phitment
-
44 శాతం ఫిట్మెంట్ ఘనత కేసీఆర్‌దే
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దేవరకొండ : ఆర్టీసీ చరి త్రలో కార్మికులకు 44శా తం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దేవరకొండ బ స్టాండ్ సమీపంలో జరిగిన టీఎంయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడా రు. గత పాలకుల వైఫల్యం వల్లే ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపా రు. అందులో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్ల మేరకు నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ గెలుపు కోసం కార్మికులు కృషి చేయాలని కోరారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాడే టీఎంయూకు పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో టీఎంయూ ముందంజలో నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సిం హ, తేరా గోవర్ధన్‌రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, గాజుల ఆంజనేయులు, బం డారు బాలనర్సిం హ, బోరిగం భూపాల్, శి రందాసు కష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, ముత్యాల సర్వ య్య, హన్మంతు వెంకటేష్గౌ డ్, ఆర్టీసీ టీఎం యూ నాయకులు నరేందర్, పీ.జే. రావు, కె.ఎన్.రెడ్డి,యా దయ్య, మోహన్‌లాల్,చంటి, పున్న శ్రీనివాసులు, దశరథం, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
రూ. 289 కోట్ల నష్టాల్లో గ్రేటర్ ఆర్టీసీ
పనితీరు మెరుగుపరచుకోవాలని అధికారులకు ఆదేశం సమీక్షా సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి సిటీబ్యూరో: ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గతేడాది జనవరి నాటికి రూ.144 కోట్లుగా ఉన్న నష్టాలు ప్రస్తుతం రూ.289 కోట్లకు చేరుకున్నాయి. సంస్థాగత లోపాలు, 44 శాతం ఫిట్మెంట్తో పెరిగిన జీతభత్యాల భారం, ఆదాయ మార్గాల పెంపుపై దూర దృష్టి లేకపోవడం తదితర కారణాలు గ్రేటర్ ఆర్టీసీని దారుణంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రేటర్ ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపోల వారీగా లాభనష్టాలను బేరీజు వేసిన ఆయన గతేడాది నుంచి ఒక్క రూపాయి కూడా లాభం లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 నెలల్లో లాభాల దిశగా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. 3804 బస్సుల పై ప్రతి రోజు రూ.3.68 కోట్ల ఆదాయం వస్తుండగా, రోజుకు రూ.4.65 కోట్ల చొప్పున ఖర్చులు ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో రోజుకు రూ.97 లక్షల చొప్పున నష్టాలు వాటిల్లుతున్నట్లు సమీక్షలో తేలింది. నగరంలోని 28 డిపోలూ నష్టాల బాటలోనే నడుస్తున్నట్లు గుర్తించి న ఆయన డిపో మేనేజర్లు పనితీరును మెరుగుపర్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హకీంపేట్‌లోని ఆర్టీసీ అకాడెమీలో జరిగిన ఈ సమీక్షలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఈడీ పురుషోత్తమ్‌నాయక్, రీజనల్ మేనేజర్లు, డీవీఎంలు తదితరులు పాల్గొన్నారు. జీతభత్యాల భారం రూ. 210 కోట్లు గ్రేటర్ ఆర్టీసీలోని 28 డిపోల్లో 22,114 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల పెరిగిన జీతాలు, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ వల్ల ప్రతి నెలా రూ.21 కోట్ల చొప్పున రూ.210 కోట్లు అదనపు భారం పడిందని అధికారులు తెలిపారు. మంత్రి జోక్యం చేసుకుంటూ జీతభత్యాల వల్ల భారం పెరిగినా కార్మికులు ‘బస్సు మనది-సంస్థ మనది’ అనే స్ఫూర్తితో పని చేస్తున్నారని అధికారుల్లో నే ఆ స్ఫూర్తి కొరవడిందని ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని, నష్టాల నుంచి గట్టెక్కే మార్గాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయింపు... అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో నష్టాలను అధిగమించేందుకు సిటీ శివార్లలోని డిపోల నుంచి విజయవాడ, విశాఖ,బెంగళూర్, ముంబయి, చైన్నై వంటి దూరప్రాంతాలకు బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు మరో రెండు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఉన్నతాధికారులకు కొత్త జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఎనిమిది రోజులు సమ్మె చేసి 43 శాతం ఫిట్మెంట్ సాధించుకుంటే, ఆర్టీసీ అధికారుల అసోసియేషన్ కూడా అదే స్థాయిలో ఫిట్మెంట్ కలుపుకుని యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. ఉన్నతాధికారులకు పెరగనున్న జీతాలు చూస్తే.. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు (ఈడీలు) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే అధిక జీతం లభించనుంది. రీజనల్ మేనేజర్లకు ఐఏఎస్, ఐపీఎస్‌ల కంటే జీతాలెక్కువ ఉండటం గమనార్హం. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున జీతాలు పెంచే పరిస్థితి లేదని నివేదికలిచ్చిన ఉన్నతాధికారులు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఫిట్మెంట్ కలుపుకుని కొత్త వేతనాలు ఆమోదించుకోవడం ఎంతవరకు సబబని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కార్మికుల జీతాల పెంపు పట్టించుకోని ఉన్నతాధికారులు గ్రేడ్ పే, అలవెన్సులు కూడా వంద శాతం పెంచుకుంటున్నారని పలు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఆర్టీసీలో ఈడీలు, విభాగాధిపతులు (హెచ్ఓడీలు), డిప్యూటీ సీటీఎం, సీఎంఈ, సీఏవో, వర్క్ మేనేజర్లు, ఏవోలు, ఈఈలు, డిపో మేనేజర్లు, ఆర్టీసీ డాక్టర్లకు మొత్తం 675 మందికి జీతాలు పెరగనున్నాయి. ఈడీల కొత్త మూలవేతనం (బేసిక్ పే) రూ. 1.31 లక్షలు అవుతుందని, రూ. 95 వేలు మినిమమ్ బేసిక్ పేగా పెట్టి, మిగిలిన రూ. 35 వేలు కొత్త గ్రేడ్ పేగా పెట్టుకున్నారు. ఆర్టీసీ ఎండీ కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న ఈడీలు కూడా సంస్థలో ఉన్నారు. -
తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘనంగా ఆర్టీసీ విజయోత్సవ సభ హన్మకొండ: తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కార్మికులను కోరారు. 44 శాతం ఫిట్మెంట్, సర్వీస్ రూల్స్ సాధించుకున్న సందర్భంగా హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్ చౌరస్తాలో తెలంగాణ మజ్దూరు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీని విడిపోకుండా ఆంధ్ర నాయకులు, అధికారులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర సాధనలో టీఎంయూ ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. సీఎం ఊహించని విధంగా ఫిట్మెంట్ ఇచ్చారని అన్నారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి మాట్లాడుతూ కార్మికులు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టామన్నారు. దీర్ఘకాలికంగా గుర్తింపు సంఘంగా పని చేసిన ఎన్ఎంయూ సాధించలేని విజయాలు టీఎంయూ సాధించిందన్నారు. టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల త్యాగం వృథాకాదన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి మాట్లాడుతూ టీఎంయూగా ముందుకు పోవాలని కేసీఆర్, హరీష్‌రావు వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. టీఎంయూ రీజియన్ గౌరవాధ్యక్షుడు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ మినహా ఇతర సంఘాలు ఒక్క డిపోలో ఆధిక్యం సాధించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. టీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ టీఎంయూను గుర్తింపు సంఘంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు. సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ల పల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి, డిప్యూటీ సీటీఎం శ్రీధర్, డిప్యూటీ సీఎంఈ రాములు, టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు. తొర్రూరు: హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం మానుకోట ఆర్డీవో భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఏడాదిలోనే రూ.11 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ సుధాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తికి ఇప్పటికే రూ.174 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో తక్కెళ్లపెల్లి రవీందర్రావు, డీఎస్పీ నాగరాజు, ఎంపీపీ సోమయ్య, జెడ్పీటీసీ కమలాకర్, సర్పంచ్ రాజేష్‌నాయక్, ప్రత్యేక అధికారి విక్రమ్‌కుమార్, తహశీల్దార్ సునీత, ఎంపీడీవో శ్రీనాద్ టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కేటుగాళ్లు
పీఆర్సీ పేరిట దోపిడీ కాసులివ్వని శాఖల్లో అందని వేతనాలు కొత్త పీఆర్సీకి రూ.కోట్లలో వసూళ్ల పర్వం యూడీసీలదే దందా.. {sెజరీ పేరిట వసూళ్లు.. అగ్రస్థానంలో ఆరోగ్య శాఖ.. ఒక్కొక్కరి నుంచి రూ.1000 సంక్షేమంలో అందని బకాయిలు హన్మకొండ అర్బన్ : రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. కొన్ని శాఖల్లో ఇది కాగితాలకే పరిమితమైంది. అవినీతికి అలవాటు పడ్డ ఉద్యోగులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పెరిగిన వేతనాలు, మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. జూన్ నెల మొదలై 12 రోజులవుతున్నా ఒకటో తారీఖు రావాల్సిన వేతనాలు చాలా శాఖల్లోని ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదు. ఇందుకు కారణం.. ఖజానా చెల్లింపుల కార్యాలయంలో వేతనాల బిల్లులు చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన మామూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే. జిల్లాలో ట్రెజరీ అధికారులు స్థానిక సౌలభ్యం కోసం ముందుగా వేతనాలు తీసుకుని తరువాత మార్చి, ఏప్రిల్ నెలల పీఆర్సీ బకాయిల బిల్లులు ఎస్టీవోలకు అందజేయాలని చెప్పారు. ఇదే అదనుగా భావించిన కొందరు యూడీసీలు ఖజానా అధికారుల పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు కొన్ని శాఖల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నా రు. తమకు నెలసరి వేతనాలు, రెండు నెలల బకాయిలు ఇచ్చేందుకు ఖజానా పేరు చెప్పి వేధించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ మొదటి స్థానంలో ఉంది. ఈ శాఖ యూడీసీలు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు.. విద్యాశాఖలో పీఆర్సీ పేరిట వసూళ్ల దందా రూ.400 నుంచి రూ.1000 వరకు వసూళ్ల పర్వం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సిబ్బందికి ఇంకా కొత్త వేతనాలు, బకాయిలు అందలేదు. వసూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీసీ సంక్షేమ శాఖలో కూడా నాల్గో తరగతి ఉద్యోగులకు కొత్త వేతనాలు ఇవ్వలేదు. ఖజానాలో కేటుగాళ్లు పీఆర్సీ వసూళ్ల విషయంలో యూడీసీలు ఉద్యోగుల నుంచి ఎంత వసూలు చేసినా ఖజానాలో ఇచ్చింది తక్కువ అని తెలుస్తోంది. అయితే జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఒక ఎస్టీవో, స్టేషన్‌ఘన్‌పూర్‌లో అడిగినంత ఇస్తేనే బిల్లులు పాస్ చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
43% ఫిట్‌మెంట్‌పై స్పందించిన హైకోర్టు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్: పీఆర్సీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. 43 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలంటూ ‘ఫోరం ఫర్ బెటర్ లివింగ్ ’ సంస్థ చైర్పర్సన్ డి.పద్మజ ఇటీవల హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. -
సంబురం
సీఎం ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల జోష్ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని వెల్లడి నిజామాబాద్ నాగారం: ఎనిమిది రోజులపాటు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సాగించిన పోరాటానికి ఫలితం లభించింది. ఊహకందని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో కార్మికులు సంబరాలలో మునిగిపోయూరు. టీవీలలో ఈ వార్త ప్రసారమైన వెంటనే బస్సు డిపోలు, బస్టాండ్లు, రహదారుల పై టపాసులు పేల్చారు. బ్యాండ్, బాజాలతో నృత్యాలు చేస్తూ, తెలంగాణ పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.మిఠారుు లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఊహకందని విధంగా కడుపు నిండా ఫిట్ మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామన్నా. సంస్థ అభివృద్ధి పయనించే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. కేసీఆర్ తమ కష్టాలను తెలుసుకొని న్యాయం చేసినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో కో-కన్వీనర్లు సయ్యద్ అహ్మద్, వందేమా తరం శ్రీనివాస్, సాయిబాబా, సంజీవ్, పురుషోత్తం, సాయన్న, వివిధ కార్మిక సంఘాల నాయకులు, టీఎన్జీఓఎస్ నేత గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు ఎనిమిది రోజుల సమ్మె తరువాత బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కారుు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో కార్మికులు సమ్మెను విరమించారు. దీంతో బస్సులన్నీ డిపోల నుంచి బస్టాండ్‌కు చేరుకున్నాయి. ఈ ఎనిమిది రోజులపాటు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ప్రైవేట్ వాహనాలు దోచుకున్నారుు. ఇది ఆర్టీసీ కార్మికుల విజయం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ఆర్టీసీ కార్మికుల విజయమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి పేర్కొ న్నారు. గత కొన్ని రోజులుగా కార్మికులు కలిసి పోరాడి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారన్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకవచ్చి నిరసనలు తెలిపి వి జయం సాధించారన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విస్మరించిన సమయంలో ఆర్టీసీ సంఘాలు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి పోరాడడం అభినందనీయమ న్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గి డిమాండ్ల పరిష్కారం కోసం దిగి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటు ందన్నారు. కార్మికులకు ఎలాంటి నష్టం జరిగినా వారి కోసం పోరాడుతుందన్నారు. -
రైట్.. రైట్
44 శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే.. సమ్మె విరమణ నెరవేరిన కార్మికుల కల.. కదిలిన రథచక్రాలు.. హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంతో ఎనిమిది రోజులుగా కొనసాగిన సమ్మె బుధవారం ముగిసింది. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతోపాటు ఈ నెల 14వ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు... సమ్మెలో కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కార్మికుల ఆనందోత్సవాలకు అవధుల్లేకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు సమ్మె విరమించి సంబరాల బాటపట్టారు. రంగులు చల్లుకుని.. బాణ సంచా కాల్చి... స్వీట్లు పంచుకున్నారు. రోజు వారి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హన్మకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట టీఎంయూ, జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ధర్నా చేసిన కార్మికులు.. అదే చోట సంబరాలు నిర్వహించుకున్నారు. హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, టీఎంయూ రాష్ట్ర నాయకులు అశ్వథ్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతయ్య ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎంప్లాయూస్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రంగులు చల్లుకుని సంబ రాలు జరుపుకున్నారు. -
జీతాలు పెంచాలంటే చార్జీలు పెంచాల్సిందే
ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గంలో చర్చ హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను హైకోర్టు తప్పుబడుతున్న నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకుని వ్యవహారం నడిపించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు. కార్మిక సంఘాలతో రెండుమూడు దఫాలుగా చర్చలు జరిపాలని సూచించారు. వారికి 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వలేమన్నారు. కార్మికుల డిమాండ్ మేరకు ఫిట్మెంట్ ఇవ్వాలంటే చార్జీలు పెంచాలని పెంచకతప్పదని స్పష్టం చేశారు. మంగళవారం సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. ఫిట్మెంట్ చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుధవారం హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశం నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాకుండా ఎంతో కొంత పెంచుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఒప్పించాల్సిందిగా సూచించారు. ఇలావుండగా మద్యం విధానంపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉన్నప్పటికీ ఆ అంశంపై 23న జరగనున్న కేబినెట్ భేటీలో చ ర్చించనున్నారు. -
ఏపీలో సమ్మె యథాతథం
హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కోరుతూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం ఆరోరోజూ రాష్ట్ర వ్యాప్తం గా సాగింది. సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అఖిలపక్ష నేతలు అండగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్లల్లో వినతి పత్రాలు అందించారు. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం నియమిస్తున్న తాత్కాలిక డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరిన తాత్కాలిక డ్రైవర్ బస్సు బయటకు తీస్తుం డగా సెక్యూరిటీ షెల్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కోరినట్టు 3 వారాల గడువును ఇచ్చేది లేదని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) రాష్ట్ర నేతలు పద్మాకర్, దామోదర్ తేల్చిచెప్పారు. -
ఆ భారం ఎలా భరిద్దాం?
ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం మల్లగుల్లాలు సోమవారం సుదీర్ఘంగా మంతనాలు జరిపిన కేబినెట్ సబ్‌కమిటీ కమిటీలోకి కొత్తగా తలసాని, జగదీశ్‌రెడ్డి సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు భారీగా ఫిట్మెంట్ ప్రకటి స్తే సంస్థపై పడే భారాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్టీసీ నష్టాలను నియంత్రించడం, లాభాల బాటలోకి తీసుకురావడం, ప్రభుత్వపరంగా చేయూత వంటి అంశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సోమవారం ఆర్థిక, వాణిజ్య శాఖలు, ఆర్టీసీ అధికారులతో సమావేశమైంది. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే భారం చాలా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. కొంతమేర తగ్గేలా ఒత్తిడి తేవాలని అభిప్రాయానికొచ్చింది. ఎంతశాతం వరకు ఫిట్మెంట్ ఇస్తే సంస్థపై ఇప్పటికిప్పుడు పెనుభారం పడబోదనే దిశలో చర్చలు జరిగాయి. ఆర్టీసీ కార్మికుల అంశంపై మంత్రులు నాయిని, ఈటల, మహేందర్‌రెడ్డిలతో ఆదివారం ఏర్పాటు చేసిన కమిటీలోకి సోమవారం మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్లను కూడా సీఎం చేర్చారు. వారు ఆదివారం కార్మిక సంఘాలతో చర్చకు సంబంధించిన వివరాలను సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌కు వివరించారు. కార్మికులు 43 శాతం ఫిట్‌మెంట్‌పై పట్టు వీడడం లేదని వారు పేర్కొన్నారు. దీంతో సీఎం వెంటనే ఆర్థిక, వాణిజ్యపన్నులు, ఆర్టీసీ అధికారులను కూడా పిలిపించి మంత్రుల సమక్షంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడం, ప్రభుత్వ పరంగా చేయూత తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ అంశాలపై లోతుగా పరిశీలన జరిపి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్.. మంత్రుల కమిటీని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ సచివాలయంలో అధికారులతో భేటీ అయి దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం చర్చించిన అంశాలివే ఫిట్మెంట్.. → సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 43% ఫిట్మెంట్తో తీవ్ర భారం పడుతుంది. అది సాధ్యంకాదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోగలిగితే ఫిట్‌మెంట్‌ను 36 శాతానికి కాస్త అటూఇటూ వరకు తీసుకెళ్లవచ్చు. →ఒకవేళ 43% ఫిట్మెంట్ ఇస్తే 40% వరకు బస్సు చార్జీలు పెంచాల్సిందే. ఇది ప్రయాణికులపై పెను భారమే. దీంతో ఏటా 15% చొప్పున మూడేళ్లపాటు లేదా 12-13% చొప్పున నాలుగేళ్లపాటు చార్జీలు పెంచాలి. ఇతర రాష్ట్రాల్లో మనకంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువగా ఉన్నందున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆర్టీసీపై భారం తగ్గింపు.. → ఆర్టీసీ డీజిల్‌పై 27 శాతం వరకు వ్యాట్ చెల్లిస్తోంది. దీనిని రీయింబర్స్ చేయాలని కోరుతోంది. ఈ మొత్తం ఎంత? దాన్ని ప్రభుత్వమే భరిస్తే పరిస్థితేమిటి? అనే విషయంలో వాణిజ్యపన్నులు, ఆర్థిక శాఖ అధికారులతో వాకబు చేశారు. విడిభాగాలపై ఆర్టీసీ 14.5 శాతం పన్ను చెల్లిస్తోంది. దీన్ని 5 శాతానికి తగ్గించాలి. → ఆర్టీసీకి రూ.3,000 కోట్ల అప్పులున్నాయి. ఇందులో తెలంగాణవాటా 1,200 కోట్లు. ఏటా చెల్లిస్తున్న వడ్డీ 150 కోట్లు. వన్‌టైం సెటిల్మెంట్ కింద దాన్ని పరిష్కరిస్తే మరో 15 ఏళ్లపాటు ఆర్టీసీకి ఇబ్బంది ఉండదు. నేడు సీఎంకు నివేదిక: సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందజేయాల్సిందిగా మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. వారు మంగళవారం ఉదయం కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. దీనిని కమిటీ ముఖ్యమంత్రికి అందించి, తదుపరి చర్యలపై చర్చించనుంది. ఈ సమయంలోనే ఫిట్‌మెంట్‌పై ఓ నిర్ణయాన్ని సీఎం వెల్లడించనున్నారు. దీనిని మంత్రుల కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల ఎదుట ఉంచి చర్చించనుంది. ఆ చర్చల సారాంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళుతుంది. ఒకవేళ అప్పటికీ కార్మిక నేతలు సానుకూలంగా లేనిపక్షంలో నేరుగా ముఖ్యమంత్రే చర్చించే అవకాశముంది. సమస్యలు పరిష్కరించాలి: ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. నేడు హైకోర్టు తీర్పు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మంగళవారం హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దానిని పరిశీలించిన కోర్టు.. కార్మికులు విధుల్లో చేరాలంటూ మూడు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. తాజాగా మంగళవారం జరుగనున్న విచారణలో కార్మిక సంఘాలు హైకోర్టు ఎదుట తమ వాదనను వినిపించబోతున్నాయి. అనంతరం హైకోర్టు తుదితీర్పు వెలువరించే అవకాశముంది. సమ్మె విరమించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేస్తే.. ప్రభుత్వం కార్మికులపై ఒత్తిడి పెంచుతుంది, ఇది ఫిట్మెంట్ ఖరారుపైనా ప్రభావం చూపే అవకాశముంది. ఎక్కడిబస్సులక్కడే ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు రోజురోజుకు ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతూనే ఉంది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీకి రాబడి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని యాజమాన్యం చెప్పడంతో అద్దె బస్సుల యజమానులు అన్ని బస్సులను తిప్పారు. కానీ వారు రద్దీ అధికంగా ఉండి, ఆదాయం ఎక్కువ ఉండే మార్గాలకే పరిమితమయ్యారు. ప్రైవేటు బస్సుల తరహాలో అడ్డగోలుగా చార్జీలు పెం చి వసూలు చేశారు. తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు కూడా ఇదే పంథాను కొనసాగించాయి. తాత్కాలిక సిబ్బంది వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి జమచేయడం లేదు. ఈ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన అధికారులు కూడా సమ్మెలో ఉండడంతో డిపో మేనేజర్లు చేతులెత్తేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. సోమవారం జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. రాజధానిలో తప్పని ఇబ్బందులు.. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతోంది. సోమవారం అధికారులు 671 బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మూలకూ చాలలేదు. ఉద్యోగులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. రోజూ తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మరో ఎనిమిది సర్వీసులను అదనంగా నడి పారు. మరోవైపు కార్మికులు సోమవారం కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. అన్ని డిపోల్లో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. -
పీఆర్సీ ఫలాలేవీ?
జీవోల కోసం ఉద్యోగుల ఎదురుతెన్నులు వేతనాల పెంపును ఇంతవరకు ఆమోదించని మంత్రివర్గం సాక్షి, హైదరాబాద్: మరో వారంలో మార్చి నెల ముగిసిపోతోంది. ఉద్యోగుల వేతనాల పెరుగుదలకు సంబంధించి ఈ నెలాఖరులోగా ప్రభుత్వం జీవో జారీ చేస్తేనే ఏప్రిల్ నెల జీతంలో పెంపు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పదో వేతన సవరణ సంఘం సిఫారసులను అమలు చేస్తూ ప్రభుత్వం ఇవ్వాల్సిన జీవోల కోసం ఉద్యోగులు ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు. స్థిరీకరణ చేస్తేనే మే 1న కొత్త జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్(మూల వేతనంలో పెంపు) చెల్లించేందుకు అంగీకరిస్తూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 9వతేదీన ప్రకటన చేయటం తెలిసిందే. వేతనాల పెంపు 2014 జూన్ నుంచి వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. అప్పటి నుంచి 2015 మార్చి వరకు అంటే 10 నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. ఉద్యోగులకు కొత్త వేతనాల నగదు ప్రయోజనం ఏప్రిల్ నుంచి అందుతుంది. జీతాల్లో పెరుగుదల మే 1వతేదీన అందుకునే జీతంలో కనిపించనుంది. ఏప్రిల్ నెల జీతాల కోసం బిల్లులను 20 తేదీన ట్రెజరీలకు సమర్పించాలి. వేతనాల స్థిరీకరణ కసరత్తు పూర్తి చేయడానికి కనీసం 20 రోజుల సమయం పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు జీవోలు వస్తేనే ఏప్రిల్ 20కి వేతనాల స్థిరీకరణ పూర్తై మే 1న అందుకునే జీతంలో పెంపుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మంత్రివర్గం ఆమోదం ఏదీ..? ఉద్యోగులు వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించి ఇప్పటికే దాదాపు నెలన్నర దాటినా ఇప్పటికీ మంత్రివర్గం ఆమోదముద్ర పడలేదు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా కోడ్ కూడా ముగిసిన ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి పీఆర్సీ అమలు జీవోలు జారీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా జీవోలు వెలువడకపోతే ఏప్రిల్ నెలలో కొత్త వేతనాలు అందుకోలేమనే ఆందోళన వారిలో నెలకొంది. 10 నెలల పీఆర్సీ బకాయిలను కూడా జీపీఎఫ్ ఖాతాకు జమ చేయాలని కోరుతున్నారు. బాండ్లు, తదితరాలు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 15 రోజుల బకాయిలు విరాళమా? 10 నెలల వేతన బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా.. అందులో 15 రోజుల బకాయిలను రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానం చేయడం పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం ప్రకటన కేవలం ఫిట్మెంట్, ఆర్థిక లబ్ధి అమలు తేదీ ప్రకటనకే పరిమితమైందని ఉద్యోగులంటున్నారు. ఈ రెండు అంశాలే కాకుండా మిగతా డిమాండ్లపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే జీవోలు జారీ చేయాలని కోరుతున్నారు. ఉద్యోగుల మిగతా డిమాండ్లు ఇవీ మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ కోసం రెండేళ్ల పాటు సెలవు ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సును అమలు చేయాలి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిని 8 కిలోమీటర్లుగా పీఆర్సీ పేర్కొంది. పట్టణీకరణ పెరగడం వల్ల నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అందువల్ల ఈ పరిధిని 15 కిలోమీటర్లుగా నిర్ణయించాలి. ఇంక్రిమెంట్ రేట్ 2.33 శాతం ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. దాన్ని కనీసం 2.832 శాతానికి పెంచాలి. కేంద్ర ప్రభుత్వం 3 శాతం ఇస్తోంది. గ్రాట్యుటీని రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటి అద్దె భత్యాన్ని 20 శాతం ఇవ్వాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే 14.5 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఫలితంగా మచిలీపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు పట్టణాల్లో ఇంటి అద్దె భత్యం 14.5 శాతమే ఉంటుంది. దీన్ని 20 శాతానికి పెంచాలి. ఉద్యోగుల పిల్లల ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెంచాలి. సచివాలయంలో పనిచేస్తున్న ఏఎస్వో, ఎస్‌వోలకు గతంలో స్పెషల్ పే ఉంది. ఇప్పుడు వాటిని కొనసాగించకుండా పదో పీఆర్సీలో తగ్గించారు. వారికి స్పెషల్ పే కొనసాగించాలి. ఏఎస్‌వోకు సూపరింటెండెంట్ స్కేల్ ఇవ్వాలి. -
పీఆర్సీపై కసరత్తు ప్రారంభం
అధికారులతో సమావేశమైన ఆర్థిక మంత్రి పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమానికి సిద్ధం: జేఏసీ నేతలు సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఫిట్మెంట్, ఆర్థిక లబ్ధి తదితర అంశాల మీద ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం అధికారులతో మాట్లాడారు. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే ఖజానాపై వాస్తవంగా ఎంత భారం పడుతుందనే విషయం మీద చర్చ జరిగినట్లు తెలిసింది. ఉద్యోగుల వాస్తవ సంఖ్యతో పాటు ఖాళీలను లెక్కలోకి తీసుకుని 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తే ఏటా రూ.7 వేల కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఉద్యోగుల వాస్తవ సంఖ్య ప్రకారం చూస్తే పీఆర్సీ అమలు భారం ఏటా రూ.3,500 కోట్లకు మించదని అంచనాకు వచ్చినట్లు సమాచారం. 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే అన్ని క్యాడర్ ఉద్యోగులకు 3 స్టేజీల ఇంక్రిమెంట్ పెరుగుతుందని, 46 శాతం ఫిట్మెంట్ ప్రకటించినా ఇదే పెంపు వర్తిస్తుందని, 47 శాతం అమలు చేస్తేనే నాలుగో స్టేజి ఇంక్రిమెంట్ వర్తిస్తుందని అధికారులు నివేదించినట్లు తెలిసింది. 44-45 శాతం ఫిట్మెంట్ ప్రకటించి తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చామనే భావన ఉద్యోగుల్లో కల్పించాలని, ఈ విధంగా చేస్తే ఖజానా మీద అదనపు భారం పడదని చెప్పినట్లు సమాచారం. అయితే ఆర్థిక లబ్ధిని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తే భారం చాలావరకు తగ్గించుకోవచ్చనే యోచనలో ఆర్థిక మంత్రి ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయాలను సోమవారం జరగనున్న ఉపసంఘ సమావేశంలో చర్చించి, వెంటనే ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వడానికి సమాయత్తమవుతున్నారు. పీఆర్సీ సిఫారసు చేసినట్లు ఆర్థిక లబ్ధిని 2013 జూలై నుంచి అమలు కు ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టుబడుతోంది. నేడు జేఏసీ భేటీ తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో కూడా పీఆర్సీ అమలు కోసం ఉద్యోగుల నుంచి అన్ని సంఘాల నేతలకు ఒత్తిడి వస్తోంది. జేఏసీ నాయకత్వ మెతక వైఖరి వల్లే పీఆర్సీ అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నాయకత్వం భావిస్తోంది. సోమవారం ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించింది. ఉపసంఘం సీఎం నివేదిక సమర్పించిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం మాట్లాడే అవకాశం ఉందని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపు వస్తే ఏం మాట్లాడాలనే విషయాన్ని నిర్ణయించడానికి ఉదయం 11 గంటలకు జేఏసీ నేతలు ఏపీఎన్జీవో హోంలో సమావేశం కావాలని నిర్ణయించారు. స్పందించకపోవడం నష్టమే తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా పీఆర్సీ అమలు గురించి ఏపీ స్పందించకపోవడం ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుం ది. హామీ అమలు చేయడానికైనా తెలంగాణ కంటే మెరుగైన ఫిట్మెంట్, ఆర్థిక లబ్ధి అమలు చేయాలి. లేదంటే ఉద్యమం తప్పదు. - ఐ.వెంకటేశ్వరరావు, జేఏసీ సెక్రటరీ జనరల్ డిమాండ్లపై వెనక్కితగ్గం ఫిట్మెంట్, ఆర్థిక లబ్దితో సహ జేఏసీ ఇప్పటికే సమర్పించిన డిమాండ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడం. అవసరమైతే ఉద్యమానికీ సిద్ధమే. - కత్తి నరసింహారెడ్డి, జేఏసీ కో చైర్మన్ వెంటనే ప్రకటించాలి తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి. ఆర్థిక లబ్దిని 2013 జూలై నుంచి వర్తింపజేయాలి. తగ్గించాలని చూ స్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, జేఏసీ కో చైర్మన్ -
ఉద్యోగులకు డబుల్ ధమాకా..!
*43 శాతం ఫిట్మెంట్తో రెట్టింపు కానున్న మూలవేతనం *మొత్తం ఆర్థిక భారం రూ. 6,500 కోట్లు * ప్రస్తుత మధ్యంతర భృతి రూ. 4,081 కోట్లు *అదనంగా వెచ్చించాల్సిన మొత్తం రూ. 2,419 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇచ్చిన మొదటి పీఆర్సీతో రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు అందే జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు అన్ని కేటగిరీల్లో మూల వేతనం రెట్టింపు కానుంది. 9వ పీఆర్సీ 2009 సంవత్సరంలో 27 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా... అప్పటి ప్రభుత్వం 2010లో 39% ఫిట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం పదో పీఆర్సీ (తెలంగాణలో మొదటిది) 29% ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా... ప్రభుత్వం 43% ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో ప్రభుత్వంపై రూ. 6,500 కోట్లు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా. ఇదే పీఆర్సీ సూచించినట్లుగా 29% ఇస్తే పడే భారం రూ. 4,383 కోట్లే. కానీ ప్రభుత్వం మాత్రం 43% ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే 9వ పీఆర్సీ కాలం 2013 జూన్ 30తో ముగిసిన నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించింది. ఇందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఏటా రూ. 4,081 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఐఆర్ (27%)కు అదనంగా 16% పెంచడం ద్వారా... ఇప్పుడు ప్రభుత్వంపై అదనంగా రూ. 2,419 కోట్ల భారం పడనుంది. 2013 జూలై 1 వరకు డీఏ కొత్త వేతనంలో విలీనం.. కొత్త పీఆర్సీని 2014 జూన్ 2వ తేదీ నుంచి నగదు రూపంలో వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో... 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1 వరకు ఇచ్చిన ఐఆర్ 2014 జూన్ 2 తరువాత రద్దవుతుంది. అలాగే 2013 జూలై 1 వరకు ఉన్న కరువు భత్యం (డీఏ) 63.344 శాతం కూడా కొత్త వేతనంలో విలీనం అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 77.896 శాతం డీఏ వస్తోంది. ఇందులోనుంచి 2013 జూలై 1 వరకున్న డీఏ 63.344 శాతాన్ని తీసేస్తే.. 14.552 శాతం డీఏ మిగులుతుంది. అయితే కేంద్రం జారీ చేసిన డీఏ సూత్రం ప్రకారం కేంద్రం ఒక శాతం డీఏ ఇస్తే రాష్ట్రంలో 0.524 శాతం ఇస్తారు. ఈ లెక్కన రాష్ట్ర ఉద్యోగుల వేతనంలో ఇకపై 8.908 శాతం డీఏ మాత్రమే కలుస్తుంది. ఫిట్మెంట్ అంటే.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరల పెరుగుదల సూచీని వెల్లడిస్తుంటుంది. దాని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు మూల వేతనంలో ఇచ్చే పెంపునే ఫిట్మెంట్ అంటారు. ఈ సూచీల ఆధారంగా కేంద్రం పదేళ్లకోసారి వేతన స్థిరీకరణ చేస్తుండగా... రాష్ట్రం ఐదేళ్లకోసారి వేతన స్థిరీకరణ చేస్తోంది. ఇందులో ఒక ఉద్యోగి ప్రస్తుతం పొందుతున్న మూల వేతనానికి... పీఆర్సీ అమలు చేయాల్సిన సమయంలో ఉన్న డీఏను+ప్రభుత్వం ఇవ్వదలచుకున్న ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త మూలవేతనాన్ని నిర్ధారిస్తారు. ఉదాహరణకు ఒక సీనియర్ లెక్చరర్ ప్రస్తుత మూలవేతనం రూ. 25,600గా ఉంది. ఆయనకు 2013 జూలై 1 నాటికి ఉన్న 63.344% డీఏ అంటే రూ. 16,216+ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 43% ఫిట్మెంట్ అంటే రూ. 11,008 కలిపి... మొత్తంగా (25,600+16,216+11,008) రూ. 52,824 మూలవేతనంగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన ఆ లెక్చరర్ మాస్టర్ స్కేల్లో ఉన్న 82 దశల్లోని రూ. 53,950 మూల వేతనంలో (పై దశలో) ఉంటారు. ఇక దీనిపై పీఆర్సీ అమల్లోకి వచ్చే నాటికి మిగిలిన డీఏ (8.908%) +హెచ్ఆర్ఏ+సీసీఏ వంటి ఇతర అలవెన్సులు కలిపి పూర్తి వేతనాన్ని నిర్ధారిస్తారు. -
ఉద్యోగుల్లో అదే అనుమానం!
పీఆర్సీ ఇవ్వకూడదనే చంద్రబాబు బీద అరుపులు 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్ పీఆర్సీ సిఫారసు చేసింది 29 శాతమే చంద్రబాబు గత చరిత్ర చూసి భయపడుతున్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: జీతాలకే డబ్బుల్లేవంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీద అరుపులు అరవడం ఉద్యోగులను మోసం చేసే వ్యూహంలో భాగమనే అనుమానాలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్నాయి. ఫిట్మెంట్ విషయంలో ఉద్యోగులు చేస్తున్న డిమాండ్‌కు, పీఆర్సీ చేసిన సిఫారసుకు మధ్య చాలా వ్యత్యాసం ఉండటం, గతంలో చంద్రబాబు తీరు, తాజాగా ముఖ్యమంత్రి చెబుతున్న మాటలు.. వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వాస్తవంగా జీతాలకూ డబ్బుల్లేని పరిస్థితి లేకపోయినా, చంద్రబాబు బీద అరుపులు అరవడంలో ఆంతర్యం ఏమిటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి పన్నుల రాబడి లేదా? ఇతర ఆదాయం ఎందుకు రావడం లేదు? ప్రస్తుత బడ్జెట్లో 10 నెలల కాలానికి పీఆర్సీ అమలుకు రూ.3,100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల సమస్యను తెరమీదకు తీసుకురావడం ఉద్యోగులను మోసం చేసే వ్యూహంలో భాగమేననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఫిట్మెంట్తో సరిపెట్టడానికి, 2013 జూలై నుంచి ఇవ్వాల్సిన కొత్త వేతనాల (ఆర్థిక లబ్ధి) బకాయిలకు ఎగనామం పెట్టడానికి ప్రభుత్వం ఆడుతున్న నాటకమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ చంద్రబాబు ఇదే విధానం అవలంభించి పీఆర్సీల అమల్లో ఉద్యోగులకు అన్యాయం చేశారని గుర్తుచేస్తున్నారు. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరువు భృతి (డీఆర్) ఇవ్వకుండా వేదనకు గురిచేసిన చరిత్ర కూడా ఆయనకు ఉందని గతాన్ని గుర్తుచేసుకుని ఉలిక్కిపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ఆర్థిక భారం లేని పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పీఆర్సీ ఇస్తానంటూ ఇచ్చిన హామీని పక్కనబెట్టడం ఉద్యోగుల అనుమాలకు మరింత బలం చేకూరుస్తోంది. తక్కువ ఫిట్మెంట్ ఇస్తారని అనుమానం పదో వేతన సవరణ సంఘం 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. 69 శాతం ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తొమ్మిదో పీఆర్సీలో 27 శాతం ఫిట్మెంట్ అధారంగా వేతన సవరణ సంఘం కనీస వేతనాన్ని రూ.6,700గా నిర్ణయించింది. అయితే అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఫిట్మెంట్ 39 శాతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కనీస వేతనాన్ని కూడా 39 శాతం ఫిట్‌మెంట్‌కు అనగుణంగా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా, అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందుకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.7,100గా నిర్ణయించి అమలు చేసింది. కానీ పదో పీఆర్సీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పీఆర్సీ నివేదికలోని రూ.6,700నే కనీస వేతనంగా తీసుకుని ఇప్పుడు రూ.13 వేలను కనీస వేతనంగా నిర్ణయించింది. అయితే ప్రభుత్వం అమలు చేసిన రూ.7,100ను ఆధారంగా తీసుకుంటే.. పీఆర్సీ లెక్కల ప్రకారమే కనీస వేతనం దాదాపు రూ.14 వేలు అవుతుంది. కనీస వేతనం రూ.14 వేల నుంచి ప్రారంభమైతే.. మాస్టర్ స్కేల్లోనూ ఆమేరకు పెరుగుదల ఉంటుంది. దానిమీద ప్రభుత్వం నిర్ణయించే ఫిట్‌మెంట్‌ను లెక్కగడితే.. ఉద్యోగులకు కాస్త ఊరట లభిస్తుంది. కానీ ప్రభుత్వ వ్యూహం చూస్తుంటే.. కనీస వేతనాన్ని మార్చకుండా, తక్కువ ఫిట్మెంట్తో సరిపెడుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఎగనామం పెట్టడానికే 2013 జూలై నుంచి ఇవ్వాల్సిన ఆర్థిక లబ్ధి ఇవ్వకుండా ఎగనామం పెట్టడానికే ప్రభుత్వం నిధుల సమస్య అని ప్రచారం చేస్తుందేమోనన్న అనుమానముంది. -ఐ.వెంకటేశ్వరరావు, ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎట్టిపరిస్థితుల్లో రాజీపడం ఏడాదిలో రావాల్సిన వసూళ్లు ఆరునెలల్లోనే వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఉద్యోగుల శ్రేయస్సు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, జేఏసీ కో చైర్మన్, రెవెన్యూ సంఘం అధ్యక్షుడు ఉద్యమానికీ వెనకాడం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి ఇవ్వాల్సిందే. అన్యాయం చేయాలని చూస్తే.. ఉద్యమానికీ వెనకాడం. - కత్తి నరసింహారెడ్డి, జేఏసీ కో చైర్మన్, ఎస్టీయూ అధ్యక్షుడు ఫ్రెండ్లీ అంటూ జాప్యమా? ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకొంటూ.. పీఆర్సీ అమలును జాప్యం చేయడం సరికాదు. - కమలాకరరావు, జేఏసీ కో చైర్మన్, పీఆర్టీయూ అధ్యక్షుడు -
48 శాతం ఫిట్మెంట్!
గత ప్రభుత్వం ఇచ్చిన పెంపు కంటే తక్కువ ఉండదు 69 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టనున్న ఉద్యోగ సంఘాలు రేపు ఉద్యోగ సంఘాలతో ఉపసంఘం చర్చలు సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీలో 48 శాతానికి తక్కువ కాకుండా ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటిస్తుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. 69 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 48 శాతం వద్దే మొదలు పెడుతుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. గత పీఆర్సీలో ఐఆర్ మీద 77.27 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ను నిర్ణయించారని, ఈ పీఆర్సీలో కూడా అంతకంటే తక్కువ పెంపు ఉండే అవకాశమే లేదని, ప్రస్తుత ఐఆర్ మీద 77.27 శాతం పెంపు ఇచ్చినా ఫిట్మెంట్ 48 శాతానికి చేరుతుందని ఉద్యోగులు లెక్కలుగడుతున్నారు. ఫిట్మెంట్ 48 శాతం నుంచి ఎక్కడి వరకు వెళుతుందనేది ఉద్యోగ సంఘాల పట్టు మీద ఆధారపడి ఉం టుందని సగటు ఉద్యోగి అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి ప్రకటన చేసే అవకాశం సంక్రాంతి కానుకగా పీఆర్సీ అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడంతో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ఒకరోజు ముందు.. 13న మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల చర్చలు జరగనున్నాయి. మంగళవారం జరగనున్న ఈ చర్చల్లో ఫిట్‌మెంట్‌ను తేల్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు విశ్వసిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కనీసం ఫిట్‌మెంట్‌పైన అయినా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్థిక లబ్ధి ఎప్పటి నుంచి ఇవ్వాలనే విషయాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. 69 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులు డిమాండ్ చేసినంత ఫిట్మెంట్ ఇవ్వకపోయినా, సంతృప్తికర స్థాయిలోనే నిర్ణయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 48 శాతం కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ ఉండే అవకాశం లేదని, అంతకంటే తక్కువ ఇస్తామని ఉపసంఘం కూడా ప్రతిపాదించదని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. గత పీఆర్సీ సమయంలో మధ్యంతర భృతి (ఐఆర్) 22 శాతం ఇచ్చారు. తొమ్మిదో పీఆర్సీ 27 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్ అమలవుతోంది. పదో పీఆర్సీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసిన విషయం విదితమే. గత పీఆర్సీ సిఫారసు చేసిన 27 శాతం మీద 44.5 శాతం అధికంగా 39 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పీఆర్సీలో కూడా సిఫారసు చేసిన దానికి కంటే 45 శాతం అధికంగా ప్రభుత్వం ఇస్తే.. 42 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. గత పీఆర్సీ సమయంలో 22 శాతం ఐఆర్ ఉండగా, దాని మీద 77.27 శాతం అధికంగా ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 27 శాతం ఐఆర్ మీద 77 శాతం అధికంగా ఇస్తే.. ఫిట్మెంట్ 48 శాతానికి చేరుతుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే తక్కువగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం లేదని, ఉద్యోగులను సంతృప్తిపరిచే విధంగా ఫిట్మెంట్ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఫిట్మెంట్ 48 శాతం కంటే ఎక్కువే ఉంటుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. ఉద్యోగుల కార్యాచరణ నేడు ఖరారు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఉద్యోగ సంఘాల జేఏసీ సోమవారం ఖరారు చేయనుంది. ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీఎన్జీవో హోమ్‌లో నిర్వహించనున్నారు. ఉద్యోగుల అంచనా ఇలా.. ఐఆర్‌ను పాయింట్లలో తీసుకుంటే.. గత పీఆర్సీలో ఐఆర్ = 22 పాయింట్లు గత ఫిట్మెంట్ = 39 పాయింట్లు ఐఆర్ మీద పెంపు శాతం = 77.27 శాతం (17 పాయింట్లు) ప్రస్తుతం ఐఆర్ = 27 పాయింట్లు గతంలో పెంపు శాతం = 77.27 శాతం పెంపు పాయింట్లు = 21 పాయింట్లు ఈమేరకు పెంచితే = 48 పాయింట్లు -
పీఆర్సీ పితలాటకం
అరకొర లెక్కలతో ఉద్యోగుల వేతన నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కుటుంబమంటే ముగ్గురు వ్యక్తులేనా? నెలవారీగా కుటుంబానికి సరిపడే కూరగాయలు రూ. 838లకే వచ్చేస్తాయా? కుటుంబానికి నెలకు 42.75 కేజీల బియ్యం సరిపోతాయా? కిలో బియ్యం బహిరంగ మార్కెట్లో రూ. 34.99కే దొరుకుతున్నాయా? అంటే సంసారసాగరాన్ని ఈదే సామాన్య కుటుంబరావులెవరైనా అసాధ్యం అంటారు. అయితే పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) మాత్రం ఈ లెక్కల ఆధారంగానే ఉద్యోగుల వేతనాన్ని నిర్ణయించింది. కుటుంబానికి కనీసం నలుగురు సభ్యులుంటారని భావించి లెక్కలుగట్టాలని ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పీఆర్సీ పట్టించుకోలేదు. తిండి సంగతి అటుంచితే.. కుటుంబం దుస్తుల అవసరాలకు ఏటా రూ. 17 వేలు సరిపోతాయని పీఆర్సీ నిర్ణయించింది. ఇక రూ. 770తో కుటుంబానికి నెలంతా సరిపడా పళ్లు, ఫలాలు కొనుక్కోవచ్చని అంచనా వేసింది. దీంతో కనీస వేతనం రూ. 15 వేలుగా నిర్ణయించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన సూచననూ పట్టించుకోకుండా రూ. 13 వేలతో సరిపెట్టింది. అంతేగాక 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా, పీఆర్సీ 29 శాతం సిఫార్సు చేసింది. కాగా, ఈ సిఫార్సులతో కూడిన పాక్షిక నివేదికను శనివారం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చింది. పాక్షిక నివేదికతో చర్చలకు ఆహ్వానం పీఆర్సీ పూర్తి నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వకుండానే ప్రభుత్వం వారిని సోమవారం చర్చలకు ఆహ్వానించింది. ఆ నివేదిక బహిరంగ పత్రమే (పబ్లిక్ డాక్యుమెంట్) అయినప్పటికీ ప్రభుత్వం తమతో దాగుడుమూతలు ఆడటాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. నివేదికలోని ముఖ్యాంశాలు.. కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డీఏ పెంచితే రాష్ట్రంలో 0.524 శాతం పెంచాలని పీఆర్సీ సూత్రీకరించింది. ప్రస్తుతం 0.856 శాతం ఉంది. తాజా సిఫార్సు ఉద్యోగులకు నష్టమే. ఇంటి అద్దె భత్యం ప్రస్తుతం గరిష్టంగా రూ. 12 వేలు ఉంది. దీన్ని రూ. 20 వేలకు పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. ఇంటి అద్దెను 4 స్లాబులుగా విభజించారు. జంట నగరాల్లో 30 శాతం, కార్పొరేషన్లలో 20 శాతం, మున్సిపాలిటీల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం అద్దె భత్యం చెల్లించాలని సూచించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటి అద్దె భత్యాన్ని 25 శాతం ఇవ్వాలని, నగర పరిధిని పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకు ఒక ప్రమోషన్(పోస్టుల్లేని పక్షంలో ఆమేరకు జీతపు శ్రేణి పెంచాలి) తప్పనిసరిగా ఇవ్వాలనే విధానాన్నే కొనసాగించాలని సూచించింది. గ్రాట్యుటీని రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచాలని సూచించింది. కమ్యుటేషన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 40 శాతాన్నే కొనసాగించాలంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి 33 సంవత్సరాల సర్వీసు చేస్తే పూర్తి పెన్షన్(ఆఖరు నెల జీతంలో సగం)కు అర్హత లభిస్తుంది. దీనికి 5 సంవత్సరాల వెయిటేజీ ఉంది. అంటే 5 సంత్సరాల మినహాయింపు ఉంటుంది. 28 సంవత్సరాలు సర్వీసు చేసిన ఉద్యోగులకు పూర్తి పెన్షన్ లభిస్తుంది. వెయిటేజీని 8 సంత్సరాలకు పెంచాలని తాజా పీఆర్సీ సిఫార్సు చేసింది. కేంద్రం 20 సంవత్సరాల సర్వీసు ఉన్న వారికి పూర్తి పెన్షన్‌కు అర్హత కల్పిస్తోంది. అదే విధానం రాష్ట్రంలో ఉండాలని ఉద్యోగులు కోరినా పట్టించుకోలేదు. ఉద్యోగులు/పెన్షనర్ల అంతిమ సంస్కార ఖర్చును 10 వేల నుంచి 20 వేలకు పెంచాలన్న విజ్ఞప్తికి పీఆర్సీ సానుకూలంగా లేదు. రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ పదో పీఆర్సీ అమలుపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలతో సోమవారం భేటీ కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పాక్షిక నివేదికలోని ముఖ్యాంశాలు.. కనీస వేతనాన్ని నిర్ధారించడానికి ఐఎల్సీ(ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్) అనుసరిస్తున్న విధానాన్ని పీఆర్సీ ఆధారంగా చేసుకుంది. అయితే కనీసం నలుగురు కుటుంబ సభ్యుల ఖర్చును ఆధారంగా చేసుకొని కనీస వేతనాన్ని నిర్ధారించాలని ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పీఆర్సీ పట్టించుకోలేదు. ముగ్గురు సభ్యుల ఖర్చునే ఆధారంగా తీసుకొంది. గరిష్ట వేతనం రూ. 1,10,850గా, కనీస వేతనం రూ. 13 వేలుగా నిర్ధారించింది. కనీస, గరిష్ట వేతనాల నిష్పత్తి 1:8.52గా ఉంది. 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లతో మాస్టర్ స్కేల్స్(మూల వేతన శ్రేణుల)ను పీఆర్సీ సిఫార్సు చేసింది. మాస్టర్ స్కేల్స్ ఇలా.. రూ. 13,000-390-14,170-430-15,460-470-16,870-510-18,400-550-20,050-590 21,820-640-23,740-700-25,840-760-28,120-820-30,580-880-33,220-950 36,070-1,030-39,160-1,110-42,490-1,190-46,060-1,270-49,870-1,360 53,950-1,460-58,330-1,560-63,010-1,660-67,990-1,760-73,270-1,880 78,910-2,020-84,970-2,160-91,450- 2,330- 1,00,770-2,520-1,10,850(80) పీఆర్సీ పాక్షిక నివేదిక www.sakshi.comలో -
పీఆర్సీ అమలుపై ఏపీ సీఎస్ ప్రాథమిక సమీక్ష
త్వరలో మంత్రుల కమిటీ ఏర్పాటు ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు అదనపు భారం నెలకు రూ. 8.96 కోట్లు సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమలు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందనే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమికంగా సమీక్షించారు. ఒక శాతం ఫిట్‌మెంట్‌కు నెలకు 8.96 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తున్నారని, 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫార్సు చేసిందని తెలిపారు. వాస్తవానికి 2013 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉన్నా.. ప్రభుత్వానికి నివేదిక అందడంలో జాప్యం జరిగిందని, రాష్ట్ర విభజన, పాలనాపరమైన కారణాల వల్ల అమల్లో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చారని, కనీసం 35 శాతం ఫిట్మెంట్ ఇచ్చే యోచనలో ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధానికి తరలివెళ్లాల్సి ఉంటుందని, హెల్త్‌కార్డుల వ్యయంలో 40 శాతం భరించాల్సి ఉంటుందని, నిత్యావసర వస్తువుల ధరలూ మండిపోతున్నాయని.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫిట్మెంట్ నిర్ణయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలతో ఫైల్‌ను తనకు పంపించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. త్వరలో ఏర్పాటయ్యే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందని చెప్పారు.