కడియం శ్రీహరి హామీ
హైదరాబారాద్: రాష్ట్రంలోని లో ఫిమేల్ లిటరసీ (ఎల్‌ఎఫ్‌ఎల్) స్కూళ్లలో ఖాళీగా ఉన్న హెడ్‌మాస్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గతంలో 150 మంది బాలికలున్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేకంగా ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ పోస్టును ఇచ్చారు. అయితే వాటిని బాలికల సంఖ్యతో సంబంధం లేకుండా ఎస్‌జీటీలకు పదోన్నతి కల్పించి భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి తదితరులు కలిశారు.
ఈ పోస్టులను ప్రస్తుత బదిలీలు, పదోన్నతుల సందర్భంగా భర్తీ చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులుతో మాట్లాడారు. పదోన్నతులు ఇచ్చేలా చర ్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున సోమవారం మరోసారి చర్చించి నిర్ణయాన్ని ప్రకటించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఖాళీల భర్తీకి చర్యలు
Published Mon, Jul 13 2015 12:12 AM | Last Updated on Thu, May 24 2018 2:02 PM
Advertisement
Advertisement