భువనగిరి : ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు ప్రజావ్యతిరేకంగా ఉందని వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ , సహాయ కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డిలు విమర్శించారు. గురువారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్చె నోటీస్ ఇచ్చినపుడే ప్రభుత్వం స్పందించి ఉంటే 8రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సిన అవసం వచ్చేది కాదన్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న సీఎం ఆర్టీసీ కార్మికుల పెంచే జీతాలపై తర్జనభర్జనతో కాలయాపన చేయడంతో ఆర్టీసీకి సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్ చేస్తానని చెప్పిన కేసీఆర్ వారు సమ్మెకు దిగితే తప్పా వారికి ఇచ్చిన హామీ గు ర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ సీఎం గా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం నమోదు చేసి ఆర్థికంగా ఆదుకుందన్నారు.
తెలంగాణ రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకో వడంలేదన్నారు. వచ్చే సీజన్‌లోనైనా రైతుల కు రోజుకు ఏడుగంటల పాటు కరెంట్ సరఫరా చేయాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి వెంటనే కేం ద్రంపై ఒత్తిడి తేవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో పార్టీ యువజన విభా గం భువనగిరి పట్టణ నాయకుడు బబ్బూరి నరేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు సీఎంల తీరు.. ప్రజా వ్యతిరేకం
Published Fri, May 15 2015 12:16 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement