జీతాలు పెంచాలంటే చార్జీలు పెంచాల్సిందే | cabinet discussion in the on RTC strike | Sakshi
Sakshi News home page

జీతాలు పెంచాలంటే చార్జీలు పెంచాల్సిందే

Published Wed, May 13 2015 1:25 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

జీతాలు పెంచాలంటే చార్జీలు పెంచాల్సిందే - Sakshi

జీతాలు పెంచాలంటే చార్జీలు పెంచాల్సిందే

ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గంలో చర్చ
 
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను హైకోర్టు తప్పుబడుతున్న నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకుని వ్యవహారం నడిపించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు. కార్మిక సంఘాలతో రెండుమూడు దఫాలుగా చర్చలు జరిపాలని సూచించారు. వారికి 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వలేమన్నారు. కార్మికుల డిమాండ్ మేరకు ఫిట్‌మెంట్ ఇవ్వాలంటే చార్జీలు పెంచాలని పెంచకతప్పదని స్పష్టం చేశారు. మంగళవారం సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించారు.

ఫిట్‌మెంట్ చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుధవారం హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశం నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాకుండా ఎంతో కొంత పెంచుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఒప్పించాల్సిందిగా సూచించారు. ఇలావుండగా మద్యం విధానంపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉన్నప్పటికీ ఆ అంశంపై 23న జరగనున్న కేబినెట్ భేటీలో చ ర్చించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement