నల్లగొండ టౌన్ : వంటావార్పు..ధర్నాలు, స్వచ్ఛభారత్..ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా ఐదో రోజూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోలు ఎదుట ఆదివారం ఆర్టీసీ కార్మికులు వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేశారు. ప్రైవేటు డ్రైవర్లు, హోంగార్డులతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు 231 బస్సులను వివిధ రూట్లలో నడిపించారు. కార్మికులు బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ పోలీసులు వారిని పక్కకు తప్పించి నడిపించారు. సమ్మె చేస్తున్న కార్మికులకు వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి.
సమ్మెకారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుభకార్యాలతోపాటు గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశానికి పరీక్ష ఉండడంతో విద్యార్థులు తీవ్ర సమస్యను ఎదుర్కొవాల్సి వచ్చింది. జిల్లా కేంద్రానికి పరీక్షకు హాజరవ్వడానికి విద్యార్థులు ఆటోలు, ద్విచక్రవాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వాహన దారులు సమ్మెను అదునుగా చూపి ఎక్కువ డబ్బులను వసూళ్లకు పాల్పడ్డారు.
నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లతో ఆర్టీసీ డిపో ఎదుట శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం కొది సేపు బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నల్లగొండ డిపో పరిధిలో 50 బస్సులను నిడిపించారు. సూర్యాపేట కొత్త బస్టాండ్ గ్యారేజీలోనుంచి బస్సులను బయటకు రాకుండా బైఠాయించారు. అక్కడే వంటావార్కు నిర్వహించారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ సమక్షంలో రూరల్ సీఐ వి.నర్సింహారెడ్డి సిబ్బందితో బస్టాండ్‌కు చేరుకొని కార్మికులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అనంతరం గ్యారేజీలోని బస్సులను బయటకు తీయించి ఆయా గ్రామాలకు ఎస్కార్ట్ సాయంతో తరలించారు. అరెస్టు అయిన కొందరు కార్మికులు స్టేషన్ నుంచి తిరిగి కొత్త బస్టాండ్ ఎదురుగా గల ఫై ్లఓవర్ వద్దకు చేరుకొని బస్సు టైర్ల గాలి తీసివేసి అద్దాలను పగులగొట్టారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల ధర్నాకు ఐఎన్‌టీయూసీ నాయకులు మద్దతు తెలియజేశారు. కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం తాత్కాలిక డ్రైవర్లతో నాలుగు బస్సులు బయటకు తీశారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల వెంట భిక్షాటన చేశారు. భువనగిరి ప్రాంతంలో ఆదివారం బస్సులు ఎక్కువగానే నడిచాయి. నల్లగొండ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట, పికెట్ డిపోలకు చెందిన అద్దెబస్సులు, కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నడిచాయి. దేవరకొండ డిపో పరిధిలో 8 అద్దెబస్సులు నడిచాయి.
నాగార్జునసాగర్, హాలియా బస్టాండ్‌లు ప్రయాణికులు లేక వెళవెళబోయాయి. మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. పర్యాటకులు లేక సాగర్ వెలవెలబోయింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆదివారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మద్దతు తెలిపారు. కొద్దిసేపు కార్మికులతోపాటు ధర్నా నిర్వహించారు. ఆదివారం కూడ కోదాడ డిపో నుంచి బస్సులను నడవకుండా కార్మికులు అడ్డుకున్నారు. సమ్మె కారణంగా నిత్యం ఎంతో మంది ప్రయాణికులతో ర ద్దీగా ఉండే ఆలేరు బస్‌స్టేషన్ బోసిపోయింది. అలాగే యాదగిరిగుట్ట బస్‌డిపోలో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. రెండు అద్దె బస్సులను పోలీసుల సాయంతో నడిపించారు.
వంటావార్పు..స్వచ్ఛభారత్
Published Mon, May 11 2015 12:47 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement