నారు. నివాస వసతితో కూడిన విద్యా పథకంగా కేజీ టు పీజీని అమలు చేయనున్నారు. ఇందులో కేజీ నుంచి 4వ తరగతి వరకు ఒక విభాగంగా చేస్తారు. ఇందులో వీలైతే అంగన్వాడీ కేంద్రాలను కూడా భాగం చేస్తారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందులో మాతృ భాషలోనే బోధన విధానం ఉండే అవకాశం ఉంది. ఇక రెండో విభాగంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నివాస వసతితో కూడిన ఇంగ్లిషు మీడియం విద్యా బోధన ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసంగా 10 గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తంగా 1,190 గురుకులాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 668 ఉండగా, మిగతా 522 గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇంటర్మీడియట్ తరువాత విద్యను మూడో విభాగంలో భాగంగా పథకాన్ని అమలు చేస్తారు. ఇంటర్మీడియట్ తరువాత దీన్నెలా అమలు చేయాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. అన్నింటిపై మరింత లోతైన అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలు విభాగాల వారీగా కాన్సెప్ట్ పేపర్‌ను రూపొందించనున్నాయి. ఆ తరువాత వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
గత పాలకులు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి * వాటిని మేం సరిదిద్దుతున్నాం * నాలుగు నెలల్లోగా వీసీల నియామకం * నెలాఖరులోగా మొదటి విడత ఫీజు బకాయిలు విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, సంక్షేమం, పాలన, రాజ్యాంగ వ్యవస్థలను గత పాలకులే భ్రష్టు పట్టించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. అలాంటి వారికి ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. గత పాలకులు చేసిన తప్పులను ఇప్పుడు సరిదిద్దడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతున్నామని వివరించారు. సచివాలయంలో శుక్రవారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, విద్యారంగంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, నియామకాలు చేపట్టకపోవడం వల్ల యూనివర్సిటీలు నాక్ గుర్తింపును కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కడా అధ్యాపకులు ఉండాల్సిన నిష్పత్తి ప్రకారం లేరన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు ఇష్టానుసారంగా అనుమతి ఇచ్చారని, కానీ సిబ్బందిని, వసతులను కల్పించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు, కాలేజీల్లో సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తరువాత మిగతా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొత్త రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీల చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పా రు. వచ్చే నాలుగు నెలల్లోగా యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమించడంతోపాటు పాలక మండళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇంటర్మీడియెట్ బోర్డులో ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చామన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులపైనా చర్యలు తప్పవన్నారు. టీచర్ల సర్వీసు రూల్స్‌పై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. గత పాలకులు ఇవ్వని 2013-14 ఫీజు బకాయిలను తాము క్రమంగా చెల్లిస్తూ వస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా మొదటి విడత ఫీజు బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఎర్రబెల్లిని చూస్తే జాలేస్తోంది... ఎర్రబెల్లి దయాకర్‌రావును చూస్తే జాలేస్తోందన్నారు. ‘బదిలీల్లో అక్రమాలంటూ ఓసారి సీబీసీఐడీ విచారణకు, మరోసారి సీబీఐ విచారణకు ఆదేశించాలంటారు.. ఇపుడు నన్ను భర్తరఫ్ చేయాలని అంటున్నారు.. నేను భర్తరఫ్ అయితే పార్టీలోకి వచ్చి మంత్రి కావాలనుకుంటున్నాడు. అందుకే అతన్ని చూస్తే జాలేస్తోంది’ అని కడియం పేర్కొన్నారు. ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అభ్యర్థులు ప్రవేశాలు పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 19 వరకు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందొచ్చని వివరించారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్‌సొసైటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వేంకటేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఇంటర్‌బోర్డు సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. తొలిదశలో ఇంటర్ విద్యార్థులకు జూనియర్ కళాశాల్లో ఈ విధానాన్ని అమలు చేసి.. త ర్వాత అవసరం అనుకుంటే స్కూల్ టీచర్లు, జూనియర్ లెక్చరర్లకూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని బోర్డు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
ఉద్యమంలో ఆటోడ్రైవర్ల పాత్ర మరువలేం..
- తెలంగాణ కోసం 22 మంది అమరులయ్యారు - ఆటోడ్రైవర్ల ప్రథమ మహాసభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ చౌరస్తా : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆటోడ్రైవర్ల పాత్ర మరిచిపోలేనిదని, ఉద్యమంలో రాష్ట్రంలో 22 మంది ఆటోడ్రైవర్లు ఆత్మబలిదానాలు చేసుకుంటే అందులో కేవలం జిల్లాలోనే 11మంది అమరుల య్యారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నా రు. హన్మకొండలోని ఏనుగులగడ్డ(ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం)లో శనివారం తెలంగాణ ఆటోడ్రైవర్ల ప్రథమ మహాసభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ఆటోడ్రైవర్లనుద్దేషించి కడియం శ్రీహరి మాట్లాడారు. స్వరాష్ట్రం కోసం 5లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉద్యమంలో భాగస్వాములు అయ్యారని గుర్తు చేశారు. ఎక్కువ శాతం దళిత, బలహీన వర్గాల వారే ఆటోడ్రైవర్లుగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నా రు. వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.77 కోట్ల మేర రోడ్‌ట్యాక్స్ మాఫీ చేశారన్నారు. డ్రైవర్ల భద్రత ఇన్సూరెన్స్, జీవిత బీమా సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా కడియం, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను ఆటోడ్రైవర్లు సత్కరించారు. యూనియన్ నాయకులు మేకల రవీం దర్, ఈసంపెల్లి సంజీవ, కిషన్, రాజు, కలకోట జయరాం, మడికొండబాబు, ఎండీ యాకూబ్, పసునూరి బాబు, జిలుకరస్వామి, ఎండీ గయాస్, అన్వర్, మాతంగి స్వామి, గోవిందు మహేష్, బొచ్చురాజు, హరిచంద్రునాయక్, బత్తులరాజ్‌కుమార్, శంకర్, రమేష్, చక్రపాణి, మందభాస్కర్, నాగపురి రమేష్, వేల్పుల సతీష్, మైదం గిరిప్రసాద్, రవీందర్, సంజీవ పాల్గొన్నారు. -
ఆటో శక్తి సభ
నేడు ఏనుగులగడ్డలో ఆటో డ్రైవర్ల మహాసభ {పత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయూలని డిమాండ్ ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవం సందర్భంగా భారీ కార్యక్రమం జిల్లాలో 60 వేల ఆటోవాలాలు హాజరుకానున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆటోడ్రైవర్లు తమ సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ గళం విప్పుతున్నారు. ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలాదిమంది ఆటోడ్రైవర్లతో ఆగస్టు ఒకటిన వరంగల్ నగరంలో తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్ ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఆటోడ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి పరిష్కార మార్గాలపై సభలో చర్చించనున్నారు. వేలాది మందికి ఉపాధి ఇంతకాలం అసంఘటిత రంగంలో కార్మికులుగా అటోడ్రైవర్లు కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానంలో తొలిసారిగా ఆటోడ్రైవర్లు సంఘటిత శక్తిగా మారారు. 2011లో జరిగిన సకల జనుల సమ్మెలో వేలాది మంది ఆటోడ్రైవర్లు మహార్యాలీ నిర్వహించి సమ్మె సైరన్ మోగించారు. ఉద్యమం జరిగిన రోజుల్లో ఆటోడ్రైవర్లు చేసిన త్యాగాలను గుర్తించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా పన్ను నుంచి మినహాయింపునిచ్చి ఆదుకున్నారు. పట్నం, పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్ల వేలాది మంది యువకులు ఆటోడ్రైవర్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో ఈ వృత్తిని నమ్ముకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో ఆటోలపై ఆధారపడిన కుటుంబాలు 60 వేలకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం వీరంతా గళం విప్పుతున్నారు. అందులో భాగంగానే శనివారం ఉదయం11.30 గంటలకు హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (ఏనుగులగడ్డ) వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు సభకు హాజరుకానున్నారు. విజయవంతం చేయూలి... ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించనున్న ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ ఆటోడైవర్స్ యూనియన్(టాడు) గౌరవ అధ్యక్షుడు గుడిమ ళ్ల రవికుమార్ శుక్రవారం వరంగల్ నగరంలో ప్రచారం నిర్వహించారు. ఆటోరంగం నడుస్తున్న పరిశ్రమ అని అన్నారు. అదాలత్ సెంటర్ నుం చి స్వయంగా ఆటోనడుపుతూ జులైవాడ, రెవిన్యూకాలనీ, వడ్డేపల్లిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలకు డీజి ల్ అమ్మకం ద్వారా ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోందని.. అదేస్థాయిలో ప్రభుత్వం నుంచి ఆటోడ్రైవర్లకు సాయం అందడం లేదన్నారు. యూనియన్ ప్రథమ మ హాసభ ద్వారా ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు -
మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో త్వరలోనే 100 బాలికల హాస్టళ్లను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే 10-15 రోజుల్లో వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది. శుక్రవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్లో జరిగిన సమావేశంలో విద్యాశాఖలో వివిధ నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మోడల్ స్కూళ్లు, వాటిల్లో బాలికల హాస్టళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల నిర్మాణ పనులను విద్యాశాఖ అధికారులతోపాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం దాదాపు రూ.1,500 కోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిని వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇప్పటివరకు 89 మోడల్ స్కూళ్లలో హాస్టళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 11 హాస్టళ్ల నిర్మాణాలు నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు మంత్రికి వివరించారు. నిర్మాణాలు పూర్తై మరో 5 స్కూళ్లలోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తంగా మోడల్ స్కూళ్ల సంఖ్య 192కు చేరుతుందన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ మూడో దశ కింద కేంద్రం నుంచి రూ. 200 కోట్లు రావాల్సి ఉందని, అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రూ. 5 వేలు గౌరవ వేతనం: మోడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లలో వార్డెన్లుగా ఉన్న టీచర్లకు అదనంగా రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. హాస్టళ్లలో భద్రత కోసం ఒక వాచ్‌మెన్‌ను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ప్రారంభించబోయే హాస్టళ్ల నిర్వహణ వ్యయాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది. 3 నెలల్లో 14,526 టాయిలెట్ల నిర్మాణం పూర్తి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నెలల్లో 14,526 టాయిలెట్ల నిర్మాణాలను విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్టీపీసీ, బీడీఎల్ తదితర సంస్థలు చేపట్టిన 251 టాయిలెట్ల నిర్మాణాలు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. అలాగే టాయిలెట్లలో నీటి సదుపాయం, అన్ని స్కూళ్లలో తాగునీటి సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ఆర్‌ఎంఎస్‌ఏ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్ఎస్ఏ అదనపు ఎస్పీడీ భాస్కర్‌రావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
ఏం చేద్దాం..
- కార్మికుల సమ్మెపై డిప్యూటీ సీఎం శ్రీహరి ఆరా - వేతనాల పెంపుపై కమిషనర్‌తో సమాలోచనలు - ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులపై చర్చ - రూ.వెయ్యి పెంచేందుకు బల్దియా సిద్ధం? వరంగల్ అర్బన్ : కార్మికుల సమ్మెతో మహా నగరంలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఎట్టకేలకు జోక్యం చేసుకుంది. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరికి కమిషనర్ నివేదిక సమర్పించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె.. గ్రేటర్ అర్థిక పరిస్థితి, కార్మికుల డిమాండ్లు, మహా నగరంలో చెత్త, మురుగు సమస్యలపై సమాలోచనలు చేశారు. బల్దియాకు ప్రతి ఏటా ఆస్తి పన్ను రూపంలో జమ అవుతున్న సొమ్మును మాత్రమే ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలుగా అందించాల్సి ఉందని కమిషనర్ వివరించారు. గత ఏడాది పన్నుల టార్గెట్ రూ. 40 కోట్లు ఉండగా, రూ. 38 కోట్లు వసూలయ్యూయన్నారు. గ్రేటర్ పరిధిలో 2,994 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిపై వివిధ విభాగాల్లో విధులు నిర్త్రిస్తున్నారని... ఏడాదికి వేతనాల రూపంలో వీరికి ప్రస్తుతం రూ.40.74 కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల డిమాండ్ మేరకు కనీస వేతనాలను పెంచితే బల్దియాపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న వేతనానికి అదనంగా రూ.వెరుు్య పెంచితే ఏడాదికి రూ.45 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, రూ.2వేలు పెంచితే రూ.50 కోట్లు, రూ.3వేలు పెంచితే రూ. 55 కోట్లు పంపిణీ చేయాలని వివరించారు. ఇంత మొత్తంలో చెల్లించలేమని, ఒక్కో కార్మికుడికి రూ.వెరు్య చొప్పన వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరికి కమిషనర్ వివరించినట్లు సమాచారం. 2015-16 బడ్జెట్లో నగర ప్రజలపై ఎలాంటి ఆస్తి భారం మోపకుండా అంచనాలను రూపొందించామని, ఈ నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనాలను పెంచడం బల్దియాపై పెనుభారమేనని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా బల్దియా ఆర్థిక పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు బల్దియూ అధికార వర్గాలు చెబుతున్నారుు. మహా నగరంలో చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతోందని, మురుగు నీరు నిలవడంతో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పర్మినెంట్ కార్మికులు ప్రధాన రహదారుల్లో చెత్తను మడికొండ డంప్ యార్డుకు తరలిస్తున్నారని, కొంత మంది దినసరి కూలీలలను విధుల్లోకి తీసుకున్నట్లు కమిషనర్ ఆయనకు వివరించారు. -
ఇంటర్ రూపురేఖలు మారుస్తాం: కడియం
హైదరాబాద్: విద్యార్థులకు ఇంటర్మీడియెట్ ఎంతో కీలకమైన దశ అని, మరో ఆరు నెలల్లో ఇంటర్ విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా వ్యవస్థను నిర్మాణం చేసుకోవాల్సి ఉందని, ఇంటర్ విద్యను కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ‘తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య-సంబరాలు, ఉచిత విద్య-అధ్యాపకుల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉచిత ఇంటర్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి.. ప్రభుత్వ కళాశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఇంటర్ ఉచిత విద్యను ప్రవేశపెట్టడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రస్తుతం సాంఘిక, ఆర్థికపరమైన అసమానతలను చూస్తున్నామని, వీటన్నింటి కంటే ప్రమాదకరమైన విద్యా అసమానతలు రానున్నాయని చెప్పారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ ఉచిత విద్యను అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా అందరి అభిప్రాయాలను సేకరించి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జీఏడీ గైడ్‌లైన్స్ రావడానికి వారం పడుతుందని, అవి అందగానే కాంట్రాక్టు లెక్చరర్లు శుభవార్తను వింటారని చెప్పారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచే బాధ్యత తమదైతే.. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో బోధన చేయాల్సిన బాధ్యత అధ్యాపకులదే అని అన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రమాణాలు పెంచే ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.140 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి పూనుకోవాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్య ఒక వరం లాంటిదని, ఇలాంటి పథకాలతో తెలంగాణ విజ్ఞాన సొసైటీ కావాలని ఆకాంక్షించారు. మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి 10 శాతం అడ్మిషన్లు పెరిగినట్లు చెప్పారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సదస్సులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు సి.విఠల్, ఇంటర్ కమిషనర్ డాక్టర్ ఎ. అశోక్ మాట్లాడారు. అనంతరం ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణకు సహకరించిన మేథా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యుగంధర్‌రెడ్డిని సత్కరించారు. -
ముగిసిన పుష్కర పండుగ
పన్నెండేళ్లకొచ్చిన పుష్కరాలు.. గోదారి వైపు సకల జన పరుగులు.. పన్నెండు రోజుల పుణ్యస్నానాలు.. లక్షలాదిగా భక్తజన హారతులు.. గంగమ్మ తీరం జనతీర్థంగా.. మంగపేట మురవంగా.. రామన్నగూడెం రాజసంగా.. ముల్లకట్ట మురిపెంగా.. ఉట్టిపడిన సంప్రదాయం.. సమ్మక-సారలమ్మకు వందనం.. హేమాచలుడికి నీరా‘జనం’.. కాకతీయ కళను చాటిన రామప్ప దర్శనం.. గోదావరి పుష్కర మహోత్సవాలు శనివారం వైభవంగా ముగిశారుు. మంగపేటలో డిప్యూటీ సీఎం శ్రీహరి, జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎమ్మె ల్యే ధర్మారెడ్డి, కలెక్టర్, ఎస్పీ పూజలు చేశారు. పూజారులు గోదారమ్మకు సంధ్యాహారతి ఇచ్చి, పన్నెండేళ్లకు కలుద్దామని బై..బై చెప్పారు. ముగిసిన పుష్కర మహోత్సవాలు - గోదావరి తల్లికి సంధ్యా హారతితో ఘన వీడ్కోలు - మంగపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పూజలు - హాజరైన జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎమ్మెల్యే ధర్మారెడ్డి సాక్షి, హన్మకొండ : గోదావరి పుష్కర పండుగ ముగిసింది. చివరిరోజు శనివారం వరకు జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్ట ఘాట్లలో సుమారు 25ల క్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు. 12రోజుల పాటు పో లీసులు, రెవెన్యూ అధికారులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు ‘పుష్కర’ సేవలో నిమగ్నమయ్యాయి. అగ్రస్థానంలో మంగపేటఘాట్ గోదావరి నదిలోని రామన్నగూడెం, ముల్లకట్ట తది తర ప్రాంతాల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో తక్కువ సంఖ్యలోనే భక్తులు పుష్కర స్నానా లు ఆచరించారు. అరుుతే, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న మంగపేట ఘాట్ వద్ద 90శాతం మంది పుణ్యస్నానాలు చేశారు. మంగపేట్తోపాటు రామన్నగూడెం, మంగపేటలోనూ నీటి నిల్వలు ఉన్న ప్రాంతం లో చలువపందిళ్లు, మహిళలు బట్టలు మార్చుకునే గదు లు ఏర్పాటు చేశారు. డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ అజ్మీరా సీతారాయం నాయక్ స్వయంగా ఏర్పాట్లు పర్యవే క్షించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్ పాటి ల్, ములుగు ఆర్డీవో మహేందర్‌జీ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్ ఘాట్ల వద్దే మకాం వేశారు. పోలీసుల అంకితభావం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా 12 రోజు ల పాటు పుష్కరఘాట్ల వద్దే ఉంటూ భక్తుల సేవలో నిమగ్నమయ్యూరు. భక్తులు వదిలేసిన వ్యర్థ్యాలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య కార్మికు లు వందలాదిమంది పుష్కరఘాట్లు, గోదావరి తీ రంతోపాటు సమీప గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో విశ్రమించకుండా పనిచేశారు. నీటిలో దిగి స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా సుమారు 90 మంది గజఈత గాళ్లు అనునిత్యం కంటికి రెప్పలా కాపలాకాశారు. జనహారతి మంగపేట : పన్నెండు రోజుల్లో గోదావరితో కలి సి సుమారు 25 లక్షల మంది భక్తులను దీవిం చిన పుష్కరుడు శనివారం సెలవు తీసుకున్నా డు. ప్రభుత్వం తర ఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 5.35 గంటలకు శాస్త్రోక్తంగా పుష్కరాలకు సమాప్తం పలికారు. శ్రీసూక్త పద్ధతి న హేమాచల నర్సింహస్వామి, ఉమాచంద్రశేఖ రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సుదర్శన అళ్వార్, గంగమ్మకు షోడ శోపచార పూ జలు నిర్వహించారు. అనంతరం తలపై హేమాచల లక్ష్మీనర్సింహస్వామి శఠారి, పాదుకలు త లపై ధరించిన కడియం గోదావరి వైపు అడుగు వేశారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వాకాటి కరుణ ఆయన ముందు నడిచి గోదారమ్మకు చీరసారెలు సమర్పించారు. అనంతరం వీరు జల్లుస్నానం చేయడంతో పుష్కరాలు ముగి సినట్లరు్యంది. అర్చకులు విస్సావఝ్జల నరేశ్‌శర్మ, కొయ్యాడ శివరాం, వెంకటనారాయణ, రాజీవ్నాగశర్మ ఆధ్వర్యంలో గోదావరి మాతకు సంధ్యాహారతినిచ్చారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం
- డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ : జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సో మవారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్ సొంత భ వనాన్ని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌తో కలిసి ప్రా రంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వివిధ రంగాల్లో జిల్లా వెనుబడి ఉందని తేలిందని, దీని పునర్మాణానికి కృషి చేద్దామన్నారు. పేద వర్గానికి చెందిన తాను రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో జర్నలిస్టుల సహకారం ఎంతో ఉందన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లా జర్నలిస్టులు పోషించిన పాత్ర అద్వితీయమైనదన్నారు. ప్రెస్‌క్లబ్‌లోఇతర నిర్మాణాలకు నియోజక అభివృద్ధి నిధుల నుంచి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ మాట్లాడు తూ జిల్లా జర్నలిస్టులు ఉత్తేజపూరిత ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు మజీథియూ వేజ్‌బోర్డును అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుంటిపల్లి వెంకట్, కార్యదర్శి దుంపల పవన్, టీఎస్‌యూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు పిన్న శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేశ్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, జర్నలిస్టు సంఘాల నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కె.మహేందర్, పిట్టల రవీందర్, పీవీ కొండల్రావు పాల్గొన్నారు. -
ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఖాళీల భర్తీకి చర్యలు
కడియం శ్రీహరి హామీ హైదరాబారాద్: రాష్ట్రంలోని లో ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) స్కూళ్లలో ఖాళీగా ఉన్న హెడ్మాస్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గతంలో 150 మంది బాలికలున్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేకంగా ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టును ఇచ్చారు. అయితే వాటిని బాలికల సంఖ్యతో సంబంధం లేకుండా ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి తదితరులు కలిశారు. ఈ పోస్టులను ప్రస్తుత బదిలీలు, పదోన్నతుల సందర్భంగా భర్తీ చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులుతో మాట్లాడారు. పదోన్నతులు ఇచ్చేలా చర ్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున సోమవారం మరోసారి చర్చించి నిర్ణయాన్ని ప్రకటించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. -
తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపరచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలో జరిగిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయోత్సవ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. కార్మికులు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని చెప్పారు. ఇది కేసీఆర్ అందించిన తెలంగాణ కానుక అని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందామన్నారు. తెలంగాణను అడ్డుకొన్న శక్తులే.. ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు జేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరు బంద్‌కు టీఎంయూ మద్దతు.. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 10వ తేదీన చేపట్టనున్న బంద్‌కు ఆర్టీసీ టీఎంయూ సంపూర్ణ మద్దతు ఇస్తోందని టీంఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి చెప్పారు. బంద్‌లో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారన్నారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డికి.. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను, టీఎంయూను విమర్శించే హక్కు లేదన్నారు. రాజిరెడ్డీ నువ్వెంత, నీ సెజైంత? నీ దమ్మెంత.. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు.. అని మండిపడ్డారు. -
తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘనంగా ఆర్టీసీ విజయోత్సవ సభ హన్మకొండ: తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కార్మికులను కోరారు. 44 శాతం ఫిట్మెంట్, సర్వీస్ రూల్స్ సాధించుకున్న సందర్భంగా హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్ చౌరస్తాలో తెలంగాణ మజ్దూరు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీని విడిపోకుండా ఆంధ్ర నాయకులు, అధికారులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర సాధనలో టీఎంయూ ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. సీఎం ఊహించని విధంగా ఫిట్మెంట్ ఇచ్చారని అన్నారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి మాట్లాడుతూ కార్మికులు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టామన్నారు. దీర్ఘకాలికంగా గుర్తింపు సంఘంగా పని చేసిన ఎన్ఎంయూ సాధించలేని విజయాలు టీఎంయూ సాధించిందన్నారు. టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల త్యాగం వృథాకాదన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి మాట్లాడుతూ టీఎంయూగా ముందుకు పోవాలని కేసీఆర్, హరీష్‌రావు వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. టీఎంయూ రీజియన్ గౌరవాధ్యక్షుడు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ మినహా ఇతర సంఘాలు ఒక్క డిపోలో ఆధిక్యం సాధించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. టీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ టీఎంయూను గుర్తింపు సంఘంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు. సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ల పల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి, డిప్యూటీ సీటీఎం శ్రీధర్, డిప్యూటీ సీఎంఈ రాములు, టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు. తొర్రూరు: హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం మానుకోట ఆర్డీవో భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఏడాదిలోనే రూ.11 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ సుధాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తికి ఇప్పటికే రూ.174 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో తక్కెళ్లపెల్లి రవీందర్రావు, డీఎస్పీ నాగరాజు, ఎంపీపీ సోమయ్య, జెడ్పీటీసీ కమలాకర్, సర్పంచ్ రాజేష్‌నాయక్, ప్రత్యేక అధికారి విక్రమ్‌కుమార్, తహశీల్దార్ సునీత, ఎంపీడీవో శ్రీనాద్ టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భావితరాలకు పచ్చదనం అందించాలి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోల్‌బెల్ట్ : భావితరాలకు పచ్చదనం అందించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం హారితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం మంజూర్‌నగర్ క్వార్టర్స్ ఏరియాలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం సోమవారం హాజరై మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం పి.సత్తయ్య అధ్యక్షత వహించగా.. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో అడవుల విస్తీర్ణం తగ్గుముఖం పట్టిందని, దీంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మూడేళ్లలో 120 కోట్ల మొక్కలు పెంచాలని, ప్రతి జిల్లాకు ఏటా 4 కోట్లు, నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశించిందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. ప్రభుత్వం రూ.40వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడానికి రూపకల్పన చేసిందన్నారు. నియోజకవర్గంలోని సుమారు 100 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సింగరేణి సహకారంతో రానున్న మూడు నెలల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుందని ప్రకటించారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న మొక్కల పెంపకం కార్యక్రమం పట్ల స్పీకర్ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, జెడ్పీటీసీలు మీరాబాయి, పాడి కల్పనాదేవి, ఎంపీపీ రఘుపతిరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, ఆర్డీఓ మహేందర్‌జీ, డ్వామా పీడీ జగన్, కౌన్సిలర్లు శిరుప అనిల్, ప్రమీల, నారాయణ, రాజవీరు, సింగరేణి అధికారులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, సలీం, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం పరకాల : జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారంలో పాల్గొనేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం వచ్చారు. మొక్కలు నాటే సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ లేరా ప్రశ్నించారు. వెంటనే దూరంగా ఉన్న ప్రిన్సిపాల్ శేషాచారి డిప్యూటీ సీఎం వద్దకు వచ్చారు. నమస్తే సార్.. నేనే ప్రిన్సిపాల్ అంటూ ముందుకొచ్చారు. నున్వేనా ప్రిన్సిపాల్.. నీ జుట్టు ఏమిటి, నీ డ్రెస్ ఏమిటి.. ప్రిన్సిపాల్ లెక్కన ఉన్నావా అంటూ మందలించారు. ఎక్కడి నుంచి వస్తావు అని అనగానే.. వరంగల్ నుంచి వస్తానని చెప్పగానే.. ఏం ఇక్కడ ఉండవా అంటూ డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. నోటీసు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ సీరియస్ అన్నారు. ఆ తరువాత ప్రిన్సిపాల్‌తో మొక్కను నాటించి మంచిగా చూసుకోవాలని సూచించారు. -
చెట్లతోనే మానవాళికి మనుగడ
జిల్లాలో విజయవంతంగా ప్రారంభం హంటర్‌రోడ్డులో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం, స్పీకర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం శుక్రవారం జిల్లాలోవిజయవంతంగా ప్రారంభమైంది. ఊరూరా.. వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటారు. హన్మ కొండ హంటర్‌రోడ్డులో డిప్యూటీ సీఎంకడియం శ్రీహరి, స్పీకర్‌తో కలిసి ఈ కార్య క్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హన్మకొండ : చెట్ల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం శుక్రవారం జిల్లాలో విజయవంతంగా ప్రారంభమైంది. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం కూడలి వద్ద కడియం... శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ హరితహారమన్నారు. సీఎం గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. వర్షాలు లేకపోవడం, పంటలు పండకపోవడం, వలసలు వెళ్లడానికి చెట్లు నశించడమే కారణమన్నారు. మొక్కల పెంపకంతో వాతావరణం సమతుల్యమై వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. చైనా, బ్రెజిల్ దేశాల తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమంగా తెలంగాణ హరితహారంను చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని పిలుపునిచ్చారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలను పెంచేలా బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మొక్కల సంరక్షణ సులువుగా ఉండేలా సామూహిక మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 4 కోట్ల మొక్కల చొప్పున మూడేళ్లలో 12 కోట్ల మొక్కలను నాటేలా.. ప్రతి గ్రామంలో 40,000 మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. రాజకీయాలకతీతంగా ప్రతిఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని పిలుపునిచ్చారు. హరితహారాన్ని ప్రతిఒక్కరూ సమష్టి బాధ్యతగా తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ హరితహారం పట్ల అకుంఠిత దీక్షతో ముందుకు పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాను అగ్రభాగంలో నిలపాలన్నారు. కాగా, హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న వారిచే ఉప ముఖ్యమంత్రి కడియం ప్రతిజ్ఞ చేయించి, మొక్కలు పంపిణీ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, కొండా సురేఖ, కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సిటీ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా తదితరులు పాల్గొన్నారు. డీఈఓ కార్యాలయం నుంచి వరంగల్ హంటర్‌రోడ్డు నాయుడు పెట్రోల్ పంపు వరకు రెండు కిలోమీటర్ల పొడవున విద్యార్థులు, 23 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు 2వేల మొక్కలను నాటారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ్యులు, కలెక్టర్, ఇతర అధికారులు ఓపెన్‌టాప్ జీప్‌లో ర్యాలీగా వెళ్లి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. -
వెబ్సైట్లో ఇంజనీరింగ్ సీట్లు,కాలేజీల జాబితాలేవీ?
♦ అన్ని కాలేజీలకు అందని వివరాలు ♦ అందుబాటులోకి తేకపోవడంపై అనుమానాలు సాక్షి, హైదరాబాద్ : జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ సోమవారమే పూర్తయినా మంగళవారం రాత్రి వరకు కూడా కాలేజీలు, సీట్ల వివరాలు వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులోకి రాలేదు. జేఎన్టీయూహెచ్ మాత్రం మంగళవారం సాయంత్రానికే అన్ని కాలేజీ యాజమాన్యాలకు అనుబంధ గుర్తింపునకు సంబంధించిన వివరాలను తెలియజేశామని పేర్కొన్నా.. మంగళవారం రాత్రి వరకు కొన్ని కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు వివరాలు అందడంతో మిగిలిన కాలేజీ యాజమాన్యాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. మళ్లీ ఏమైనా మార్పులు చేస్తున్నారేమోనని ఆందోళన చెందుతున్నాయి. కొన్ని కాలేజీల్లో సీట్ల పెంపునకు ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రిపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల అనుబంధ గుర్తింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయకపోవడంపట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌కు 2, 3 రోజుల ముందు వెబ్సైట్లో జాబితాను పెట్టాలన్న యోచనలో వర్సిటీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకవేళ కోర్టుకెళ్లినా తమకు ఆటంకాలు అడ్డుకావని, కౌన్సెలింగ్ సజావుగా సాగుతుందని వారు యోచిస్తున్నారు. 6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు! ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 6 నుంచి 9 వరకు చేపట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. 10న ఆప్షన్లలో మార్పులకు, 12 లేదా 13న సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 13 నుంచి రెండో దశ, 19 నుంచి తుది దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలిని భావిస్తోంది. ఈ షెడ్యూల్‌ను బుధవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 4 వరకు అభ్యంతరాల స్వీకరణ: కడియం జేఎన్టీయూహెచ్ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం సచివాలయం లో విలేకరులతో కడియం మాట్లాడుతూ నిర్ణీత నిబంధనల మేరకు ప్రమాణాలు పాటించే కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చినట్లు చెప్పా రు. కాలేజీల యాజమాన్యాలకు ఏమైనా అభ్యం తరాలుంటే ఈ నెల 4 వరకూ జేఎన్టీయూహెచ్కు అప్పీల్ చేసుకోవాలన్నారు. -
హైదరాబాద్ బాబు జాగీర్ కాదు: కడియం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్-8, యూటీ అంటూ పూటకొక డిమాండ్ చేస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్ తెలంగాణ ఆస్తి అని, బాబు జాగీర్ కాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మహిళా వసతి గృహానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. -
రూ.1,500 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి: కడియం
గండేడ్: మూడు నెలల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను రూ.1,500 కోట్లతో అభివృద్ధి పర్చనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గండేడ్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గేల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.32 కోట్ల వ్యయంతో అందించిన డ్యూయల్ డెస్క్ టేబుళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, నీరు, విద్యుత్ సరఫరా, కిచెన్షెడ్లు, ప్రహరీల నిర్మాణా లు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌తో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను మూతవేయబోమని స్పష్టం చేశారు. త్వరలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పట్లో డీఎస్సీ లేదు: ఇప్పట్లో డీఎస్సీ ప్రకటించే అవకాశంలేదని కడియం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గండేడ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందిం చారు. ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం కుల్కచర్ల: సమస్యలను పరిష్కరించాలని నిరసనకు దిగిన ఉపాధి హామీ సిబ్బందిపై కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల్కచర్ల మండలం రాంపూర్‌లోని ఆశ్రమ పాఠశాల భవనం ప్రారంభోత్సవం అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా ఉపాధిహామీ సిబ్బంది నిరసనకు దిగారు. -
‘ప్రథమ’లో 66%, ‘ద్వితీయ’లో 42% ఉత్తీర్ణత
* ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల * ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి * రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జూలై 4 చివరి తేదీ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో (జనరల్) 3,02,349 మంది పరీక్షలకు హాజరుకాగా 2,00,253 మంది (66.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారు 1,50,685 మంది ఉండగా మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు 49,588 మంది ఉన్నారు. ఇక ప్రథమ సంవత్సరం వొకేషనల్‌లో 12,392 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 6,342 మంది (51.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,61,294 మంది పరీక్షలకు హాజరవగా 68,996 మంది (42.77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 9,508 మంది పరీక్షలకు హాజరుకాగా 4,668 (49.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే అత్యధిక ఉత్తీర్ణతను సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలవారీగా చూస్తే ప్రథమ సంవత్సరంలో 52 శాతం మంది ప్రభుత్వ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే ప్రైవేటు కాలేజీలకు చెందిన 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 45 శాతం మంది ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఉత్తీర్ణులైతే ప్రైవేటు కాలేజీలకు చెందిన 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడు రోజుల్లో మార్కుల జాబితాలు మార్కుల జాబితాలను కాలేజీలకు అందించేందుకు వాటిని మూడు రోజుల్లో ప్రాంతీయ ఇన్స్పెక్షన్ అధికారులకు పంపనున్నారు. ప్రిన్సిపాళ్లు వాటిని జూలై 1న తీసుకొని వీలైనంత త్వరగా విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. మార్కుల మెమోల్లో తేడాలు, తప్పులుంటే ప్రిన్సిపాళ్ల ద్వారా జూలై 27లోగా బోర్డుకు తెలియజేయాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఆన్లైన్లోనే దరఖాస్తులు మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌తోపాటు జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం విద్యార్థులు జూలై 4లోగా దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ. 100, రీవెరిఫికేషన్‌తోపాటు జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చొప్పున ఆన్లైన్ www.tsbie.cgg.gov.in ద్వా రా, మీసేవా లేదా ఏపీ ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఈ ఫీజును చెల్లించాక వెబ్సైట్ ద్వారా లేదా ఏపీ ఆన్లైన్ లేదా మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. -
ఇంటర్ విద్య పటిష్టతకు చర్యలు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి * ఎంసెట్‌కు హాజరయ్యే వారికి ప్రత్యేక శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్య పటిష్టానికి పక్కా చర్యలు చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు కాలేజీల విద్యార్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తామని, ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా లెక్చరర్లకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. లెక్చరర్లు కూడా బాగా పని చేయాలని, ప్రభుత్వ కాలేజీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక తరగతుల నిర్వహణ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని, వచ్చే ఏడాది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎంసెట్‌కు సిద్ధమయ్యే ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, అందుబాటులోకి వచ్చే సీట్ల వివరాలను ఈనెల 28న తెలుస్తాయన్నారు. త్వరలోనే వర్సిటీలకు వీసీల నియామకంపై చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న కడియం... ఆ విధానం అమలుపై పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సును రద్దు చేయబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఓయూ పీజీ కోర్సుల్లో సీబీసీఎస్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య వెల్లడించారు. డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్ అమలుకు ఏర్పాట్లపై దృష్టి సారించామన్నారు. ఏపీ ఇంటర్ బోర్డు డబ్బును విజయవాడకు తరలించిన వ్యవహారంలో కేసు పెడతామన్నారు. కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయించినందుకు కడియంకు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, విద్యార్ధులు ధన్యవాదాలు తెలిపారు. -
‘అనాథల’ పథకాలపై సమీక్ష
కడియం నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనాథలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి? ఇంకా మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వపరంగా ఏంచేస్తే బావుంటుందనే దానిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రభుత్వపరంగా, స్వచ్ఛంద సంస్థలు, ఇతరత్రా చేపడుతున్న కార్యక్రమాల వల్ల అనాథలకు ఏ మేరకు మేలు జరుగుతుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. గురువారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రి జోగు రామన్న తదితరులతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. ప్రస్తుతం అనాథల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల తీరు ఎలా ఉంది, వాటికి మెరుగులు దిద్ది మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏంచేస్తే బావుంటుందనే దానిపై చర్చించారు. ఆయా అంశాలకు సంబంధించి పరిశీలన జరిపి టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదికలు సమర్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులను కడియం ఆదేశించారు. ఈ నెల 30న జరిగే సమావేశానికల్లా ఆయా శాఖలు, ఇతరత్రా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జ్యోతిరెడ్డి.. రాష్ట్రంలో అనాథలను చేరదీసి వారికి విద్యాబుర్ధులు నేర్పించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త జ్యోతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనాథ బాలల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి సహా అనేక మంది ప్రముఖులను కలసి చేసిన విజ్ణప్తికి సానుకూలంగా స్పందించారని ఆమె ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. -
ఇంటర్లో అన్ని సేవలూ ఆన్లైన్లోనే
* 22 రకాల సేవలు అందించేందుకు బోర్డు సిద్ధం * జూలై 1 నుంచి అందుబాటులోకి.. సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా విద్యార్థులు, యాజమాన్యాలకు అందించే వివిధరకాల సేవలన్నింటిని ఇకపై ఆన్లైన్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు బోర్డు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా 22 రకాల సేవలను ఆన్లైన్ ద్వారానే అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ (www.tsbie.cgg.gov.in)ను ఏర్పాటు చేశారు. జూలై 1వ తేదీ నుంచే ఈ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బోర్డు కార్యాలయానికి వచ్చినపుడు ఏ పని కావాలన్నా లంచం అడుగుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కడియం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ సేవలను ఆన్లైన్ ద్వారా అందించే ఏర్పాటు చేశామని, పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. సేవలు పొందే వారు చెల్లించాల్సిన నిర్ణీత మొత్తాన్ని కూడా అన్లైన్లోనే చెల్లించే ఏర్పాట్లు చేశారు. -
డీఎస్సీకి జాప్యం తప్పదు
హేతుబద్ధీకరణ తర్వాతే ఖాళీలపై స్పష్టత: కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ఆలస్యం తప్పదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సచివాలయంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తయ్యాక ఉపాధ్యాయ ఖాళీలపై లెక్కలు తేలుతాయన్నారు. ఆ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. 1998 నుంచి 2012 వరకు జరిగిన డీఎస్సీలలో మిగిలిపోయిన వారికి ఏ మాత్రం అవకాశమున్నా పోస్టింగులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని పేర్నొన్నారు. దీనిపై ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం అడిగామన్నారు. అభిప్రాయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ బదిలీలపై పత్రికల్లో వివిధ కథనాలు వస్తున్నాయని, ప్రభుత్వపరంగా ఎలాంటి అక్రమ బదిలీలు చేయలేదని కడియం వివరించారు. విచక్షణాధికారంతో 19 బదిలీలు మాత్రమే చేశామన్నారు. అందులో 16 బదిలీలు జిల్లాల పరిధిలోనే చేశామని చెప్పారు. ఒక బదిలీ మాత్రం హైదరాబాద్ కు, మరొక బదిలీని కరీంనగర్ నుంచి ఖమ్మంకు, ఒక ప్రధానోపాధ్యాయుడిని ఒకే జోన్లో వేరే జిల్లాకు బదిలీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి బదిలీలు చేయలేదని, జిల్లాలో ఇప్పటికే నాన్ లోకల్ కేటగిరీలో కోటాకు మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇకపై రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి బదిలీగానీ, డిప్యుటేషన్గానీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఒత్తిళ్లున్నా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యాశాఖ అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని స్కూళ్లలో టాయిలెట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర ్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన తర్వాతే ఖాళీ పోస్టులను భర్తీ చే స్తామన్నారు. జీవో 1 ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకే రకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిందేనని, ప్రైవేటు స్కూళ్ల ఇష్ట ప్రకారం ప్రభుత్వం నడవదని కడియం వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని, అమలు చేయకపోతే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రతి స్కూల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని, ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. స్కూల్ ఫీజుల నియంత్రణ విషయంలో కోర్టులో కేసు తేలగానే చర్యలు చేపడతామన్నారు. హేతుబద్ధీకరణ తరువాతే ఆలోచన: కడియం ప్రాథమిక పాఠశాలల్లో 30 మందిలోపు విద్యార్థులు ఉన్న వాటికి అదనపు టీచర్‌ను ఇచ్చే విషయంలో హేతుబద్ధీకరణ, బదిలీల తరువాతే ఆలోచిస్తామని కడియం చెప్పారు. పాఠశాలకు ఒకే టీచర్‌ను ఇచ్చేలా హేతుబద్ధీకరణ ఉత్తర్వులు ఉండడం వల్ల ఆ స్కూళ్లలో ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని కడియం దృష్టికి తీసుకెళ్లగా దీనిపై తరువాత ఆలోచిస్తామని తెలిపారు. రేషనలైజేషన్ పూర్తయ్యాక 30 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లకు టీచర్‌ను ఇవ్వాలా? అకడమిక్ ఇన్స్ట్రక్టర్ను ఇవ్వాలా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
భారీగా తగ్గిన ఇంటర్ పుస్తకాల ధరలు!
ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పుస్తకాల ధరలు భారీగా తగ్గాయి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో పుస్తకాల నాణ్యత పేరుతో ధరలను విపరీతంగా పెంచిన అధికారుల వైఖరితో తెలుగు అకాడమి తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన పలుమార్లు చర్చించి పుస్తకాల ధరలు తగ్గించాలని నిర్ణయించారు. మరోవైపు పుస్తక విక్రేతలు ఇప్పటికే పాత ధరలతో కొనుగోలు చేసిన పుస్తకాల ధరలను కూడా తగ్గించి... వారు ఎక్కువగా చెల్లించిన సొమ్ము మేరకు అదనంగా పుస్తకాలను ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఇతర వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని పుస్తకాల ధరలు తగ్గుతున్నాయి. -
ప్రభుత్వ కాలేజీలకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అన్ని కళాశాలలకు సొంత భవనాలు, ల్యాబ్‌ల సౌకర్యం, ల్యాబ్ పరికరాల కొనుగోలుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం సచివాలయంలో పాలీసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ముందుగా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆ తరువాత బోధనా సిబ్బంది నియామకం చేపడుతామన్నారు. 25 కళాశాలలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.142.42 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. 19 పాలిటెక్నిక్ కాలేజీల్లో బాలికల హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 19 కోట్లు ఇచ్చామని, ఇందులో 15 హాస్టళ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. అలాగే వికారాబాద్‌లో రూ. 8 కోట్లతో పాలిటెక్నిక్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ. 34 కోట్లతో 23 పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది ప్రారంభించిన 8 పాలిటెక్నిక్‌లలో బోధన సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. ఇదిలాఉండగా, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ఉచితంగా ప్రవేశాలు కల్పించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉప కడియం శ్రీహరి స్వయంగా ఈ అంశంపై పరిశీలన జరుపుతున్నారు. -
పేదలు..అనాథ పిల్లలకు రక్షణగా ప్రభుత్వం
