nalla surya prakash
-
‘పెద్ద మొత్తంలో డబ్బు పట్టు బడుతున్నా.. ’
సాక్షి, హైదరాబాద్ : ఎలక్షన్ కమిషన్ నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్ల సూర్యప్రకాష్ అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు పట్టు బడుతున్నా లక్షల్లో మాత్రమే చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో విచ్చల విడిగా డబ్బు పంచుతున్నారని తెలిపారు. జాతీయ స్థాయి నాయకుల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. బహిరంగ సభలు నిర్వహించే స్థలాల్లో విచ్చల విడిగా మద్యం పంపిణీ చేస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. -
సంక్షేమానికి చిరునామా వైఎస్సార్
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి, సామాజిక మార్పునకు చిరునామాగా నిలిచారని, అందుకే నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రాన్ని 18 మంది ముఖ్యమంత్రులు పాలించారని, వారెవరికీ సాధ్యంకాని రీతిలో.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. వైఎస్ వర్ధంతి రోజును ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పదినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అపర బ్రహ్మ.. వైఎస్సార్.. మొండి రోగాలకు గురై ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని సూర్యప్రకాశ్ గుర్తు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో వైద్యం అందించేందుకు 104, 108 అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన అపర బ్రహ్మ వైఎస్ అని కొనియాడారు. దేశంలో దళితులు, పేదల కోసం కేంద్ర ప్రభుత్వాలు 49 లక్షల గృహాలు నిర్మిస్తే, తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 48 లక్షల కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి పేదలకు గూడు కల్పించారని గుర్తు చేశారు. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడమే కాక సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించిన రైతు పక్షపాతి వైఎస్ అని చెప్పారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టి, సుమారు 80 శాతం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అపర భగీరధుడిగా వెలుగొందుతున్నారన్నారు. టెన్త్, ఇంటర్‌తో చదువు ఆపేసే పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించడంతో పాటు ఇంజనీర్లు, డాక్టర్లు కావడానికి అవకాశం కల్పించిన విద్యాప్రదాత రాజశేఖరరెడ్డి అని శ్లాఘించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనసాగించడంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే శక్తిసామర్థ్యాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉన్నాయని తెలిపారు. -
ఆ భయంతోనే దళితులపై ప్రేమ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ హైదరాబాద్: గో సంరక్షణ పేరుతో దేశంలో పలు చోట్ల దళితులపై ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల దాడులతో ఉత్తర భారతంలో బీజేపీ పునాదులు కదులుతున్నాయని.. ఆ భయంతోనే మోదీకిదళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తార్నాకలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గోసంరక్షణ పేరుతో దళితులపై జరుగుతున్న దాడిని మోదీ ఖండించడం హర్షణీయం అన్నారు. అయితే గుజరాత్లో దళితులపై దాడి జరిగినప్పుడు ప్రధాని ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నిం చారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో త్వరలో ఎన్నికలు ఉండడంతో మోదీకి దళితులు గుర్తొచ్చారని చెప్పారు. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడుల సంఘటనలపై విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రాల సంతోష్‌రెడ్డి తదితరులున్నారు. -
ఇద్దరు సీఎంలు బొమ్మాబొరుసు లాంటివారు
వైఎస్సార్సీపీ ప్రధానకార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ సంగారెడ్డి మున్సిపాలిటీ: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజావ్యతిరేక పరిపాలనలో బొమ్మాబొరుసులా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు విమర్శిం చారు. గురువారం సంగారెడ్డిలో విలేకరులతో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరి స్తోందన్నారు. ఏపీలో టీడీపీ ప్రజావ్యతిరేక పాల నపై తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో కలసి ఉద్యమాలు చేస్తున్నారని.. కానీ, ఇక్కడ ఆ పరిస్థితి లేదన్నారు. భూసేకరణ చట్టం 2013ను కాదని ప్రభుత్వం తెచ్చిన 123 జీవోను హైకోర్టు కొట్టివేయడం ప్రజావిజయమని చెప్పారు. -
బాబు రాజకీయ వ్యభిచారం మీకు కనిపించలేదా?
రాష్ట్రంలోని మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌ల కింద భూముల సేకరణ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. ముంపు గ్రామాల వాసులకు ప్రతి ఎకరాకు రూ. 25 లక్షలు, కులవృత్తులు చేసుకునే వారికి రూ. 10 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ రేటుకు నాలుగింతలు పెంచి అందజేయాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు, వివిధ రకాలుగా భూములు అనుభవిస్తున్న రైతులకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఇంటికి నలుగురు పోలీసులను పెట్టి భూసేకరణలో ప్రభుత్వం జీవో 123 ప్రకారం వెళ్తానంటే ప్రజలు, రైతుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో టాటా భూముల విషయంలో సీపీఎం వారు ఇలాగే వ్యవహరించి చేతులు కాల్చుకున్నారన్నారు. తన జిల్లానుంచే ప్రతిఘటన ఆరంభం కాకుండా సీఎం కేసీఆర్ చూచుకోవాలని వైఎస్సార్ సీపీ హెచ్చరిస్తోందని వారు చెప్పారు. 2013 భూ సేకరణ చట్టంలో ఏవేం అంశాలు ఉన్నయో వాటన్నింటినీ ప్రభుత్వం ఇక్కడి వారికి నెరవేర్చాలని సూచించారు. సీఎం కేసీఆర్ కేవలం సిద్దిపేట, గజ్వేల్, తన ఫామ్‌హౌజ్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నీరు తరలించేందుకు రీ డిజైన్ నాటకం తెర మీదకు తీసుకవచ్చారన్నారు. 25వేల ఎకరాల బంగారు భూమిని, 14 గ్రామాలను పూర్తి నీటి ముంచుతున్నారని వాపోయారు. 16 వేల జనాభా పూర్తి నిరాశ్రయులు కానున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే బంగారు భూమిని నీట ముంచటమా? అని వారు ప్రశ్నించారు. మిత్రమా రేవంత్...బాబు వ్యభిచారం కన్పించలేదా..! వివిధ పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకోవటం వ్యభిచారం అయినప్పుడు, ఏపీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అక్కడి సీఎం, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోటానుకోట్లు ఏర చూపి లాగేసుకోవటం వ్యభిచారంగా కన్పించలేదా అని వైఎస్సార్ సీపీ నేతలు ముకుమ్మడిగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ రెండు నాల్కాల ధోరణి విడనాడాలని సూచించారు. ఇరురాష్ట్రాల సీఎంలు ఇలాగే వ్యవహరిస్తూ వెళ్తే, ముందు ముందు ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. -
హరీశ్ రాజీనామా చేయాలి
♦ మంత్రిగా ఉండి బెదిరింపులా..: వైఎస్సార్సీపీ ♦ ఏపీ ప్రయోజనాల కోసం జగన్ దీక్ష చేస్తున్నారు ♦ వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ♦ అంతేగానీ దబాయింపులకు దిగడమేమిటని ప్రశ్న ♦ వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన ♦ నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు, నీటి వినియోగంపై తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... మానుకోట చేస్తా అంటూ హరీశ్‌రావు బెదిరింపులకు దిగడమేమిటని నిలదీసింది. మంత్రి హోదాలో ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా హెచ్చరికలు చేస్తున్న హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, గత రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం ఎంత బడ్జెట్ విడుదల చేశాయో ప్రకటించాలన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యాలయంపై దాడిని, హైదరాబాద్‌లో పలు చోట్ల వైఎస్సార్సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాచరికం అనుకుంటున్నారా?: నల్లా ‘సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నదని అనుకుంటున్నారా? తామేమైనా అభినవ నిజాం నవాబు అనుకుంటున్నారా..’ అని నల్లా సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయిన హరీశ్‌రావు రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి మానుకోట పునరావృతమవుతుందంటూ హెచ్చరికలు చేయడం... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు జగన్ దీక్ష చేస్తుంటే.. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమేమిటని నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి, జెండా గద్దెల కూల్చివేతను ఖండించారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి: రాఘవరెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో వైఎస్ ప్రారంభించిన 36 ప్రాజెక్టుల్లో ఆరు పూర్తికాగా, 9 నిర్మాణదశలో ఉన్నాయని.. 21 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు రూ.10వేల కోట్లు కేటాయిస్తే వాటన్నింటినీ పూర్తి చేసి ఏకంగా 49 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వొచ్చన్నారు. కానీ అవి పూర్తయితే వైఎస్‌కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పక్కన పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని జగన్ దీక్ష చేస్తున్నారని... ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా మానుకోట పునరావృతం అవుతుందంటూ హరీశ్ హెచ్చరికలు చేయడం సరికాదని పేర్కొన్నారు. వీలైతే జగన్ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని.. అలాగాకుండా ఏవేవో మాట్లాడడం సమంజసం కాదన్నారు. పచ్చకామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని రాఘవరెడ్డి విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు దిగిపోయి, డబ్బు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. సోమవారం జేఏసీ పేరిట కొందరు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే.. తాము ముందుండి అఖిలపక్షంతో కలసి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు. -
పాలేరు ఉప ఎన్నిక పరిశీలకులుగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, మెండం జయరాం, హబీబ్ అబ్దుల్ రెహమాన్లను ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్ నియమితులవగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డిని నియమించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హబీబ్ అబ్దుల్ రెహమాన్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. బేషరతుగా క్షమాపణలు చెప్పు
వైఎస్సార్సీపీ నేత నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కుల వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, తెలంగాణ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్‌చేశారు. తన వ్యాఖ్యలతో బాబు ఎస్సీలను అవమానించారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పకుంటే.. కోర్డులు, ఉభయ రాష్ట్రాల్లోని పోలీస్స్టేషన్లలో చంద్రబాబుపై కేసులు పెడతామని హెచ్చరించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు ఎం. గవాస్కర్‌రెడ్డి, రవికుమార్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎంపై పరువు నష్టం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే విషయంపై పార్టీ లీగల్ విభాగాన్ని, న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ప్రతి చిన్న విషయంపై వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలపై ఏపీలో ఎస్సీ, ఎస్టీ కేసులను పెడుతున్నారని, చంద్రబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను పాలతో శుద్ధి చేసి చంద్రబాబుకు నిరసనలు తెలపాలని దళితులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పెద్ద ఫ్యూడలిస్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు దళితులు తమ మధ్యనున్న తరతమ భేదాలను మరచి సంఘటితమై నిలబడాలని కోరారు. గతంలో అమ్మాయిలు వద్దని, అబ్బాయిలనే కనాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఈ విధంగా మాట్లాడడం బాబుకు నైజంగా మారిందని ధ్వజమెత్తారు. -
ఇది దుర్మార్గ పాలన
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపాటు ♦17 నెలల పాలనలో 1,400 మంది రైతుల ఆత్మహత్య ♦ పత్తికి మద్దతు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట ♦ ఇరు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు గాల్లో మేడలు కడుతున్నారు ♦ వైఎస్ పాలన రావాలంటే ఫ్యాన్‌కు ఓటేయండి ♦ వరంగల్‌లో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా ప్రచారం పర్వతగిరి, రాయపర్తి, తొర్రూరు: కోటి ఆశల తెలంగాణ.. ప్రస్తుతం రైతుల ఆత్మహత్యతో విలవిల్లాడిపోతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 17 నెలల పాలనలో 1,400 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా పర్వతగిరి, రాయపర్తి, తొర్రూరు, సంగెం తదితర మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. పత్తికి కనీస మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. వరుసగా తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారని మండిపడ్డారు. కానీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విత్తనాల ధర తగ్గించి, వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ అందజేసి, రైతుల రుణాలను మాఫీ చేసి రైతు బాంధవుడయ్యూరని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటితో వైఎస్‌కు అనుబంధం ఉందని, ప్రతి ఇళ్లు వైఎస్సార్ పథకాలతో లబ్ధి పొందిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో ఇద్దరు చంద్రులు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ గాలిలో మేడలు కడుతున్నారని మండిపడ్డారు. 17 నెలల్లో ఏం చేశారు? బంగారు తెలంగాణగా చేస్తానని ఒకరు, సింగపూర్‌లా అభివృద్ధి చేస్తానని మరొకరు ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని కేసీఆర్, చంద్రబాబుపై రోజా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పంటల్లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని, రైతులకు రుణాలు మాఫీ చేయడం లేదని దుయ్యబట్టారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు. రాష్ట్ర కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీకి ఓట్లెందుకు వేయాలో ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. వైఎస్ పాలన రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రోడ్‌షోలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కందాడి అచ్చిరెడ్డి, కళ్యాణ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
-
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను బరిలోకి దించుతున్నట్లు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రచారం చేపడతామని తెలిపారు. నల్లా సూర్యప్రకాశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి ఈ సందర్భంగా వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది వైఎస్ఆర్ సీపీని విమర్శలు చేస్తున్నారని, వారి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పొంగులేటి మండిపడ్డారు. -
నేడు ప్రజ్ఞాపూర్‌కు షర్మిల
♦ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు ♦ అభిమానులంతా తరలిరావాలి ♦ వైఎస్ఆర్సీపీ రాష్ర్ట నేతలు నల్లా, నర్రా పిలుపు సంగారెడ్డిక్రైం/గజ్వేల్/పటాన్చెరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల సోమవారం వరంగల్ జి ల్లాకు పరామర్శ యాత్ర నిమిత్తం వెళ్తూ మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆగనున్నారు. మెదక్ జిల్లా మీదుగా వెళ్లే ఆమె.. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్, పార్టీ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి తెలిపారు. ఆదివారం వారిక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఏర్పాట్లు వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల రాక నేపథ్యంలో ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఆమెకు ఘన స్వాగతం పలకడానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మర వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఆయన వైఎస్ విగ్రహం గద్దెకు సున్నం వే యించారు. సోమవారం ఉదయం 9.30 గం టలకు షర్మిల ప్రజ్ఞాపూర్ చేరుకుంటారని వెంకట్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ బలోపేతానికి సంఘటిత కృషి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ కార్యకర్తలంతా సం ఘటితంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి కోరారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప ట్టణాలు, మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా మండల, గ్రామస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నామని వారు తెలిపారు. -
ఇద్దరు సీఎంల తీరు.. ప్రజా వ్యతిరేకం
భువనగిరి : ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు ప్రజావ్యతిరేకంగా ఉందని వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ , సహాయ కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డిలు విమర్శించారు. గురువారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్చె నోటీస్ ఇచ్చినపుడే ప్రభుత్వం స్పందించి ఉంటే 8రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సిన అవసం వచ్చేది కాదన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న సీఎం ఆర్టీసీ కార్మికుల పెంచే జీతాలపై తర్జనభర్జనతో కాలయాపన చేయడంతో ఆర్టీసీకి సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్ చేస్తానని చెప్పిన కేసీఆర్ వారు సమ్మెకు దిగితే తప్పా వారికి ఇచ్చిన హామీ గు ర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ సీఎం గా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం నమోదు చేసి ఆర్థికంగా ఆదుకుందన్నారు. తెలంగాణ రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకో వడంలేదన్నారు. వచ్చే సీజన్లోనైనా రైతుల కు రోజుకు ఏడుగంటల పాటు కరెంట్ సరఫరా చేయాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి వెంటనే కేం ద్రంపై ఒత్తిడి తేవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో పార్టీ యువజన విభా గం భువనగిరి పట్టణ నాయకుడు బబ్బూరి నరేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలతో పూట గడుపుతున్న కేసీఆర్
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ కరీంనగర్: ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ పూటకో హామీతో కాలం వెళ్లదీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో 18 లక్షల ఇళ్లు మంజూరైతే తెలంగాణ ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజులు ఇంకా రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, మండలాల్లో 8 గంటలు, హైదరాబాద్‌లో 6 గంటల విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని అన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న చంద్రబాబు అడుగుజాడల్లోనే కేసీఆర్ పయనిస్తున్నారని విమర్శించారు. -
'చంద్రబాబు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి'
ఆంధప్రదేశ్ రాష్టానికి కొత్త డీజీపీ ఎంపిక విషయంలో ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్య ప్రకాశ్ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడారు. తన సామాజిక వర్గానికి చెందిన జేవీ రాముడిని ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎంపిక చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి డీజీపీగా వ్యవహరించిన బి.ప్రసాదరావును పక్కనపెట్టడంలో చంద్రబాబు అంతర్యమేమిటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. డీజీపీ ఎంపిక విషయంలో చంద్రబాబు మరోసారి ఆలోచిస్తే మంచిదన్నారు. అయితే ఇదే అంశంపై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల రోడ్‌షో
జహీరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మొహియొద్దీన్, అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌లు శనివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని హమాలీ, బాలాజీ కాలనీ, డ్రైవర్స్ కాలనీల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో ఎంతోమంది పేదలు లబ్ధి పొందారన్నారు. దీంతో పేదలు రాజశేఖరరెడ్డి తనయుడు ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వహీద్తోపాటు ఆయా కాలనీల నాయకులు పాల్గొన్నారు. -
21న జహీరాబాద్‌కు షర్మిల
జహీరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21న జహీరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జహీరాబాద్ చేరుకోనున్న షర్మిల, వైఎస్సార్సీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరఫున ప్రచారం చేయనున్నారు. ప్రచారంలో భాగంగా పట్టణంలో రోడ్డుషో నిర్వహించనున్న ఆమె, ఆ తర్వాత ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. -
దామోదర.. వైఎస్ వారసుడు కాదు
నల్లా సూర్యప్రకాశ్ స్పష్టీకరణ హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వం ఒక్క జగన్‌కే తప్ప మరెవ్వరికీ లేదని, ఆయన పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చేస్తే ప్రజలు నమ్మరని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ‘తెలంగాణకు నేనే సీఎం అంటూ తిరుగుతున్న దామోదర రాజనరసింహ ఏనాటికీ వైఎస్ వారసుడు కాలేడు. ఓట్ల కోసం చేసే ఇలాంటి ఎత్తుగడలను ప్రజలు ఛీ కొడతారు’ అని పేర్కొన్నారు.వైఎస్ సేవలు ఎనలేనివని, మళ్లీ ఆ శక్తి సామర్థ్యాలు ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉన్నాయని, వైఎస్ వారసుడు ఆయనేనని అన్నారు. నల్లా సూర్యప్రకాశ్ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఇటీవల ఓ కార్యక్రమంలో వైఎస్సార్ తన గురువు అని, ఆయన అడుగు జాడల్లోనే నడుస్తానని, మాట తప్పను, మడమ తిప్పనని చెప్పుకోవడం సిగ్గు చేటని నల్లా నిప్పులు చెరిగారు. ఓట్ల కోసమే దామోదర ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌పై అంత అభిమానం ఉంటే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినప్పుడు, సీబీఐకి చెందిన 20 బృందాలు ఒకేసారి ఆయన కుటుంబంపై దాడులకు దిగినప్పుడు దామోదర ఎందుకు చూస్తూ ఉండిపోయారని నిలదీశారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను 16 నెలలు జైల్లో పెడితే ఎందుకు నోరెత్తలేదని దామోదరను ప్రశ్నించారు. -
వైఎస్ వారసుడినని చెప్పుకొనే అర్హత దామోదరకు లేదు
వైఎస్ వారసుడినని చెప్పుకునే అర్హత మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు లేదని వైఎస్ఆర్సీపీ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఓట్ల కోసమే ఆయన చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని, వైఎస్ పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు దామోదర ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేసినప్పుడు నిందితుడ్ని విడిచిపెట్టడం వాస్తవం కాదా అని నిలదీశారు. మీరెన్ని మాటలు చెప్పినా దళిత, బలహీనవర్గాలు మాత్రం వైఎస్ఆర్సీపీ వెంటే ఉంటాయని నల్లా సూర్యప్రకాశ్ ధీమా వ్యక్తం చేశారు.