సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాం గం విషమ పరీక్షలను ఎదుర్కొంది. అయోధ్య తీర్పు ఒకవైపు, ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్‌బండ్ మరోవైపు పోలీసు యంత్రాంగాన్ని కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయోధ్య తీర్పుపై స్ప ష్టత రావడంతో శుక్రవారం రాత్రి 9గంటల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయా యి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుక్షణం పహారాలో ఉండి అవాంఛనీయ ఘటనలు లేకుండా జాగ్రత్తపడింది.
చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే హౌస్ అరెస్టులు చేశారు. అదే విధంగా గ్రామాల వారీగా జల్లెడ పట్టి ఆర్టీసీ కారి్మకులను సైతం అరెస్టు చేసి చలో ట్యాంక్‌బండ్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. శనివారం నాడు ట్యాంక్‌బండ్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు మినహా... రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు ఎక్క డా చోటుచేసుకోకపోవడంతో పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది.
అయోధ్యతో ఉత్కంఠ...
ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై తీ ర్పును శనివారం ఉదయం వెల్లడించనున్నట్లు శుక్ర వారం రాత్రి 9గంటలకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పెట్టింది. దీంతో దేశమంతా ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాయి. వెనువెంటనే డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో హై అలర్ట్‌ను ప్రకటించింది. ఆ తర్వాత అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసుల కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ న్విహించారు. అన్ని జిల్లాల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.
అదే సమయంలో చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌తో పాటు సైబరాబా ద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో డీజీపీ ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అనుక్షణం తనతో టచ్‌లో ఉండాలని సూచించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో గత రెండు వారాలుగా రాష్ట్ర వ్యాప్తం గా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో మత పెద్దలు, పీస్ కమిటీలతో పోలీసు కమిషనర్లు, ఎస్పీలు సమావేశాలు నిర్వహించారు. సోషల్ మీడియాపైగా పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. అనుమానితులు, నేరచరిత ఉన్నవారిని ముందస్తుగా అరెస్టులు చేయగా... ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించారు.
ఉద్రిక్తంగా చలో ట్యాంక్‌బండ్
ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ ఉద్రిక్తలకు దారితీసింది. సీటీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీసులకు శుక్రవారం నుంచే కంటిమీద కునుకు లేదు. శుక్రవారం సాయంత్రం నుంచే ఆర్‌ఏఎఫ్, సివిల్, ఏఆర్, ఆక్టోపస్ బలగాలు 20వేల మంది నగరంలో పహారా కాశారు. చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి నిరాకరించినప్పటికీ ఆందోళనకారులు వేల సంఖ్యలో వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇంతలో ఆందోళనకారులు పోలీసులపైకి రాల్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో 400 మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment