బెంగుళూరు: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గత తొమ్మిది రోజులుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కచ్చితంగా అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ గడువు (ఏప్రిల్ 14) ముగిసే వరకు రోడ్లపైకి ఎలాంటి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని వెల్లడించింది. ఈమేరకు కర్ణాటక డీజీపీ కార్యాలయం ట్విటర్‌లో తెలిపింది. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి ఏప్రిల్ 14 వరకు రోడ్లపైకొచ్చే ప్రైవేటు దిచక్రవాహనాలు, కార్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ‘ఇది ఏప్రిల్ ఫూల్ అని ఆటపట్టించే ప్రాంక్ కాదు. నేటినుంచి లాక్‌డౌన్ ముగిసే వరకు టూ/ఫోర్ వీలర్ వాహనాలు రోడ్లపైకొస్తే సీజ్ చేస్తాం’అని ట్వీట్ చేసింది. కాగా, ఏప్రిల్ 1న చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. నిత్యావస వస్తువుల కొనుగోలు పేరుతో జనం ‘సామాజిక దూరం’ మాటను పట్టించుకోకుండా.. అడ్డగోలుగా బయటికి వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
This is not an April Fool's prank. Two/ four wheelers are banned from use till the 14th of April. We will SEIZE your vehicle if you CEASE to ignore this lockdown regulation.
— DGP KARNATAKA (@DgpKarnataka) April 1, 2020
Comments
Please login to add a commentAdd a comment