Private motorists
-
కరోనా: బయటికొస్తే బండి సీజే!
బెంగుళూరు: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గత తొమ్మిది రోజులుగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కచ్చితంగా అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ గడువు (ఏప్రిల్ 14) ముగిసే వరకు రోడ్లపైకి ఎలాంటి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని వెల్లడించింది. ఈమేరకు కర్ణాటక డీజీపీ కార్యాలయం ట్విటర్లో తెలిపింది. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి ఏప్రిల్ 14 వరకు రోడ్లపైకొచ్చే ప్రైవేటు దిచక్రవాహనాలు, కార్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ‘ఇది ఏప్రిల్ ఫూల్ అని ఆటపట్టించే ప్రాంక్ కాదు. నేటినుంచి లాక్డౌన్ ముగిసే వరకు టూ/ఫోర్ వీలర్ వాహనాలు రోడ్లపైకొస్తే సీజ్ చేస్తాం’అని ట్వీట్ చేసింది. కాగా, ఏప్రిల్ 1న చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. నిత్యావస వస్తువుల కొనుగోలు పేరుతో జనం ‘సామాజిక దూరం’ మాటను పట్టించుకోకుండా.. అడ్డగోలుగా బయటికి వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. This is not an April Fool's prank. Two/ four wheelers are banned from use till the 14th of April. We will SEIZE your vehicle if you CEASE to ignore this lockdown regulation. — DGP KARNATAKA (@DgpKarnataka) April 1, 2020 -
అవే అవస్థలు
- కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. సోమవారం యథావిధిగా నగరవాసులు ఇబ్బందులు - ఎదుర్కొన్నారు. బస్సులు లేక... - ప్రైవేట్ వాహనాలు దొరక్క నానాపాట్లు పడ్డారు. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు దోపిడీ పర్వం కొనసాగించారు. అర్ధనగ్న ప్రదర్శనలతోఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల ఎదుట నిరసన తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు సోమవారం కూడా ఉధృతంగా కొనసాగింది. ఒకవైపు ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు, మరోవైపు కార్మికుల ఆందోళనలు, ప్రదర్శనలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం వంటి కార్యకలాపాలు కొనసాగించారు. మరోవైపు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ఆర్టీసీ అధికారులు గ్రేటర్లో 671 బస్సులు నడిపారు. అయినా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సోమవారం పనిదినం కావడంతో విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. 121 సర్వీసులతో పాటు మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను అధికారులు అదన ంగా నడిపారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వేషన్ బోగీలు, జనరల్ బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల యథావిధిగా దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, కార్లు, వివిధ రకాల రవాణా వాహనాల యజమానులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇక ఆటోడ్రైవర్లు ప్రయాణికుల జేబులు లూటీ చేశారు. మరోవైపు తార్నాకలో ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొనడంతో స్నేహ (19) అనే విద్యార్ధిని దుర్మరణం పాలైంది. ఎక్కువ బస్సులు నడుపాలనే అధికారుల పట్టుదల, ఎక్కువ ట్రిప్పులు తిప్పేందుకు డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోందని విమర్శలు వచ్చాయి. అన్ని డిపోల్లో సమ్మె ఉధృతం... నగరంలోని 28 డిపోలు, బస్స్టేషన్లలో కార్మికుల సమ్మె కొనసాగింది. కార్మికులంతా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. బర్కత్‌పురా, కాచిగూడ, కంటోన్మెంట్, పికెట్, హయత్‌నగర్, మియాపూర్, రాణీగంజ్, దిల్‌షుఖ్‌నగర్, ఉప్పల్, బండ్లగూడ, తదితర డిపోలలో ధర్నాలు, ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా కండక్టర్లు బతుకమ్మ ఆడారు. పలు డిపోల నుంచి కార్మికులంతా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు ప్రదర్శనగా తరలి వెళ్లారు. పలు కార్మిక సంఘాలు ఎంజీబీఎస్‌లో సభ నిర్వహించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో కార్మిక సంఘాల నాయకులు ఎమ్మార్వోలను, కార్మికశాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎంసెట్‌కు ఆర్టీఏ సన్నద్ధం... కార్మికుల సమ్మె కొనసాగితే చేపట్టవలసిన చర్యలపై సోమవారం సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు మరోసారి సమావేశమయ్యారు. సమ్మె దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాలకు విద్యార్ధుల కోసం 1000 బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ అద్దె బస్సులు కలిపి ఇప్పటి వరకు 450పైగా సిద్ధం చేసినట్లు జేటీసీ చెప్పారు. మరో 2 రోజుల గడువు ఉన్నందువల్ల బస్సుల సేకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. -
రెండో రోజూ లూటీ!
నగరంలో వీడని సమ్మె కష్టాలు.. {పయాణికులను నిలువునా దోచుకున్న {పైవేట్ వాహనదారులు {పత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన ద.మ.రైల్వే నేడు ఏపీ ఎంసెట్.. విద్యార్థుల్లో టెన్షన్ రెండో రోజూ నగరంలో సమ్మె కష్టాలు కొనసాగాయి. గురువారం ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికుల కష్టాలు మరింత పెరిగాయి. ఆటోలు, ప్రైవేట్ వాహనదారులు దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. సాధారణంగా రూ.100 తీసుకునే దూరానికి రూ.300 వరకు వసూలు చేశారు. రైళ్లలో జిల్లాల నుంచి నగరానికి చేరుకున్న ప్రయాణికులు.. ఆటోవాలాల దోపిడీ చూసి అవాక్కయ్యారు. శుక్రవారం ఏపీ ఎంసెట్.. పరీక్షా కేంద్రానికి చేరుకోవడమే అసలైన పరీక్షగా మారిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంసెట్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. సిటీబ్యూరో/సికింద్రాబాద్/కాచిగూడ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారుల నిలువుదోపిడీ రెండో రోజు గురువారం తారస్థాయికి చేరుకుంది. ఆటోవాలాలు మీటర్ రీడింగ్‌తో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. రెట్టింపు కంటే ఎక్కువ చార్జీలతో ప్రయాణకుల జేబులు లూఠీ చేశారు. సాధారణ రోజుల్లో కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు రూ.215 నుంచి రూ.250 వరకు ఆటో చార్జీ ఉంటుంది. కానీ ఏకంగా రూ.500 వసూలు చేశారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వరకు సాధారణంగా అయితే రూ.160 వరకు చార్జీ ఉంటుంది. కానీ ఆర్టీసీ సమ్మె కారణంగా రూ.270 నుంచి రూ.300 వరకు వసూలు చేశారు. ఇలా నగరంలోని అన్ని మార్గాల్లోనూ ఆటోవాలాలు, ట్యాక్సీ డ్రైవర్లు భారీ ఎత్తున దోపిడీకి దిగారు. ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపైనే ఎక్కువ భారం పడింది. వేసవి సెలవులు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేందుకు బయలుదేరిన నగరవాసులు నానాపాట్లు పడ్డారు. దోపిడీ పర్వం ఇలా..... ఆర్టీసీ చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు కొంతమేరకు ఫలితాన్ని ఇచ్చాయి. మొదటి రోజు 70 బస్సులు నడిపిన అధికారులు రెండో రోజు 250 బస్సులు నడపగలిగారు. మరోవైపు డిపోల్లోంచి బస్సులు బయటకు రాకుండా అన్నిచోట్లా ఆర్టీసీ కార్మిక సంఘాలు యథావిధిగా ఆందోళన కొనసాగించాయి. బస్సులను అడ్డుకున్న కార్మికులను పలు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన రాణిగంజ్-2 డిపోకు చెందిన కండక్టర్ బి.రవిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. కంటోన్మెంట్ డిపోకు చెందిన కార్మికుడు ఆర్జీడీ ప్రభుదాస్ ఆర్టీసీ యాజమాన్యం వైఖరి పట్ల తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొనేందుకు యత్నించాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం ఒక యువకుడి మృతికి కారణమైంది. పంజగుట్టలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసే కుత్బుల్లాపూర్‌కు చెందిన కుమార్‌గౌడ్ (35) గురువారం తన తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై డైరీఫామ్ వద్దకు వచ్చాడు. అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు నిరీక్షిస్తుండగా కొంపల్లి నుంచి బోయిన్పల్లి వైపునకు వెళ్లే ఓ వాటర్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. అది సరిగ్గా కుమార్గౌడ్పైనే పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు .ప్రతి రోజు బస్సుల్లో వెళ్లే తన కొడుకు బస్సులు లేకపోవడం వల్ల ద్విచ క్రవాహనంపై వెళ్లవ లసి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రైళ్లు కిటకిట... ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడ్డారు. దీంతో నగరంలోని అన్ని వైపులా 121 సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసి నడిచాయి. సమ్మెను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాచిగూడ-నిజామాబాద్, సికింద్రాబాద్-కాజీపేట్ మధ్య 6 ప్యాసింజర్ రైళ్లను,తిరుపతి-హైదరాబాద్. ఎంఎంటీఎస్ అదనపు సర్వీసులు... ఎంఎంటీఎస్ రైళ్లకు భారీగా రద్దీ నెలకొడంతో శుక్రవారం నుంచి మరో 7 సర్వీసులు అదనంగా పెంచనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికపై ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కండక్టర్లు సరైన అవగాహన లేక ఇష్టారాజ్యంగా చార్జీలు తీసుకుంటున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పంజగుట్ట నుంచి చిలుకలగూడ క్రాస్‌రోడ్డు వరకు ఆర్డినరీ బస్సు చార్జీ రూ.8 లు కాగా గురువారం ఏకంగా రూ.15 చొప్పున చార్జీ తీసుకున్నారని మల్కాజిగిరికి చెందిన మేరి అనే ప్రయాణికురాలు విస్మయం వ్యక్తం చేశారు. అన్నీ ఇబ్బందులే.. హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చాం. తప్పని సరిపరిస్థితుల్లో ఆటోలో ఎక్కువ డబ్బులు పెట్టి రావాల్సి వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు రూ.100 తీసుకున్నారు. మామూలు రోజుల్లో మీటర్ చార్జీ కనీసం రూ.40 నుంచి రూ.50 వరకు ఉంటుంది. - జి.రాంరెడ్డి, కదిరి మాదాపూర్‌కు రూ.500 డిమాండ్ చేస్తున్నారు లింగంపల్లికి వెళ్లాలి. ఎంతోమంది ఆటో డ్రైవర్లను అడిగాను రూ.500కు తక్కువ వచ్చేది లేదంటున్నారు. ఆటో చార్జికి డబుల్ (రిటన్ చార్జి) ఇస్తానని అంటున్నా నహీ అంటున్నారు. బస్సులు లేకే ఈ పరిస్థితి. మోహన్, ప్రయాణికుడు నిలువు దోపిడీ చేస్తున్నారు మంచిర్యాల నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు వచ్చాను. 250 కిలోమీటర్ల దూరానికి రైలు చార్జీ రూ.80లు. కానీ సికింద్రాబాద్ నుంచి 15 కిలోమీటర్లు కూడా లేని జీడిమెట్లకు రూ.200 అడుగుతున్నారు ఆటోడ్రైవర్లు. చెల్లించక తప్పడం లేదు. దారుణమైన దోపిడీ ఇది. -మహ్మద్ హజీయుద్దీన్, ఇంజినీరింగ్ విద్యార్థి. గింత అన్యాయం ఉంటదా బిడ్డా సుట్టపామెకు పూర్తిగ బాగలేదట. చూసి వద్దామని ఇంట్లకెళ్లి బెలైల్లిన. నల్లకుంట పోదామంటే రూ.200 అంటండ్రు. గింత అన్యాయం ఎక్కడన్న ఉంటదా బిడ్డా? పది రూపాయలు పారేస్తె బస్సుకు పోయ్యి వచ్చేదాన్ని . వాళ్లకేమైందో బస్సులు నడుపుత లేరంట. వీళ్లేమో మొత్తం దోపిడికి దిగిండ్రు. - సరోజమ్మ, తుకారాంగేట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నందున బస్సులు నడవడం లేదు. మెహిదీపట్నం నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఆటోలో రూ.200 వరకు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే తాము ఎక్కువ డబ్బులు చెల్లించి ఆటోలో రావాల్సి వచ్చింది. - శోభ, కడప -
ప్రైవేట్ దోపిడీ
సాక్షి నెట్వర్క్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జిల్లావ్యాప్తంగా ప్రయూణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. పెళ్లిళ్లు, సెలవుల సీజన్ కావడంతో ప్రయూణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు రూ.150-200 బస్‌చార్జీ ఉండగా... ప్రైవేటు వాహనదారులు ఒక్కొక్కరికి రూ.400-500 వసూలు చేశారు. వాహనంలో పది మందికి సీట్లుంటే 14 మందిని ఎక్కించుకొని ప్రయూణికులను ఇబ్బందులకు గురిచేశారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌కు బస్‌చార్జీ రూ.40 ఉండ గా రూ.70-80 వసూలు చేశారు. హైదరాబాద్‌కు రూ.300లకు పై గా వసూలు చేస్తున్నారు. మంథని నుంచి పెద్దపల్లి, గోదావరిఖని, కాటారం, భూపాలపల్లి, తాడిచర్లతో తదితర ప్రాంతాలకు బస్‌చార్జీ రూ.20 ఉండగా, ప్రైవేట్ వాహనాల్లో రూ.50-60 వరకు వసూలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని పట్టణాలకు వందలాది ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, జీపులు, కార్లు రెట్టింపు ధరలతో నడిపించారు. వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు వ చ్చిన భక్తులు బస్సులు లేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రైవేట్ వాహనదారులు కరీంనగర్‌కు రూ.50, హైదరాబాద్‌కు రూ.300 చొప్పున దండుకున్నారు.