
సాక్షి, హైదరాబాద్ : ఎలక్షన్ కమిషన్ నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని బీఎల్‌ఎఫ్ ఛైర్మన్ నల్ల సూర్యప్రకాష్ అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు పట్టు బడుతున్నా లక్షల్లో మాత్రమే చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో విచ్చల విడిగా డబ్బు పంచుతున్నారని తెలిపారు.
జాతీయ స్థాయి నాయకుల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. బహిరంగ సభలు నిర్వహించే స్థలాల్లో విచ్చల విడిగా మద్యం పంపిణీ చేస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.