తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం | Telangana RTC saved - kadiyam | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం

Published Fri, Jul 10 2015 1:11 AM | Last Updated on Thu, May 24 2018 2:02 PM

తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం - Sakshi

తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
ఘనంగా ఆర్టీసీ విజయోత్సవ సభ

 
 హన్మకొండ: తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కార్మికులను కోరారు. 44 శాతం ఫిట్‌మెంట్, సర్వీస్ రూల్స్ సాధించుకున్న సందర్భంగా హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్ చౌరస్తాలో తెలంగాణ మజ్దూరు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీని విడిపోకుండా ఆంధ్ర నాయకులు, అధికారులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర సాధనలో టీఎంయూ ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. సీఎం ఊహించని విధంగా ఫిట్‌మెంట్ ఇచ్చారని అన్నారు.  టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి మాట్లాడుతూ కార్మికులు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టామన్నారు.  దీర్ఘకాలికంగా గుర్తింపు సంఘంగా పని చేసిన ఎన్‌ఎంయూ సాధించలేని విజయాలు టీఎంయూ సాధించిందన్నారు. టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల త్యాగం వృథాకాదన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి మాట్లాడుతూ టీఎంయూగా ముందుకు పోవాలని కేసీఆర్, హరీష్‌రావు వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. టీఎంయూ రీజియన్ గౌరవాధ్యక్షుడు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ మినహా ఇతర సంఘాలు ఒక్క డిపోలో ఆధిక్యం సాధించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. టీఆర్‌ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ టీఎంయూను గుర్తింపు సంఘంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు. సభలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ల పల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి, డిప్యూటీ సీటీఎం శ్రీధర్, డిప్యూటీ సీఎంఈ రాములు, టీఎంయూ రీజినల్  అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.
 
తొర్రూరు: హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం మానుకోట ఆర్డీవో భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఏడాదిలోనే రూ.11 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ సుధాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తికి ఇప్పటికే రూ.174 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో తక్కెళ్లపెల్లి రవీందర్‌రావు, డీఎస్పీ నాగరాజు, ఎంపీపీ సోమయ్య, జెడ్పీటీసీ కమలాకర్, సర్పంచ్ రాజేష్‌నాయక్, ప్రత్యేక అధికారి విక్రమ్‌కుమార్, తహశీల్దార్ సునీత, ఎంపీడీవో శ్రీనాద్ టీఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement