
ఇద్దరు సీఎంలు బొమ్మాబొరుసు లాంటివారు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజావ్యతిరేక పరిపాలనలో బొమ్మాబొరుసులా వ్యవహరిస్తున్నారని...
వైఎస్సార్సీపీ ప్రధానకార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్
సంగారెడ్డి మున్సిపాలిటీ: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజావ్యతిరేక పరిపాలనలో బొమ్మాబొరుసులా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు విమర్శిం చారు. గురువారం సంగారెడ్డిలో విలేకరులతో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించకపోవడంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరి స్తోందన్నారు. ఏపీలో టీడీపీ ప్రజావ్యతిరేక పాల నపై తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో కలసి ఉద్యమాలు చేస్తున్నారని.. కానీ, ఇక్కడ ఆ పరిస్థితి లేదన్నారు. భూసేకరణ చట్టం 2013ను కాదని ప్రభుత్వం తెచ్చిన 123 జీవోను హైకోర్టు కొట్టివేయడం ప్రజావిజయమని చెప్పారు.