RTC workers strike
-
ఒకేరోజు.. రెండు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాం గం విషమ పరీక్షలను ఎదుర్కొంది. అయోధ్య తీర్పు ఒకవైపు, ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్‌బండ్ మరోవైపు పోలీసు యంత్రాంగాన్ని కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయోధ్య తీర్పుపై స్ప ష్టత రావడంతో శుక్రవారం రాత్రి 9గంటల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయా యి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుక్షణం పహారాలో ఉండి అవాంఛనీయ ఘటనలు లేకుండా జాగ్రత్తపడింది. చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే హౌస్ అరెస్టులు చేశారు. అదే విధంగా గ్రామాల వారీగా జల్లెడ పట్టి ఆర్టీసీ కారి్మకులను సైతం అరెస్టు చేసి చలో ట్యాంక్‌బండ్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. శనివారం నాడు ట్యాంక్‌బండ్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు మినహా... రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు ఎక్క డా చోటుచేసుకోకపోవడంతో పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది. అయోధ్యతో ఉత్కంఠ... ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై తీ ర్పును శనివారం ఉదయం వెల్లడించనున్నట్లు శుక్ర వారం రాత్రి 9గంటలకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టింది. దీంతో దేశమంతా ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాయి. వెనువెంటనే డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో హై అలర్ట్‌ను ప్రకటించింది. ఆ తర్వాత అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసుల కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ న్విహించారు. అన్ని జిల్లాల కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. అదే సమయంలో చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌తో పాటు సైబరాబా ద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో డీజీపీ ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అనుక్షణం తనతో టచ్‌లో ఉండాలని సూచించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో గత రెండు వారాలుగా రాష్ట్ర వ్యాప్తం గా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో మత పెద్దలు, పీస్ కమిటీలతో పోలీసు కమిషనర్లు, ఎస్పీలు సమావేశాలు నిర్వహించారు. సోషల్ మీడియాపైగా పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. అనుమానితులు, నేరచరిత ఉన్నవారిని ముందస్తుగా అరెస్టులు చేయగా... ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్తంగా చలో ట్యాంక్‌బండ్ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ ఉద్రిక్తలకు దారితీసింది. సీటీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీసులకు శుక్రవారం నుంచే కంటిమీద కునుకు లేదు. శుక్రవారం సాయంత్రం నుంచే ఆర్ఏఎఫ్, సివిల్, ఏఆర్, ఆక్టోపస్ బలగాలు 20వేల మంది నగరంలో పహారా కాశారు. చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి నిరాకరించినప్పటికీ ఆందోళనకారులు వేల సంఖ్యలో వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇంతలో ఆందోళనకారులు పోలీసులపైకి రాల్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో 400 మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. -
మిలియన్ మార్చ్‌పై ఉక్కుపాదం!
సాక్షి, వరంగల్ : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం జరగనున్న మిలియన్ మార్చ్ విజయవంతం కాకుండా చూసేందుకు పోలీసు వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలతో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లు కిటకిటలాడాయి. పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాలతో నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. శుక్రవారం ఉదయం నుంచే ప్రణాళికాబద్దంగా పోలీసులు ఆర్టీసీ కార్మికులతో పాటు, పార్టీలు, ప్రజా సంఘాల నాయకులపై కన్నేశారు. కదలికలను ఎప్పటికప్పుడు పోలీసు నిఘా బృందాలు ఉన్నతాధికారులకు చేరవేశాయి. ఈ మేరకు నేతలను అదుపులోకి తీసుకోగా వారిని ఉంచేందుకు స్థలం సరిపోకపోడంతో ఫంక్షన్ హాళ్లలో ఉంచారు. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల విధానాలపై శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఆధ్వర్యాన హన్మకొండలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య నేతలు, నాయకులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు రాత్రి వేళ గృహ నిర్బంధం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని హన్మకొండ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచగా సుబేదారి పోలీసులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పీసీసీ సభ్యులు ఈవీ.శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి క్రాంతి, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్‌ను సైతం గృహాల్లో నిర్బంధం చేశారు. కమిషనరేట్‌లో రాత్రి సమావేశం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ రాత్రి 10 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మిలియన్ మార్చ్‌కు కమిషనరేట్ పరిధి నుంచి ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నేతలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ముందుస్తు అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలలని ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా నేతల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు అరెస్టులు కొనసాగాయి. మహిళా కార్మికులను సైతం.. మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా ఆర్టీసీ మహిళా కార్మికులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నారని వారు ఎంత మొర పెట్టుకున్నా పోలీసులు వినలేదు. మహిళా కార్మికులను ఉదయమే ఏకశిలా పార్కులోని దీక్షా శిబిరంలో అదుపులోకి తీసుకుని పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. ఇక కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అయా విద్యార్థి సంఘాల నేతలను అదుధుపులోకి తీసుకున్నారు. హన్మకొండ పోలీసులు బస్టాండ్ వద్ద పికెటింగ్ ఏర్పాటుచేయగా నగర నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలు తనిఖీలు చేశారు. హసన్‌పర్తి: మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా హసన్‌పర్తి పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. హసన్‌పర్తి జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు గురుమూర్తి శివకుమార్, మారపల్లి రాంచంద్రారెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, విద్యాసాగర్, జ్ఞానేశ్వర్, తంగళపల్లి రమేష్, సత్యప్రకాష్‌ను అరెస్టు చేయగా, హసన్పర్తికి చెందిన మేడిపల్లి మదన్‌గౌడ్, కుమారస్వామి, ఆకుల అశోక్, బాబు, లక్ష్మణ్ తదితరులను కేయూ పోలీసుస్టేషన్‌కు తరలించారు. హన్మకొండ : హన్మకొండ బాలసముద్రం ఏకశిల పార్కులోని ఉద్యమ శిబిరంలో నిరసన తెలుపుతున్న కార్మికులు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బీఆర్.కుమార్ గౌడ్, ఎల్ఎన్.రావు, జీ.పీ.రెడ్డి, సత్తయ్య, ఎన్.రాధ, కె.అరుణ, కె.పద్మ, పి.విజిత, ఈ.సరిత, జి.విజయ, సీ.హెచ్.మమత, టి.అనిత, బి.శ్రీవాణి, ఎ.సరస్వతిని పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. కేయూ క్యాంపస్ : కేయూకు చెందిన విద్యార్థి సంఘాల నేతలు బొట్ల మనోహర్, మంద నరేష్, దులిశెట్టి మధును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. -
దీక్ష కొనసాగిస్తా: కూనంనేని
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పరిరక్షణతో పాటు, కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తన నిరవధిక దీక్ష కొనసాగిస్తానని సీపీఐ సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సమ్మెపై జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, వివిధ డిమాండ్లపై సానుకూల నిర్ణయం వెలువడే వరకు తన నిరసన దీక్ష కొనసాగుతుందని ‘సాక్షి’కి తెలిపారు. తన పల్స్రేట్ 53కు పడిపోయిందని, ఆరోగ్యం విషమిస్తోందని డాక్టర్లు హెచ్చరించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం కదిలి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కారం సాధ్యం కాదని భావించే విషయాలపై కమిటీని ఏర్పాటుచేసి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కూనంనేని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో కోదండరాం (టీజేఎస్), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహ (సీపీఐ), మంద కృష్ణమాదిగ (ఎమ్మార్పీఎస్), వీహెచ్ (కాంగ్రెస్), ఎల్.రమణ (టీటీడీపీ), రావుల చంద్రశేఖరరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కూనంనేనిని పరామర్శించారు. -
సకలజనుల సమ్మెతో సమం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గకుండా ఉధృతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన సకల జనభేరీ సభకు అన్ని జిల్లాల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. సభ నిర్వహించిన స్టేడియం సామర్థ్యం చిన్నది కావటంతో జేఏసీ నేతలు జనసమీకరణకు పెద్దగా యత్నించలేదు. అయినా జిల్లాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో తరలివెళ్లారు. మిగిలినవారు ఆయా డిపోల ముందు నిరసనలు కొనసాగించారు. బుధవారంతో సమ్మె 26 రోజులు పూర్తి చేసుకుంది. గురువారంతో తెలంగాణ సాధన కోసం జరిపిన సకల జనుల సమ్మె కాలంతో సమమవుతుంది. అదనంగా ఒక్కరోజు దాటినా తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ సమ్మెగా రికార్డుల కెక్కనుంది. 2013లో జరిగిన సకల జనుల సమ్మె సమయంలో 27 రోజుల పాటు బస్సులు నిలిపేసి కార్మికులు సమ్మె చేశారు. ఇప్పుడు అంతకంటే దీర్ఘకాల సమ్మెగా అవతరించనుంది. 72 శాతం బస్సులు తిప్పాం: ఆర్టీసీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 72.8 శాతం బస్సు లు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,575 ఆర్టీసీ బస్సులు, 1,950 అద్దె బస్సులు తిప్పినట్లు వెల్లడించింది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,515 ప్రైవేట్ కండక్టర్లు విధులకు వచ్చారని, 5598 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడారని, 542 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
20 వేల బస్సులైనా తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం ఎంతకీ తెగట్లేదని, ఎంతకాలం ప్రజలకు ఈ ఇబ్బందులని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పదిహేను, 20 వేల ప్రైవేటు బస్సులను రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని, వాటికి రూట్ పర్మిట్లు జారీ చేసేందుకు కసరత్తు చేయాలని రవాణ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై బుధవారం ప్రగతి భవన్లో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆ శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో సమీక్షించారు. గురువారం హైకోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలు చేయనున్న అఫిడవిట్‌ను సీఎం పరిశీలించారు. హైకోర్టు నుంచి ప్రభుత్వానికి ప్రతికూల ఆదేశాలందితే తక్షణమే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు తెలిసింది. సకల జన భేరీ నిర్వహించడం, విపక్ష నేతలను ఈ సభకు ఆహ్వానిచడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని అధికారవర్గాలు తెలిపాయి. -
ఆర్టీసీలో కేంద్రం పెట్టుబడి రూ.61 కోట్లు
* యాభై ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు శూన్యం * లాభాలొచ్చినప్పుడు వివరణ కోరిన కేంద్ర ప్రభుత్వం * నష్టాలపై నోరు మెదపని తీరు * ఎయిర్ఇండియాకు బెయిలౌట్ ప్యాకేజీ తరహాలో ఆర్టీసీని ఆదుకోవాలని కేంద్రానికి లేఖ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు లేఖ రాయలని భావిస్తోంది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉంది. గతంలో లాభాల్లో వాటా కోరిన కేంద్రం.. నష్టాలొచ్చినప్పుడు మాత్రం మొహం చాటేసింది. ఈ విషయమై పాత లెక్కలు తీసే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. తీవ్ర నష్టాల్లో మునిగిన ఎయిర్ ఎండియాను కేంద్రం బెయిలౌట్ ప్యాకేజీ రూ.30 వేల కోట్లు అందించి ఆదుకుంది. కానీ దాదాపు రూ.4 వేల కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి దివాలా దిశగా సాగుతున్న మన రోడ్డు రవాణా సంస్థకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఎయిర్ ఇండియాకు- మన ఆర్టీసీకి పొంతన ఏంటనుకుంటున్నారా..? ఈ రెండు సంస్థలు కూడా కేంద్రప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పడ్డవే. ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది. కేంద్రప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పాటు కావటంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం ఇందులో పెట్టుబడులు పెట్టాయి. కేంద్రం రూ.61.07 కోట్లు, రాష్ట్రప్రభుత్వం రూ.133.19 కోట్లు పెట్టుబడిగా సమర్పించాయి. వెరసి రూ.194.26 కోట్లతో సంస్థ ఆవిర్భవించింది. అంతే.. ఆ తర్వాత ఇప్పటివరకు అటు కేంద్రం గాని, ఇటు రాష్ట్రం ప్రభుత్వం గాని మళ్లీ ఆర్టీసీలో పెట్టుబడి పెట్టలేదు. లాభాలు లక్ష్యంగా కాకుండా ప్రజాసేవ ప్రధానోద్దేశంగా ఏర్పడే ప్రజారవాణా సంస్థలు నష్టాలపాలు కావటం సహజం. ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలి. కానీ ఆర్టీసీ విషయంలో ఇది జరగలేదు. తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర సాయం రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లాభాలపై దృష్టి... రెండు దశాబ్దాల క్రితం ఆర్టీసీకి పుష్కలంగా లాభాలొచ్చాయి. ఈ తరుణంలో కేంద్రప్రభుత్వం పెట్టుబడి సంస్థగా తనవంతు వాటాను కోరింది. ప్రయాణికులకు వసతులు కల్పించే ఉద్దేశంతో ఆ లాభాలను ఆర్టీసీ బస్స్టాండ్ల నిర్మాణానికి వినియోగించింది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చింది. 2007-08, 2008-09 సంవత్సరాల్లో ఎంవీ ట్యాక్స్ తగ్గించిన ఫలితంగా మళ్లీ ఆర్టీసీ లెక్కల్లో లాభాలు నమోదయ్యాయి. మిగిలిన కాలమంతా నష్టాలే. కానీ కేంద్రప్రభుత్వం నోరు మెదపటం లేదు. సంస్థ మనుగడ కష్టంగా మారటంతో ఆర్టీసీ యాజమాన్యం బ్యాంకులు, ఎల్ఐసీ నుంచి రూ.4 వేల కోట్ల అప్పులు తెచ్చి నెట్టుకొస్తోంది. అడపాదడపా కొత్త బస్సులు కొనేందుకు రాష్ట్రప్రభుత్వం లోన్లు, గ్రాంట్లు ఇవ్వటం మినహా పెట్టుబడి సంస్థలుగా ఈ రెండు ప్రభుత్వాల నుంచి ఆర్టీసీకి సాయం శూన్యం. కేవలం 33 వేల మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియాను ఆదుకునేందుకు బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం 1.20 ల క్షల మంది కార్మికులున్న ఆర్టీసీ విషయాన్ని పట్టించుకోలేదు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు రూ.5 వేల కోట్ల సాయం చేస్తున్న తరహాలోనే ఆర్టీసీని కూడా ఆదుకోవాలంటూ పూర్తి వివరాలతో త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పాత లెక్కలు తీస్తున్నారు. -
ఇద్దరు సీఎంల తీరు.. ప్రజా వ్యతిరేకం
భువనగిరి : ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు ప్రజావ్యతిరేకంగా ఉందని వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ , సహాయ కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డిలు విమర్శించారు. గురువారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్చె నోటీస్ ఇచ్చినపుడే ప్రభుత్వం స్పందించి ఉంటే 8రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సిన అవసం వచ్చేది కాదన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న సీఎం ఆర్టీసీ కార్మికుల పెంచే జీతాలపై తర్జనభర్జనతో కాలయాపన చేయడంతో ఆర్టీసీకి సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్ చేస్తానని చెప్పిన కేసీఆర్ వారు సమ్మెకు దిగితే తప్పా వారికి ఇచ్చిన హామీ గు ర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ సీఎం గా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం నమోదు చేసి ఆర్థికంగా ఆదుకుందన్నారు. తెలంగాణ రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకో వడంలేదన్నారు. వచ్చే సీజన్లోనైనా రైతుల కు రోజుకు ఏడుగంటల పాటు కరెంట్ సరఫరా చేయాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి వెంటనే కేం ద్రంపై ఒత్తిడి తేవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో పార్టీ యువజన విభా గం భువనగిరి పట్టణ నాయకుడు బబ్బూరి నరేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రొడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
సమ్మె విరమించిన కార్మికులు ► రాత్రి నుంచి పూర్తిస్థాయిలో కదలిన బస్సులు ► 43శాతం ఫిట్‌మెంట్‌పై సంబరాలు ► ఎనిమిది రోజులకు రూ.6 కోట్ల నష్టం నెల్లూరు (రవాణా) : ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రొడ్డెక్కాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలంటూ ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. బుధవారం రాష్ట్ర మంత్రుల సబ్‌కమిటీ, యూనియన్లు నేతలు చేపట్టిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో కార్మిక సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఫిట్మెంట్తో పాటు అరియర్స్‌ను రెండు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సమ్మె విరమించి తక్షణం విధుల్లోకి వెళ్లనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగిన 410 బస్సులు.. బుధవారం సాయంత్రం వరకు జిల్లాలోని ఆయా డిపోల నుంచి 410 బస్సులు తిరిగాయి. వాటిలో 311 ఆర్టీసీ బస్సులు, 109 అద్దె బస్సులు ఉన్నాయి. బస్సులకు 311 మంది తాత్కాలిక డ్రైవర్లు, 410 మంది కండక్టర్లు విధులు నిర్వహించారు. రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా 850 బస్సులు తిరిగాయి. ఎనిమిది రోజుల సమ్మె ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో ఆర్టీసీకి రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దీంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుతో బస్సులను నడిపారు. గతంలో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.కోటి రెవెన్యూ వచ్చేది. కార్మికులు సమ్మె కాలంలో రోజుకు రూ.25 లక్షలకు మించలేదు. మిఠాయిల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం 43శాతం ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన ఆర్టీసీ బస్డాండ్‌లో ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, కార్మికసంఘ్ తదితర యూనియన్ల నాయకులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఫిట్‌మెంట్‌కు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు. సమ్మెకు సంఘీభావం, మద్దతు తెలిపిన వైస్సార్‌సీసీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ తదితర పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అదేవిధంగా సమ్మెకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం కార్మికుల విజయంగా పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన బస్సులు
43 శాతం ఫిట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం జేఏసీ నాయకుల సంబరాలు కడప అర్బన్, ఎడ్యుకేషన్ : ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇస్తామని ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఏడు రోజులుగా నిర్వహించిన సమ్మె బుధవారం 8వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులతో జరిగిన చర్చల ఫలితంగా కార్మికుల ప్రధాన డిమాండ్ 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి సంబరాలు చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో బుధవారం సాయంత్రం బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అంతకుముందు కడప నగరంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స యూనియన్ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఎస్వీబీ రాజేంద్రప్రసాద్, రీజినల్ అధ్యక్షుడు నాగముని, కోశాధికారి చెన్నయ్య, కడప డిపో అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాశం, ఏఆర్ మూర్తి, ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సురేష్, జోనల్ కార్యదర్శి పీవీ శివారెడ్డి, కడప డిపో కార్యదర్శి డీడీఎస్ మణి, బీఎంఎస్ నాయకులు, ఇతర సంఘాల నాయకులు, కార్మికులు సంబరాల్లో పాలుపంచుకున్నారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. మహిళా ఉద్యోగుల్లో ఆనందం ఆర్టీసీలో కండక్టర్లుగా పనిచేస్తున్న తమను కూడా ఉద్యమంలో భాగస్వాములు చేసి మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. మిగతా కార్మికులతోపాటు మహిళా ఉద్యోగులకు కూడా 43 శాతం ఫిట్మెంట్ వర్తించేలా నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది.- ప్రమీల, మహిళా కండక్టర్ అన్ని వర్గాల వారు మద్దతిచ్చారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని వైఎస్సార్సీపీ, బీజేపీ, వివిధ సంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు. అందరూ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో తమవంతు పాత్ర పోషించారు.- రాములమ్మ, మహిళా కండక్టర్ భవిష్యత్తులో వేతన సవరణకు మార్గం సుగమం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం సంతోషదాయకం. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వేతన సవరణ జరిగినపుడు అదే స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేందుకు మార్గం సుగమమైంది. - ఎస్వీబీ రాజేంద్రప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు కేసులన్నీ ఎత్తి వేయాలి.. కార్మిక సంఘాలు ఐక్య పోరాటం వల్ల ప్రభుత్వం దిగివచ్చి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. కేసులన్నీ ఎత్తివేసి కార్మికులకు న్యాయం చేయాలి. అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేస్తే కార్మిక కుటుంబాలు వీధినపడకుండా గాడిలో పడతాయి. - పీవీ శివారెడ్డి, ఎన్ఎంయూ జోనల్ కార్యదర్శి ఆనందంగా ఉంది ప్రభుత్వం, యాజమాన్యం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులకు న్యాయబద్దంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రతి కార్మికునికి న్యాయం జరిగినట్లైయింది. - ఎస్.నాగముని, ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు సమిష్టి పోరాటం వల్ల ప్రభుత్వం దిగి వచ్చింది కార్మికులకు న్యాయం జరిగేందుకు ప్రతి యూనియన్ ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వానికి, యాజమాన్యానికి సమస్య తీవ్రతను తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం దిగివచ్చింది. 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం భరోసా కల్పించినట్లయింది. - జీవీ నర్సయ్య, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి -
బస్సెక్కిన ఆర్టీసీ కార్మికులు
రైట్...రైట్ ఫిట్మెంట్ ప్రకటనతో కార్మికుల్లో సంబరాలు వైఎస్ జగన్ మద్దతు ప్రభావం చూపిందన్న కార్మికులు అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తలవంచిన ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రావడంతో జిల్లాలోని 12 డిపోల్లో పండుగ వాతావరణం బుధవారం నెలకొంది. కార్మికులు డిపో ముందుకు వచ్చి మిఠాయిలు పంచుకున్నారు. బాణా సంచా పేల్చి, రంగులు చల్లుకుని తమ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామనడంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని కార్మికులు పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడం హర్షనీయమన్నారు. విధుల్లోకి కార్మికులు సమ్మె కారణంగా రీజియన్‌లోని 4,652 మంది విధులకు దూరంగా ఉన్న విషయం విధితమే. ఫిట్మెంట్ ప్రకటనతో కార్మికులు ఆగమేఘాలపై విధులకు హాజరయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం ఆలస్యం చేయకుండా కార్మికులను రంగంలోకి దించింది. వారం రోజులుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ‘అనంత’ రీజియన్‌కు రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఆర్టీసీ ఆర్ఎం జి.వెంకటేశ్వరరావు కింది స్థాయి అధికారులతో సమావేశమై బస్సులు తిరిగేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామనడంతోనే.. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పోరాటంతోనే ప్రభుత్వం మేలుకుంది.. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఫిట్మెంట్ ప్రకటన తర్వాత వారు ఆర్టీసీ కార్మికులతో కలసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఫిట్‌మెంట్‌పై స్పష్టత రాకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారని, అందుకు ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుందన్నారు. సీఎం చంద్రబాబు కార్మిక ద్రోహి అని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అండ ఫలించిందని ఆర్టీసీ జేఏసీ నేతలు వీఎన్ రెడ్డి, సీఎన్ రెడ్డి, కొండయ్య, అవధాని శ్రీపాద అన్నారు. కార్మికుల పక్షాన నిలబడి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామనడంతో ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు. సంబరాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు అవధాని శ్రీపాద, జబ్బార్, ఆదాం, కల్లప్ప, వెంకటేశ్, రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ నేతలు ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మీసాల రంగన్న, కాంగ్రెస్ పార్టీ నేత దాదాగాంధీ, వామపక్ష నేతలు జాఫర్, రాజారెడ్డి, నాగేంద్ర, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల మౌన ప్రదర్శన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ, కార్మికులు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు నల్లరిబ్బన్లను నోటికి కట్టుకుని ర్యాలీగా అనంతపురం బస్టాండ్ నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా సప్తగిరి సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లాలోని మిగితా 11 డిపోల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం కళ్లు తెరవాలంటూ నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వీరికి వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపారు. ఈ మౌన ప్రదర్శన ర్యాలీలో ఆర్టీసీ జేఏసీ నేతలు వీఎన్ రెడ్డి, సీఎన్ రెడ్డి, కొండయ్య, నాగిరెడ్డి, ఆదాం, జబ్బార్, రామిరెడ్డి, గోపాల్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించింది. బుధవారం సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అసలే వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం రాత్రి సర్వీసులను పునరుద్ధరించింది. ఆర్ఎం జీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గురువారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు తిప్పుతామన్నారు. గతంలో అన్ని రూట్లకు ఏవిధంగా సర్వీసులు వెళ్లాయో అదే స్థాయిలో బస్సులు పంపుతామన్నారు. -
రైట్.. రైట్
ఆర్టీసీ కార్మికుల సమ్మె సమాప్తం విధుల్లో చేరిన సిబ్బంది డిపోలలో సంబరాలు రోజూ కోల్పోయిన ఆదాయం రూ.70లక్షల నుంచి 85లక్షలు విశాఖపట్నం: ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సర్కారుతో చర్చలు ఫలించడంతో కార్మికులు బుధవారం మ ద్యాహ్నం విధుల్లో చేరిపోయారు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. సమ్మె ముగిసినా భారీ నష్టాన్ని మాత్రం మిగిల్చిం ది. ప్రయాణీకులకు నరకం చూపించింది. విశాఖ నగరం, రూరల్ పరిధిలో 5312 మంది ఆర్టీసీ కార్మికులు ఈ నెల 6వ తేదీన సమ్మె బాటపట్టారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో 1016 బస్సుల సేవలు స్తంభించా యి. ప్రైవేటు రవాణా వాహనాల యజమానులు ఇదే అదునుగా ప్రయాణీకులను నిలువుదోపిడీ చేశారు. టిక్కెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకున్నారు.అధికారులు రోజుకి రూ.1000 చెల్లించి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకున్నారు. రోజుకి దాదాపు 500 సర్వీసులు నడిపారు. వారు కూడా ప్రయాణీకుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరోక్షంగా నలుగురు, ప్రత్యక్షంగా ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఏజెన్సీలోని జర్రెలఘాట్లో జీపు బోల్తాపడి నలుగురు చనిపోయారు. గాజువాక వద్ద బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత పడ్డారు. ఇక ఈ ఎనిమిది రోజుల్లో వాహన ప్రమాదాల్లో అనేక మంది గాయాలపాలయ్యారు. సమ్మె వల్ల సాధారణ ప్రయాణీకులతో పాటు ఎంసెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు హాజరయ్యే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా ఆర్టీసీకి రోజుకి రూ.70 లక్షల నుంచి రూ.85 లక్షల వరకూ ఆర్ధిక నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు బుధవారం సమ్మె విరమించడంతో సాయంత్రం నుంచే సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో మళ్లీ నగర వీధులు బస్సులతో కళకళలాడాయి. కార్మికులు ఆర్టీసీ డిపోలకు చేరుకుని తమ విధులను చేపట్టారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తమకు కేటాయించిన బస్సులు తీసుకుని ప్రయాణీకుల సేవకు బయలుదేరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి 43 శాతం ఫిట్‌మెంట్‌కు ఒప్పుకోవడం సంతోషమని సమ్మెకు నేతృత్వం వహించిన కార్మిక సంఘాలు తెలిపాయి. సమ్మె కాలంలో తమకు సహకరించిన ప్రయాణికులు, మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు కార్మిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది.పలు డిపోల్లో ఆందోళనలు జరిగాయి. మద్దిలపాలెం డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏజెన్సీలో శిరోమండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రానికి తీపి కబురు అందడంతో సంబరాల్లో మునిగితేలారు. కార్మిక విజయం.. మండుటెండను కూడ లెక్కచేయకుండా, కుటుంబాల యోగక్షేమాలు పట్టించుకోకుండా అహర్నిశలు రోడ్లపై ఉద్యమాలు చేపట్టిన కార్మికులకే ఈ విజయం దక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, సంస్థ ఎండీ కార్మికుల సంక్షేమాన్ని, ఆర్ధిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఫిట్మెంట్ ఇవ్వడానికి సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. -పలిశెట్టి దామోదర్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సమష్టి కృషి ప్రతి కార్మికుడు చిత్తశుద్ధితో పోరాటం చేయడం ద్వారా దిగ్విజయంగా సమ్మె ముగిసింది. కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఉపసంఘం గ్రహించి 43 శాతం ఫిట్మెంట్తో పాటు విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం, రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులపై కేసుల ఎత్తివేత వంటి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. -వై.శ్రీనివాసరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. -
నేడు ఎంసెట్ ఆల్ ది బెస్ట్
తొలగిన రవాణా కష్టాలు విద్యార్థుల్లో సంతోషం పరీక్ష కేంద్రాలకు 661 బస్సులు ఆర్టీసీ టోల్ ఫ్రీ నంబర్లు 040-23202813, 99592 26160 విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ హామీ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో ఎంసెట్‌కు హాజర వుతున్న విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తమ డిమాండ్ల సాధనకు కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన రాగానే వారి మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. గ్రేటర్‌లోని 8 రీజినల్ సెంటర్ల పరిధిలో మొత్తం 1,13,700 మంది విద్యార్థులు గురువారం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్న విషయం తెలిసిందే. ఇందులో 67,686 మంది ఇంజినీరింగ్, 45,100 మంది మెడికల్ ప్రవేశ పరీక్ష రాయనున్నారు. మరో 457 మంది ఈ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో మొత్తం 189 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో ఇంజినీరింగ్‌కు 111, మెడికల్ కు 78 కేటాయించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. నిర్ణీత సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు పలుమార్లు సూచించారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులలో ఇది ఆందోళన పెంచింది. బస్సులు రోడ్డెక్కడంతో ఊరట చెందారు. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు ఎదురుకాకుండా పోలీసులూ చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో 661 బస్సులు రవాణా విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని రూట్లనూ కలుపుతూ పరీక్ష కేంద్రాలకు బస్సులు నడుపుతున్నారు. దీని కోసం 661 బస్సులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ కె.నిర్మల వెల్లడించారు. ఇందులో 200కు పైగా ఆర్టీసీవి ఉన్నాయి. వీటితోపాటు కళాశాలలు, స్కూళ్లు, ప్రైవేటు సంస్థలకు చెందిన 400కు పైగా బస్సులను వినియోగించనున్నారు. విద్యార్థులు సులువుగా గుర్తించేందుకు వీలుగా బస్సులన్నింటిపై ఎంసెట్ పరీక్ష కేంద్రానికి సంబంధించిన బ్యానర్ ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్లు... రవాణా సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కలెక్టరేట్లో అధికారులు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 040-23202813 నంబరులో విద్యార్థులు, తల్లిదండ్రులు సంప్రదించవచ్చు. కోఠి బస్ టెర్మినల్‌లో మరో టోల్ ఫ్రీ నంబరు 99592 26160ను కూడా అందుబాటులోకి తెచ్చారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మరోపక్క విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఉదారత కనబరుస్తున్నాయి. త మ కళాశాల కేంద్రంగా పరీక్ష రాసే విద్యార్థుల కోసం వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడుపుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ జిల్లాలో గురువారం జరుగుతున్న ఎంసెట్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మల సీఎస్‌తో మాట్లాడుతూ జిల్లాలో 111 కేంద్రాల్లో 1.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టు తెలిపారు. వీరి సౌకర్యార్థం 661 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఆర్కే కళాశాల ప్రత్యేక బస్సులు తమ కళాశాల కేంద్రంగా ఎంసెట్ రాసే విద్యార్థుల కోసం డీఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మియాపూర్-మేడ్చల్ దారిలో ఉన్న ఈ కళాశాలకు అమీర్‌పేట, కూకట్పల్లి, వీవీ నగర్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, మలేషియా టౌన్షిప్, లింగంపల్లి, సికింద్రాబాద్, బాలానగర్, గండిమైసమ్మ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలిపింది. వివరాలకు 8790911899, 9849285621లో సంప్రదించవచ్చు. -
సూపర్ ఫిట్
తమకు 44 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం... ఆర్టీసీ కార్మికుల్లో ఆనందోత్సాహాలను నింపింది. దీంతో వివిధ ప్రాంతాల్లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు వేడుకల్లో మునిగి తేలారు సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో బుధవారం సాయంత్రం సిటీ బస్సులు రోడ్డెక్కాయి. గురువారం ఉదయం నుంచి ఆర్టీసీ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. ఆశించిన దానికన్నా ఒక శాతం ఎక్కువే సాధించుకున్న కార్మికులు సమ్మె విరమించి సంబరాలు చేసుకున్నారు. డిపోలు, బస్ భవన్, జూబ్లీ, ఎంజీబీఎస్, తదితర బస్ స్టేషన్ల వద్ద కార్మికులు మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు పేల్చి విజయోత్సవాలు నిర్వహించారు. బుధవారం ఉదయం కార్మికుల ధర్నాతో దద్దల్లిన బస్‌భవన్ ప్రాంగణం... సాయంత్రం విజయోత్సవ నినాదాలతో మిన్నంటింది. అన్ని డిపోల వద్ద టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల నేతృత్వంలో వేడుకలు జరిగాయి. 44శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే అప్పటి వరకు సమ్మెలో ఉన్న కార్మికులంతా సంబరాల్లో మునిగిపోయారు. నిరసన ప్రదర్శనలు విజయోత్సవాలుగా మారాయి. వివిధ ప్రాంతాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంతోషాన్ని ప్రకటించారు. అంతకు కొద్దిసేపటి క్రితం వరకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్మికులు... ఆ తరువాత జిందాబాద్‌లతో హోరెత్తించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 28 డిపోలలో పని చేసే సుమారు 24 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్వైజర్లు, వివిధ కేటగిరీల ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంపుతో ప్రయోజనం లభించనుంది. మరోవైపు ఎనిమిది రోజుల పాటు బస్సులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగనున్న దృష్ట్యా విద్యార్థులు, తల్లిదండ్రులు ఊర ట చెందుతున్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఎంసెట్‌కు 600కు పైగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను యధావిధిగా నడపనున్నట్లు ఈడీ జయరావు చెప్పారు. గురువారం ఉదయం నుంచి అన్ని డిపోల పరిధిలో పూర్తి స్థాయిలో 3850 బస్సులు రోడ్డెక్కనున్న దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా గురువారం నుంచి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. నరకం చూశారు... ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నగరంలో ప్రయాణికులు ఎనిమిది రోజుల పాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు ఉదయం, సాయంత్రం వేళల్లో నరకం చవి చూశారు. మరోవైపు ఆటోలు, ప్రైవేట్ వాహనాల దోపిడీ తారస్థాయికి చేరింది. చార్జీలు రెండు, మూడు రెట్లు పెంచి... ప్రయాణికులను దోచుకున్నారు. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీలు, వివిధ రకాల రవాణా వాహనాలు సైతం నిలువుదోపిడీకి పాల్పడ్డాయి. ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు ఆటోవాలాల కు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేశారు. టిక్కెట్లు ఇవ్వకుండా కొంతమొత్తం జేబుల్లో వేసుకొని మిగిలిన సొమ్ము ఆర్టీసీ డిపోల్లో జమ చేశారు. నగర శివారు ప్రాంతాలకు, కాలనీలకు రాత్రి వేళల్లో బస్సులు లేకపోవడంతో సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫిట్మెంట్ పెంపు నేపథ్యంలో చార్జీలను పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో నగరంలోని 35 లక్షల మంది ప్రయాణికులు భారం మోసేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో, మానవహారం
పట్నంబజారు(గుంటూరు) : ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మంగళవారం ఏడో రోజు ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ ఎదుట భారీ సంఖ్యలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. తొలుత ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల నేతలు బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. సుమారు 45 నిముషాలకు పైగా మానవహారంగా ఏర్పడడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మహిళా కార్మికులు చంటి బిడ్డలతో సైతం ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ లోపలికి చేరుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ లోపలి నుంచి బయటకు వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకుని, శాంతియుతంగా ఆందోళన చేయాలని కార్మిక సంఘాల నేతలకు సూచించారు. బస్సులను నిలిపిన సమయంలో టైర్లలోని గాలి తీయడానికి యత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం వదిలిపెట్టారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఎన్వీకే రావు, మందపాటి శంకర్రావు, సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు భావన్నారాయణ, కోటా మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నేతాజీ పాల్గొన్నారు. ఉధృతమైన సమ్మె గుంటూరు రీజయన్ పరిధిలో మంగళవారం పలు చోట్ల బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహిం చారు. గత రెండు రోజుల నుంచి కార్మిక సం ఘాలు ఆందోళనలు మరింత ఉధృతం చేశా యి. ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్, తాత్కాలిక సిబ్బందితో సర్వీసులు పునరుద్ధరించే ప్రయత్నం చేసినా అంతంతమాత్రంగానే తిరిగాయి. నేడు నిరసన ప్రదర్శన... ఆర్టీసీ కార్మికులు రీజియన్ పరిధిలో నేడు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. 13 డిపోల్లోనూ కళ్ళకు గంతలు కట్టుకుని ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఎంప్లాయీస్ యూనియన్ రీజయన్ అధ్యక్షుడు ఎన్వీకే రావు తెలిపారు. కార్మిక సంఘాలకు రాజకీయపార్టీలు తోడుగా నిలవనున్నాయి. -
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో భారీగా తగ్గిన రాబడి
నెల్లూరు (రవాణా) : కార్మికుల సమ్మెతో ఆర్టీసీ రాబడికి భారీగా గండి పడింది. దూర ప్రాంతాలకు బస్సులును తిప్పకపోవడం, తాత్కాలిక ఉద్యోగులు, అధికారులు చేతివాటం ఆర్టీసీని మరింత పీకల్లోతు కష్టాల్లోకి తీసుకెళ్లింది. ఆర్టీసీ అధికారులు తమకు అనుకూలమైన వారికి విధులు అప్పగించి వసూలైన చార్జీల్లో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 7వరోజు ధర్నాలకే పరిమితం.. కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని ఆయా డిపోల్లో ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసి బస్డాండ్ నుంచి గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లేబర్ కమిషనర్‌కు మెమొరాండం అందించారు. సమ్మె కొనసాగింపుకే మొగ్గు.. రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సమ్మె కొనసాగిస్తామంటున్నారు. ముందుగానే నోటీసు ఇచ్చి చట్టబద్దంగా సమ్మె చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం మేరకే నడుచుకుంటామని పలు యూనియన్ల నాయకులు చెబుతున్నారు. ఆర్టీసి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నెల్లూరు (రవాణా) : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ మంగళవారం ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ బస్డాండ్ సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయుకులు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వ బెదిరింపుల్లో భాగమేనన్నారు. కార్మికుల డిమాండ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 40శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినా ఏపీలో మాత్రం అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయుకులు బాబూ శామ్యూల్, నారాయణ, ఎన్ఎంయూ నాయకులు కుమార్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఎంఆర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, కార్మిక్‌సంఘ్ నేతలు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విధులకు హాజరైతే క్రమబద్ధీకరణ ఇన్చార్జి ఈడీ శశిధర్ నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు బుధవారం విధులకు హాజరైతే క్రమబద్ధీకరించనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు జోన్ ఈడీ శశిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం హజరుకాకుంటే శ్వాశతంగా విధుల నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేశారు. -
దోపిడీ అ‘ధనం’
పట్నంబజారు (గుంటూరు) : ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా పూర్తి స్థాయిలో సఫలం కాలేదనే చెప్పాలి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారుతోంది. ఈ నెల 6వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రీజియన్ పరిధిలోని అధికారులు హెవీ డ్రైవింగ్ లెసైన్సులు కలిగిన డ్రైవర్లు, పదో తరగతి విద్యార్హత కలిగిన వారిని కండక్టర్లుగా తీసుకున్నారు. సుమారు 13 డిపోల్లో 200 మంది డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక విధుల్లోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికలు మాత్రం విధులకు వచ్చి వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. రీజియన్ పరిధిలో మొత్తం 1275 బస్సులు ఉన్నాయి. వాటిలో 1050 ఆర్టీసీవీ కాగా, 225 హైర్ బస్సులు. సమ్మె ప్రారంభం అయిన నాటి నుంచి డిపో నుంచే హైర్ బస్సులు తిరుగుతున్నా, ఆర్టీసీకి ఎలాంటి రసుం చెల్లించడం లేదు. కాంట్రాక్ట్ ప్రకారం ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించటం లేదు. అయితే గమ్యస్థానం ప్రకారం ఒక నిర్ధిష్ట మొత్తాన్ని సంస్థకు చెల్లించాలని అధికారులు వారికి సూచించి సర్వీసులకు పంపిస్తున్నారు. గమ్యస్థానం, ధరల పట్టికను వారికి అందజేశారు. అయితే వారిలో కొంత మంది మాత్రం టికెట్ ధరకు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ ధర రూ.20 ఉంటే రూ. 40 వరకు తీసుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. టికెట్లు ఇచ్చే పద్ధతి లేకపోవడంతో కొంత మంది సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రయాణికుల నుంచి అధికమొత్తంలో వసూలు చేయకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రైవేట్ దందా.... ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు వరంగా మారింది. రీజియన్ పరిధిలో నిత్యం 400 సర్వీసుల వరకు దూరప్రాంతాలకు వె ళుతుంటాయి. సమ్మె నేపథ్యంలో రీజియన్‌లోని 13 డిపోల నుంచి ఆర్టీసీకి చెందిన ఒక్క బస్సు కూడా దూరప్రాంతాలకు వెళ్లటంలేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు ఒకటికి నాలుగు రెట్లు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ప్రయాణం భారంగా మారుతోందని చెబుతున్నారు. హైదరాబాద్‌కు టికెట్ రూ.400 ఉంటే రూ.1200 వరకు వసూలు చేస్తున్నారంటే ప్రైవేట్ దందాను అర్థం చేసు కోవచ్చు. అధికారులు స్పందించి ప్రైవేట్ బస్సుల దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాత్కాలిక సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం... సమ్మె నేపథ్యంలో విధుల్లో తీసుకున్న తాత్కాలిక సిబ్బందికి నిత్యం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పీవీ రామారావు చెప్పారు. అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం తమ దృష్టికీ వచ్చిందన్నారు. టికెట్టు ధర కంటే అధికంగా వసూలు చేయొద్దని వారికి చెప్పటం జరిగిందన్నారు. ప్రస్తుతం టిమ్స్ వాడటం తాత్కాలిక సిబ్బందికి ఇబ్బందిగా ఉంటుందనే దృష్టితో నేరుగా చార్జీలు తీసుకుంటు న్నామన్నారు. అధిక చార్జీలు వసూలు చేయకుండా పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపడతామన్నారు. - ఆర్ఎం రామారావు, గుంటూరు. -
ఏడవ రోజూ కొనసాగిన సమ్మె
ఆర్టీసీ కార్మికుల మౌన ప్రదర్శన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారం ఏడవ రోజూ కొనసాగింది. నేతలు, కార్మికులు ఆర్టీసీ బస్టాండు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు ఎస్.నాగముని, ఏఆర్ మూర్తి, పీవీ శివారెడ్డి, రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే తమ డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నారు. తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్లను నియమించుకుని వారికి వేలాది రూపాయలు వేతనంగా ఇస్తూ కార్మికులు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కొందరు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన డబ్బును పూర్తిగా క్యాష్ కౌంటర్లో కట్టకుండా స్వాహా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పోటాపోటీగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు
కార్మిక శాఖ సహాయక కమిషనర్‌కు, అంబేద్కర్ విగ్రహానికి టీఎంయూ వినతి {పొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఈయూ, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకుల వినతిపత్రం హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ రీజియన్‌లో యూనియన్లుగా విడిపోయి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం ఏడో రోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఒంటరిగా, ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, బహుజన కార్మిక సమాఖ్య జేఏసీగా నిరసన కార్యక్రవలు నిర్వహించారు. ఈ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు మౌన ప్రదర్శనగా ర్యాలీ తీశారు. ఆర్టీసీ రీజినల్ జేఏసీలోని ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, బహుజన కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికులు హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హన్మకొండలోని ఏకశిల పార్కు వరకు మౌనప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. సీఎంకేసీఆర్,మంత్రులు, ఆర్టీసీ యాజమాన్యంలో మార్పు తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆయూ సంఘాల నాయకులు వెంకన్న, బి.వీరన్న, ఎన్.రాజయ్య, చింత రాంచందర్, బి.రఘువీర్, సి.హెచ్.యాకస్వామి, ఎన్.కొమురయ్య, కృష్ణ, సోము, శేఖర్ పాల్గొన్నారు. టీఎంయూ ఆధ్వర్యంలో.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన జరిపి కార్మిక శాఖ సహాయ కమిషనర్ మొగిలయ్యకు వినతిపత్రం అందించారు. తమ వేతన సవరణ 2013 ఏప్రిల్‌తో ముగిసిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు వేతన సవరణ చేయకుండా యాజమాన్యం తమను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, దీంతో తాము సమ్మె చేయాల్సి వచ్చిందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం కార్మిక శాఖ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం, ఆర్టీసీ యా జమాన్యం మనసు మార్చాలని కోరుతూ వినతిపత్రం అం దించారు. కార్యక్రమంలో టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, కార్యదర్శి ఈఎస్ బాబు, ఎం.డీ.గౌస్, ఆర్.సాంబయ్య,జి.సత్తయ్య, ఎస్ఆర్కుమార్, ఆర్.వి.గోపాల్, రవీందర్, పాషా, జోషి, కె.ఎస్.కుమార్ పాల్గొన్నారు. డిపోలకే పరిమితమైన బస్సులు హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో బస్సులు 7వ రోజు బుధవారం డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులంతా సమ్మెలో ఉండటంతో బస్సులు బయటికి వెళ్లలేదు. 56 మంది తాత్కాలిక డ్రైవర్లు విధులకు హాజరుకావడంతో 56 ఆర్టీసీ బస్సులు, 194 అద్దె బస్సులు తిరిగాయి. ఏడో రోజు కూడా ఆర్టీసీ జిల్లాలో రూ.కోటి ఆదాయాన్ని కోల్పోయింది. నేడు ఆర్ఎం కార్యాలయం ముట్టడి సమ్మెలో భాగంగా బుధవారం హన్మకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు టీఎంయూ రీజినల్ కార్యదర్శి ఈఎస్ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఈదురు వెంకన్న తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
డిపోల ఎదుట కార్మికుల ఆందోళన
అర్ధనగ్న ప్రదర్శనలు ఏడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికులు పట్టువీడక నిరసనలతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 43 శాతం వేతన ఫిట్మెంట్ మంజూరు చేసేదా కా సమ్మెను విరమించబోమని నినదిస్తున్నా రు. మంగళవారం జిల్లాలోని 12 డిపోల్లో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. అరకొర బస్సులు తిరుగుతుండగా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. అనంతపురం డిపో ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్ మేరకు ఫిట్మెంట్ ప్రకటించాల్సిందేనంటూ నినాదాలు చేశారు. కళ్యాణదుర్గంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. గుంతకల్లులో సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరిలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉరవకొండలో కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. తాడిపత్రి, ధర్మవరం, మడకశిర, రాయదుర్గం, తదితర డిపోల్లో సమ్మె కొనసాగింది. ఏడు రోజుల సమ్మె కారణంగా అనంతరం రీజియన్‌లో రూ.7 కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. సమ్మె ఎప్పుడు విరమిస్తారో.. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు సమ్మె విరమిస్తారోనని వేచి చూస్తున్నారు. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు మంగళవారం 392 బస్సులు తిప్పారు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో బస్సు సర్వీసులు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినవారికి తిప్పలు తప్పడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సులవారు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. రేల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. -
జీతాలు పెంచాలంటే చార్జీలు పెంచాల్సిందే
ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గంలో చర్చ హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను హైకోర్టు తప్పుబడుతున్న నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకుని వ్యవహారం నడిపించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు. కార్మిక సంఘాలతో రెండుమూడు దఫాలుగా చర్చలు జరిపాలని సూచించారు. వారికి 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వలేమన్నారు. కార్మికుల డిమాండ్ మేరకు ఫిట్మెంట్ ఇవ్వాలంటే చార్జీలు పెంచాలని పెంచకతప్పదని స్పష్టం చేశారు. మంగళవారం సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. ఫిట్మెంట్ చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుధవారం హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశం నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాకుండా ఎంతో కొంత పెంచుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఒప్పించాల్సిందిగా సూచించారు. ఇలావుండగా మద్యం విధానంపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉన్నప్పటికీ ఆ అంశంపై 23న జరగనున్న కేబినెట్ భేటీలో చ ర్చించనున్నారు. -
ఏపీలో సమ్మె యథాతథం
హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కోరుతూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం ఆరోరోజూ రాష్ట్ర వ్యాప్తం గా సాగింది. సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అఖిలపక్ష నేతలు అండగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్లల్లో వినతి పత్రాలు అందించారు. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం నియమిస్తున్న తాత్కాలిక డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరిన తాత్కాలిక డ్రైవర్ బస్సు బయటకు తీస్తుం డగా సెక్యూరిటీ షెల్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కోరినట్టు 3 వారాల గడువును ఇచ్చేది లేదని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) రాష్ట్ర నేతలు పద్మాకర్, దామోదర్ తేల్చిచెప్పారు. -
అవే అవస్థలు
- కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. సోమవారం యథావిధిగా నగరవాసులు ఇబ్బందులు - ఎదుర్కొన్నారు. బస్సులు లేక... - ప్రైవేట్ వాహనాలు దొరక్క నానాపాట్లు పడ్డారు. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు దోపిడీ పర్వం కొనసాగించారు. అర్ధనగ్న ప్రదర్శనలతోఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల ఎదుట నిరసన తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు సోమవారం కూడా ఉధృతంగా కొనసాగింది. ఒకవైపు ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు, మరోవైపు కార్మికుల ఆందోళనలు, ప్రదర్శనలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం వంటి కార్యకలాపాలు కొనసాగించారు. మరోవైపు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ఆర్టీసీ అధికారులు గ్రేటర్లో 671 బస్సులు నడిపారు. అయినా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సోమవారం పనిదినం కావడంతో విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. 121 సర్వీసులతో పాటు మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను అధికారులు అదన ంగా నడిపారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వేషన్ బోగీలు, జనరల్ బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల యథావిధిగా దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, కార్లు, వివిధ రకాల రవాణా వాహనాల యజమానులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇక ఆటోడ్రైవర్లు ప్రయాణికుల జేబులు లూటీ చేశారు. మరోవైపు తార్నాకలో ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొనడంతో స్నేహ (19) అనే విద్యార్ధిని దుర్మరణం పాలైంది. ఎక్కువ బస్సులు నడుపాలనే అధికారుల పట్టుదల, ఎక్కువ ట్రిప్పులు తిప్పేందుకు డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోందని విమర్శలు వచ్చాయి. అన్ని డిపోల్లో సమ్మె ఉధృతం... నగరంలోని 28 డిపోలు, బస్స్టేషన్లలో కార్మికుల సమ్మె కొనసాగింది. కార్మికులంతా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. బర్కత్‌పురా, కాచిగూడ, కంటోన్మెంట్, పికెట్, హయత్‌నగర్, మియాపూర్, రాణీగంజ్, దిల్‌షుఖ్‌నగర్, ఉప్పల్, బండ్లగూడ, తదితర డిపోలలో ధర్నాలు, ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా కండక్టర్లు బతుకమ్మ ఆడారు. పలు డిపోల నుంచి కార్మికులంతా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు ప్రదర్శనగా తరలి వెళ్లారు. పలు కార్మిక సంఘాలు ఎంజీబీఎస్‌లో సభ నిర్వహించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో కార్మిక సంఘాల నాయకులు ఎమ్మార్వోలను, కార్మికశాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎంసెట్‌కు ఆర్టీఏ సన్నద్ధం... కార్మికుల సమ్మె కొనసాగితే చేపట్టవలసిన చర్యలపై సోమవారం సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు మరోసారి సమావేశమయ్యారు. సమ్మె దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాలకు విద్యార్ధుల కోసం 1000 బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ అద్దె బస్సులు కలిపి ఇప్పటి వరకు 450పైగా సిద్ధం చేసినట్లు జేటీసీ చెప్పారు. మరో 2 రోజుల గడువు ఉన్నందువల్ల బస్సుల సేకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. -
అదనపు బాదుడు
అద్దె బస్సుల్లో టిక్కెట్‌లేని ప్రయాణం ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీల వసూలు ఆరో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె 20 శాతానికి మించి ఆర్టీసీ బస్సులు నడపడం కష్టమంటున్న అధికారులు గ్రామీణ ప్రాంతాలకే చేరని పల్లెవెలుగు రాకపోకలు సాగిస్తున్న 264 బస్సులు నేటినుంచి టిక్కెట్లతోనే ప్రయాణం నల్లగొండ సందిట్లో సడేమియా లాగా....ఆర్టీసీ కార్మికుల సమ్మెను అదునుగా చేసుకుని అద్దెబస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు వాహనాల దోపిడీ భరించలేని ప్రయాణికులకు అద్దె బస్సుల రూపంలోనూ తీవ్ర నష్టం వాటిల్లోతోంది. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు ఆర్టీసీ అద్దెబస్సులను రోడెక్కిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఆర్టీసీ 81 బస్సులు నడుపుతుండగా అద్దె బస్సులు 183 నడుస్తున్నాయి. ఇవి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హైదరాబాద్, భువనగిరి మార్గాల గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే అద్దెబస్సుల యజమానులకు, అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే వాటిని నడిపిస్తున్నారు. సమ్మె కాలంలో అద్దెబస్సుల నుంచి ఎలాంటి చార్జీలు ఆర్టీసీ తీసుకోరాదు. అలాగే ఆర్టీసీ చార్జీలనే ప్రయాణికుల నుంచి వసూలు చేయాలి. ప్రైవేటు డ్రైవర్లు, కండ క్టర్లు సాయంతో బస్సులు నడుపుతున్నారు కాబట్టి టిక్కెటు లేని ప్రయాణమే సాగుతోంది. దీనిని అతిక్రమించిన అద్దె బస్సుల యజమానులు ఆర్టీసీ చార్జీల కంటే ఎక్కువ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వంద రూపాయలు చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా రూ.120, 130 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మంగళవారం నుంచి అద్దె బస్సుల్లో టిక్కెట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం సుక్షితులైన డ్రైవర్లు, కండక్టర్లు నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కార్మికుల సమ్మె ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ బస్సులు నడపడం కష్టసాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం రీజియన్ పరిధిలోని 720 బస్సుల్లో 20 శాతానికి మించి నడపడం కష్టమని అంటున్నారు. డిపో మేనేజర్లు మినహా కార్యాలయాల్లో ఉద్యోగులు సైతం సమ్మెలో ఉన్నందున ఇతర వ్యవహారాలు చూసుకోవడం వీలుపడదని అధికారులు పేర్కొంటున్నారు. ఉన్న బస్సుల్లో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతాల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి తప్ప పల్లె ప్రాంతాలకు చేరడం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కార్మికుల నిరసనలు.... నల్లగొండ డిపో ముందు కార్మికులు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. డిపో నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మిర్యాలగూడ డిపోలో కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. పోలీస్ ఎస్కార్ట్‌తో వివిధ ప్రాంతాలకు నాలుగు బస్సులు నడిపించారు. భువనగిరి నుంచి నల్లగొండ, గజ్వెల్ ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట, పికెట్ డిపోలకు చెందిన అద్దె బస్సులు నడిచాయి. ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక బస్ చార్జీలు వసూలు చేశారు. పోలీస్‌లు బస్సులకు అంతరాయం కలగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంస్థాన్ నారాయణపూర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్సుల రాకపోకలు ఆగిపోవడంతో ఆరు రోజులుగా పర్యాటకులు లేక నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతం వెలవెలబోతుంది. కోదాడ డిపో గేట్ ముందు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహిళ కండక్టర్లు, డ్రైవర్లు గేట్ ఎదుట బైఠాయించారు. పోలీసుల ద్వారా బస్సులను బయటకు తీసుకు రావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నం చేయగా కార్మికులు ప్రతిఘటించారు. దీంతో కొద్దిసేపు కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు కార్మికులను బలవంతంగా తొలగించి నాలుగు బస్సులను బయటకు తీసుకొచ్చి నాలుగు రూట్లకు పంపారు. ఖమ్మం, మిర్యాలగూడెం, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులు బస్టాండ్ బయట వరకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నాయి. -
ఆర్టీసీ సమ్మెకు సీఐటీయూసీ మద్దతు
మెదక్ : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మెదక్ జిల్లా సంగారెడ్డిలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు సీఐటీయూసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మద్దతు తెలిపారు. ఆయన శనివారం సంగారెడ్డి డిపో కార్మికులను కలసి వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
-
మహిళలకు ఇవ్వరట!
ఉద్యోగుల ఎంపికలో జోరుగా పైరవీలు బస్సుల్లో టికెట్లు కొట్టని కొత్త కండక్టర్లు వారు తెచ్చి ఇచ్చిందే రెవెన్యూ.. బస్సులు తిప్పితే భారీగా నష్టం డ్రైవర్లు, కండక్టర్లకు డబ్బులు తగ్గించి ఇస్తున్న అధికారులు ఆందోళనలో తాత్కాలిక ఉద్యోగులు నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలికంగా నియమించుకునే యువతకు సంబంధించి డ్రైవర్‌కు రూ.1,000, కండక్టర్‌కు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడంతో భారీగా నిరుద్యోగులు ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు చేరుకున్నారు. సుమారు రెండు వేల మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్ ఉద్యోగాలు చేపట్టేందుకు ఆయా బస్స్టాండ్లకు చేరుకున్నారు. గంటల తరబడి క్యూల్లో నిలబడి తమ సర్టిఫికెట్లను అధికారులకు అందజేశారు. హెవీ లెసైన్స్ ఉన్నవారిని మాత్రమే డ్రైవర్లగా అధికారులు నియమించారు. టెన్త్ పాసైన వారిని కండక్టర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. అయితే తాత్కాలిక ఉద్యోగాల్లో పైరవీలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు, తెలిసిన వారి ద్వారా వచ్చిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారని సమాచారం. మహిళలను పక్కనబెట్టిన అధికారులు తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాలు చేపట్టేందుకు మహిళలు అధికసంఖ్యలో ఆయా బస్స్టాండ్లకు చేరుకున్నారు. మొదటిరోజు ఒకరిద్దరు మహిళలు ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఇవ్వలేదన్న కారణంతో వారిని విధుల్లో నుంచి తొలగించారు. వీరితో పాటు కండక్టర్ ఉద్యోగం చేపట్టేందుకు ధ్రువపత్రాలు ఇచ్చిన పలువురు మహిళలను కూడా విధులకు దూరంగా పెట్టారు. విధుల్లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం కరువువతుందని పలువురు మహిళలు వాపోయారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా బస్స్డాండ్లోనే పడిగాపులు కాస్తున్నా తమను విధుల్లోకి తీసుకోలేదని మహిళలు వాపోయారు. టికెట్లు కొట్టని కొత్త కండక్టర్లు కొత్తగా కండక్టర్లు ఎవరూ బస్సుల్లో టికెట్లు కొట్టడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆర్టీసీకి భారీనష్టం వస్తుందని అధికారులే చెబుతున్నారు. పలువురు కండక్టర్లు వసూలు చేసిన దానిలో కొంతమాత్రమే అధికారులకు అప్పజెబుతున్నారని సమాచారం. ఉదాహరణకు నెల్లూరు బుచ్చి రూట్‌కు రోజు రూ. 5వేలు వస్తుంది. కానీ కొత్తగా నియమించిన కండక్టర్లు రూ.2వేలు మించి అప్పజెప్పడం లేదు. దీంతో డబ్బులు తగ్గించి ఇచ్చిన వారిని తొలగించి మళ్లీ కొత్తవారిని విధుల్లోకి తీసుకుంటున్నారు. తక్కువగా ఇస్తున్న రోజు వేతనం తాత్కాలిక డ్రైవర్‌కు రోజుకు రూ.1000, కండక్టర్‌కు రూ.800 చెప్పిన అధికారులు తక్కువ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. డ్రైవర్‌కు రూ.500, కండక్టర్‌కు రూ.400కు మించి ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశిస్తే రోజుకు 300 కిలోమీటర్లు తిరిగి డ్రైవర్‌కు మాత్రమే ఆ వేతనం వర్తిస్తుంద ంటున్నారు. వేతన విషయం ముందే ఎందుకు చెప్పలేదంటూ శనివారం బుచ్చికి వెళ్లే బస్సుకు డ్రైవర్‌గా విధులు నిర్వహించిన ఓ వ్యక్తి వాదనకు దిగారు. ఈ విషయంలో తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఆ వ్యక్తి తన సర్టిఫికెట్‌ను తిరిగి ఇచ్చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదే రీతిలో పలువురు డ్రైవర్లు, కండక్టర్లకు డబ్బులు ఇస్తుండడంతో నిత్యం అక్కడ వివాదం చోటుచేసుకుంటుంది. -
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
► డిపోల్లో ధర్నాలు, వంటా వార్పు ► రొడ్డెక్కిన 421 బస్సులు ► ప్రమాదం అంచున ప్రయాణం ► పట్టించుకోని జిల్లా యంత్రాంగం నెల్లూరు (రవాణా) : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు 43 శాతం ఫిట్మెంట్ పెంచాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు డిపోల్లో ధర్నాలు, రాస్తారోకోలు, వంటా వార్పు నిర్వహించారు. నెల్లూరు ఆర్టీసీ బస్‌స్డాండ్ సెంటర్లో యూనియన్లు జేఏసీ ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా వాహనాలు కిలోమీటరు పొడవునా నిలిచిపోయాయి. అనంతరం వంటావార్పు నిర్వహించారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. జిల్లాలో ఆయా డిపోల నుంచి 421 బస్సులు రోడ్డెక్కాయి. పొలీసు పహారాతో డిపోల నుంచి బస్సులను తీసి ఆయా రూట్లకు ఆర్టీసీ అధికారులు పంపించారు. అయితే బస్సులకు తాత్కాలిక డ్రైవర్లు కావడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించారు. ప్రయాణికుల ఆందోళన ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను తిప్పుతున్నారు. వీరికి రూట్లపై అవగాహన లేదు. స్పీడు బ్రేకర్లు, గుంతలు ఉన్న ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించకపోవడంతో బస్సులు కుదుపులకు గురవుతున్నాయి. ప్రయాణికలు భయాందోళన చెందుతున్నారు. శనివారం రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. పామూరు నుంచి నెల్లూరు వస్తున్న రెండో డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగం - కలిగిరి మధ్య ఆటోను ఢీకొంది. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నాడని ప్రయాణికులు చెబుతున్నారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం దామరమడుగు వద్ద రాత్రి సమయంలో కడప నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. తాత్కాలిక డ్రైవర్ల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కేవలం అధికారులు డిపోలకే పరిమితమవుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు హడలెత్తి పోతున్నారు. అధిక చార్జీలతో జేబులు గుల్ల తాత్కాలిక డ్రైవర్లు కావడంతో అధికారులు ఆర్టీసీ బస్సులను కేవలం జిల్లా పరిధిలోనే తిప్పుతున్నారు. దూర ప్రాంతాలకు బస్సులను పంపించకపోవడంతో ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నారు. సాధారణ చార్జీకంటే రెండు రెట్లు అధికంగా పెంచి వసూలు చేస్తున్నారు. ఆదివారం కావడంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు చార్జీలను అమాంతంగా పెంచేశారు. బెంగళూరు, హైదరాబాద్‌కు ఏసీ బస్సులో రూ.800 టికెట్‌ను రూ.2400కు, ఆర్డినరీ బస్సులో రూ.500 టికెట్‌ను రూ.1300కు పెంచారు. ఈ రీతిలో ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. అధిక చార్జీలను నియంత్రించాల్సిన ఆర్టీసీ, రవాణా, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం జిల్లాలోని ఆయా డిపోల నుంచి మొత్తం 421 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 313 ఆర్టీసీ, 108 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు తాత్కాలికంగా 421 మంది డ్రైవర్లు, 108 కండక్టర్లును తీసుకున్నారు. అయితే తాత్కాలిక కండక్టర్లు టెకెట్ కొట్టడం లేదు. సాధారణ చార్జీ కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సమ్మె కొనసాగిస్తాం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చినా, మంగళవారం ఎలాంటి తీర్పు ఇచ్చినా సమ్మెను ఆపేది లేదని ఆర్టీసీ యూనియన్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఆదివారం డిపోల ముందు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీలో ఈడీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల రక్షణతో కార్మికులను అణిచి వేయాలని అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు అనంతరం సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో
పాల్గొన్న విపక్ష రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనకారుల అరెస్టు, విడుదల పట్నంబజారు (గుంటూరు) : న్యాయమైన కోర్కెలు తీర్చాలని కోరతున్నా.. .సమస్యలు పట్టకుండా వ్యవహరిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై కార్మికులు కన్నెర్ర జేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారంతో ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. బస్టాండ్ ఎదుట రాస్తారోకో దిగారు. కార్మికులు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ. సీపీఎం పార్టీలు, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాలు మద్దతుగా పాల్గొన్నాయి. బస్టాండ్ ఎదుట ఉదయం పది గంటలకు రాస్తారోకో చేపట్టారు. పెద్దఎత్తున ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, కార్మికులు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బస్టాండ్‌లో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవే క్షించి పోలీసు బలగాలను మోహరించారు. రాస్తారోకో చేస్తున్న రాజకీయ, కార్మిక సంఘాల నేతలను బలవంతంగా అక్కడ నుంచి పక్కకు తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో కార్యకర్తలు, కార్మికులు అడ్డుపడడంతో తోపులాట చోటుచేసుకుంది. నేతలతో పాటుగా 23మందిని అరెస్ట్ చేసి పాతగుంటూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కనీస కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 43 శాతం ఫిట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సౌకర్యాలు కల్పించాలన్న కనీస కోర్కెలను తీర్చకుండా ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు. కార్మికుల హక్కులు సాధించేవరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించినంత మాత్రాన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల వలనే తెలుగుదేశం పార్టీ పాతాళానికి దిగజారిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అధికార టీడీపీ నేతలా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహమూద్, కొట్టె కవిత, ఝాన్సీ, షేక్ ముస్తఫా, పూనూరి నాగేశ్వరరావు, గుండు శ్రీను, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, రీజయన్ అధ్యక్షుడు ఎన్వీకే రావు, శివరాత్రి శ్రీనివాసరావు, ఎన్ఎంయూ రీజయన్ కార్యర్శి నరసింహారావు, సీపీఎం నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, పలు కార్మిక సంఘాల నాయకులు నేతాజీ, వెలుగూరి రాధాకృష్ణమూరి, సుబ్బారావు, భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. ఐదో రోజుకు చేరిన సమ్మె పట్నంబజార్ (గుంటూరు): సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారంతో ఐదో రోజుకు చేరుకుంది. గుంటూరు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి ఓ మోస్తరుగా బస్సులు నడిచాయి. అయితే కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెకు దిగడంతో తాత్కాలిక కార్మికులచే ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించారు. డీఎస్సీని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక సిబ్బంది అధికంగా విధుల్లోకి తీసుకుని బస్సులు నడిపించారు. రీజియన్ పరిధిలో విపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు రాస్తారోకోకు పిలుపులు నివ్వడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకులేదు. రీజియన్పరిధిలో సుమారు 952 బస్సులు తిరగాల్సి ఉండగా, 450 బస్సులు మాత్రమే తిరిగాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమ్మె కారణంగా ఈ ఐదు రోజుల్లో ఆర్టీసీ రీజియన్‌కు రూ. 6 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీఎస్సీకి తెల్లవారుజాము నుంచి బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. సంగడిగుంట: ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం జి.శ్రీరాములు ఆదివారం తెలిపారు. సోమవారం.. 07623 నంబరు ప్యాసెంజరు రైలు గుంటూరులో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 14.30 గంటలకు గిద్దలూరు చేరుతుంది. 07624 నంబరు ప్యాసెంజరు రైలు గిద్దలూరులో 15.00 గంటలకు బయలుదేరి 21.00 గంటలకు గుంటూరు చేరుతుంది.ఈ రైళ్లు మార్గం మధ్యలోని అన్ని స్టేషన్లలో ఆగనున్నాయి. 07053 నంబరు ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాదలో 21.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 13.55 గంటలకు కాకినాడ పోర్ట్ చేరుతుంది. మంగళవారం.. 07054 నంబరు ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ పోర్ట్‌లో 15.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.15 గంటలకు హైదరాబాదు చేరుతుంది. ఈ రైలు మార్గంమధ్యలోని నల్లగొండ, మిర్గాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. -
ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం
► అద్దె బస్సులను అడ్డుకున్న కార్మికులు ► రోడ్డుపైన బైఠాయించిన మహిళా కండక్టర్లు ► జేఏసీ కన్వీనర్ అరెస్ట్‌కు యత్నం ► పోలీస్ అధికారులతో వాగ్వాదం కర్నూలు రాజ్‌విహార్/ నంద్యాలటౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నంద్యాల పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. బస్టాండ్ వద్ద ఆదివారం కార్మికులు అద్దె బస్సులను అడ్డుకున్నారు. యజమానులు ప్రయాణికులను దోచుకుంటున్నారని, రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కార్మికులు, మహిళా కండక్టర్లు రోడ్డుపైన బైఠాయించి బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లనివ్వలేదు. పోలీసులు వీరికి సర్ది చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జేఏసీ కన్వీనర్ ఖాన్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నించారు. ఆయనను ఎత్తుకొని జీపు వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా మహిళా కండక్టర్లు, కార్మికులు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఖాన్‌ను వదిలి పెట్టడంతో కార్మికులు శాంతించారు. తర్వాత కార్మికులు గుంపులుగా ఆత్మకూరు, కోవెలకుంట్ల రూట్ల ఫ్లాట్ ఫారాల వద్దకు వెళ్లి తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను వాహనాలను తిప్పవద్దని హెచ్చరించారు. సీఐలు రామయ్యనాయుడు, ప్రతాపరెడ్డి, ఎస్ఐలు రమణ, ప్రీయతంరెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. తర్వాత కార్మికులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి ప్రశాంతంగా ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రోడ్డు రవాణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూధన్ డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కర్నూలులో ఆయన మాట్లాడుతూ ప్రజా సేవలో ఆర్టీసీ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వీరికి 43శాతం పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నెల రోజుల కిత్రం నోటీసు జారీ చేసినా పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి కుమార్, జిల్లా నాయకులు ఎంబిఎన్ శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు. - ఐదో రోజు రూ.70లక్షలు నష్టం: సమ్మె కారణంగా జిల్లాలోని 11డిపోల్లో 494 బస్సులు నిలిచిపోయాయి. 970బస్సుల్లో 476 బస్సులు నడపగా ఇందులో ఆర్టీసీ బస్సులు 290, అద్దె బస్సులు 186 ఉన్నాయి. అయినప్పటకీ సంస్థకు రూ.70లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టివి రామం పేర్కొన్నారు. మరి కొంత మంది ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తూ కొంత కాలంగా డిస్ ఎంగేజ్ పేరుతో విధులకు దూరంగా ఉన్న మరి కొంత మంది కాంట్రాక్టు కండక్టర్లను రెగ్యులర్ చేసినట్లు ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మంది డ్రైవర్లతోపాటు మరో 14 మంది కాంట్రాక్టు డ్రైవర్లను రెగ్యులర్ చేశామని వెల్లడించారు. -
సడలని సంకల్పం...
అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. మరోవైపు సమ్మెను అణిచివేసేందుకు ప్రభుత్వ పోలీసు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా కళ్యాణదుర్గంలో ఒకరు, హిందూపురంలో ముగ్గురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఫిట్‌మెంట్‌పై స్పష్టత వచ్చే వరకు సమ్మె ఆపేది లేదంటూ కార్మికులు భీష్మిస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఆపబోమని సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్టీసీ యాజమాన్యానికి కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆదివారం రీజియన్‌లోని 12 డిపోల్లో స్వచ్చభారత్ కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. పలు చోట్ల వంటావార్పు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల నేతలు కొండయ్య, సీఎన్ రెడ్డి, పీఎస్ ఖాన్, ఆదాం తదితరుల నేతృత్వంలో స్వచ్చభారత్ చేపట్టి బస్టాండ్‌లోని చెత్తా చెదారాన్ని తొలగించారు. ప్రభుత్వంలోని నిర్లక్ష్యాన్ని చీపురుతో ఊడ్చిపారేయాలని నేతలు నినదించారు. ఈ నెల 9న రాత్రి ఓ బస్సు అద్దాలు ధ్వంసం చేశారనే ఆరోపణపై కళ్యాణదుర్గంలో కండక్టర్ గణపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం సీఐటీయూ నేత జాఫర్, జేఏసీ నేలు రాయల్ వెంకటేశులు, వైఎస్సార్ టీఎఫ్ అశోక్, ముర్రే నారాయణ కార్మికులకు మద్దతు తెల్పి పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. నేతలు డీఎం కిరణ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. చివరకు సదరు కండక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూపురంలో శేషారెడ్డి, సంజీవప్ప, రూపేంద్ర అనే ఉద్యోగులను హైయ్యర్, ప్రభుత్వ బస్సు అద్దాలు ధ్వంసం చేశారనే ఆరోపణపై అరెస్టు చేశారు. బస్టాండ్ వద్ద కార్మికులు వంటావార్పుతో నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ బస్టాండ్, పోలీసు స్టేషన్ ఎదుట కార్మికులు రెండు గంటలపాటు నిరసన తెలిపారు. కదిరిలో నిన్నటి రోజుతో పోల్చితే బస్సులు తక్కువగా నడిపారు. కండక్టర్లు లూటీ చేస్తున్నారన్న కారణంతో యాజమాన్యం డ్రైవర్లు, కండక్టర్లను ఎక్కువ మందిని విధుల్లోకి తీసుకోలేదు. ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో స్వచ్చభారత్ నిర్వహించి కార్మికులు నిరసన తెలిపారు. నష్టపోయిన రూ 5 కోట్ల ఆదాయం ఐదు రోజులుగా ఆర్టీసీ సమ్మెతో సంస్థ రీజియన్ వ్యాప్తంగా రూ 5 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ప్రతి రోజూ రూ.ఒక కోటి పది లక్షల ఆదాయం వచ్చేది. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ మరింత నష్టాల్లోకి పోయే ప్రమాదం ఉందని అధికారులంటున్నారు. ఆదివారం రోజున జిల్లా వ్యాప్తంగా 388 బస్సులను నడిపారు. రాత్రి సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపై ఆధారపడుతున్నారు. -
సమ్మెపై సర్కార్ జోక్యం చేసుకోవాలి
టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తాండూరు: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున వేతన సవరణ చేయాలన్నారు. ఉద్యోగాలను పణంగా పెట్టి సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారికి జేఏసీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తాండూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరి మానుకోవాలని చెప్పారు. కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని, చెప్పారు. ఈ తేడాను పూర్తి చేసే బాధ్యత యాజమాన్యానిదేనని కోదండరాం పేర్కొన్నారు. ఇటు యాజమాన్యం, అటు కార్మికులు ఒక మెట్టు దిగి సమస్యకు పరి ష్కారం దొరికిలా దోహదపడాలని సూచించారు. -
వంటావార్పు..స్వచ్ఛభారత్
నల్లగొండ టౌన్ : వంటావార్పు..ధర్నాలు, స్వచ్ఛభారత్..ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా ఐదో రోజూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోలు ఎదుట ఆదివారం ఆర్టీసీ కార్మికులు వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేశారు. ప్రైవేటు డ్రైవర్లు, హోంగార్డులతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు 231 బస్సులను వివిధ రూట్లలో నడిపించారు. కార్మికులు బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ పోలీసులు వారిని పక్కకు తప్పించి నడిపించారు. సమ్మె చేస్తున్న కార్మికులకు వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి. సమ్మెకారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుభకార్యాలతోపాటు గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశానికి పరీక్ష ఉండడంతో విద్యార్థులు తీవ్ర సమస్యను ఎదుర్కొవాల్సి వచ్చింది. జిల్లా కేంద్రానికి పరీక్షకు హాజరవ్వడానికి విద్యార్థులు ఆటోలు, ద్విచక్రవాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వాహన దారులు సమ్మెను అదునుగా చూపి ఎక్కువ డబ్బులను వసూళ్లకు పాల్పడ్డారు. నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లతో ఆర్టీసీ డిపో ఎదుట శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం కొది సేపు బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నల్లగొండ డిపో పరిధిలో 50 బస్సులను నిడిపించారు. సూర్యాపేట కొత్త బస్టాండ్ గ్యారేజీలోనుంచి బస్సులను బయటకు రాకుండా బైఠాయించారు. అక్కడే వంటావార్కు నిర్వహించారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ సమక్షంలో రూరల్ సీఐ వి.నర్సింహారెడ్డి సిబ్బందితో బస్టాండ్‌కు చేరుకొని కార్మికులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం గ్యారేజీలోని బస్సులను బయటకు తీయించి ఆయా గ్రామాలకు ఎస్కార్ట్ సాయంతో తరలించారు. అరెస్టు అయిన కొందరు కార్మికులు స్టేషన్ నుంచి తిరిగి కొత్త బస్టాండ్ ఎదురుగా గల ఫై ్లఓవర్ వద్దకు చేరుకొని బస్సు టైర్ల గాలి తీసివేసి అద్దాలను పగులగొట్టారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల ధర్నాకు ఐఎన్టీయూసీ నాయకులు మద్దతు తెలియజేశారు. కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం తాత్కాలిక డ్రైవర్లతో నాలుగు బస్సులు బయటకు తీశారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల వెంట భిక్షాటన చేశారు. భువనగిరి ప్రాంతంలో ఆదివారం బస్సులు ఎక్కువగానే నడిచాయి. నల్లగొండ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట, పికెట్ డిపోలకు చెందిన అద్దెబస్సులు, కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నడిచాయి. దేవరకొండ డిపో పరిధిలో 8 అద్దెబస్సులు నడిచాయి. నాగార్జునసాగర్, హాలియా బస్టాండ్లు ప్రయాణికులు లేక వెళవెళబోయాయి. మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. పర్యాటకులు లేక సాగర్ వెలవెలబోయింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆదివారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మద్దతు తెలిపారు. కొద్దిసేపు కార్మికులతోపాటు ధర్నా నిర్వహించారు. ఆదివారం కూడ కోదాడ డిపో నుంచి బస్సులను నడవకుండా కార్మికులు అడ్డుకున్నారు. సమ్మె కారణంగా నిత్యం ఎంతో మంది ప్రయాణికులతో ర ద్దీగా ఉండే ఆలేరు బస్‌స్టేషన్ బోసిపోయింది. అలాగే యాదగిరిగుట్ట బస్‌డిపోలో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. రెండు అద్దె బస్సులను పోలీసుల సాయంతో నడిపించారు. -
విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం
- టీఎస్ ఆర్జేసీ పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి హైరానా - తల్లిదండ్రుల్లో ఆందోళన - 216 మంది గైర్హాజరు సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమ్మె విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించింది. గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశ పరీక్షలు ఉండడం, కేంద్రాలు దూర ప్రాంతాల్లో ఉండడంతో అక్కడికి చేరుకోవడానికి విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కో దశలో గమ్యం చేరుకోలేమోనని భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల బాధలు చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి దేవుడా అంటూ మదన పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహన యజమానులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆదివారం సంగారెడ్డిలో గురుకుల కళాశాల ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్, నారాయణఖేడ్, జహీరాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు వచ్చారు. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు సొంత వాహనాల్లో సంగారెడ్డికి రాగా మరి కొందరు ప్రైవేటు వాహనాలను సమకూర్చుకొని వచ్చారు. పేద విద్యార్థులు మాత్రం పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు మూడు నాలుగు రెట్లు అధికమైనా చార్జీలను భరించారు. పరీక్ష ప్రశాంతం తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు తెలిపారు. సంగారెడ్డిలో 15 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించామని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షలకు 3,443 మందికి హాజరుకావాల్సి ఉండగా 3,227 వచ్చినట్లు తెలిపారు. -
సమ్మె ఉధృతం.. పరిస్థితి ఉద్రిక్తం
పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట పరస్పర వాగ్వాదం.. యూనియన్ నాయకుల అరెస్టుకు విఫలయత్నం సమ్మెకు కాంగ్రెస్, జేఏసీ నాయకుల మద్దతు ప్రభుత్వంపై మండిపాటు పరిగి : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆదివారం పరిగిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయా యూనియన్ల నాయకులు స్పష్టం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారితో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల ని డిమాండ్ చేశారు.ఐదో రోజు సమ్మెలో భాగంగా పరిగిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఇతర డిపోల నుంచి వచ్చిన బస్సులను సైతం అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బస్సులు వెళ్లాలంటూ పోలీసులు, అడ్డుకునేందుకు ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ క్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులను అరెస్టుకు పోలీసులు విఫల యత్నం చేశారు. టీఎంయూ పరిగి డిపో అధ్యక్షుడు ప్రసాద్‌ను పోలీసులు ఎత్తి జీపులో పడేశారు. ఉద్యోగులు ఆయనను తిరిగి వాహనం నుంచి కిందికి దించారు. ఈ క్రమంలో కార్మికులుపోలీసులు, ప్రభుత్వం, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి బస్‌డిపో ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. సీఎ కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు వారికి మద్దతు ప్రకటించారు. జేఏసీ నాయకుడు నాగేశ్వర్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు. ఎస్ఐలు కృష్ణ, షేక్శంషోద్దీన్లు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇతర ఠాణాల నుంచి అదనపు పోలీసులను రప్పించారు. కార్యక్రమంలో ఈయూ, టీఎంయూ, టీఎన్‌ఎంయూ నాయకులు ఎస్జేఎం రెడ్డి, ప్రసాద్, వెంకట్రాములు, సిద్దిక్, మల్లయ్య, జీపీ రెడ్డి, రాకేష్, ప్రసాద్, సురేష్, వీఎన్‌గౌడ్, నిరంజన్, వెంకన్న, స్వామి, యాకూబ్అలీ, కేఆర్ చారి, బందెయ్య, అంజయ్య, ఖాజాఖుదుద్దీన్, ఎండీ బాసిద్, సుధాకర్, రవికుమార్, రత్నయ్య, ఎల్లమ్మ, పార్వతమ్మ, జయమ్మ తదితరులు ఉన్నారు. -
సమ్మెకు సంఘీభావం
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే.. వారి సమస్యల పరిష్కారానికి సర్కారు చొరవచూపాలి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వికారాబాద్ : హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలియజేస్తున్నామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వికారాబాద్‌కు వచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తక్కువ జీతాలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేయడం న్యాయమైనదేనని ఆయన పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను సవరించుకోవడంపై ఆయన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని సూచించారు. కాగా.. ఆదివారం తాండూరు డిపోకు చెందిన బస్సుకు అడ్డు వెళ్లిన ఆర్టీసీ కార్మికుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా.. పోలీసులను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పరిస్థితి సద్దుమణిగింది. తాండూరులో బస్సులను అడ్డుకునేందుకు కార్మికుల యత్నం తాండూరు : ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా యూనియన్ నాయకులు, కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఆర్టీసీ సమ్మె ఐదో రోజు సందర్భంగా యూనియన్ నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఉదయం 9గంటలకు ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డిపో మేనేజర్ లక్ష్మీధర్మా వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికుల ప్రయత్నాలను విఫలం చేశారు. చించొళి, కరన్‌కోట్, కోస్గీ తదితర రూట్లలో నాలుగు బస్సులను అధికారులు నడిపించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ తాండూరు చైర్మన్ సోమశేఖర్‌తోపాటు నాయకులు ఆర్.విజయ్‌కుమార్, మదన్‌రెడ్డి, సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్ తదితరులు డిపో వద్దకు వచ్చి, సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సర్కారుకు సూచించారు. కార్మికుల సమ్మెకు అండగా ఉంటామన్నారు. సమ్మెలో భాగంగా యూనియన్ నాయకులు, కార్మికులు డిపో ఆవరణలో పాటలు పాడారు. కబడ్డీ ఆడారు. -
బాలయ్యా.. ఎక్కడున్నావయ్యా..
► ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు ► చంద్రబాబుకు పాత రోజులు దగ్గరపడ్డాయి ► మాఓట్లతో గెలిచి పోలీసులతో లాఠీచార్జి చేయిస్తారా ► రోడ్డుపై వంటావార్పుతో కార్మికుల నిరసన హిందూపురం అర్బన్ : ఎమ్మెల్యే బాలయ్య ఎక్కడున్నావ్.. ఆర్టీసీ కార్మికుల బాధలు, ఆక్రందనలు కనపించడంలేదా.. వినిపించడంలేదా.. నీవైనా మీబావ చంద్రబాబుకు చెప్పలేవా..? అంటూ ఆర్టీసీ కార్మికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నాల్గవరోజు శనివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా తరలివెళ్లి ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు ధర్నా చేపట్టారు. బాలయ్య ఎక్కడున్నవయ్యా.. ఇటూరావయ్యా అని ముద్రించిన బాలయ్య ఎక్కడున్నావయ్యా.. మీ బావకు చెప్పవేమయ్యా... పోస్టర్లు ఇంటిగోడలకు అతికించారు. ఈసందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మొసలికన్నీరు కార్చుతూ కార్మికుల పక్షాన నిలుస్తానని చెప్పి మాయమాటలతో మా ఓట్లు కొల్లకొట్టారు.. ఇప్పడు మేం అలుసు అయ్యామన్నారు. న్యాయం అడగడానికి వెళ్లి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళాకార్మికులని చూడకుండా లాఠీలతో సృహ తప్పేలా కొడతారా ప్రశ్నించారు. ఆహర్నిశలు సంస్థఅభివృద్ధికి కష్టపడే కార్మికులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వమంటే ఎంతదౌర్జన్యామా అన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర నాయకులు చెన్నారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు నేను మారాను.. అవకాశమిస్తే కష్టలన్నీ తీర్చేస్తానన్న ఆయన అసలు రూపం అధికారంలో రాగానే బయటకు వచ్చింది. గద్దెనెక్కించిన తాము మరోసారి బుద్ధిచెప్పడానికి వెనుకాడేదిలేదన్నారు. ఎన్టీయారు తనయుడు బాలకృష్ణను గెలిపిస్తే హిందూపురానికి మంచి రోజులు వచ్చేస్తాయి. అంతా మారిపోతుందని స్థానికులను పక్కన పెట్టి గెలిపించాం. ఆయన సినిమా షికార్లకు సమయం సరిపోతోంది. మూడునెలలకు ఒకసారి వచ్చి మూడురోజులు ఉండి సొంతపనులు చూసుకుని వెళ్లిపోతున్నారు. ఇదేనా ప్రజలకు ఇచ్చే బహుమతని విమర్శించారు. ఆర్టీసీకార్మికులు రోడ్డున పడుతుంటే ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఏఐటియుసీ డివిజన్ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ అయ్యా చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. సంస్థను ప్రయివేట్పరంచేయడానికి చాపకింద నీరులా సన్నాహాలు చేస్తున్నారా అని విమర్శించారు. రోడ్డుపైనే వంటా వార్పు..భోజనాలు ఆర్టీసీ బస్టాండులో కార్మికులు వంటావార్పు చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డిపోపరిసరాల్లోనూ, బస్టాండులోనూ వంటలు చేయడం, కనీసం కుర్చుని తినడానికి కూడా వీలులేదన్నారు. సీఐ, ఎసైై్సలతో డిపోవద్ద భారీ బందోబస్తు కల్పించారు. బస్సులను ప్రయివేట్వ్యక్తులతో నడిపించడానికి బందోబస్తుగా బస్సులో పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేశారు. కార్మికుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో యూనియన్ నాయకులు ఆర్టీసీడీఎం క్వార్టర్సు ఆవరణంలో వంటావార్పు చేసి అక్కడే రోడ్డుపై భోజనాలు చేసి తమ నిరసనను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఐక్యకార్యచరణ సమితి సభ్యులు విజయనంద్, నారాయణస్వామి, బాబయ్య, రాజారెడ్డి, సుందర్రాజు, టిఎస్నాథ్, పరమేష్, మోహన్‌రెడ్డి, లింగారెడ్డి, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ.. తొలి రోజు ప్రశాంతం
సమయానికంటే ముందే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు సెంటర్లను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు, డీఈఓ కడప ఎడ్యుకేషన్ : టెట్ కం టీఆర్టీ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శనివారం నిర్ణీత సమయానికి పరీక్ష ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఎవరూ పరీక్షకు ఆలస్యంగా రాలేదు. డీఎస్సీ మూడు రోజుల పరీక్షలో భాగంగా మొదటి రోజు సెకెండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పరీక్ష జరిగింది. తొలి రోజు పరీక్షకు 2878 మంది అభ్యర్థులకు గాను 2557 మంది హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియంకు సంబంధించి 2385 మంది హాజరు కావాల్సి ఉండగా 2117 మంది, ఉర్దూ మీడియంకు సంబంధించి 489 మందికి గాను 440 మంది హాజరయ్యారు. ఇందు కోసం కడపలో 12 కేంద్రాలను (నగరంలోని మున్సిపాల్ హైస్కూల్ మొయిన్, మున్సిపల్ ఉర్దూ హైస్కూల్, నిర్మల స్కూల్, శాంతినికేతన్ స్కూల్, మదర్ఇండియా స్కూల్, గురుకుల విద్యాపీఠ్, నాగార్జున హైస్కూల్, సెంయింట్ మేరీస్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, పవన్ స్కూల్, మరియాపురం సెయింట్ జోసఫ్ ఇంగ్లీస్ మీడియం హైస్కూల్, గాంధీనరగ్ స్కూల్) ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరీశీలకురాలు వనజాక్షి పరిశీలించారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను, అందులోని ఫొటోలను పరిశీలించారు. డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి కూడా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. రెవిన్యూ, పోలీస్, విద్యాశాఖకు సంబంధించిన మూడు ప్రత్యేక స్వ్కాడ్ బృందాలు సైతం పరీక్షా కేంద్రాలను పరిశీలించాయి. డీఆర్ఓ సులోచన కూడా పలు సెంటర్లను పరిశీలించారు. చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు : డీఈఓ డీఎస్సీ కేంద్రాలలో అటు సిబ్బంది కానీ ఇటు అభ్యర్థులు కానీ చిన్నపాటి పొరపాటుకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. డీఎస్సీ పరీక్ష కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని చెప్పారు. రెండు ప్రాంతాలలో పరీక్ష వ్రాసే అభ్యర్థులకు సంబంధించిన జాబితా తమ వద్ద ఉందని తెలిపారు. ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తే క్రిమిన ల్ కేసు పెడతామని హెచ్చరించారు. నేడు లాంగ్వేజ్ పండిట్లకు పరీక్ష 10 వతేదీన ఉదయం లాంగ్వేజ్ పండిట్లకు(తెలుగు, ఉర్ధూ, హిందీ) పరీక్ష నిర్వహించనున్నారు. 13 సెంటర్లకు గాను 3041 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు కేంద్రాల్లో 358 మంది అభ్యర్థులు రాయనున్నారు. -
దొరికినోళ్లకు దొరికినంత!
కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల ఇష్టారాజ్యం డ్యూటీల కోసం నేతల ఒత్తిడి సాక్షి, కడప : ఆర్టీసీ కార్మికుల సమ్మె కొంత మందికి బాగా కలిసొచ్చింది. ప్రైవేట్ వాహనాల వారు చార్జీలు రెట్టింపు చేసి దండుకుంటుండగా, ఆర్టీసీ తాత్కాలికంగా సిబ్బందికి మాత్రం పండగలా మారింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో ప్రజలకు ఇక్కట్లు కలగకూడదని భావించి ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా డ్రైవర్, కండెక్టర్లను నియమించుకున్నారు. రోజుకు డ్రైవర్‌కు రూ.వెయ్యి, కండక్టర్‌కు రూ.800 చొప్పున చెల్లిస్తున్నారు. ఇది చాలదనుకున్నారో.. లేక సమ్మె ముగిశాక తమ ఉద్యోగాలు ఉండవనుకున్నారో కానీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్సులను తనిఖీ చేసే వారు లేకపోవడంతో సగం నొక్కేస్తున్నారు. బస్సులో ఎంత మంది ఎక్కినా సగం మందికే లెక్క చూపుతూ మిగతా సొమ్మును పలువురు తాత్కాలిక డ్రైవర్, కండెక్టర్లు చెరి సగం జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 300 నుంచి 400 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు బస్సులు రద్దీతో వెళ్తున్నా తక్కువ మంది ఎక్కినట్లు తాత్కాలిక కండక్టర్లు డిపోలో డబ్బులు అందజేస్తున్నారు. ఇందుకు తాత్కాలిక డ్రైవర్లు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లినా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. కాగా, ప్రస్తుత సమ్మె నేపథ్యంలో ఎంపికైన కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లు డ్యూటీల కోసం పైరవీలు చేస్తున్నారు. టీడీపీ నేతల ద్వారా కొందరు, ఇతర నాయకుల ద్వారా మరి కొందరు ఆర్టీసీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో డిపో మేనేజర్లు తల పట్టుకున్నారు. -
టెట్ కమ్ టీఆర్టీ ప్రారంభం
తొలిరోజు ప్రశాంతం నెల్లూరు (అర్బన్) : టెట్ కమ్ టీఆర్టీ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. నగరంలో ఏర్పాటుచేసిన 9 కేంద్రాల్లో ఎస్జీటీ అభ్యర్థులకు పరీక్ష జరిగింది. పరీక్షకు 2,142 మందికి గాను 1,913 మంది హాజరయ్యారు. 229 మంది గైర్హాజరయ్యారు. తెలుగు మీడియం అభ్యర్థులు 2,103 గాను 1,895 మంది, ఉర్దూ మీడియం అభ్యర్థులు 39 మందికి గాను 18 మంది పరీక్షకు హాజరైనట్లు డీఈఓ ఆంజనేయులు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అభ్యర్థులు చాలామంది ముందే రోజే నగరానికి చేరుకున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులకు కొంతమేర ఇబ్బందులు తప్పాయి. కొందరు అభ్యర్థులు పరీక్షకు టైం అయిపోతోందని ఆఖరి నిమిషాల్లో హడావుడిగా కేంద్రాలకు చేరుకున్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో వికలాంగ అభ్యర్థులు, ఓ బాలింత సహాయకుల సాయంతో వచ్చి పరీక్ష రాశారు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఏజేసీ రాజ్‌కుమార్, డీఈఓలు డీకేడబ్ల్యూ, కృష్ణచైతన్య, వీఆర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరాతీశారు. నేడు లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు లాంగ్వేజ్ పండిట్స్‌కు పరీక్ష జరగనుంది. 2,985 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పీఈటీలకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటలకు పరీక్ష జరగనుంది. 447 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. -
సమ్మె హోరు దోపిడీ జోరు
రెండు రెట్లు పెంచిన ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సులోనూ అధిక వసూళ్లు రోడ్డెక్కిన 421 బస్సులు పలు ప్రాంతాల్లో అడ్డుకున్న కార్మికులు ఆయా డిపోల్లో ఉద్యోగుల వంటావార్పు రాస్తారోకో, ధర్నాలకే పరిమితమైన వైనం సమ్మెకు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులు నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేటు వాహనదారులు పండగ చేసుకుంటున్నారు. దూరప్రాంతాలకు అధిక రేట్లను పెంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో నియమించిన కొత్త కండక్టర్లు సైతం ప్రయాణికుల నుంచి ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలను నియంత్రించాల్సిన అధికారులు కేవలం సీట్లకే పరిమితమవుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. పలు డిపోల్లో వంటవార్పు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు మానవహారాలు, ధర్నాలు జరిగాయి. శనివారం సమ్మె చేస్తున్న ఉద్యోగులు వెంటనే విధులకు హాజరుకావాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆర్టీసీ సంఘాల నాయకులు న్యాయపరమైన సలహాలు తీసుకుని సమ్మెను ఉధృతం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అధిక వసూళ్లు : సాధారణంగా నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు రూ. 800లు ఉంటే ప్రస్తుతం రూ. 2,000లు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాన్ని బట్టి పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే నాన్ఏసీ రూ. 450లు ఉంటే రూ.1,300లు వసూలు చేస్తున్నారు. బెంగళూరుకు నెల్లూరు నుంచి రూ. 800లు ఉంటే రూ. 2,400 వసూలు చేస్తున్నారు. ఆదివారంలో మరింత పెం చి నాన్ఏసీ బెంగళూరుకు రూ.1,540లు, హైదరాబాద్‌కు రూ.1,600లు పెంచారు ఈరీతిలోనే చెన్నై, వైజాగ్‌లకు ఎక్కువ మొత్తంలో చార్జీలను పెంచి ప్రయాణికుల నుంచి దండుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సైతం ప్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. నెల్లూరు నుంచి వింజమూరుకు రూ. 46లు చార్జీ ఉండగా, కొత్త కండక్టర్లు రూ. 80లు వసూలు చేస్తున్నారు. సంగం నుంచి నెల్లూరుకు రూ.21లు ఉండగా రూ. 40ల వరకు వసూలు చేస్తున్నారు. చార్జీలు ఎందుకు పెంచారని ప్రయాణికులు ప్రశ్నిస్తే దిగిపోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. పలు డిపోల్లో వంటవార్పు ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులు పలు డిపోల్లో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. యాజమాన్యం తీరుకు నిరసనగా అక్కడే వంట చేసి పంక్తి భోజనం చే శారు. గూడూరు, కావలి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి డిపోల్లో కార్మికులు వంటావార్పును నిర్వహించా రు. మరికొన్ని ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి తమ నిరసనను తెలిపారు. గూడురులో సమ్మెలో ఉన్న కార్మికులకు విధుల్లో ఉన్న డ్రైవర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శనివారం జిల్లాలోని ఆయా డిపోల నుంచి మొత్తం 421 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 312 ఆర్టీసీ , 109 అద్దె బస్సులు ఉన్నాయి. పలు పార్టీల సంఘీభావం... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా వైఎస్ఆర్సీసీ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, సీపీఎం, సీపీఐలతో పాటు వివిధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం నెల్లూరు ఆర్టీసీ బస్డాండ్‌లో స్వచ్ఛభారత్‌ను నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ జోనల్కార్యదర్శి నారాయణ తెలిపారు. -
ఆర్టీసీ ఆందోళనకు పలు పార్టీల మద్దతు
పట్నంబజారు(గుంటూరు) : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో శనివారం ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ,సీపీఎంలతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏపీ ఎన్జీవో, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన కోర్కెల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని, ప్రజలపై చార్జీల భారం మోపేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించిన తనకు కార్మికుల కష్టాలు తెలుసని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న టీడీపీ నేతలు, ఇక్కడ లాఠీచార్జీ చే యించడంపై మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ 16 డిగ్రీల ఏసీ బాక్సుల వద్ద కూర్చుని కార్మికులు ఉద్యోగాలు చేయటం లేదని, 43 డి గ్రీల ఎండలో కష్టం చేస్తున్నారన్న సంగతి గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు మాట్లాడుతూ లాఠీచార్జీలకు భయపడేది లేదని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ రాస్తారోకో, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, పలు రాజకీయ పార్టీల నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, కోటా మాల్యాద్రి, నళినీకాంత్, వై.నేతాజీ, షేక్ అమీర్‌వలి, శివరాత్రి శ్రీనివాసరావు, ఎన్వీకే రావు, భగ వాన్దాస్, చల్లా చిన ఆంజనేయులు పాల్గొన్నారు. -
నాలుగో రోజూ ప్రశాంతంగా ఆర్టీసీ సమ్మె
పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం ఆర్టీసీ బస్టాండ్ నందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల నేతలు, కార్మికులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా కార్మిక సంఘాల నేతలు సమన్వయం పాటించారు. రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి శనివారం 785 సర్వీసులు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు కేవలం రీజియన్ పరిధిలోనే తిరుగుతుండడంతో సుదూర ప్రాంతాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. వినుకొండతోపాటు జిల్లాలో పలు చోట్ల ఆర్టీసీ కార్మికుల వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. -
సమ్మెపై సీఎం చొరవ చూపాలి
- సమ్మెను పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం - విచ్ఛిన్నానికి కుట్రలు చేయడం సిగ్గుచేటు - అఖిలపక్ష నాయకులు - ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా, ర్యాలీ హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చొరవ చూపాలని అఖిల పక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం ఢిల్లీకి వెళ్లడం, కుమారుడైన మంత్రి కేటీఆర్ విదేశీయానం చేస్తుండగా, అల్లుడైన మంత్రి హరీష్‌రావు కమీషన్లకై మిషన్ కాకతీయ అంటూ తిరుగుతున్నారని అఖిలపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో శనివారం హన్మకొండలోని ఏకశిల పార్కులో ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి, అనంతరం అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అఖిలపక్ష నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఏక శిల పార్కులో జరిగిన ధర్నాలో అఖిలపక్షాల నాయకులు మాట్లాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని స్వయంగా ప్రకటించారన్నారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో పాల్గొనడంతోనే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు జరిగిందన్నారు. ఆర్టీసీకి విధిస్తున్న పన్నులను ఎత్తివేసి 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం ద్వారా వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని మరిచారని విమర్శించారు. కార్మికుల పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు..చేతకాకపోతే అధికారంలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కార్మిక ద్రోహులపట్ల ఆర్టీసీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్మికులకు ఫిట్మెంట్ పెంచితే ఛార్జీలు పెంచాల్సి వస్తుందని రవాణ శాఖ మంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఎవరు రోడ్డెక్కాల్సిన అవసరం రాదని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యూక రాష్ట్రంలో అందోళనలు పెరిగాయన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు నున్నా అప్పారావు మాట్లాడుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా మంత్రి హరీష్‌రావు ఉన్నప్పటికీ ఎందుకు సమస్యను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ యువత జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. ధర్నా, ర్యాలీలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సీహెచ్.రాంచందర్, ఈదురు వెంకన్న, సీహెచ్ యాక స్వామి, ఈఎస్ బాబు. జి.సారంగపాణి, సదాశివరావు, ఆయా పార్టీల నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ఎం.చుక్కయ్య, పనాస ప్రసాద్, సిరబోయిన కర్ణాకర్, సాంబయ్య నాయక్, శివ, మేకల రవి, ఆర్టీసీ కార్మికులు, ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఏపీలో హోరెత్తిన ఆందోళన!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నాలుగో రోజు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తింది. సమ్మెలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు అన్ని డిపోల ఆవరణల్లోనూ ‘వంటా-వార్పూ’ చేపట్టారు. శాంతియుతంగానే నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విజయవాడలో ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో కార్మికులు విజయవాడ-హైదరాబాద్ హైవేపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి సహా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. సిద్ధా, ఆర్టీసీ ఎండీపై బాబు అసహనం.. కార్మికుల సమ్మెను సరిగా డీల్ చేయలేకపోయారని, కార్మికులు సమ్మెలోకి వెళ్లకుండా నిరోధించలేకపోయారని సీఎం చంద్రబాబు.. రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమ్మెపై శనివారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబు సమీక్షించారు. సబ్ కమిటీ ఎంతిమ్మంటే అంత ఫిట్మెంట్ ఇస్తామని చంద్రబాబు అన్నట్టు తెలిసింది. కాగా ఫిట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉపసంఘంలోని మంత్రులు యనమల రామకృష్ణుడు, శిద్దా రాఘవరావు, కె.అచ్చెన్నాయుడులు చర్చిస్తారు. కలసి వస్తున్న కామ్రేడ్లు :ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ, సీసీఎం సహా పది వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. అవి శనివారం సమావేశమై సోమవారం నుంచి సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. సమ్మెను ఆపబోం.. ఆర్టీసీ సమ్మె సరికాదని, కార్మికులు విధుల్లో చేరాలని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో... తాము సమ్మెను ఆపబోమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. కోర్టు తీర్పు పూర్తి పాఠం అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి, స్పందిస్తామని వారు చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. కోర్టు తదుపరి చేసే వ్యాఖ్యలను బట్టి ఆలోచిద్దామనే ధోరణిలో వారు ఉన్నట్లు సమాచారం. ఆదివారం మంత్రులు చర్చలకు పిలిచినా 43 శాతం ఫిట్మెంట్ విషయంలో గట్టిగానే వాదించాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
తాండూరు ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
బస్సులను అడ్డుకున్న నాయకులు అధికారులు, కార్మికుల మధ్య వాగ్వాదం బస్సు కిందికి దూరిన కార్మికులు ఆరుగురు నాయకుల అరెస్టు తాండూరు : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నాలు గో రోజు తాండూరు డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపో నుంచి శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న యూనియన్ నాయకులు, కార్మికులు డిపో గేట్ వద్ద ధర్నాకు దిగారు. బస్సులను ఎలా నడుపుతారంటూ డీప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డిపో మేనేజర్ లక్ష్మీధర్మాలతో నాయకులు వాగ్వాదానికి దిగారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ఎందుకు సహకరించాలని నాయకులు ప్రశ్నించారు. దీంతో అధికారులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డిపో నుంచి చించొళి, కరన్‌కోట్ రూట్లో బస్సులను నడిపేందుకు బస్సులు బయలుదేరాయి. దాంతో ఆగ్రహం చెందిన కార్మికులు, నాయకులు బస్సులకు అడ్డంగా వెళ్లారు. మరికొందరు కార్మికులు బస్సు కిందికి దూరారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అర్బన్ ఎస్ఐ నాగార్జున, క్విక్ రియాక్షన్ టీం బలగాలు, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో యూనియన్ నాయకులు గోపాల్‌రెడ్డి, బాషా, రవిసింగ్, తేజ, అంజిగౌడ్, సత్తయ్యగౌడ్ తదితర ఆరుగురు యూనియన్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తాండూరు, కరన్‌కోట్ ఎస్ఐలు నాగార్జున, ప్రకాష్‌గౌడ్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బస్టాండ్‌లో వంటావార్పు.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాండూరు బస్టాండ్‌లో కార్మికులు వంటావార్పు నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున వంటావార్పుకు అనుమతి ఇవ్వమని ముందు పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై నాయకులు అధికారులతో మాట్లాడి అనుమతి తీసుకొని వంటావార్పు నిర్వహించారు. డ్రైవింగ్ పరీక్షలు.. పరిగి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ డీటీసీఎం రాజేంద్రప్రసాద్, డీఎం లక్ష్మీధర్మా పలువురు ప్రైవేట్ డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. డిపోలోనే డ్రైవర్లతో బస్సులను నడిపించి, పలువురిని ఎంపిక చేశారు. -
సజావుగా ఎంసెట్
95 శాతం హాజరు ముందు రోజే నగరానికి చేరుకున్న విద్యార్థులు ఫలించిన రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు యూనివర్సిటీ : ఎంసెట్-2015 రాత పరీక్షలు జిల్లాలో సజావుగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల రాత పరీక్ష 17 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మెత్తం 8, 275 మంది (95.6శాతం) అభ్యర్థులు హాజరుకాగా, 385 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ కోర్సు ప్రవేశాల రాత పరీక్షలు 6 కేంద్రాలలో నిర్వహించారు. మెత్తం 3058 (93.2 శాతం) మంది అభ్యర్థులు హాజరుకాగా 226 మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సులకు రెండు కలిపి 95శాతం హాజరు నమోదు అయిందని రీజనల్ కో ఆర్డినేటర్ ఆచార్య బి. ప్రహ్లాదరావు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. జేఎన్టీయూ అనంతపురం సెంటర్లో జామర్లు ఏర్పాటు చేశారు. సమ్మె నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో తాజాగా ఊహాగానాల నడుమ జరిగిన ఎంసెట్ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించారు. ఎంసెట్ పరీక్షలకు అరగంట ఆలస్యమైనా అనుమతించండని జిల్లా కలెక్టర్ కోనశశిధర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ఈ వెసులుబాటును ఉపయోగించుకోలేదు. సమ్మె ప్రభావం, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతిచ్చిలేదనే ముందస్తు హెచ్చరికలతో ముందు రోజే నగరానికి చేరుకున్నారు. ప్రవేటు కళాశాలల ఉచిత తాయిలాలు: ఎంసెట్‌కు గణనీయ స్థాయిలో అభ్యర్థులు హాజరుకావడంతో అనుబంధ కళాశాలల యాజమాన్యాల అంచనాలు రెట్టింపయ్యాయి. గత ఏడాది ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, లోకల్ క్యాటగిరి వివాదం, సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆలస్యంగా ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ దృష్ట్యా పొరుగు రాష్ట్రాల వైపు విద్యార్థులు మళ్లారు. ఇందుకు భిన్నంగా తాజా ఎంసెట్ జరగడంతో ప్రవేటు కళాశాలలో గత ఏడాదితో పోలిస్తే ప్రవేశాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ రాత పరీక్ష ముగిసిన వెంటనే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలు తాయిలాలు మెదలెట్టాయి. కళాశాలలో అడ్మిషన్ పొందితే ఉచిత ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, బస్ ఫీజు ప్రీ, హాస్టల్ ప్రీ అంటూ ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా తాయిలాలు ఇస్తుండడం విశేషం. మెడిసిన్‌కు ఎండ దెబ్బ: ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షల కంటే మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరయ్యే వారికి అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
మూడో రోజు కొనసాగిన సమ్మె
ఆర్టీసీకి రూ. 70 లక్షల నష్టం కర్నూలు(రాజ్‌విహార్) : ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) లతోపాటు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు బస్‌స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి కుమార్, జిల్లా నాయకులు ఎంబీఎన్ శాస్త్రీ పాల్గొన్నారు. ఈ సమ్మెకు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి, సమ్మె కారణంగా జిల్లాలోని 11 డిపోల్లో 609 బస్సులు నిలిచిపోయాయి. 361 బస్సులు నడపగా ఇందులో ఆర్టీసీ బస్సులు 182, అద్దెబ బస్సులు 179 ఉన్నాయి. దీంతో సంస్థకు రూ.70 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టీవీ రామం పేర్కొన్నారు. -
సమ్మె ప్రశాంతం
ఎంసెట్ పరీక్షతో ర్యాలీ, ధర్నాలకే పరిమితం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీపై అదనపు భారం జిల్లాలో రోడ్డెక్కిన 403 బస్సులు ఇబ్బందులుపడ్డ దూర ప్రాంత ప్రయాణికులు నెల్లూరు (రవాణా): జిల్లాలో శుక్రవారం విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రశాంతంగా నిర్వహించారు. కేవలం ర్యాలీలు, ధర్నాలకే పరిమితమయ్యారు. నగర, రూరల్ ప్రాంతాల్లోని 20 సెంటర్లలో 16 వేల మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సడ లింపు ఇచ్చారు. దీంతో జిల్లాలోని ఆయా డిపోల నుంచి పోలీసుల సహకారంతో 403 బస్సులు తిరిగాయి. ఆర్టీసీ అధికారులు దూరప్రాంతాలకు బస్సులను పంపకుండా కేవలం జిల్లాలోనే తిప్పారు. మొత్తం 707 బస్సులుకు గాను 294 ఆర్టీసీ, 109 అద్దె బస్సులును తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దూరప్రాంతాలు చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. ట్రావెల్స్, ప్రైవేటువాహనాలు చార్జీలను రెట్టింపు చేశారు. అధికచార్జీలను నియంత్రించడం లో అటు పోలీసు, రవాణా, అర్టీసీ అధికారులు విఫలమయ్యా రు. ఇంకెన్నాళ్లు ఈ అవస్ధలు పడాలో తెలియడం లేదని పలువురు ప్రయాణికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులను ప్రైవేటు డ్రైవర్లు, కం డక్టర్లతో తిప్పడంతో ఆర్టీసీపై అదనపుభారం పడింది. ర్యాలీ, ధర్నాలకే పరిమితం 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని సమ్మెబాట పట్టిన ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు శుక్రవారం ర్యాలీ, ధర్నాలకే పరిమతమయ్యారు. ఆర్టీసీలోని అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపోల ఎదుట ముందు ధర్నా నిర్వహించారు.ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ కూడా సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు సీపీఎం, సీపీఐ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. అర్టీసీపై అదనపు భారం శుక్రవారం మొత్తం 403 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే మొత్తం డ్రైవర్లు 294 మంది, కండక్టర్లు 403 మందిని కొత్తగా నియమించారు. డ్రైవర్‌కు రూ. 1000లు, కండక్టర్‌కు రూ. 800లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన డ్రైవర్లుకు రోజుకు రూ. 2.94 లక్షలు, కండక్టర్లకు రూ. 3.22 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం కలిపి రూ. 6.16 లక్షలు చెల్లించాల్సి ఉంది. పీక్ సీజన్ పేరుతో పక్కన బెట్టిన కొంతమంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరైనట్లు తెలిసింది. ఇబ్బందుల పడ్డ ప్రయాణికులు ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఎక్కువ బస్సులను విద్యార్థులకు కేటాయించారు. దీంతో ఆయా ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోలు, టాటాఏసీలను ఆశ్రయించారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం వాహనాల కోసం ఎదురుచూశారు. చెన్నై, తిరుపతి, బెంగూళూరు, హైదరాబాద్‌లకు ప్రవేటు బస్సులు ఛార్జీలను రెట్టింపు చేశారు. కొంత మంది కార్లును అద్దెకు తీసుకుని వెళ్లగా మరికొంతమంది రైళ్లును ఆశ్రయించారు. ఎంసెట్‌కు 253 బస్సులు ఎంసెట్ పరీక్షకు మొత్తం 253 బస్సులన తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు. 137 బస్సులను ఆర్టీసీ, 116 బస్సులను రవాణాశాఖ అందజేశారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అద్దె వాహనాలు తీసుకుని ఎంసెట్ పరీక్షకు హజరైనట్లు తెలిసింది. దూర ప్రాంతాల విద్యార్థులు మాత్రం ముందు రోజే నెల్లూరు నగరానికి చేరుకున్నట్లు సమాచారం. వరుసగా 3రోజులు టెట్, డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సడలింపు ఇస్తారా లేక మరింత ఉధృతం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఆర్టీసి కార్మికులు మాత్రం శనివారం నుంచి సమ్మెను ఉధృతం చేయునున్నట్లు చెబుతున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వాహనాలు- ఎన్.శివరాంప్రసాద్, రవాణా ఉపకమిషనర్ విద్యార్థులకు మూడు రోజులు వరుస పరీక్షలు ఉండటంతో ఇబ్బందులు లేకుండా వాహనాలను తిప్పుతున్నాం. ఎంసెట్‌కు రవాణాశాఖ నుంచి 116 వాహనాలను ఏర్పాటు చేశాం, మిగిలిన పరీక్షలకు కూడా వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. శుక్రవారం 115 మంది డ్రైవర్లును అర్టీసీకి పంపాం. -
రోడ్డెక్కిన అద్దెబస్సులు
- మూడో రోజుకు చేరిన కార్మిక సంఘాల సమ్మె - ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన అధికారులు - రాకపోకలు సాగించిన 183 బస్సులు - క్యాజువల్ డ్రైవర్, కండక్టర్ల తొలగింపు - వంటావార్పు, ధర్నాలతో కార్మికుల నిరసన - కొనసాగుతున్న ప్రైవేటు వాహనాల దోపిడీ.. నల్లగొండ : ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె మూడో రోజుకు చేరింది. విరమించే పరిస్థితి కనిపించకపోవడంతో రీజియన్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేశారు. శుక్రవారం పలుచోట్ల అద్దె బస్సులు రోడ్డెక్కాయి. కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ డిపోల ఎదుట ధర్నా నిర్వహించారు. విధుల్లోకి వచ్చిన ప్రైవేటు ఉద్యోగులను అడ్డుకున్నారు. నల్లగొండ నుంచి దేవరకొండ వెళ్తున్న బస్సును కనగల్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనపై అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల మీద ప్రైవేటు వాహనాల దోపిడీ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్టీసీ..ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సేవలు వినియోగించుకుంటోంది. శనివారం నుంచి మరిన్ని అద్దె బస్సులను రోడ్డుమీద తిప్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. డిపోనకు 40 బస్సుల చొప్పున శనివారం మరో 280 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం 183 బస్సులు వివిధ మార్గాల్లో ప్రయాణించగా వాటిల్లో ఆర్టీసీ 33, అద్దె బస్సులు 150 ఉన్నాయి. నల్లగొండ డిపో నుంచే 23 బస్సులు వివిధ ప్రాంతాలకు పంపించారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మిగిలిన బస్సులను అక్కడి నుంచే ఆపరేట్ చేశారు. పోలీస్ ఎస్కార్ట్ సహాయంతోనే బస్సులు ప్రయాణించాయి. ఇదిలావుంటే క్యాజువల్ కండక్టర్లు, డ్రైవర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆర్ఎం బి.రవీందర్ అన్ని డిపోలకు ఉత్తర్వులు జారీ చేశారు. సంఘాల నిరసనలు.. నల్లగొండ డిపో వద్ద ధర్నా చేస్తున్న సంఘాలకు వివిధ పార్టీల అనుంబంద సంఘాలు సంఘీభావం తెలిపాయి. పోలీస్ ఎస్కార్ట్‌తో భువనగిరి ప్రాంతంలో నల్లగొండ, గజ్వెల్ ప్రజ్ఞాపూర్, పికెట్ డిపోలకు చెందిన అద్దె బస్సులు, కొన్ని ప్రైవేట్ బస్సులు నడిచాయి. గ్రామాలకు కాకుండా పట్టణ ప్రాంతాలకు బస్సులు పంపించారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైవేపై నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవరకొండ డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేశారు. కోదాడలో కార్మికులు డిపో నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను బయటకు పంపడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా చేరేందుకు ప్రయత్నించగా వారిని కూడ కార్మికులు అడ్డుకొని డిపో లోనికి వెళ్లనీయలేదు. మిర్యాలగూడ డిపోలో బస్సులు గేటు బయటకు రాలేదు. సమ్మెలో భాగంగా కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపోలోనే మధ్యాహ్న భోజనాలు చేశారు. కార్మికుల సమ్మెకు సీపీఐ, బీజేపీ, స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. సూర్యాపేటలో బస్టాండ్ ఆవరణ నుంచి ఒక్క బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. అలాగే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. -
సమ్మె జోరు.. ప్రయాణం బేజారు
మూడో రోజూ కదలని బస్సులు పోలీస్ ఎస్కార్ట్‌తో నడిపే యత్నం ఎక్కడికక్కడ అడ్డుకున్న కార్మికులు దుబ్బాకలో అర్ధనగ్న ప్రదర్శన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. మూడో రోజైన శుక్రవారం కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పోలీస్ ఎస్కార్ట్‌తో బస్సులను నడపాలని అధికారులు ప్రయత్నించినా.. కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఆశించిన మేర బస్సులను రోడ్డెక్కించలేకపోయారు. 35 బస్సులు మాత్రమే బయటకు తీయగా.. 161 బస్సులు నడిపామంటున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడం, ఇక్కడ సమ్మె జరిగే తీరు రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మిక సంఘాల ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సమ్మె ప్రభావం లేదని చెప్పడానికి ఆర్టీసీ యాజమాన్యం, పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కండక్టర్ ఆత్మహత్యాయత్నం అధికారుల తీరును నిరసిస్తూ బహీరాబాద్ డిపో వద్ద చంద్రప్ప అనే కండక్టర్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పక్కనే గల తోటి కార్మికులు అడ్డుకున్నారు. ఆయన తొడ భాగాలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ► సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ప్రైవేటు సిబ్బందితో శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు సంగారెడ్డి డిపో నుంచి 12 బస్సులను బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘం నాయకులు 4 గంటలకు డిపో వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ► మెదక్ డిపో వద్ద పోలీసులు మహిళా కార్మికులను నెట్టేసిన తీరు వివాదాస్పదమవుతోంది. ► సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 54 ఆర్టీసీ, 18 అద్దె బస్సులుండగా.. ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. కార్మికులు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ► దుబ్బాక డిపో నుంచి ఒక్క బస్సూ కదల్లేదు. మెదక్ డిపోకు చెందిన బస్సు దుబ్బాక వరకు నడిపించగా.. దుండగులు బస్సు అద్దాలు పగులగొట్టారు. అర్ధనగ్న ప్రదర్శనతో పాటు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ► నారాయణఖేడ్‌లో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని బస్సులు నడిపిస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో డిపో వద్దకు రాగానే కార్మికులు అడ్డుకొని వారిని వెనక్కి పంపించారు. ► సిద్దిపేట డిపో పరిధిలో శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. డిపో నుంచి వస్తున్న బస్సులను అడ్డుకున్నందుకు, తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి వచ్చిన వారిపై దాడి చేసినందుకు పోలీసులు కార్మికులపై కేసులు నమోదు చేశారు. అలాగే గురువారం రెండు బస్సుల టైర్ల నుంచి గాలి తీసినందుకు గాను కేసు నమోదైంది. మొత్తం ఈ మూడింటికి సంబంధించి సుమారు వంద మందిపై కేసులు నమోదయ్యాయి. ► మూడో రోజు సమ్మె కారణంగా రూ.98 లక్షల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు -
ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం
కార్మికులు, పార్టీల నేతల అరెస్టు, విడుదల మంత్రి పల్లెను నిలదీసిన కార్మికులు పలు చోట్ల బస్సు అద్దాలు ధ్వంసం కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతం అవుతోంది. గురువారం రీజియన్ వ్యాప్తంగా కార్మికులు కదంతొక్కారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.అనేకచోట్ల అరెస్టులు జరిగాయి. జిల్లాలోని అనంతపురం, కదిరి తదితర ప్రాంతాల్లో బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్మికులు డిపో ఆవరణలో ఉండకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. నగరంలో ఈయూ, ఎన్ఎంయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మిక నేతలు కొండయ్య, వీఎన్ రెడ్డి, భాస్కర్ నాయుడు, గోపాల్, రామాంజినేయులు, కార్మికులు మంత్రి పల్లె రఘునాథ రెడ్డిను నిలదీశారు. ఫిట్మెంట్, ప్రభుత్వంలో విలీనంపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ అడ్డుకున్నారు. మంత్రి కారు ఎదుట బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను పక్కకు నెట్టారు. దీంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఎం నేతలు సాయంత్రం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయబోతుండగా పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు. హిందూపురంలో హైర్ బస్సులను తిప్పేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ కార్మికులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఉరవకొండలో కార్మికులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. కార్మికులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామనడం సరికాదన్నారు. ఇందుకు సీఎం మూల్యం చెల్లించకతప్పదన్నారు. కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా కార్మికుల మద్దతు తెలిపారు. ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని విమర్శించారు. ఫిట్మెంట్ 43 శాతం ప్రకటించాల్సిందేనన్నారు. తాడిపత్రిలో పోలీసులకు కార్మికుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రైవేట్ బస్సులను ఏవిధంగా పంపుతారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు 42 మందిని అదుపులోకి తీసుకుని, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. మడకశిర బస్టాండ్ ముందు కార్మికులు ధర్నా చేశారు. పుట్టపర్తిలో సమ్మె ప్రభావం కన్పించింది. 249 బస్సులు నడిపిన ఆర్టీసీ రీజియన్ వ్యాప్తంగా పోలీసులు బందోబస్తు మధ్య ఆర్టీసీ 249 బస్ సర్వీసులను తిప్పింది. ఇందులో హైర్ బస్సులు 130,, 119 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. పోలీసులు బందోబస్తు మధ్య బస్సులు తిప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది వరకు డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల ప్రమాదమని తెలిసినా ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాల్సి వస్తోందని ఓ అధికారి చెప్పారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు.. అరకొరగా బస్సులు తిప్పుడంతో ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉన్నారు. కొందరు ప్రయాణికులు ప్రైవేట్ వ్యాన్లు, డీజిల్ ఆటోలను ఆశ్రయించారు. పరిమితికి మించి ప్రయాణికులతో ప్రైవేటు వాహనాలు, డీజిల్ ఆటోలు తిరిగాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రైల్వే స్టేషన్లో బారులు తీరారు. సీఐటీయూ నేతల అరెస్టు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ నేతలు ఇంతియాజ్, నాగరాజు, గోపాల్ ఆర్టీసీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని నేతలను అరెస్టు చేశారు. పోలీసుల చర్యలను నాయకులు ఖండించారు. ఎంసెట్ అభ్యర్థులు ఇబ్బంది రాకూడదు ఐవైఆర్ కృష్ణారావు అభ్యర్థులు ఎంసెట్‌కు హాజరయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో కలిసి గురువారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థుల రవాణా సౌకర్యం వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టిన బస్సు సర్వీసుల వివరాలను వివరించారు. విధులకు హాజరుకాకపోతే తొలగిస్తాం : ఆర్టీసీ ఆర్ఎం రీజియన్‌లో సమ్మె కారణంగా కాంట్రాక్టు 71 డ్రైవర్లు, 14 కండక్టర్లు విధులకు హాజరుకాలేదు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకు వారు విధులకు హాజరుకాకపోతే తొలగిస్తామనిచ రెగ్యులర్ చేయబోమని ఆర్ఎం జీ వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. వెంటనే కాంట్రాక్ట్ ఉదోయగులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. -
ప్రాణం తీసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
బస్సుల బంద్‌తో భార్యను తీసుకొచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఫొటోగ్రాఫర్ దుర్మరణం గూడూరు : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మండలంలోని కె.నాగులాపురం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరుకు చెందిన హబీ ఫొటోస్టూడియో యజమాని ఎం.ఖాజాబాబు(26) వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణానికి చెందిన ఎం.మహబూబ్‌బాషా రెండో కుమారుడు ఎం.ఖాజాబాబుకు రెండు నెలల క్రితం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వేలూరు యువతితో వివాహమైంది. పుట్టింటికి వెళిన భార్య రైలులో కర్నూలుకు వస్తుండగా ఆమెను తీసుకువచ్చెందుకు రాత్రి 8 గంటల సమయంలో ఖాజాబాబు కర్నూలుకు బయలు దేరాడు. సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో బైక్‌పై వెళ్లాడు. మార్గమధ్యంలో కె.నాగులాపురం దాటిన తరువాత కంకర మిషన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారులు ప్రమాదాన్ని గమనించి కె.నాగులాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మోహన్ కిషోర్‌రెడ్డి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చేరుకోవడమే అసలు పరీక్ష..!
రోడ్డెక్కని బస్సులు.. ఆందోళనలో విద్యార్థులు నగరంలో నేడు ఏపీ ఎంసెట్ హాజరుకానున్న 26,948 మంది విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లే దిక్కు సిటీబ్యూరో: నగరంలో ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు. పరీక్ష రాయడం ఒకెత్తయితే.. పరీక్ష సెంటర్‌కు చేరుకోవడమే అసలు పరీక్షగా మారింది. శుక్రవారం నగరంలో ఏపీ ఎంసెట్ పరీక్ష జరగనుంది. దాదాపు 27 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సన్నద్ధమయ్యారు. వీరందరికీ ఆయా ప్రాంతాల్లో కేటాయించిన కేంద్రాలకు ఎలా చేరుకోవాలని ఆందోళనలో పడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మూడు రోజులుగా బస్సులు రోడ్లెక్కని విషయం తెలిసిందే . యథావిథిగా బస్సులు నడవడం, ప్రత్యేక బస్సులు వేస్తేనే నగరంలో పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడం కష్టం. అసలు పూర్తిగా బస్సులు నడవకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రైవేటు సిబ్బందిపైనే ఆర్టీసీ ఆధారపడింది. వారు ఎంత మంది విధులకు హాజరైతే.. ఆ మేరకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ చెబుతోంది. ఏ రూట్లలో, ఎన్ని బస్సులు అనేది స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై విద్యార్థులు ఆధారపడకపోవడమే మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమే ఉత్తమం. ఎవరికివారు సొంత ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటే సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావడంతో నగరంలో చదువుకున్న విద్యార్థులతో పాటు విజయవాడ, కర్నూల్ వంటి ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులంతా ఇక్కడే పరీక్ష రాయనున్నారు. వీరికీ కష్టాలు తప్పేలా లేవు. పరీక్ష సమయానికంటే గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఓ వైపు అధికారులు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ.. ఎలా వెళ్లాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. మెడికల్ విద్యార్థులే అధికం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నగరంలో మూడు జోన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జోన్ల పరిధిలో మొత్తం 22 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరగనుంది. నగరంలో మొత్తం 26,948 మంది ఏపీ ఎంసెట్ రాస్తుండగా.. అందులో మెడికల్ విద్యార్థుల సంఖ్యే అధికం. ఇంజినీరింగ్‌కు 9,028 మంది, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 17,718 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరితోపాటు మరో 101 మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ రెండు పరీక్షలు రాయనున్నారు. కో ఆర్డినేటర్లు వీరే.. జోన్ 1 - రీజినల్ కో ఆర్డినేటర్: డాక్టర్ బి. బాలు నాయక్, 9949499038 జోన్ 2 - రీజినల్ కో ఆర్డినేటర్: డాక్టర్ పి. శ్రీనివాస రావు, 9949485554 జోన్ 3 - రీజినల్ కో ఆర్డినేటర్ : డాక్టర్ ఏ ప్రభుకుమార్, 8008103810 పకడ్బందీగా ఏర్పాట్లు.. కేపీహెచ్‌బీకాలనీ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీ ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.బాలు నాయక్ తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందే చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ముందస్తు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తుల నకలు కాపీలు, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల నకలు కాపీలను తీసుకురావాలని డాక్టర్ బాలూనాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తమతో పాటు పరీక్షా కేంద్రాలకు తీసుకురాకూడదని చెప్పారు. - డాక్టర్ బాలు నాయక్, ఏపీ ఎంసెట్ రీజినల్ కో ఆర్డినేటర్ ఎంసెట్ విద్యార్థులకు విజ్ఞాన జ్యోతి కళాశాల బస్సులు సిటీబ్యూరో: ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థుల పట్ల వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ఉదారత చాటింది. ఆ కళాశాలకు చెందిన బాచుపల్లి, నిజాంపేట సెంటర్లలో ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఉదయం 8.30 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద, మియాపూర్ జంక్షన్ వద్ద కళాశాలకు చెందిన బస్సులు సిద్ధంగా ఉంటాయి. మధ్యాహ్నం పరీక్ష రాసే మెడికల్ విద్యార్థుల కోసం ఆ ప్రాంతాల్లోనే మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సులు అందుబాటులో ఉంటాయని విజ్ఞాన కళాశాల యాజమాన్యం పేర్కొంది. -
తాడో.. పేడో
రెండో రోజూ కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె డిపో కార్యాలయాల ఎదుట వెల్లువెత్తిన ఆందోళనలు పోలీస్ బందోబస్తు నడుమ రోడ్డెక్కిన బస్సులు పాక్షికంగానే రవాణా సేవలు ఏలూరు (ఆర్ఆర్ పేట) :వేతన సవరణ చేయాలని, 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. సర్కారుతో అమీతుమీ తేల్చుకుంటామని, డిమాం డ్లను ఆమోదించేంత వరకూ సమ్మె ను విరమించేది లేదని కార్మిక సం ఘాల నాయకులు స్పష్టం చేశారు. సమ్మె నేపథ్యంలో బుధవారం కేవలం 8 బస్సులను మాత్రమే నడిపిన అధికారులు గురువారం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సుమారు 276 బస్సులను తిప్పగలిగారు. వీటిలో 189 బస్సులు ఆర్టీసీకి చెందినవి కాగా, మరో 87 అద్దెబస్సులు ఉన్నాయి. ఏలూరు డిపోపరిధిలో 51 ఆర్టీసీ, 36 అద్దె బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో పరిధిలో 30 ఆర్టీసీ, 15 అద్దె బస్సులు, తాడేపల్లిగూడెంలో 12 ఆర్టీసీ, 8 అద్దె బస్సులు, భీమవరంలో 26 ఆర్టీసీ, 9 అద్దె బస్సులు, నరసాపురంలో 26 ఆర్టీసీ, 7 అద్దె బస్సులు, తణుకులో 24 ఆర్టీసీ, 12 అద్దె బస్సులు, కొవ్వూరులో 20 ఆర్టీసీ బస్సులు నడిచాయి. అద్దె బస్సుల యజమానులు రూ.100 చొప్పున పర్మిట్ చార్జీలు చెల్లించి లాభసాటి మార్గాల్లో ప్రయాణించగా, ఆర్టీసీ బస్సులు మాత్రం ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని పల్లె వెలుగు రూట్లలో వెళ్లాయి. ఆర్టీసీ బస్సుల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వర్తించగా, ప్రతి బస్సుకు ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను ఎస్కార్ట్‌గా పంపించారు. కొనసాగిన ఆందోళనలు బుధవారం 38 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి, కేసులు నమోదు పెట్టినా రెండో రోజున కార్మికులు వెనక్కి తగ్గలేదు. ఉదయాన్నే ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని ధర్నాలు నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వందలాదిగా వచ్చిన నిరుద్యోగులు సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడుపుతామని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా డిపోల్లో అధికారులను సంప్రదిం చాలని కలెక్టర్ కె.భాస్కర్ బుధవారం చేసిన ప్రకటనతో నిరుద్యోగులు ఉదయం 6గంటలకే వందలాదిగా ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బారులు తీరారు. తొలుత వారినుంచి సర్టిఫికెట్లు సేకరించిన అధికారులు వాటిని పరిశీలించి ఒక్కొక్కరినీ పిలిచి బస్సులు అప్పగించారు. ప్రతి డిపో వద్ద వందలాది మంది అభ్యర్థులు వేచి ఉండగా, జిల్లావ్యాప్తంగా కేవలం 552 మందికే అవకాశం లభించడంతో మిగిలిన వారు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ప్రయాణికులకు పెరిగిన ఇబ్బందులు కలెక్టర్ ప్రకటనతో సులభంగా ప్రయాణం చేయవచ్చనే ధీమాతో రోడ్లపైకి వచ్చిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయం 9 గంటల తరువాత గాని బస్సులు బయటకు రాలేదు. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. మొత్తానికి ప్రయాణికులు ఇబ్బందులు తప్పలేదు. కాంట్రాక్ట్ కార్మికుల సేవలు క్రమబద్ధీకరణ సమ్మె నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించే అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలలోపు తన కార్యాలయంలో రిపోర్టు చేసే కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేస్తామని రీజినల్ మేనేజర్ ఆర్.రామారావు ప్రకటించారు. రిపోర్టు చేయని కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ చేసే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయన్నారు. రీజియన్ పరిధిలో 141 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 61 మంది కాంట్రాక్టు కండక్టర్లు ఉన్నట్టు ఆయన చెప్పారు. -
రెండో రోజూ ‘బస్సు’ బంద్ ఉద్రిక్తత
- తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడ్డెక్కిన బస్సులు - కార్మికుల కన్నెర్ర.. అడ్డుకున్న సిబ్బంది.. - టైర్లలో గాలి తీసివేత.. బస్సు అద్దాలు ధ్వంసం - కానిస్టేబుల్‌కు గాయూలు.. చెదరగొట్టిన పోలీసులు.. - ఆర్టీసీ జేఏసీ భారీ ర్యాలీ.. పోలీసుల అదుపులో కొందరు కార్మికులు హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రెండోరోజు గురువారం చేపట్టిన బస్సుల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తిస్థారుులో బస్సు సర్వీసులు నిలిచిపోరునప్పటికీ... తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడం, అద్దె బస్సులు నడిపించడంపై కార్మికులు కన్నెర్ర చేశారు. సమ్మెలో భాగంగా హన్మకొండ డిపో నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం కూడలి, పెట్రోల్ పంప్, హన్మకొండ చౌరస్తా మీదుగా వరంగల్-2 డిపో ముందు నుంచి హన్మకొండ జిల్లా స్టేషన్‌కు ర్యాలీ చేరుకుంది. జిల్లా బస్‌స్టేషన్‌లోకి ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే క్రమంలో వరంగల్-2 డిపోకు చెందిన బస్సు ఇటు వైపు రావడంతోవారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహిళా కార్మికులు బస్సులకు అడ్డంగా బైఠాయించగా... కొందరు ఆర్టీసీ సిబ్బంది నడుస్తున్న బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో వరంగల్-2 డిపోకు చెందిన ఓ అద్దె బస్సు అద్దాలు పగిలాయి. బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు రాయి తగలడంతో స్వల్పంగా గాయమైంది. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు చెదరగొట్టారు. రాళ్లు విసిరాడంటూ ఆర్టీసీ కార్మికుడు అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించేందుకు వాహనంలోకి ఎక్కించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు వాహనాన్ని కార్మికులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో జగిత్యాల డిపోకు చెందిన రెండు అద్దె బస్సులు రావడంతో కార్మికులు ఆ బస్సులనూ అడ్డగించారు. మహిళా కార్మికులు బస్సుల ముందు బైఠాయించారు. కొంత మంది బస్సుల టైర్లలో గాలి తీశారు. పోలీసులు అదుపులోకి తీసుకొన్న కార్మికుడిని వదిలేయడంతో కార్మికులు శాంతించారు. అనంతరం బస్‌స్టేషన్ ద్వారం వద్ద కార్మికులు టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. ర్యాలీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈఎస్ బాబు, జితేందర్‌రెడ్డి, సిహెచ్ యాకస్వామి, ఈదురు వెంకన్న, మనోహర్, సీహెచ్.రాంచందర్, యాదయ్య, యాదగిరి, ఎండీ.గౌస్. కేడీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు రూ.కోటి నష్టం జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 965 బస్సులు ఉన్నారు. ఇందులో 758 సంస్థ బస్సులు, 207 అద్దె బస్సులు. ఇందులో సంస్థకు చెందిన 12 ఆర్టీసీ బస్సులను తాత్కాలి డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో బయటకు వెళ్లాయి. 142 అద్దె బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్‌లో మొత్తం 4539 మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు 3605 మంది ఉండగా... మిగతా వారు సూపర్ వైజర్లు, మెకానిక్‌లు, డీసీలు, ఏడీసీలు, ఇతర ఉద్యోగులున్నారు. సమ్మెతో రెండో రోజు దాదాపు రూ.98 లక్షల నుంచి రూ.కోటి వరకు సంస్థ ఆదాయాన్ని కోల్పోయింది. తాత్కాలికంగా హన్మకొండ నుంచి పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, జనగామ, హైదరాబాద్, కరీంనగర్ రూట్లలో నడిపినట్లు ఆర్టీసీ ఆర్ఎం యాదగిరి తెలిపారు. ఫలించని అధికారుల వ్యూహం ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ... గురువారం పూర్తిస్థాయిలో బస్సులు నడుపలేకపోయూరు. బుధవారం తాత్కాలిక డ్రైవర్లుగా 30 మందిని ఎంపిక చేసి డిపోలకు కేటాయించినప్పటికీ... గురువారం 12 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. దీంతో మరో 12 మంది తాత్కాలిక కండక్టర్లను విధుల్లోకి తీసుకుని 12 బస్సులు నడిపారు. గురువారం మరో 40 మంది తాత్కాలిక డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సు యజమానులకే పూర్తి స్వేచ్ఛను వదిలేసింది. దీంతో కొంత మంది అద్దె బస్సు యజమానులు బస్సులను తిప్పారు. బస్‌స్టేషన్ ప్రాంతాలకు బస్సులు వెళ్లే ఇబ్బందులు తప్పవని భావించిన అద్దె బస్సు యజమానులు బస్స్టేషన్లకు కొంచెం దూరంలో ప్రధాన కూడళ్లలో ప్రయాణికులను దింపి, ఎక్కించుకొని వెళుతున్నారు. అరుుతే కార్మికులు అడ్డుకుంటారని, నష్టం చేస్తారనే భయంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. సంఘీభావాల వెల్లువ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పనాసా ప్రసాద్,నాయకుడు సిరబోయిన కర్ణాకర్ సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని మార్తినేని ధర్మారావు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. కార్మికుల పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. -
సమ్మె ఉద్రిక్తం..
రెండో రోజూ కదలని బస్సులు సంగారెడ్డిలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ గుండెపోటుకు గురైన కండక్టర్.. దుబ్బాకలో మోకాళ్లపై నిలబడి నిరసన జహీరాబాద్‌లో కబడ్డీ ఆడిన కార్మికులు గజ్వేల్‌లో నిరసన ర్యాలీ సంగారెడ్డి, ఆర్సీ పురంలో సీఎం దిష్టిబొమ్మల దహనం ఆర్టీసీ సమ్మె రెండో రోజై న గురువారం జిల్లాలో ఉధృతమైంది. అదే సమయంలో ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసుల సహకారంతో బస్సులను నడపాలని ప్రయత్నించిన అధికారులు కార్మికుల ప్రతిఘటనతో విఫలమయ్యారు. సంగారెడ్డిలో ఓ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆందోళనలో పాల్గొన్న మరో కండక్టర్ గుండెపోటుకు గురి కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుబ్బాకలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు. మెదక్‌లో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బస్సుల కింద పడుకొన్న కార్మికులను పోలీసులు లాగేశారు. సిద్దిపేట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు బస్సుల టైర్ల నుంచి గాలి తీసేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ డిపో ఎదుట కార్మికులు కబడ్డీ, వాలీ బాల్ ఆడి నిరసన తెలిపారు. సంగారెడ్డి, రామచంద్రాపురంలో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డిమున్సిపాలిటీ/సంగారెడ్డి క్రైం: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రెండో రోజైన గురువారం కూడా జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 8 గంటలకే కార్మికులు సంగారెడ్డి డిపో ఎదుట బైఠాయించారు. పట్టణ ఎస్ఐ రమేష్ కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో డ్రైవర్ అనిల్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ కిరోసిన్ డబ్బాను పైకి లేపగానే తోటి కార్మికులు, పోలీసులు లాగేసుకున్నారు. అనంతరం పట్టణ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ వెంకటేష్, డీఎస్పీ తిరుపతన్న డిపో వద్దకు చేరుకొని బస్సులు నడిచేందుకు సహకరించాలని కార్మికులను కోరారు. అందుకు కార్మికులు అంగీకరించలేదు. కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగా రు. కార్మికులను అరెస్టు చేసేందుకు పో లీసు వాహనాలను సిద్ధం చేస్తున్న క్రమం లో కండక్టర్ అంజయ్య గుండెపోటుకు గురై అక్కడే పడిపోవడంతో కార్మికులు వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ దశలో పోలీసులు వారిని అరెస్టు చేయకుండా వెనుదిరిగారు. బెడిసికొట్టిన పోలీసుల వ్యూహం... సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో కొన్ని బస్సులనైనా నడిపించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆర్ఎం రాజుతోపాటు జిల్లాలోని డీఎస్పీలతో బుధవారం అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసుల పటిష్టమైన బందోబస్తు మధ్య బస్సులు నడిపించాలని సూచించారు. ఒక్కో బస్సుకు ఇద్దరు నుంచి ఐదుగురిని ఎస్కార్ట్‌గా నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు పోలీసు పహారా పెంచారు. ప్రత్యేక బలగాల మధ్య బస్సులను నడిపించేందుకు యత్నించారు. ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకోవడంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. నడిచింది 5 బస్సులు మాత్రమే... కార్మికుల సమ్మె కారణంగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 55 సర్వీసులను నడిపించినట్లు ఇన్చార్జి ఆర్ఎం రాజు తెలిపారు. ఇందులో 50 ప్రైవేట్ బస్సులు, 5 ఆర్టీసీ బస్సులు నడిచినట్టు ఆయన పేర్కొన్నారు. రెండో రోజు సమ్మె కారణంగా జిల్లాలో కోటి రూపాయల వరకు సంస్థకు నష్టం వాటిల్లిందని తెలిపారు. సమ్మె ఆపేది లేదు: టీఎంయూ నేత పీరయ్య సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ‘ఎస్మా’ ప్రయోగిస్తామని సర్కార్ హెచ్చరించినా బెదిరేది లేదని టీఎంయూ రీజినల్ కన్వీనర్ పీరయ్య అన్నారు. ప్రాణాలు పోయిన తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంగారెడ్డిలోని ప్రధాన రహదారిపై కార్మికులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. కార్మికుల సమ్మెకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికుల ఆందోళనలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు సంబరపడి కేసీఆర్‌కు మద్దతిచ్చిన కార్మికులే ఇప్పుడు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు సమ్మె చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదని... టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ అయిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూడా సమ్మెలో పాల్గొనడం గొప్పవిషయమన్నారు. సమ్మె చేస్తున్న అధికార యూనియన్‌కు కేబినెట్ మంత్రి టి.హరీశ్‌రావు గౌరవ అధ్యక్షునిగా ఉండి కార్మికుల సమస్యలను విస్మరించడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. పది నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. భెల్ డిపో ఎదుట నిరసన... రామచంద్రాపురం: ఆర్టీసీ కార్మికులు గురువారం ఉదయం భెల్ డిపో ఎదుట బైఠాయించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు మొగులయ్య, శ్రీనివాస్, వెంకటేశం, మల్లేశం పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం
నెల్లూరు: తమ డిమాండ్ల పరిష్కారానికై జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపో వద్ద పోలీసులకు, కార్మికులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంలో డ్రైవర్ శ్రీనివాస్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తొలుత డ్రైవర్ శ్రీనివాస్ కు గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే యత్నం చేశారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచాడు. పోలీసుల సాయంతోబస్సులు నడపాలని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యపు చర్యలను అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి, -
సమ్మె దెబ్బ...
ఎక్కడి బస్సులు.. అక్కడే.. అతికష్టం మీద 50 వరకు బస్సులను తిప్పిన ఆర్టీసీ రూ.కోటికిపైగా ఆదాయం కోల్పోయిన వైనం చార్జీలు రెట్టింపుచేసిన ప్రైవేటు వాహనదారులు ఇబ్బందులు పడిన ప్రయాణికులు నెల్లూరు(రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రయాణికులకు చుక్కలు చూపింది. ఫిట్మెంట్ 43 శాతం పెంచాలంటూ ఆర్టీసీలోనే అన్ని యూనియన్లు బుధవారం నుంచి సమ్మెకు దిగాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 800లకు పైగా బస్సులు ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు కార్మికులు, మెకానికల్ విభాగం, కార్యాలయ సిబ్బంది, అందరూ మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్లిపోయారు. కేవలం ఆయా డిపో మేనేజర్లు, అధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆయా డిపోల నుంచి 4 నుంచి 5 బస్సుల వరకు అధికారులు అతికష్టం మీద తిప్పారు. సమ్మె కారణంగా జిల్లాకు రోజుకు రూ.కోటి వరకు రావాల్సిన రెవెన్యూను ఆర్టీసీ కోల్పోయింది. ప్రైవేటు వాహనాలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో చార్జీలు పెంచి అందినకాడికి ప్రయాణికుల నుంచి దోచుకున్నారు. అధికారులు మొదటిరోజు బస్సులు తిప్పడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను విరమించుకుంటే మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు... జిల్లావ్యాప్తంగా 800లకుపైగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అధికారులు అతికష్టం మీద ఆయా డిపోల నుంచి 51 బస్సులను తిప్పారు. ప్రయాణికులు బస్సుల కోసం డిపోల్లోనే నిరీక్షించారు. కొంతమంది చేసేదేమీలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ప్రధానంగా బెంగళూరు, తిరుపతి, చెన్నై, వైజాగ్, విజయవాడకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముందే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో బస్టాండుకు వచ్చి ఇబ్బందులుపాలయ్యారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులతో వాదనలకు దిగారు. కనీసం రిజర్వేషన్ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లించమని అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైందని పలువురు ప్రయాణికులు వాపోయారు. తాత్కాలిక ఏర్పాట్లలోనూ నిర్లక్ష్యం బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలన్న సమాచారం ముందే తెలియడంతో అధికసంఖ్యలో యువకులు బస్టాండుకు వచ్చారు. కేవలం డ్రైవర్లు, కండక్టర్లు ధృవపత్రాలను పరిశీలించేందుకు అంత సుముఖత కనబడటంలేదని విధులు నిర్వహించడానికి వచ్చిన పలువురు యువకులు వాపోయారు. ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఆ ప్రయత్నాలు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు రద్దుచేశారు... వారం ముందే హైదరాబాద్ నుంచి చెన్నైకి రిజర్వేషన్ చేసుకున్నాం. తీరా మంగళవారం రాత్రి బస్సు దగ్గరకి వచ్చేసరికి రిజర్వేషన్ రద్దుచేస్తూ మెసేజ్ పంపారు. అక్కడి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి నెల్లూరుకు ఇతర వాహనాల్లో వచ్చాం. ఇక్కడ నుంచి చెన్నై వెళ్లేందుకు బస్సులు లేవు. బస్సుకోసం ఇబ్బందులు పడుతున్నాం. - వంశీకృష్ణ, ప్రయాణికుడు సమాచారమే కరువు... బస్సులు రద్దవుతున్నట్లు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమ్మె విషయం తెలిసినట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. ఈ విషయంపై అధికారుల నుంచి ఎలాంటి సమాధానం కూడా రావడంలేదు. బస్సుకోసం నాలుగు గంటలకుపైగా ఎదురుచూస్తున్నాం. - జోయల్, ప్రయాణికుడు పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం.. తిరుపతి వెళ్దామని పిల్లలతో బస్టాండుకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు వెళ్లడం లేదని తెలిసింది. ఉదయం నుంచి తిరుపతి వెళ్లేందుకు బస్టాండులోనే కూర్చున్నాం. చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం. - నాగిళ్ల శీనమ్మ.. ప్రయాణికురాలు బస్సులను ఏర్పాటు చేయలేదు.. సమ్మె విషయం ముందే తెలిసినా అధికారులు అం దుకు తగిన ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయలేదు. ప్రైవేటు వాహనాలు కూ డా అంతంతమాత్రంగానే తిరుగుతున్నాయి. చార్జీలు ఎక్కువ చెల్లించి అయినా వెళ్దామన్నా కుదరడంలేదు. ఉదయం నుంచి బస్సుకోసం బస్టాండులో పడిగాపులు కాస్తున్నాం. - కొండా నాగమణి, ప్రయాణికురాలు శ్రీలంకకు విమాన టికెట్ రిజర్వు చేసుకున్నాం.. బుధవారం రాత్రికి శ్రీలంకకు వెళ్లేందుకు బెంగళూరు నుంచి విమానానికి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. నెల్లూరు నుంచి వెళ్లేందుకు బుధవారం వోల్వో బస్సుకు బెంగళూరుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. తీరా బస్టాండుకు వచ్చాక బస్సు లేదని అధికారులు చెప్పారు. బస్సు రద్దయిన విషయంపై ఎలాంటి సమాచారం అందించలేదు. శ్రీలంకకు వెళ్లాలంటే ఏం చేయాలో అర్థం కావడంలేదు. - ఆరాఫత్, లష్ర్పత్ -
ప్రైవేట్ దోపిడీ
సాక్షి నెట్వర్క్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జిల్లావ్యాప్తంగా ప్రయూణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. పెళ్లిళ్లు, సెలవుల సీజన్ కావడంతో ప్రయూణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు రూ.150-200 బస్‌చార్జీ ఉండగా... ప్రైవేటు వాహనదారులు ఒక్కొక్కరికి రూ.400-500 వసూలు చేశారు. వాహనంలో పది మందికి సీట్లుంటే 14 మందిని ఎక్కించుకొని ప్రయూణికులను ఇబ్బందులకు గురిచేశారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌కు బస్‌చార్జీ రూ.40 ఉండ గా రూ.70-80 వసూలు చేశారు. హైదరాబాద్‌కు రూ.300లకు పై గా వసూలు చేస్తున్నారు. మంథని నుంచి పెద్దపల్లి, గోదావరిఖని, కాటారం, భూపాలపల్లి, తాడిచర్లతో తదితర ప్రాంతాలకు బస్‌చార్జీ రూ.20 ఉండగా, ప్రైవేట్ వాహనాల్లో రూ.50-60 వరకు వసూలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని పట్టణాలకు వందలాది ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, జీపులు, కార్లు రెట్టింపు ధరలతో నడిపించారు. వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు వ చ్చిన భక్తులు బస్సులు లేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రైవేట్ వాహనదారులు కరీంనగర్‌కు రూ.50, హైదరాబాద్‌కు రూ.300 చొప్పున దండుకున్నారు. -
రోడ్డెక్కని ఆర్టీసీ
సమ్మెకు దిగిన 6400 మందికి పైగా కార్మికులు,ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన 1100 బస్ సర్వీసులు రోజుకు రూ.కోటికి పైగా నష్టం ఆందోళనలో అధికారగణం పట్నంబజారు (గుంటూరు) : సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఇచ్చిన పిలుపునకు అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వడంతో జిల్లాలోని ప్రగతి చక్రాలకు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మెకు ఎన్ఎంయూ సైతం మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మె అనివార్యమైందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మంగళవారం తెలిపారు. ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బాసటగా నిలవటంతో, డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. రోజుకు రూ. కోటి నష్టం... గుంటూరు రీజియన్ పరిధిలోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం 6400 మందికి పైగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె కారణంగా సంస్థకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ భవిష్యత్ దృష్ట్యా తప్పటం లేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు. రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రోజుకు రూ. కోటి మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పలు సంఘాల మద్దతు ... నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న కార్మికుల విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈయూ సమ్మెకు పిలుపునిచ్చింది. మరో ప్రధాన యూనియన్ నేషనల్ మజ్దూర్ (ఎన్ఎంయూ)తో పాటుగా అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిత్యం రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి 1275 సర్వీసులు తిరుతున్నాయి. కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో సుమారు 1100 పైగా బస్సులు నిలిచిపోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 6,400 మంది కార్మికుల్లో ఈయూలో 2, 800 మంది, ఎన్‌ఎంయూలో 2,700 మంది ఉండగా, మిగిలిన వారు వివిధ సంఘాల్లో ఉన్నారు. ఈయూ నాయకులు గత నెల 2వ తేదీన సమ్మె నోటీసులు జారీ చేశారు. సమ్మెలో 13 డిపోల కార్మికులు, నాయకులు పాల్గొనాలని తీర్మానించారు. దీంతో పూర్తి స్థాయిలో బస్సులు నిలిచిపోయే అవ కాశం కూడా ఉంది. ప్రత్యామ్నాయం కోసం అధికారుల ప్రయత్నాలు...? కార్మికులు సమ్మెకు సిద్ధం కావడంతో బస్సులు నడపటం కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్మిక సంఘాల నేత లు మాత్రం ఒక్క బస్సును కూడా డిపోల నుంచి కదలనివ్వబోమని తేల్చిచెప్పారు. -
30న ఆర్టీసీ కార్మికుల సమ్మె
నేడు ఆర్టీసీ ఎండీ కి సమ్మె నోటీసు ఇవ్వనున్న కార్మిక సంఘాలు సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు రవాణా, భద్రతా బిల్లు-2015 ఆర్టీసీకి తీవ్ర నష్టదాయకమని, బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 30న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహించే సమ్మెలో పాలుపంచుకోనున్నట్లు తెలిపింది. బుధవారం ఆర్టీసీ ఎండీని కలసి సమ్మె నోటీసు ఇవ్వాలని జేఏసీ తీర్మానించింది. కార్మికులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నేత కె.రాజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.