- 2016-17 నుంచి కేజీ టు పీజీ విద్య - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - ఉద్యమాల ఖిల్లా.. ఓరుగల్లు : నాయిని నర్సింహారెడ్డి - ఎస్సెస్సీ, ఇంటర్ ప్రతిభా విద్యార్థులకు ప్రజ్ఞాపురస్కారాల అందజేత కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పేద, అనాధ పిల్లలకు రక్షణగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం క డియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లాలో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన ప్ర భుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వి ద్యార్థులకు ప్రజ్ఞా పురస్కారాలను బుధవా రం అందజేశారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేట గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్, కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈఓ జ్యోతిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016-17 సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్య అందించనున్నట్లు చెప్పారు. కామన్ స్కూల్ విధానం తీసుకురానున్నట్లు వివరించారు. అనాథలు, పేద పిల్లలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న జ్యోతిరెడ్డి అభినందనీయురాలన్నారు. రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు పోరుగల్లు అని, ఉద్యమ ఖిల్లా అన్నారు. అలాంటి గడ్డమీద కష్టపడి చిదివి ఉన్నత స్థాయికెదిగిన జ్యోతిరెడ్డి అమెరికాకు వెల్లినా ఇక్కడి అనాధ, పేద పిల్లల కోసం పాటుపడుతుండడం ఆదర్శనీయమన్నారు. అనాథ పిల్లలకు అడ్రస్ ఏర్పాటు చేయడం, వారి భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. విద్యావ్యవస్థ బాగుపడితేనే అంతా బాగుపడుతుందన్నారు. లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ పేదల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో తాను ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామన్నారు. దేశంలో 3 కోట్ల మంది అనాథలున్నారని, వారికి విద్య, భవిష్యత్, చిరునామా, హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. ఇలాంటి అనాథలు, పేద పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ సందర్బంగా టెన్త్‌లో ఒకరు, ఇంటర్లో ఇద్దరు విద్యార్ధులకు రూ.10 వేల చొప్పున రూ.30 వేల నగదుతో పాటు బ్యాగు, మెమొంటో, సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా అందించారు. మరో 85 మంది విద్యార్థులకూ మెమొంటోలు, సర్టిఫికెట్లు, బ్యాగులు అందించారు. ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్కిషోర్జా, టీఆర్ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షులు టి.రవీందర్రావు, నన్నపునేని నరేందర్, వాగ్దేవి విద్యాసంస్థల అధినేత దేవేందర్రెడ్డితోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయూలి కరీమాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ మేరకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నారుుని నర్సంహారెడ్డిని చేర్యాల జెడ్పీఎస్ఎస్ విద్యార్థిని ఎ.సమత కోరింది. వారు నవ్వుతూ... కచ్చితంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కడియం, బోడకుంటికి ఎమ్మెల్సీ గిరి
- టీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయం - శ్రీహరి ఎంపీగా రాజీనామా చేసే అవకాశం - వెంకటేశ్వర్లుకు మరో చాన్స - నేడు నామినేషన్ దాఖలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు. శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో శ్రీహరికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కడియం గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూన్ 1న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరు స్థానాలకు ఇంత కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే పోలింగ్ జరుగుతుంది. సమాన సంఖ్యలో నామినేషన్ దాఖలైతే పోలింగ్ లేకుండానే ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది. ఏడాది క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో శ్రీహరి వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. అనూహ్య పరిస్థితులతో ఈ ఏడాది జనవరి 25న ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా లోక్‌సభ సభ్యుడిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం గతంలో ఎప్పుడు జరగలేదు. వరంగల్ ఎంపీగా ఉన్న శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో ఆరు నెలల(జూలై 24)లోపు ఆయన రాష్ట్ర చట్టసభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో టీఆర్ఎస్ అధిష్టానం కడియంకు అవకాశం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనుండడంతో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనుండడంతో శ్రీహరి వరంగల్ లోక్‌సభ సభ్యత్వానికి గురువారమే రాజీనామా చేసే అవకాశం ఉంది. లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే జూన్ 1న రాజీనామా చేయనున్నారు. ‘బోడకుంటి’కి మరో చాన్స్ జిల్లా నుంచి కడియంతోపాటు బోడకుంటి వెంకటేశ్వర్లుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన ‘బోడకుంటి’ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చేరిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంకటేశ్వర్లుకు మరోసారి అవకాశం దక్కింది. కాగా, గురువారం కడియంతోపాటు వెంకటేశ్వర్లు కూడా నామినేషన్ వేయనున్నారు. -
కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య
మారేడ్‌పల్లి: కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ, నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ‘‘తెలంగాణ లో ఉన్నత విద్య బలోపేతం- సీబీసీఎస్ అమలు’’ అంశంపై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సెమినార్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రముఖ విద్యావేత్త హరగోపాల్ మాట్లాడుతూ విద్యావిధానంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలన్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో టీజీసీపీ అసోషియేషన్ అధ్యక్షుడు మారుతిరావు, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, టీజీసీటీ అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బ్రిజే ష్, కార్యదర్శి డాక్టర్ ఎస్.రమేశ్, టీఏఏసీటీ అసోషియేషన్ చైర్మన్ డాక్టర్ డేవిడ్‌ప్రేమ్‌రాజ్, అధ్యక్షుడు రాజరత్నం, కార్యదర్శి అర్జున్, కస్తూర్బాగాంధీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.అనితారెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ స్కూల్స్ 82.48 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాలలు 92.99 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 87. 83 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ 54.06శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 1,491 స్కూల్స్ వంద శాతం ఫలితాలను సాధించగా, 28 స్కూల్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు. టెన్త్ సప్లమెంటరీ పరీక్షల రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాల్సి ఉంది. టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
నేడే టెన్త్ ఫలితాలు
-
నేడే టెన్త్ ఫలితాలు
హాజరైన విద్యార్థులు 5.65 లక్షలు ⇒ ఇంటర్నెట్లో ఫలితాలు ⇒ ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ రూపంలోనూ తెలుసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజయ్యారు. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఇస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల సగటును లెక్కించి సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్) పాయింట్లు ఇస్తారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచే కాకుండా కొన్ని ప్రైవేటు వెబ్సైట్ల నుంచి కూడా పొందేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ రకాల మొబైల్ ఆపరేటర్ల నుంచి కూడా ఎస్ఎంఎస్ల రూపంలోనూ, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్సైట్లు www.sakshieducation.com www.aponline.gov.in www.bsetelangana.org www.results.cgg.gov.in ఎస్ఎంఎస్ల రూపంలో.. ఎయిర్‌సెల్/వొడాఫోన్/రిలయన్స్ 58888 ఐవీఆర్ఎస్ ద్వారా.. యూనినార్/ఎయిర్టెల్/ఎయిర్‌సెల్/వొడాఫోన్ 5333530 -
ముత్తిరెడ్డి x కడియం
- అధికారుల నిర్లక్ష్యంపై తీర్మానం చేయూలి : జనగామ ఎమ్మెల్యే - అక్కర లేదు : డిప్యూటీ సీఎం - సమావేశంలో నిరసన తెలుపుతానన్న యాదగిరిరెడ్డి - జెడ్పీలో ఇద్దరి మధ్య సంవాదం - అధికారుల నిర్లక్ష్యంపై తీర్మానం చేయూలని యాదగిరిరెడ్డి పట్టు - అక్కర్లేదన్న డిప్యూటీ సీఎం కడియం - నిరసన తెలుపుతానన్న ఎమ్మెల్యే - మంచినీటి సమస్యపై గరం గరం సాక్షి, హన్మకొండ : ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారుల వ్యవహార శైలిపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహారి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మధ్య జిల్లా పరిషత్ సమావేశంలో సంవాదం చోటుచేసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినా అధికారులు సరైన సమయంలో స్పందించడం లేదని దీనిపై తీర్మానం చేయాలని ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై తీర్మానం అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిగా అధికారుల తీరుపై తీర్మానం చేయకుంటే అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడిని అయినా సరే తాను సభలో నిరసన వ్యక్తం చేస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న సమావేశం దీంతో ఒక్కసారిగా వేడెక్కింది. వివరాలిలా ఉన్నాయి. జనగామ మండలంలో వడ్లకొండ, గానుగుపాడు గ్రామా ల్లో నెలకొన్న మంచినీటి సమస్యను జనగామ జెడ్పీటీసీ విజ య లేవనెత్తారు. ఆ తర్వాత జనగామ నియోజకర్గంలో మం చినీటి సమస్య వివరించేందుకు ముత్తిరెడ్డి మైకు తీసుకోగానే కడియం అడ్డుపడుతూ ‘ముత్తిరెడ్డిని మాట్లాడమంటే గోదావరి నీళ్లు కావాలంటడు.. వార్తల్లా కాకుండా సమస్యను క్లుప్తంగా చెప్పాలి’ అని సూచించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా నియోజకర్గంలో మంచినీటి కొరత తీర్చేందుకు కొత్త బోర్లు వేయడంతోపాటు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని గత సమావేశంలో అడిగాను. రూ. 3.5 కోట్లు చెల్లిస్తే ప్రత్యేక కరెంటు లైన్లు నిర్మించి నియోజకర్గం పరిధిలో 24 గంటల కరెంటు ఇస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా మా నియోజకర్గ పరిధిలో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ నిధులు ఈ పథకం కోసం తమ నిధులు కేటాయించారు. నేను కూడా కోటి రూపాయలు ఎమ్మెల్యే నిధులు జత చేసి మొత్తం రూ 3.5 కోట్లు కూడబెట్టాం. ఇందుకు సంబంధించి వేసవికి ముందే కలెక్టర్‌కు నివేదిక సమర్పించగా, ఒక్క రోజులోనే ఈ ఫైలుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కానీ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్‌లో ఈ ఫైల్‌ను రెండు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. మరో 15 రోజుల్లో వేసవి ముగుస్తుంది. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మా ప్రజాప్రతినిధులు నోరు కట్టుకుని నిధులన్నీ కేటాయిస్తే అధికారులు రెండు నెలలుగా ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడంతో మా సమస్య తీరలేదు’ అని అన్నారు. వేసవికాలం ముగుస్తున్నా తగు చర్యలు తీసుకోని అధికారుల తీరును నిరసిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తీర్మానం అవసరం లేదంటూ ఉపముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. తీర్మానం పెట్టకపోతే తాను అధికార పార్టీలో ఉన్నా సరే నిరసన తెలుపుతానంటూ ముత్తిరెడ్డి ధీటుగా స్పందిం చారు. చివరికి తీర్మానం చేస్తామంటూ అప్పటి వరకు చర్చను ముగించారు. చివరకు జిల్లా పరిషత్ తీర్మానాల్లో ముత్తిరెడ్డి డిమాండ్‌ను చేర్చకపోవడం కొసమెరుపు. -
‘సంక్షేమం’లో మార్పులు చేర్పులు
రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం నేడో, రేపో ముఖ్యమంత్రికి తుది నివేదిక హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో అవసరమైన మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ శాఖల పథకాల అమలుకు ఒకేవిధమైన ఆదాయ, వయో పరిమితిని ప్రభుత్వం నిర్ణయించనుంది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల రాయితీ గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచే విషయంపై ప్రభుత్వం దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు 2015-16లో అమలు చేయాల్సిన సబ్సిడీ విధానం, బ్యాంక్ లింకేజీ. ఆయా పథకాల నిబంధనలు, ఇంకా తీసుకురావాల్సిన మార్పులపై కూడా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 8న ఆయా శాఖల అధికారులు తీసుకొచ్చిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల బృందం విస్తృతంగా చర్చించిన విషయం విదితమే. వ్యక్తిగత రుణ విభాగం కింద గరిష్ట రుణ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడంతోపాటు రాయితీని రూ.5 లక్షలకు పెంచాలని అధికారులు ప్రతిపాదించగా మంత్రుల బృందం సానుకూలంగా స్పందించింది. ముఖ్యకార్యదర్శులు జె.రేమండ్‌పీటర్, టి.రాధా ఎస్సీ, బీసీ శాఖల అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించి, ఈ నెల 8న జరిగిన భేటీకి సంబంధించిన సమావేశ మినిట్స్‌కు తుదిరూపునిచ్చారు. గత సమావేశంలో ఆయా పథకాలకు సంబంధించి చేయాల్సిన మార్పులు, మార్గదర్శకాల్లో చేపట్టాల్సిన సవరణలు, ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన వచ్చిన సూచనలతో ఉన్నతాధికారులు తుది అంచనాను రూపొందించారు. వీటిని ఒకట్రెండు రోజుల్లోనే సీఎంకు సమర్పిస్తారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా సీఎం ఏవైనా ఆదేశాలిస్తే వాటికి అనుగుణంగా కొత్త రాయితీ విధానాన్ని ఖరారు కానుంది. కళాశాల విద్యార్థులకు పాకెట్ మనీ కాలేజీవిద్యార్థులకు నెలకు రూ.200 చొప్పున పాకెట్ మనీ ఇవ్వాలని, కాస్మోటిక్ చార్జీలను అమ్మాయిలకు నెలకు రూ.200, అబ్బాయిలకు రూ.150 ఇవ్వాలని ప్రతిపాదించారు. స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల యూనిట్ విలువ రూ.లక్ష అయితే 80 శాతం, రూ.2 లక్షలైతే 70 శాతం, రూ.3 లక్షలైతే 60 శాతం, రూ.4-5 లక్షలు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ పథకాలకు 50-55 ఏళ్ల వయో పరిమితి, గ్రామీణప్రాంతాల్లో ఆదా య పరిమితిని రూ. లక్షన్నరకు, పట్టణప్రాం తాల్లో రూ.2 లక్షలు పెంచాలని (ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకే ఈ పరిమితి ఉంది) సూచించారు. -
‘బిల్ట్’ పునరుద్ధరణకు సహకరించండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడియం శ్రీహరి విజ్ఞప్తి సబ్సిడీపై యూకలిప్టస్ కలప సరఫరా చేయాలని వినతి హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని బళ్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-బిల్ట్ (పూర్వపు ఏపీ రేయాన్స్) ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడును తెలంగాణ ఉప ముఖ్యమం త్రి కడియం శ్రీహరి కోరారు. మంగళవారం సచివాలయ ంలో చంద్రబాబును కలసి ఈ అంశంపై చర్చించారు. అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడటంతో వేలాది మంది వీధిన పడ్డారన్నారు. ప్రధానంగా యూకలిప్టస్ కలప కొరతతో కంపెనీ మూతపడిందని, యూకలిప్టస్ కలప ఉత్పత్తి ఏపీలో 70 శాతం అవుతుంటే తెలంగాణలో 30 శాతం మాత్రమే అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీపై ఫ్యాక్టరీకి తగి నంత యూకలిప్టస్ కలపను సరఫరా చేస్తే ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంటుందన్నారు. ఫ్యాక్టరీ ఏ ప్రాంతంలో ఉందని కాకుండా, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా దాని పునరుద్ధరణకు సహకరించాలని బాబును కోరినట్లు తెలిపారు. దీనిపై బాబు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనిపై తమ నిర్ణయం చెబుతామన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకరిస్తామన్నారు: ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సహకరిస్తామన్నారని టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు, టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్‌లు అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేసీఆర్‌ను కలిశామని, సబ్సిడీ కరెంటు, తగినంత బొగ్గు సరఫరా గురించి అడిగామని, కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌లు చొరవ తీసుకుంటే వీలైనంత త్వరలో ఫ్యాక్టరీ తెరుచుకునే అవకాశముందన్నారు. ఇప్పటికే కార్మికులు వీధినపడ్డారని, వారిని దృష్టిలో పెట్టుకుని సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
మిషన్ కాకతీయలో జిల్లా ఫస్ట్
అధికారులకు డిప్యూటీ సీఎం అభినందనలు చెరువు పనులు ఇంకా వేగవంతం చేయాలని పిలుపు అధికారులతో సమీక్షించిన కడియం శ్రీహరి వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులను ఆయన అభినందించారు. చెరువు పనుల పురోగతి, పనుల జాప్యంపై మంగళవారం ఆయన హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ కరుణ, ఎస్ఈ పద్మారావు, ఈఈలతో సమీక్షించారు. జూన్ రెండోవారం నుంచి వర్షాలు పడే సూచనలు ఉన్నందున మొదటి విడతలో మంజూరైన పనులన్నీ వేగంగా పూర్తి చేయాలన్నారు. అవినీతికి తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని, అక్రమాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మంజూరై టెండర్ పూర్తయిన పనులను వెంటనే చేపట్టాలన్నారు. పూడికతీతపై పూర్తిగా దృష్టి పెట్టినట్లే మత్తడి, తూములు, కట్ట మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. పనుల పర్యవేక్షణ కోసం ప్రతి చెరువుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. చెరువులకు అధికారులను నియమించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలన్నారు. చెరువుల ప్రత్యేక అధికారులు పనుల పురోగతిని నిర్ణీత నమూనాలో పొందుపర్చి... రోజు వారీ నివేదికలు అందజేయాలన్నారు. సంబంధిత ఏఈలతో నిత్యం సమీక్ష నిర్వహించాలని, తద్వారా పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఎస్ఈకి సూచించారు. పూడికతీత అనంతరం ఏ మేరకు చెరువుల్లో నిల్వ సామర్థ్యం పెరుగుతుందో అంచనాలు వేయాలన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ చెరువుల పూడికతీత, మట్టి రవాణా, మత్తడి మరమ్మతుల వివరాలు రోజూ వారి నిర్ణీత నమూనాలో పొందుపర్చి అందజేయాలని ఎస్ఈకి సూచించారు. 18.02 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత కాకతీయ మిషన్‌లో చేపట్టిన పూడికతీతల్లో సుమారు 18.02లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసినట్లు ఎస్ఈ పద్మారావు తెలిపారు. ఇప్పటి వరకు 20-25లక్షల క్యూ.మీ మట్టి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల కొన్ని చెరువుల పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈనెల 18నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాల కారణంగా పనుల పురోగతి తగ్గిందన్నారు. నె క్కొండ మండలంలో అలంకానిపేట, గూడూరు మండలం బొద్దుగొండ, కురవి మండలం నేరడ గ్రామాల్లోని చెరువుల పునరుద్ధరణ పనులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం పరిశీలిస్తున్నట్లు యన తెలిపారు. పనులు పూర్తికావొచ్చిన నెక్కొండ మండలం పత్తిపాక గ్రామంలోని ఊరచెరువు పనులను పరిశీలించాలని కోరగా... వీలుంటే తప్పకుండా వస్తామని డిప్యూటీ సీఎం చెప్పారన్నారు. -
గరం గరంగా గ్రేటర్ సమీక్ష 600 లీకేజీలు..15 రోజులు
- ఆ లోపు మరమ్మతులు పూర్తి చేయూల్సిందే... - మునిసిపల్ ఇంజనీర్లకు డీప్యూటీ సీఎం కడియం ఆదేశం - వారి పనితీరు బాగాలేదని అసహనం.. ఆగ్రహం - ఒక్కో డీఈకి ఒక్కో మార్కెట్‌ను దత్తత ఇవ్వాలని సూచన హన్మకొండ అర్బన్ : నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి పై ప్లైన్లకు ఏర్పడ్డ 600 లీకేజీలను 15 రోజుల్లో మరమ్మతులు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. వేసవిలో నగరవ్యాప్తంగా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ పనితీరుపై గురువారం ఆయ న హన్మకొండలోని కలెక్టరేట్లో సమీక్షించారు. కొందరు అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవడం పట్ల శ్రీహరి అసహనంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నగర పాలకసంస్థలో ఎంత మంది ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారంటూ అడిగిన శ్రీహరి.. ఆ వివరాలు చెబుతుండగానే అసలు మీ (కార్పొరేషన్) ఆదా యం ఎంత.. మీ ఆదాయానికి ఇంత మంది ఇంజనీరింగ్ అధికారులు అవసరమా అంటూ ప్రశ్నించారు. వరంగల్ ఈఈ పరిధిలోని 100 లీకేజీలు, హన్మకొండ ఈఈ పరిధిలోని 500 లీకేజీలను టెండర్లతో సం బంధం లేకుండా మరమ్మతు చేయాలన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు చెప్పిన పని.. తాను ఎంపీగా ఉన్నప్పుడు హన్మకొండ మండలంలోని అయోధ్యాపురం నీటి సమస్యను నేరుగా అధికారులకు ఫోన్‌చేసి వివరించానని.. ఆరు నెలలవుతున్నా ఆ సమస్య పరిష్కారం కాలేదంటే అధికారుల పనితీరు ఏంటో తెలుస్తోందని కడియం మండిపడ్డారు. అవసరాన్ని బట్టి బావులు, బోర్లు అద్దెకు తీసుకోవాలని, నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయూలని సూచించారు. వారి పని తీరుపై సమీక్షించండి.. నగర పాలక సంస్థలోని ఇంజనీరింగ్ అధికారులు పని తీరు సక్రమంగా లేదని, వారి పని తీరును సమీక్షించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను శ్రీహరి ఆదేశించారు. నగరంలో పండ్ల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, మటన్, చికెన్ మార్కెట్ల కోసం స్థల కేటాయింపులు పూర్తిచేయాలన్నారు. కుమార్‌పల్లి మార్కెట్లో కొనుగోలు దారులకు నరకం కనిపిస్తోందని, నిర్వహణ తీరు మారాల్సి ఉందని, ఈ విషయం లో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఒక్కో డీఈకి ఒక్కో మార్కెట్‌ను దత్తత ఇవ్వాలని కమిషనర్‌కు సూచించారు. నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు : కలెక్టర్ వేసవి వచ్చి నెలన్నర అవుతున్నా.. పైపులైన్ల లీకేజీలను మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యంగా ఉం డడంపై కలెక్టర్ కరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు స్వయంగా చెప్పినా... అధికారులు స్పందిచకపోవడం సరికాదన్నారు. పని తీరు మారకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ అహ్మద్ మాట్లాడు తూ మార్కెట్లో చెత్త సేకరణకు ఒక వాహనం, డివిజన్‌కు ఒక ట్రాక్టర్ కేటాయిస్తామని తెలి పారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటామని, స్వయంగా మార్కెట్ స్థలాలు సందర్శించి సిబ్బందికి తగు ఆదేశాలు ఇస్తామన్నారు. -
బాలికలే ఫస్ట్
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత అమ్మాయిల్లో 61.68 శాతం.. అబ్బాయిల్లో 49.60 శాతం పాస్ హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణత శాతం వారిదే అధికంగా ఉంది. ఇంటర్ ఫస్టియర్(జనరల్) పరీక్షలకు రాష్ట్రంలో 4,31,363 మంది హాజరు కాగా అందులో 2,39,954 మంది(55.62) ఉత్తీర్ణులయ్యారు. మొత్తం విద్యార్థుల్లో బాలికలు 2,15,029 మంది పరీక్షలు రాయగా 1,32,639 మంది (61.68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2,16,334 మంది బాలురు పరీక్షలు రాయగా, 1,07,315 మంది(49.60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో 71 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 43 శాతం ఉత్తీర్ణతతో నల్లగొండ చివరి స్థానంలో నిలిచింది. మార్చి 9 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం విడుదల చేశారు. వేగంగా ఫలితాలను సిద్ధం చేసిన అధికారులను అభినందించారు. ఈ నెలాఖరులోగా ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఇంటర్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ఇంటర్ బోర్డు సలహాదారు వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సలహాదారుగా అందించిన సేవలకుగాను వీరభద్రయ్యను ఈ సందర్భంగా సన్మానించారు. బీసీ గురుకులాల్లో 86 శాతం ఉత్తీర్ణత మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న (2014-15) జూనియర్ ఇంటర్ విద్యార్థులు 86 శాతం ఉత్తీర్ణతను సాధించారు. సీఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను 456 మార్కులు సాధించిన కె.అశోక్, ఎంఈసీ గ్రూపులో 500 మార్కులకుగాను 433 మార్కులు సాధించిన జి,అవినాశ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈ విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, ఈ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ టి.రాధ, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు అభినందించారు. 26 నుంచి మెమోల జారీ మార్కుల రిజిస్టర్లను రెండు రోజుల్లో సం బంధిత ప్రాంతీయ తనిఖీ అధికారులకు అందజేయనున్నారు. ప్రిన్సిపాళ్లు వాటిని తీసుకుని తమ తమ కాలేజీల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థుల మార్కుల జాబితాలను ఈ నెల 26 నుంచి ఆర్ఐవోలనుంచి ప్రిన్సిపాళ్లు తీసుకుని విద్యార్థులకు అందజేయాలి. మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా మే 22వ తేదీలోగా ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ కాలేజీల్లో 48.82 % పాస్: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లాల వారీగా ఉత్తీర్ణతను ప్రకటించిన ఇంటర్ బోర్డు ప్రైవేటు కాలేజీల ఉత్తీర్ణతను మాత్రం ప్రకటించలేదు. ప్రభుత్వ కాలేజీల్లో 48.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఎయిడెడ్ కాలేజీల్లో 36.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. -
22న ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు!
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ఈనెల 22న విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల వెల్లడి కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పంపించిన ఫైలు ఆమోదం పొందినట్లు తెలిసింది. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈనెల 28న వెల్లడించే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,251 కేంద్రాల్లో గత నెల 9 నుంచి 27 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తం 9,73,237 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,06,789 మంది ఉన్నారు. మరోవైపు పదో తరగతి పరీక్ష ఫలితాలను మే రెండో వారంలో వెల్లడించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీలైతే మే 11 లేదా 12న ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
ఉద్యోగులకు అండగా ఉంటా..
డిప్యూటీ సీఎం కడియం ఉద్యోగులకు అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి శ్రీహరి అన్నారు. హన్మకొండలో గురువారం జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభలో పాల్గొని మాట్లాడారు.. హన్మకొండ : ఉద్యోగులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్లోకి రావడం వల్ల తనకు అన్నీ మంచి శకునాలే జరిగాయని అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభ గురువారం జరిగింది. సభలో కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగ జేఏసీ నాయకులతోపాటు తనను అభిమానించే వారు, తెలంగాణ కోరుకునే శక్తులు టీడీపీలో ఎన్ని రోజులుంటారు.. అందులోంచి బయటకు రావాలని వత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్లో చేరడంతో ఎంపీగా ఎన్నికయ్యాయని, ఊహించకుండానే డిప్యూటీ సీఎం అయ్యూనన్నారు. జిల్లాకు చెందిన కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. దేవీప్రసాద్ సలహాలు, సూచనలు తీసుకొని అధ్యక్షుడిగా రాణించాలన్నారు. రవీందర్‌రెడ్డికి, హమీద్‌కు ఉద్యోగులు చేదోడు వాదోడుగా ఉండాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చెందకుండా ఇంకా కొందరు ప్రత్యక్షంగా, పరోక్షం కుట్రలు చేస్తున్నారన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. దేవీప్రసాద్‌కు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని, ఏదో ఒక అవకాశం కల్పిస్తారన్నారు. జిల్లాకు దక్కిన గౌరవం: కారం రవీందర్‌రెడ్డి,టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్జీవోస్ యూనియన్‌కు తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవమని కారం రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా ఉద్యోగులు అం దించిన సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానన్నా రు. రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల సాధనకు జరి గిన పోరాటంలో జిల్లా ఉద్యోగులు కనబరిచిన పాత్ర అమోఘమన్నారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం టీఎన్జీవోస్ యూనియన్‌కు కేఆర్.ఆమోస్ నుంచి ఇప్పటివరకు అందించిన అన్ని నాయకత్వాల మార్గంలో తాము సేవలందిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అదనంగా రెండు గంటలు పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యోగులం నడుచుకుంటామన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగులం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల కుటుంబాలకు ఒకటిన్నర రోజు జీతం విరాళంగా ఇచ్చి ఆదుకున్నామన్నారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను జూన్ వరకు పొడిగించిందని, దీనిని అక్టోబర్ వరకు పొడిగించే అవకాశముందని చెబుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈనెల 19న కాకతీయ మిషన్ కార్యక్రమంలో శ్రమదానం చేయనున్నట్లు చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హామీద్ మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్‌ను టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా శాఖ, ఉద్యోగ జిల్లా శాఖ, టీఎన్జీవోస్ యూనియన్ ఆయా ప్రభుత్వ శాఖల యూనిట్లు, ఇతర ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఘనంగా పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించాయి. కాగా, డీసీసీబీ చైర్మన్ జంగా రాాఘవరెడ్డి కారం రవీందర్‌రెడ్డిని సన్మానించారు. టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, జోరిక రమేశ్, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీజీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర నాయకులు రేచల్, జిల్లా నాయకులు రత్నవీరాచారి, హసనుద్దీన్, ఈగ వెంకటేశ్వర్లు, సురేందర్‌రెడ్డి, రత్నారెడ్డి, సదానందం, బి.రాము, బి.సోమయ్య, శ్యాంసుందర్, రాంకిషన్, ఇబ్రహీం హుస్సేన్, మాధవరెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, సాదుల ప్రసాద్, సామ్యేల్, కత్తి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజుల పథకానికి తూట్లు
⇒ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దుపై అసెంబ్లీలో విపక్షాల ధ్వజం ⇒ ప్రభుత్వంపై బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌ల ముప్పేట దాడి ⇒ సీఎం గతంలో చేసిన ‘పౌల్ట్రీ ఫారాల్లో కాలేజీల’ వ్యాఖ్యలపై మండిపాటు ⇒ ఆ కళాశాలల పేర్లు తెలపాలంటూ బీజేపీ పట్టు ⇒ ఫీజుల పథకంపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్, బీజేపీల వాకౌట్ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు అంశం మంగళవారం శాసనసభను కుదిపేసింది. కాలేజీల రద్దు ద్వారా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోందంటూ విపక్షాలు చేసిన మూకుమ్మడి దాడితో సభ అట్టుడికింది. ఈ అంశంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్, ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ సభ్యులు డి.కె.అరుణ తదితరులు లేవనెత్తిన ప్రశ్న సభలో దాదాపు 2 గంటలపాటు దుమారం రేపింది. దీనిపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెం దని విపక్షాలు ‘సరైన సమాధానం’ కోరుతూ పదేపదే పట్టుబట్టాయి. ఫీజుల పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చుతోందని నిరసన తెలుపుతూ కాంగ్రెస్, బీజేపీ పక్షాలు చివరకు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రైవేటు కళాశాలల అంశంపై ఇదే సెషన్లో మళ్లీ చర్చకు అవకాశమిస్తామని, ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తామని కడియం హామీ ఇవ్వడంతో సభలో చర్చకు తెరపడింది. ఆర్థికభారం తగ్గించుకోవడానికే: బీజేపీ పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ షెడ్లను ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చి నిర్వహిస్తున్నారంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సమాధానమివ్వాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. ఎన్ని కళాశాల లు పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ షెడ్లలో నడుస్తున్నాయి? ఎన్ని కళాశాలల మీద పోలీసు కేసులు పెట్టారు? ఫీజుబకాయిల విడుదలలో అవి నీతికి పాల్పడినట్లు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిలదీశారు. ఆర్థిక భారం తగ్గించుకోడానికే కళాశాలల గుర్తింపును రద్దు చేశారని మండిపడ్డారు. ఇంజనీరింగ్ సీట్ల కుదింపు, కళాశాలల మూసివేతకు దాదాపు 200 కళాశాలలు దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పౌల్ట్రీ ఫారాలలో నిర్వహిస్తున్న కళాశాలల పేర్లు తెలపాని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణలో చేసిన జాప్యంతో వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోయారన్నారు. 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ జరపకపోవడంతో ప్రైవేటు ఇంజనీరింగ్, ఇంటర్ కళాశాలల అధ్యాపకులు పస్తులుం టున్నారని జి.కిషన్‌రెడ్డి(బీజేపీ) ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పీజీ సీట్లే లేవు: అక్బరుద్దీన్ ప్రభుత్వ విద్యా విధానం తప్పుగా ఉందని ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గత ఐదేళ్లలో చెల్లించిన రూ. 30 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులతో జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలలు స్థాపించవచ్చన్నారు. అర్హులైన ప్రిన్స్పల్స్, సరిపడ బోధన సిబ్బంది, పరికరాలు, వసతులు లేకపోయినా ప్రభుత్వ కళాశాలలను కొనసాగిస్తున్నారన్నారు. ప్రైవేటు కళాశాలల గుర్తింపు రద్దు విషయంలో అవలంబించిన విధానాన్నే ప్రభుత్వ కళాశాలల విషయంలో ఎందుకు అమలు చేయరని ప్రభుత్వాన్ని నిలదీశారు. యూజీతో పోల్చితే పీజీ కోర్సుల్లో కేవలం 10 శాతం కూడా సీట్లు లేకపోతే, అర్హులైన అధ్యాపకులు ఎక్కడ నుంచి వస్తారన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే 50 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేసేందుకు అనుమతి కోరగా, మరో 40 కళాశాలలు సైతం మూసివేసేతకు సిద్ధమవుతున్నాయన్నారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. థర్డ్ పార్టీ నిపుణుల కమిటీ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో తనఖీలు జరిపి సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. సౌకర్యాలు మెరుగుపరచుకున్న కళాశాలల గుర్తింపును పునరుద్ధరించాలన్నారు. గుర్తింపు పునరుద్దరణ అంశంపై కళాశాలల యాజమాన్యాలతో సమావేశం ఏర్పా టు చేసి మైనారిటీ, మైనారిటీయేతర కళాశాలల ప్రతినిధులతో చర్చలు జరపాలన్నారు. ఇంజనీరింగ్ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం: కాంగ్రెస్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్య బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందని పువ్వాడ అజయ్‌కుమార్ (కాంగ్రెస్) విమర్శించారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన ఇంజనీరింగ్ విద్యార్థులు హోంగార్డులు, ఉపాధి కూలీలుగా మారుతున్నారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపునకు చేరుకున్నా ప్రభుత్వం ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాలను ఖరారు చేయలేదని జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) ధ్వజమెత్తారు. ఫీజులు చెల్లించలేదని 40 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వలేదన్నారు. ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా మాదే బాధ్యత: కడియం ఫీజుల భారం తగ్గించుకోడానికే ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తోసిపుచ్చారు. ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెంచడానికే కళాశాలలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామన్నారు. ఫీజుల చెల్లింపు కోసం 371డీ ఆర్టికల్ ఆధారంగా విద్యార్థుల స్థానికతను నిర్ధారిస్తామన్నారు. ఫీజు రీయిం బర్స్మెంట్ రాక ఏ ఒక్క విద్యార్థి నష్టపోయి నా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక రూ.1,587.78 కోట్ల పాత బకాయిలు కలిపి మొత్తం రూ.2,017.90 కోట్ల ఫీజులను చెల్లించామన్నారు. 2014 మేలో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలి విడత తనిఖీలు నిర్వహించిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో మళ్లీ రెండో విడత తనఖీలు నిర్వహించి ఏఐసీటీఈ నిబంధనలు పాటించని 163 కళాశాలల గుర్తింపు రద్దు చేశామన్నారు. ప్రైవేటు కళాశాలలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని, థర్డ్ పార్టీ నిపుణులతో తనిఖీలు జరిపించాలని, ఆలోగా ఈ కళాశాలలను కౌన్సిలింగ్‌కు అనుమతించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఐఐటీహెచ్, నీట్స్, బిట్స్ పిలానీకి చెందిన నిపుణులతో ఏర్పాటు చేసిన థర్డ్ పార్టీ కమిటీ గత జనవరి 31న నివేదిక సమర్పించిందన్నారు. నిర్మిత స్థలం, బోధన సిబ్బంది, ప్రయోగశాల, కంప్యూటర్లు, గ్రంథాలయాల ఏర్పాటుకు సంబంధించి 163 కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనలు పాటించట్లేదని తేలడంతో గుర్తింపు రద్దు కారణాలు తెలుపుతూ ఆ కళాశాలలకు లేఖలు పంపామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,76,770 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, అందులో 76,594 సీట్లు భర్తీ అయ్యాయని, లక్ష సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. -
ముక్కోటి దండాలు
కనులపండువగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా శివపార్వతుల కల్యాణం శివుడి సేవలో ప్రముఖులు మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు ఓంకారనాదంతో మార్మోగారుు.. మంగళవారం వేకువజాము నుంచే భక్తులు బారులుతీరారు.. శివపార్వతుల కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.. పొరుగు జిల్లాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి అశేష భక్తులు తరలివచ్చారు.. జాగరణ సందర్భంగా ఆలయ ప్రాంగణాల్లో భజనలు, కీర్తనలు జరిపారు.. వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు మల్లన్న ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. చారిత్రక శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్థంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి ఉదయం 2 గంటల నుంచే ప్రత్యేకార్చనలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ వేదపండితులు, అర్చకులు సుప్రభాతసేవ, మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకాలను నిర్వహించారు. ఘనంగాశ్రీరుద్రేశ్వరస్వామి, శ్రీరుద్రేశ్వరీ అమ్మవారి కల్యాణం సాయంత్రం 6.32 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రమున గోధానాళి లగ్న సుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి శ్రీరుద్రేశ్వరీ అమ్మవారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్ సతీసమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాల ను సమర్పించగా స్పీకర్ సిరికొండ మధుసూదనచారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలను అందజేశారు. కలెక్టర్ కరుణ పాల్గొని రుద్రాభిషేకం నిర్వహించారు. పూజల్లో మాజీ ఎంసీ సిరిసిల్ల రాజయ్య, టీడీపీ నాయకుడు చాడా సురేష్‌రెడ్డి, జిల్లా జడ్జి వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి జీవన్ పాటిల్, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వేముల శ్రీనివాస్, వేముల సత్యమూర్తి, రచయిత పొట్లపల్లి శ్రీనివాసరావు, ఐనవోలు సత్యమోహన్, బండా ప్రకాష్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.కల్యాణం అనంతరం ఇండియన్ ఓవర్సీస్ సౌజన్యంతో టీటీడీ ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవార్లు కొనసాగాయి. కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ టి సాయిబాబా, పర్యవేక్షకులు అనిల్‌కుమార్, శ్రీరుద్రేశ్వర సేవా సమితి సభ్యులు చొల్లేటి కృష్ణమచారి, గండ్రాతి రాజు, పులి రజనీకాంత్, గౌరిశెట్టి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో వారణాసి జ్యోతిర్లింగ కాశీ క్షేత్రం నుంచి తెప్పించిన లక్షా పదకొండు వేల పంచముఖ రుద్రాక్షలతో లక్ష రుద్ర మహాభిషేకం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో బజ్జూరి శ్యాంసుందర్, వాగ్దేవి కళాశాలల కరస్పాండెంట్ చందుపట్ల దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. హన్మకొండ డీఎస్పీ పుల్లా శోభన్‌కుమార్, సీఐ కిరణ్ కుమార్ నేతృత్వంలో పోలిసులు బందోబస్తు నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి వద్దిరాజు రాజేందర్ ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. రాత్రి 8 గంటల వరకు పది లక్షల మంది భక్తులు శ్రీరుద్రేశ్వరున్ని దర్శించుకున్నట్లు అంచనా. -
డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ
స్టేషన్లో చిచ్చు డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ఆధిపత్య పోరు అధికారులకుసంకటంగా మారిన పరిస్థితి లింగాలఘణపురం : స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు తమ వెంట ఉండే ద్వితీయ శ్రేణి నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించే విషయంలో వివాదాలు ఉండేవి. తాజాగా ప్రభుత్వ పథకాలు, పరిపాలన అంశాల్లో కూడా పోరు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి మార్పు తర్వాత తన నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా సహించేదిలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య పదేపదే ప్రకటిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ లబ్ధిదారుల విషయంలో ఇదే జరిగింది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను సన్న, చిన్నకారు రైతులకు అందిస్తోంది. ఇటీవల జిల్లాకు 94 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వ్యవసాయశాఖలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్, మహబూబాబాద్, మరిపెడ, నర్సంపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ మండలాలకు సగటున రెండు చొప్పున కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ట్రాక్టరుపై గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. నిబంధనల ప్రకారం.. ఆయా గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి సర్పంచ్, ఎంపీటీసీ.. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఏవోల ఆమోదంతో సబ్సిడీ పరికరాల పంపిణీ ప్రాధాన్యత కల్పించాలి. మరో ఉదాహరణ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మండలాలకు రెండు చొప్పున ట్రాక్టర్లు కేటాయించారు. తనకు దగ్గరగా ఉండే ఒక రైతుకు సబ్సిడీ ట్రాక్టర్ పంపిణీ అయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సిఫారసు లేఖ ఇచ్చారు. పథకానికి సంబంధించి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నట్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీవోలతోనూ సంతకాలు చేసి ఆమోదం తెలిపారు. ఇక రేపోమాపో ట్రాక్టర్ వచ్చేస్తుందనే ధీమాతో దరఖాస్తు చేసుకున్న రైతు ఓ ట్రాక్టర్ కంపెనీ యజమానిని వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. విషయం తెలిసిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఆగ్రహం ఆ దరఖాస్తును వెనక్కి తీసుకరావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మధ్య అధికార యంత్రాంగం బిక్కుబిక్కుమంటున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. సబ్సిడీ ట్రాక్టర్లకు సంబంధించి మార్చి 30లోగా లబ్ధిదారుల ఎంపిక చేసి పంపిణీ పూర్తి చేయాలి. ప్రజాప్రతినిధుల సిఫారసులతో తాము ఏం చేసే పరిస్థితి లేదని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని రైతులకు కనీసం సమాచారం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించిన జాండీర్, సుబోటో, న్యూహోలాండ్, ఎస్కర్ట్ కంపెనీల షోరూం యజమానులకు మాత్రమే ఈ పథకంపై సమాచారం ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కేటాయింపులో సిఫారసులు చేస్తుండడంతో అర్హులైన ఎందరో రైతులకు ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెలియడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాల ఉద్దేశం నెరవేరడం లేదు. -
కొంచెం దగ్గర దూరం
డిప్యూటీ సీఎంపై ఎమ్మెల్యేల్లో అనుమానాలు పాత అనుభవాలు గుర్తు చేసుకుంటున్న నేతలు పస్తుతం ఎలా ఉంటారో అని ఆలోచన ‘కడియం’కు పదవితో మారుతున్న రాజకీయాలు జిల్లా టీఆర్ఎస్లో సరికొత్త సమీకరణలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఉప ముఖ్యమంత్రి మార్పుతో జిల్లా రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. తాటికొండ రాజయ్య స్థానంలో ఆయన ప్రత్యర్థి కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో అధికార టీఆర్ఎస్లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు రాజయ్యకు సన్నిహితంగా ఉన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పుడు కడియం శ్రీహరికి దగ్గర య్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి పరిపాలన పరంగా, పార్టీ పరంగా పదేళ్లపాటు జిల్లా రాజకీయాలను శా సించారు. కడియం శ్రీహరితోపాటు టీడీపీలో పని చేసిన పలువురు ఇటీవలి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున గెలిచారు. కొందరు కడియం శ్రీహరికి ముందు, మరికొంద రు ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరారు. టీడీపీలో రాజకీయంగా అవకాశాలు రాకపోవడం, వ్యక్తిగత కారణాలతో అ ప్పట్లో ఆ పార్టీని వీడిన వారు.. టీఆర్ఎస్లో చేరి కీలక నా యకులయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు వీరికి, కడియం శ్రీహరికి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది గులాబీ శ్రేణులకు ఆసక్తికరంగా మారింది. సత్సంబంధాల విషయంలో ఉప ముఖ్యమంత్రితో ఏ ఎమ్మెల్యే ఎలా ఉంటున్నారనే విషయంలో ఒకింత సందేహాలు ఉన్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజకీయంగా దీర్ఘకాలికంగా ప్రత్యర్థి. రాజయ్యకు పదవి దూరమవడం ఎలా ఉన్నా.. శ్రీహరి అదే పదవిలో ఉండడం ఇబ్బందికరంగా మారింది. శ్రీహరి, రాజయ్య ఇద్దరు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందినవారే. సాధారణ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ సెగ్మెంట్లో పట్టు కోసం రాజయ్య ఎంపీపీ ఎన్నికల్లో కడియం వర్గంపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ రెండు వర్గాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ గతంలో టీడీపీలో పని చేసినవారే. 2004 ఎన్నికల్లో చందూలాల్‌కు టీడీపీ తరుఫున ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దక్కలేదు. అప్పడు టీడీపీ జిల్లా పార్టీలో కడియం శ్రీహరి కీలకంగా వ్యవహరించారు. తాజాగా చందూలాల్‌కు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు కడియం శ్రీహరితో చందూలాల్ మధ్య దూరం లేదు. అలాగని పూర్తిస్థాయిలో సన్నిహితంగానూ లేరు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ గతంలో టీడీపీలో పని చేశారు. మాజీ మంత్రి ప్రణయ్‌భాస్కర్ రాజకీయ వారసుడిగా వినయ్‌భాస్కర్‌కు 1999లోనే శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉన్నా రాలేదు. 2004లోనూ వినయ్‌భాస్కర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పడు టీడీపీలో కీలకంగా ఉన్న ఇద్దరు అగ్రనేతల వల్లే వినయ్‌కి అవకాశాల పరంగా ఇబ్బందులు కలిగాయని రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. వినయ్‌భాస్కర్ టీఆర్ఎస్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం వీరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయంలో గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో రాజకీయంగా ఎలా ఉంటున్నారనేది ఈ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తలకు స్పష్టత రావడం లేదు. కొండా సురేఖకు మంత్రి పదవి రాకుండా జిల్లా ప్రజాప్రతినిధులు పలువురు ప్రయత్నించారని ప్ర చారం జరుగుతోంది. దీనికి కారకులు ఎవరనే విషయంలోనూ గులాబీ పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. డోర్నకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన డీఎస్ రెడ్యానాయక్ గత నవంబరులో టీఆర్ఎస్లో చేరారు. ఇదే నియోజకవర్గం నుంచి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యవతి రాథోడ్ అంతకుముందు టీడీపీలో పని చేశారు. కడియం శ్రీహరి సహకారంతోనే సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో, నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న సత్యవతి రాథోడ్‌కు రాజకీయంగా సహకరించే కడియం శ్రీహరితో డీఎస్ రెడ్యానాయక్‌కు సత్సంబంధాలు సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉన్నారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జనగామ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో అప్పటి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిపై ముత్తిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కొద్ది నెలలుగా మాత్రం వీరి మధ్య సత్సంబంధాలే ఉన్నట్లు కనిపిస్తోంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ గతంలో టీడీపీలో పని చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్లో పోటీ విషయంలో గతంలో కడియం శ్రీహరి, అరూరి రమేశ్ మధ్య అంతరం పెరిగింది. సాధారణ ఎన్నికల్లో ఇద్దరు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయినా ఇద్దరి మధ్య కొంత అంతరం కొనసాగింది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుపై అధ్యయనానికి కడియం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందంలో అరూరి రమేశ్ ఉన్నారు. ఈ పార్కు ఏర్పాటు అధ్యయనం కోసం గుజరాత్, తమిళనాడుకు వెళ్లిన సందర్భాల్లో ఇద్దరి మధ్య అంతరం తగ్గిపోయిందని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. పరకాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గత నవంబరులో టీఆర్ఎస్లో చేరారు. కడియం టీడీపీలో ఉన్న రోజుల్లోనూ ధర్మారెడ్డికి ఈయనకు మధ్య అంతరమే ఉండేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరే సమయంలోనూ వరంగల్ ఎంపీగా ఉన్న కడియంను కలవలేదని తెలిసింది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అధ్యయన బృందంలో ధర్మారెడ్డి ఉన్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనల్లో వీరిద్దరు దగ్గరగా ఉండడంతో వీరి మధ్య అంతరం తగ్గిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీలోనే పనిచేశారు. ఇ న్నాళ్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యకు సన్నిహితం గా ఉన్న శంకర్‌నాయక్‌కు, ప్రస్తుత డిప్యూటీ సీఎం శ్రీహరితో సాధారణ సంబంధాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. -
నిద్రపోతామంటే కుదరదు
15 రోజుల్లో నివేదికలు సిద్ధం చేయాలి నిజాయితీతో కష్టపడి పని చేయాలి నగరాన్ని అభివృద్ధి పథంలో నిలపాలి జీవో 58కి సవరణలు అవసరం {Vేటర్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం సమీక్ష హన్మకొండ: ‘ననిన్టిదాక నిద్రపోయారో.. ఏం చేశారో తెల్వదు. ఇప్పుడు నిద్రపోతామంటే కుదరదు. గతం గతః, నగరాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేయాలని సీఎం అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా అందరం పనిచేయూలె’ అని కుడా, కార్పొరేషన్ అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్దేశం చేశారు. సీఎం ఇటీవల నగరంలో పర్యటించి ఇచ్చిన హామీల అమలుపై కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. 15 రోజుల్లో సీఎం హామీల అమలు కోసం పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయూలని ఆదేశించారు. ఇబ్బంది లేకుండా లేవుట్ జీ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎంపిక చేసిన తొమ్మిది కాలనీల్లో ప్రస్తుతం ఇళ్లకు నష్టం లేకుండా లే అవుట్లు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. మురికివాడల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో దాదాపు రూ. 500 కోట్లు నగరానికే కేటాయించే అవకాశం ఉందన్నారు. జీ ప్లస్ వన్ నిర్మాణాలపై ప్రజల్లో అపోహలు తొలగించాలని కోరారు. నిర్మాణాలకు అంగీకారించిన కాలనీల్లో పనులు ప్రారంభించి.. మిగతా వారిని కూడా ప్రోత్సహించాలని సూచించారు. అదనపు లబ్ధిదారుల ఎంపికకు విధివిధానాలు త్వరలో రూపొందిస్తామన్నారు. జీవో 58కి సవరణలపై చర్చిస్తాం.. నగరంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జీవో నంబరు 58కు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయూన్ని మంత్రివర్గంలో చర్చిస్తానని కడియం పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన కాలనీల్లో సగానికి పైగా చెరువు శిఖంలోనే ఉన్నాయని, ఈ చెరువు శిఖం భూములకు జీవో నంబరు 58 వర్తించదని స్పష్టంచేశారు. వరంగల్‌లో ఐదు, హన్మకొండలో ఐదు మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని కడియం పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో రూ. 6 కోట్లతో నిర్మించనున్న రెండు షాదీఖానాలకు స్థలాన్ని ఎంపిక చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. దేశాయిపేట, బంచరాయి ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలన్నారు. పై నుంచి దిగొచ్చారా! నగరంలోని వీధుల్లో చెత్త పేరుకపోవడంపై కడియం ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కుమార్‌పల్లి మార్కెట్ ఏరియాలోకి ఒక్కసారి వెళ్తే చాలు.. పారిశుద్ధ్య విభాగం సిబ్బందిని సస్పెండ్ చేయాడానికి’ అంటూ మండిపడ్డారు. కార్పొరేషన్లో పాలన ఇష్టారాజ్యంగా మారడాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీరు ప్రభుత్వ ఉద్యోగులా.. లేకుంటే పై నుంచి దిగివచ్చారా? పని చేయని అధికారులను పంపించేస్తాం’ అని హెచ్చరించారు. 15 రోజుల్లో రోడ్లపై చెత్త లేకుండా చూడాలని, లేకుంటే సిబ్బందిని మార్చాల్సి వస్తుందని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో మాదిరిగా వరంగల్‌లో ఎల్ఈడీ లైట్లు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని చెరువులను గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తై ఇండోర్ స్టేడియాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రోడ్లను విస్తరించాలి హంటర్‌రోడ్డు-నిట్, కాజీపేట-పెద్దమ్మగడ్డ, కడిపికొండ-ఉర్సుగుట్ట, రాంపూర్-ధర్మారం, పెట్రోల్‌పంప్-హసన్‌పర్తి, పోచమ్మమైదాన్-వరంగల్ తదితర రోడ్లను సాధ్యమైనంత త్వరగా విస్తరించాలని కడియం సూచించారు. హంటర్‌రోడ్డు-నిట్రోడ్డుకు శాయంపేట వద్ద భూ సేకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమీపంలో ప్రణయ్మార్గ్లో ఉన్న వై జంక్షన్ వద్ద పరిస్థితిని పదిహేను రోజు ల్లో సరిచేయూలన్నారు. అంతకుముందు సీఎం హామీలు.. నగర అభివృద్ధికి సంబంధించిన వివరాలను కలెక్టర్ కరుణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రెండు విలీనగ్రామాల ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ఈ సమావేశానికి హాజరుకాలేదు.