విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది.అయితే పురుషులతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఆసియాలో స్త్రీల సగటు అక్షరాస్యత శాతం 81.6గా ఉంది. అయితే భారత్‌లో స్త్రీ అక్షరాస్యత 65.8 శాతంగా ఉంది. భారత్ కంటే అనేక అరబ్ దేశాలు అక్షరాస్యతలో చాలా ముందంజలో ఉండటం గమనార్హం..
15 ఏళ్ల కంటే ఎక్కువున్న బాలికలు, చదవడం, రాయగల సామర్థాన్ని కలిగి ఉన్నవారిని.. స్త్రీ అక్షరాస్యతగా పేర్కొంటారు. ఇది విద్య, సాధికారత ద్వారా సాధ్యమవుతుంది. మహిళ ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి, లింగ సమానత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీల అక్షరాస్యత రేట్లను మెరురుపరచడం వల్ల వారికి ఉద్యోగావకాశాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతతాయి. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం పెరుగుతుంది.
అన్నీ దేశాలను గమనిస్తే..
స్త్రీ అక్షరాస్యతలో ఉత్తర కొరియా 100 శాతంతో ఉంది. దీనితోపాటు సమానంగాా ఉజ్బెకిస్తాన్ కూడా 100 శాతం ఉంది. తరువాత కజకిస్తాన్ -99.7 శాతం
తజకిస్తాన్-99.7 శాతం
జార్జియా-99.7 శాతం
అర్మెనియా-99.7 శాతం
అజర్బైజాన్-99.7 శాతం
కిరిగిస్తాన్ 99.5 శాతం
సైప్రస్- 99.2
తుర్క్మెనిస్తాన్- 99.6 శాతం
సిరియా-81 శాతం
ఇరాక్ -77.9 శాతం
ఇరాన్ 88.7 శాతం
ఇజ్రాయిల్ 95.8 శాతం
జోర్దాన్ 98.4 శాతం
కువైట్ 95.4 శాతం
సౌదీ అరేబియా 96 శాతం
టర్కీ 94.4శాతం
ఓమన్-92.7 శాతం
యెమెన్ 55 శాతం
యూఏఈ-92.7 శాతం
దక్షిణ కొరియా-96.6 శాతం
జపాన్-99 శాతం
వియాత్నం 94.6 శాతం
బ్రూనై -96.9 శాతం
ఇండోనేషియా-94.6 శాతం
మలేషియా 93.6 శాతం
ఫిలిప్పిన్స్-96.9 శాతం
సింగపూర్-96.1 శాతం
శ్రీలంక-92.3 శాతం
తైవాన్-97.3 శాతం
మంగోలియా-99.2 శాతం
ఖతర్ 94.7 శాతం
చైనా-95.2 శాతం
భారత్ 65.8 శాతం
నేపాల్ 63.3 శాతం
భూటాన్ 63.9 శాతం
మయన్మార్ 86.3 శాతం
థాయ్‌లాండ్ 92.8 శాతం
కంబోడియా 79.8 శాతం
ఇక అన్నింటికంటే తక్కువగా చివరి స్థానంలో అప్ఘనిస్తాన్ ఉంది. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత కేవలం-22.6శాతం మాత్రమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment