ప్రైవేట్ దోపిడీ | Private robbery | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ దోపిడీ

Published Thu, May 7 2015 3:02 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Private robbery

సాక్షి నెట్‌వర్క్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జిల్లావ్యాప్తంగా ప్రయూణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. పెళ్లిళ్లు, సెలవుల సీజన్ కావడంతో ప్రయూణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు రూ.150-200 బస్‌చార్జీ ఉండగా... ప్రైవేటు వాహనదారులు ఒక్కొక్కరికి రూ.400-500 వసూలు చేశారు. వాహనంలో పది మందికి సీట్లుంటే 14 మందిని ఎక్కించుకొని ప్రయూణికులను ఇబ్బందులకు గురిచేశారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌కు బస్‌చార్జీ రూ.40 ఉండ గా రూ.70-80 వసూలు చేశారు.

హైదరాబాద్‌కు రూ.300లకు పై గా వసూలు చేస్తున్నారు. మంథని నుంచి పెద్దపల్లి, గోదావరిఖని, కాటారం, భూపాలపల్లి, తాడిచర్లతో తదితర ప్రాంతాలకు బస్‌చార్జీ రూ.20 ఉండగా, ప్రైవేట్ వాహనాల్లో రూ.50-60 వరకు వసూలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని పట్టణాలకు వందలాది ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, జీపులు, కార్లు రెట్టింపు ధరలతో నడిపించారు. వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు వ చ్చిన భక్తులు బస్సులు లేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రైవేట్ వాహనదారులు కరీంనగర్‌కు రూ.50, హైదరాబాద్‌కు రూ.300 చొప్పున దండుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement